
రెండేళ్లయినా బిల్లులు రావట్లేదు..
సార్.. మేమంతా పీవీటీజీ ఆదిమ గిరిజనులం. ఉట్నూర్ ఐటీడీఏ ఆధ్వర్యంలో 2023లో సీసీడీపీ నిధుల కింద కేంద్ర ప్రభుత్వం ఇండ్లను మంజూరు చేసింది. చేతిలో డబ్బుల్లేకపోయినా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందనే భరోసాతో అప్పు చేసి మరి ఇండ్లను కట్టుకున్నాం. నిర్మాణాలు పూర్తయి రెండేండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు బిల్లులు మంజూరు చేయడం లేదు. మా పరిస్థితి అర్థం చేసుకుని త్వరితగతిన బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
– ఆదివాసీ లబ్ధ్దిదారులు, ఉట్నూర్