
ముగిసిన శబరిమాత అఖండజ్యోతి
తలమడుగు: మండలంలోని కజ్జర్ల గ్రామంలో శ్రావణమాసం సందర్భంగా నెలరోజుల పాటు నిర్వహించిన శబరిమాత అఖండ జ్యోతి ముగింపు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే శంకర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. మన సంస్కృతిని భావితరాలకు అందించాలన్నారు. అనంతరం పల్లకీ ఊరేగింపు నిర్వహించారు. మహిళలు సాంప్రదాయ నృత్యాలు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానందం, బీజేపీ మండల అధ్యక్షుడు ధనంజయ్, బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.