షెడ్యూల్డు ప్రాంత హక్కులు కాపాడాలి | - | Sakshi
Sakshi News home page

షెడ్యూల్డు ప్రాంత హక్కులు కాపాడాలి

Feb 16 2026 7:43 AM | Updated on Feb 16 2026 7:43 AM

షెడ్యూల్డు ప్రాంత హక్కులు కాపాడాలి

షెడ్యూల్డు ప్రాంత హక్కులు కాపాడాలి

ఆదిలాబాద్‌టౌన్‌: ఆదివాసీలపై అటవీశాఖ జులుం పెరిగిందని, ఇళ్ల నిర్మాణం, వ్యవసాయం చేయకుండా అధికారులు అడ్డుకుంటున్నారని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్‌ అన్నారు. రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌లో ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ కమిటీ సమావేశాలు కొనసాగుతున్నా యి. ఇందులో భాగంగా తెలంగాణ నుంచి ఆ యన ఆదివారం పాల్గొని మాట్లాడారు. షెడ్యూ ల్డు ప్రాంత హక్కులను కాపాడాలని, అటవీ హ క్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని పేర్కొన్నారు. ఏజెన్సీ డీఎస్సీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని అన్నారు. ఆది వాసీలపై అటవీ శాఖ అధికారులు అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలి పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐటీడీఏలకు నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement