
హంగు, ఆర్భాటం లేకుండా..
సాక్షి,ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా ఆమె పర్యటన కొనసాగించారు. గురువారం సాయంత్రం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆమె స్థానిక టీటీడీసీ భవనంలో సుమారు 50 మంది పార్టీ బృందం సభ్యులతో కలిసి విశ్రాంతి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం పార్టీ కార్యకర్తలతో కలిసి శ్రమదానం చేపట్టారు. అనంతరం ఇంద్రవెల్లి మండలం సమాక గ్రామానికి చేరుకొని వివిధ ప్రభుత్వ పథకాలపై ప్రజలకు ఎలా చేరువవుతున్నాయనే విషయంలో ఆరా తీశారు. అయితే ఆమె తన పర్యటన సందర్భంగా ప్రభుత్వ భవనంలో సేద తీరారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఆమె అందరితో కలిసి ఉన్నారు. ఇక్కడి నుంచి తాను సొంతగా తెచ్చుకున్న కారులో ఇంద్రవెల్లికి బయల్దేరి వెళ్లారు. మొత్తంగా ఆమె పర్యటన కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారింది.