
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
కాసిపేట: కాసిపేట పోలీస్‌స్టేషన్ పరిధి సోమగూడెం భరత్‌కాలనీకి చెందిన మల్లెపల్లి శోభన్(42) కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్సై రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్ మండలానికి చెందిన శోభన్ సోమగూడెంలో నివాసం ఉంటూ ఆటోరిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. భార్యాభర్తలు గొడవ పడడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన శోభన్ ఆదివారం ఉదయం 9.30గంటలకు పురుగుల మందు తాగాడు. మంచిర్యాల ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం మృతిచెందాడు. మృతుడి సోదరుడు మల్లెపల్లి తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి..
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల ము న్సిపల్ కార్పొరేషన్ పరిధి ముల్కల్ల వాగొడ్డుపల్లెకు చెందిన కొట్టె బాపన్న(51) ఆత్మహత్య చేసుకున్నా డు. హాజీపూర్ ఎస్సై స్వరూప్‌రాజ్ తెలిపిన వివరా ల ప్రకారం.. బాపన్న వ్యవసాయ కూలీ పనులు చే స్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల నడుం నొప్పి తీవ్రంగా ఉండడంతో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. వ్యవసాయం, కూలీ పనులకు వెళ్లలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. పదేళ్ల క్రితం బాపన్న కుమారుడు చనిపోవడం, తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురై 24న సాయంత్రం 4గంటల ప్రాంతంలో ముల్కల్ల శివారులో గడ్డి మందు తాగాడు. మృతుడికి భార్య పద్మ, కుమార్తె లలిత ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.