
తిమ్మిని బమ్మి చేసి..
ఇది ఉట్నూర్ మండలం కుమ్మరితాండలో ఓ డొమెస్టిక్ కొత్త లైన్ కోసం వేసిన ట్రాన్స్‌ఫార్మర్. పది రోజుల క్రితం బిగించారు. అయితే ఇక్కడ లాజిక్ ఉంది. వాస్తవానికి 25 కేవీ లోడ్ ట్రాన్స్‌ఫార్మర్ బిగించాలి. అయితే ఇదే మండలంలోని ఉమ్రి గ్రామంలో ఓవర్‌లోడ్ కారణంగా తొలగించిన 15 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను బిగించేశారు. అలాగని ఈ వర్క్ సాంక్షన్ జరిగి అగ్రిమెంట్ ప్రకారం జరుగుతుందా అంటే.. అదేమిలేదు. మొత్తం పని పూర్తయిన తర్వాత ఇప్పుడు సాంక్షన్, అగ్రిమెంట్ పనులు చేపట్టడంలో చోద్యమేమిటో.
ఇది ఉట్నూర్ మండలంలోని ఉమ్రి గ్రామంలోనిది. ఒక వర్క్‌కు సంబంధించి ఈ 25కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఇటీవల బిగించారు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఈ వర్క్ ఇంకా మంజూరు కాకపోవడంతో ఇదే గ్రామంలో మంజూరైన ఇతర పనులకు సంబంధించి మరో కాంట్రాక్టర్ నుంచి ఓ ట్రాన్స్‌ఫార్మర్‌ను తీసుకొని ఇలా పెట్టేశారు. సాధారణంగా ఏ పనికోసమైతే ఆ ట్రాన్స్‌ఫార్మర్‌ను వాడాలో దానికి సంబంధించి ఎక్యూప్మెంట్ నంబర్ నమోదై ఉంటుంది. ఇప్పుడు ఈ బిగించిన ట్రాన్స్‌ఫార్మర్ వివరాలు విచారణ చేస్తే అది మరొక పనికోసం మంజూరు చేసినదని ఇట్టే తెలిసిపోతుంది.

తిమ్మిని బమ్మి చేసి..