
ప్రో ఖోఖో లీగ్‌కు మడావి ప్రశాంత్
ఉట్నూర్‌రూరల్: ఇంద్రవెల్లి మండలం చిన్నగూడకు చెందిన మడావి ప్రశాంత్ అల్టిమేట్ ప్రో ఖోఖోలీగ్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా అతడిని ఉట్నూర్‌లో జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి సోమవారం సన్మానించారు. స్థానిక కొలాం ఆశ్రమ ఉన్నత పాఠశాలలో చదివి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న ప్రశాంత్‌ను పలువురు అభినందించారు. ఇందులో సీనియర్ పీడీ హేమంత్, కోచ్‌లు కృష్ణ, శేఖర్ పాల్గొన్నారు.
బీజేపీ నాయకులపై కేసు
గుడిహత్నూర్: అనుమతి లేకుండా జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకోలో పాల్గొన్న 20 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ బండారి రాజు తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో రహదారిపై బైఠాయించడంతో ప్రజా రవాణాతో పాటు భారీ వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిందని పేర్కొన్నారు. జాతీయ రహదారి సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఎలుగుబంటి వేటగాళ్ల రిమాండ్
పెంచికల్‌పేట్(సిర్పూర్): పెంచికల్‌పేట్ రేంజ్ పరిధిలోని కోయచిచ్చాల అటవీ ప్రాంతంలో ఎలుగుబంటిని వేటాడిన నలుగురిని రిమాండ్‌కు తరలించినట్లు అటవీశాఖ అధికారులు సో మవారం తెలిపారు. పదిరోజుల క్రితం ప్రధాన నిందితుడు శ్రీనివాస్‌ను రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు. సోమవారం పెంచికల్‌పేట్‌కు చెందిన వెంకటి, సామెర సత్తన్న, ఎల్లూర్‌కు చెందిన మధునయ్యను కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు ఎఫ్‌ఎస్‌వో జగన్, ఎఫ్‌బీవో సతీష్ వెల్లడించారు. వన్యప్రాణులను వేటాడితే చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.