
రైతులు అధైర్యపడొద్దు
సిరికొండ: వరద బాధిత రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మండలంలో దెబ్బతిన్న పంటలను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. కొండాపూర్ శివారు చిక్‌మాన్ వాగు సమీపంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సర్వే కొనసాగుతుందని, బాధిత రైతులందరికీ పరిహారం అందేలా చూస్తామన్నారు. కాగా, చిక్‌మాన్ ప్రాజెక్టుకు గేట్లు బిగించాలని రైతులు కలెక్టర్‌కు విన్నవించారు. అనంతరం మండల కేంద్రంలోని పీఏసీఎస్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే మండలకేంద్రంలోని కేజీబీవీని సందర్శించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ తుకారాం, ఎంపీడీవో రవీందర్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, ఏవో శ్రద్ధారాణి, ఎంపీవో సంతోష్‌కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి ప్రవీణ్, మండల విద్యాధికారి సునీల్ కుమార్, పంచాయతీ కార్యదర్శి సూర్యప్రకాశ్ తదితరులున్నారు.
నష్టంపై ప్రణాళికలు రూపొందించాలి
కై లాస్‌నగర్: జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో నష్టపోయిన పంటలు, దెబ్బతిన్న వంతెనలు, రహదారులకు సంబంధించి ఆయా శాఖల అధి కారులు నివేదికలు సమర్పించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మతులతో పా టు శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కొత్తగా నిర్మించిన వంతెనల వద్ద రహదారులు గుంతలమయమైనట్లు గు ర్తించినట్లు తెలిపారు. సంబంధిత కాంట్రాక్టు సంస్థలే ఆ బాధ్యత తీసుకుని శాశ్వత మరమ్మతు చేపట్టాలని ఆదేశించారు. నీటి ప్రవాహానికి దెబ్బతిన్న కల్వర్టులు, మినీ వంతెనలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. అనంతరం అధికారులు రూపొందించిన ప్రదర్శనను పరిశీలించి, వివిధ శాఖల ప్ర ణాళికలను సమీక్షించారు. తహసీల్దార్లు మండలా ల వారీగా వరద నష్టం వివరాలు సమర్పించాలన్నారు. ఈనెల చివరిలో మరోసారి సమీక్ష ఉంటుందని, పూర్తి వివరాలతో హాజరు కావాలన్నా రు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.