విద్యారంగ సమస్యల పరిష్కారంలో విఫలం
ఆదిలాబాద్‌టౌన్: విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ ఆరో పించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డైట్ కళా శాలలో యూనియన్ జిల్లా విస్తృత స్థాయి సమావే శం నిర్వహించగా ఆయన హాజరై మాట్లాడారు. 2047 నాటికి ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాకారం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే హైదరాబాద్ చుట్టుపక్కల మా త్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరగాల ని తెలిపారు. సర్దుబాటు విధానంలో ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న పాఠశాలల్లో టీచర్లను భర్తీ చే యాలని, ఎన్జీవో ద్వారా ఆర్థిక సహకారం మాత్రమే తీసుకుని విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. బోధనలో వారి ప్రమేయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, కార్పొరేట్‌కు మద్దతుగా ప్ర భుత్వ విధానాలు అమలు చేయడం సరికాదని మండిపడ్డారు. ఉపాధ్యాయ రంగంలో ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యలపై చర్చించి పోరాటలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఇటీవల మృతిచెందిన ఉపాధ్యాయులు, ఆయా సంఘాల నాయకుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే కిష్టన్న, వీ అశోక్, నాయకులు లక్ష్మణరావు, శ్రీనివాస్, స్వామి, ఇస్తారి, శివన్న, గౌస్ మొహియొద్దీన్, విలాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.


