
సెక్షన్‌లో ఓ అధికారి తీరు మారట్లేదు..
విద్యుత్ శాఖలో కాంట్రాక్టర్లు వర్సెస్ ఆఫీసర్లు బిల్లుల విషయంలో ఓ అధికారి తీరుపై నిరసన క్షేత్రస్థాయిలో పనులపై ప్రభావం ఉన్నతాధికారుల పట్టింపులేమిపై విమర్శలు
విద్యుత్ శాఖ అకౌంట్ సెక్షన్‌లో ఓ అధికారి తీరు మారడం లేదు. కాంట్రాక్టర్లు బిల్లు సబ్మిట్ చేసిన తర్వాత తన పరిధిలోనే నెలల తరబడి పెండింగ్‌లో ఉంచుతున్నాడు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. జిల్లా పరిధిలో సుమారు రూ.60లక్షలకు పైగా బిల్లులు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి.
– ప్రకాశ్ జాదవ్, విద్యుత్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు
సాక్షి,ఆదిలాబాద్: విద్యుత్ శాఖలో కాంట్రాక్టర్లు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ముందస్తు నోటీసు ఇచ్చి మూడు రోజులుగా పనులు నిలిపివేశారు. ఈ ప్రభావం క్షేత్రస్థాయిలో పడింది. సాధారణంగా కాంట్రాక్టర్ల దగ్గర మిషనరీలు ఉండడంతో చకచకా పనులు చేసే పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతం అత్యవసర పరిస్థితులు ఎదురైతే చక్కదిద్దడం అధికారులకు కత్తిమీద సాములా మారింది. కారణం.. శాఖ సిబ్బంది వద్ద సరైన మిషనరి ఉండకపోవడమే. ఈ పరిస్థితుల్లో వారు చిన్న పనులు కూడా చక్కబెట్టేందుకు సమయం తీసుకుంటున్నారు. నిమిషాల్లో పూర్తి కావాల్సిన పనులు సైతం గంటలు పడుతుండడం గమనార్హం. ప్రస్తుతం వర్షాకాలం కావడం, అలాగే గణేశ్ నవరాత్రోత్సవాలు మొదలవుతుండగా అత్యవసరంగా ఏదైన పనులు ఏర్పడితే విద్యుత్ శాఖ అధికారులకు ఉరుకులు పరుగులు తప్పని పరిస్థితి. పరిస్థితిని చక్కదిద్దాల్సిన ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వివాదం ఏమిటి..
వర్క్స్‌కు సంబంధించి బిల్లులను జిల్లా కేంద్రంలోని అకౌంట్ సెక్షన్‌లో కాంట్రాక్టర్లు అందజేస్తారు. వాటి ని ఆ సెక్షన్ ఆఫీసర్లు పరిశీలించి ఉన్నతాధికారులకు పంపించాలి. అయితే ఓ అధికారి ఆ బిల్లుల పరిశీలనతో పాటు వాటిని ఉన్నతాధికారులకు పంపించడంలో అంతులేని జాప్యం చేస్తున్నారని,ఈ తాత్సా రం విషయంలో ప్రశ్నించినా మార్పు రావడం లేద ని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు.దీంతో నెలల తర బడి బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయని వాపోతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, గత్యంతరం లేని పరిస్థితిలోనే పనులు నిలిపివేయాల్సి వచ్చిందని అంటున్నారు.
అత్యవసర పనులు చేయాలని చెప్పాం..
కాంట్రాక్టర్లు వర్క్‌లు చేయడం నిలిపివేశారు. అయితే అత్యవసరంగా ఏదైన పని ఏర్పడితే చేయాలని చెప్పాం. పెండింగ్ బిల్లుల విషయంలో వారు నిరసనకు దిగారు. ఆదిలాబాద్ డీఈ వారితో చర్చలు జరుపుతున్నారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం.
– జేఆర్ చౌహాన్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ, ఆదిలాబాద్

సెక్షన్‌లో ఓ అధికారి తీరు మారట్లేదు..

సెక్షన్‌లో ఓ అధికారి తీరు మారట్లేదు..

సెక్షన్‌లో ఓ అధికారి తీరు మారట్లేదు..