
నాణ్యమైన విద్యుత్ సేవలు అందించాలి
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో విద్యుత్ వ్యవసాయ కనెక్షన్లు పెండింగ్‌లో ఉంచవద్దని ఎన్‌పీడీసీఎల్ వరంగల్ డైరెక్టర్ మధుసూదన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో విద్యు త్ శాఖ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని ఆదేశించారు. 33కేవీ ట్రి ప్పింగ్ కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని విద్యుత్ స్తంభాలకు సెప్టెంబర్ 30లో గా నంబరింగ్ పూర్తి చేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బకాయిలను వసూలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో సీఈ అశోక్ కుమార్, డీఈలు ఈదన్న, ప్రభాకర్, సుభాష్, ఏడీ లక్ష్మణ్, ఉద్యోగులు పాల్గొన్నారు.