అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

Dec 25 2025 8:08 AM | Updated on Dec 25 2025 8:08 AM

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

● నాందేడ్‌ డీఆర్‌ఎం ప్రదీప్‌ కామ్లే ● రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పరిశీలన ● ఆదిలాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనుల్లో వేగం పెంచాలని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ట్రే డ్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు నాందేడ్‌ డీఆర్‌ఎం ప్రదీప్‌ కామ్లేకు వినతిపత్రం అందించారు. అమృత్‌ భారత్‌లో భాగంగా రైల్లేస్టేషన్‌లో చేపట్టిన అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఫిట్‌లైన్‌ త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని తెలిపారు. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు ఆదిలాబాద్‌ నుంచి ప్రత్యేక ట్రైన్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన డీఆర్‌ఎం ఈ విషయాన్ని ఉ న్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. సీవోసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దినేశ్‌ మ టోలియా, కందుల రవీందర్‌, ఉపాధ్యక్షుడు తా నాజీ నిక్కమ్‌, కోశాధికారి మనోహర్‌ కుపాట్‌, సభ్యులు అమిత్‌ జీవాని, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ● ఆదిలాబాద్‌–ఆర్మూర్‌ రైల్వేలైన్‌ ప్రాజెక్ట్‌కు బడ్జెట్‌ మంజూరు చేయాలని రైల్వేలైన్‌ సాధన సమితి ప్రతినిధులు డీఆర్‌ఎం ప్రదీప్‌ కామ్లేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ.. ఆదిలాబాద్‌ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన ఆదిలాబాద్‌–ఆర్మూర్‌ రైల్వేలైన్‌ పట్టాలు ఎక్కేలా చర్యలు తీసుకోవాలని కోరా రు. ఇటీవలే 2024–25కు సంబంధించి డీపీఆర్‌ నూ కేంద్రానికి అందజేసినట్లు తెలిపారు. అయినప్పటికీ బడ్జెట్‌ మంజూరు కాలేదని, ఈ దిశగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని విన్నవించారు. ఈ రైల్వేలైన్‌ పూర్తయితే జిల్లా ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని తెలిపారు. నాయకులు నిమ్మల నరేందర్‌, నారాయణ తదితరులున్నారు.

ఆదిలాబాద్‌: అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని నాందేడ్‌ డీఆర్‌ఎం ప్రదీప్‌ కామ్లే సూచించారు. నాందేడ్‌–ఆదిలాబాద్‌ రైల్వే మార్గంలో బుధవారం తని ఖీలు నిర్వహించారు. నాందేడ్‌ నుంచి ఆదిలాబాద్‌ వరకు రివర్‌ బెడ్‌ ఇన్‌స్పెక్షన్‌ నిర్వహించడంతోపా టు ట్రాక్‌ సిగ్నలింగ్‌ నిర్మాణ సంబంధిత అంశాలను పరిశీలించారు. ఆదిలాబాద్‌ రైల్వేస్టేషన్‌లో అమృత్‌ భారత్‌ స్టేషన్‌ అభివృద్ధి పనులు, ఫిట్‌లైన్‌ నిర్మాణ పనులు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. రై ల్వే భద్రత, ప్రయాణికులకు అందించే మౌలిక సదుపాయాలు కల్పించేలా, అభివృద్ధి పనులు వేగవంతమయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చె ప్పారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ కింద రైల్వేస్టేషన్‌లో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చే యాలని సూచించారు. ఫిట్‌లైన్‌ నిర్మాణ పనులు ప రిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు. క్రూలా బీ, రన్నింగ్‌ రూమ్‌లో సిబ్బందికి కల్పించే సౌకర్యాలు, నిర్వహణ ఏర్పాట్లు పరిశీలించారు. ఆయన వెంట నాందేడ్‌ డివిజనల్‌ అధికారులున్నారు.

డీఆర్‌ఎంకు వినతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement