
రుణం చెల్లించినా జమ కాలే..
మేమంతా సరోజినిదేవి గ్రామ సమాఖ్య పరిధిలోని మహాత్మాగాంధీ గ్రామ స్వయం సహాయక సంఘ సభ్యులం. సీ్త్రనిధి ద్వారా తీసుకున్న రూ.2లక్షల రుణాలను మూడేళ్లలో పూర్తిగా చెల్లించాం. 2020లో కొత్త రుణం కోసం బ్యాంకుకు వెళ్లగా పాత రుణం పూర్తిగా చెల్లించలేదని అధికారులు తెలిపారు. మేం కట్టిన రశీదులు చూపించగా ఆ డబ్బులు మరో సంఘం ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు. దీనిపై ఐకేపీ సీసీ, సీఏలను ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదు. నాలుగేళ్లుగా ఆ రుణంపై వడ్డీ పెరుగుతోంది. విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలి. – ఎస్‌హెచ్‌జీ
సభ్యులు, ఖోడద్, తలమడుగు