
బోధనోపకరణాలతో విద్యార్థుల్లో ఆసక్తి
కాసిపేట: బోధనోపకరణాలు విద్యార్థుల్లో అభ్యాసంపై ఆసక్తిని పెంపొందిస్తాయని, విద్యాప్రమాణాల మెరుగుదలకు దోహద పడతాయని జిల్లా విద్యాధికారి యాదయ్య సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని కాసిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి బోధనోపకరణాల మేళా(టీఎల్‌ఏం)ను ఆయన ప్రారంభించారు. ఉపాధ్యాయుల సృజనాత్మకతను అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కోఆర్డినేటర్లు చౌదరి సత్యనారాయణమూర్తి, విజయలక్ష్మి, మండల విధ్యాధికారి ముక్తవరం వెంకటేశ్వరస్వామి, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు మామిడిపల్లి సాంబమూర్తి, రమేష్ రాథోడ్, సుధాకర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.