వర్సిటీ ఏర్పాటు చేయాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

వర్సిటీ ఏర్పాటు చేయాల్సిందే..

Aug 12 2025 12:51 PM | Updated on Aug 12 2025 12:51 PM

వర్సిటీ ఏర్పాటు చేయాల్సిందే..

వర్సిటీ ఏర్పాటు చేయాల్సిందే..

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలో యూనివర్సిటీ ఏర్పా టు చేయాల్సిందేనని యూనివర్సిటీ సాధన సమి తి జిల్లా కన్వీనర్‌ బద్దం పురుషోత్తంరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్‌ కళాశాలలో విద్యార్థులకు వర్సిటీ ఆవశ్యకతపై సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. సమష్టిగా పోరాడితే విశ్వవి ద్యాలయ ఏర్పాటు సాధ్యపడుతుందన్నారు. ఈ మేరకు విద్యార్థులు, యువత, రాజకీయ నాయకులు ఉద్యమంలో కలిసి రావాలని కోరారు. జిల్లావ్యాప్తంగా అన్ని కళాశాలలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భారీసభ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో వర్సిటీ సాధన స మితి కోకన్వీనర్‌ తొగరి భాస్కర్‌, సభ్యులు శ్రీ కాంత్‌ రెడ్డి, అఫ్సర్‌ఖాన్‌, డాక్టర్‌ ప్రపుల్‌వఝే, సతీశ్‌రెడ్డి, ఛాత్రోపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement