
సంస్కృతిని భావితరాలకు అందించాలి
ఇంద్రవెల్లి: ఆదివాసీలు తరాలుగా వస్తున్న సంస్కృతి, సాంప్రదాయాలు పాటిస్తూ భావితరాలకు అందించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. మండలంలోని కేస్లాగూడలో శనివారం నిర్వహించిన పొలాల అమవాస్య పండుగకు హాజరయ్యారు. ఆదివాసీలతో కలిసి ఎడ్ల జతలకు పూజలు చేశారు. నైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో ఉట్నూర్ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్, గ్రామ పటేల్ జ్యోతిరాం, గ్రామస్తులు పాల్గొన్నారు.
గురుకుల పాఠశాల తనిఖీ
అనంతరం మండలంలోని ముత్నూర్‌లో గల గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. వసతి గృహంలో మెనూ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నారు. ఆమె వెంట ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.