
● విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న కొందరు గురు
న్యూస్‌రీల్
మావలలోని జెడ్పీఎస్‌ఎస్‌లో ఓ ఉపాధ్యాయుడిపై ఇటీవల పోక్సో కేసు నమోదైంది. విద్యార్థినులు షీటీమ్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టి సదరు ఉపాధ్యాయుడిపై కేసు నమో దు చేశారు. దీంతో ఆయన జైలు పాలయ్యాడు.
ఇంద్రవెల్లి మండలంలోని ఓ పాఠశాల ఉపాధ్యాయుడిపై విద్యార్థినులు షీటీమ్‌కు ఫిర్యాదు చేశా రు. ఆతర్వాత స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు న మోదైంది. ఇటీవల పోక్సోకేసు నమోదుతో సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.
తాంసి మండల కేంద్రంలోని ఓ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు షీటీమ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు. ఇటీవల సదరు ఉపాధ్యాయుడిని విద్యాశాఖాధికారులు సస్పెండ్ చేశారు.
ఉట్నూర్‌లో పనిచేసే ఎస్జీటీ ఓ విద్యార్థినిపై ఇటీవల అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసు స్టేషన్‌లో కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. ఆయనపై పోక్సో కేసు నమోదైంది.
ఉట్నూర్ మండలం లక్కారం పాఠశాలలో ఓ ఉ పాధ్యాయుడు విద్యార్థినులపై అసభ్యంగా ప్రవ ర్తించడంతో ఆయనపై పోక్సో కేసు నమోదైంది.
మావలలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఓ ప్రిన్సి పాల్ విద్యార్థిని వేధించడంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఇటీవల ఆ ఉపాధ్యాయుడికి జైలు శిక్ష సైతం పడింది.
తాంసి మండలంలోని ఘోట్కురి పాఠశాలలో పనిచేసే ఓ ఉపాధ్యాయుడు, వాగాపూర్‌లో పని చేసే మరో ఉపాధ్యాయుడు గతంలో విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించడంతో వారిపై సస్పెన్షన్ వేటువేశారు. వేరేపాఠశాలకు బదిలీ చేశారు.
జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ స్కూల్‌లో పనిచేసే ఇద్దరు కోచ్‌లు విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించడంతో వారిపై వేటు పడింది. విధుల నుంచి తొలగించారు. ఇటీవల ఓ కోచ్‌పై వన్‌టౌన్‌లో పోక్సో కేసు నమోదైంది.
మంగళవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2025
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి సన్మార్గంలో నడిపించాల్సిన గురువుల్లో కొంతమంది తప్పడుగులు వేస్తున్నారు. వెకిలి చేష్టలతో కీచకులుగా మారుతున్నారు. విద్యాబుద్ధులు నేర్పించి వారి భవితకు బాటలు వేయాల్సిన వారు దారి తప్పుతున్నారు. తండ్రి లాంటి వయస్సులో ఉన్నవారు విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. పవిత్రమైన వృత్తికి మచ్చ తెచ్చిపెడుతున్నారు. ఇటీవల జిల్లాలో వెలుగు చూసిన పలు సంఘటనలే ఇందుకు నిదర్శనం. దీంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొంత మంది పిల్లలు తమకు జరిగిన అన్యాయాన్ని వెల్లబోసుకుంటుండగా, మరికొందరు ఎవరికి చెప్పుకోలేక మానసికంగా కుంగిపోతున్నారు. కొంత మంది గురువుల ఈ చేష్టలతో మిగతా ఉపాధ్యాయులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. విద్యార్థులు షీటీమ్, పోలీసులను సంప్రదించడంతో నిందితులపై పోక్సో కేసులు నమోదై కటకటాల పాలవుతున్నారు.
జిల్లాలో ఘటనలు..
● మావలలోని జెడ్పీఎస్‌ఎస్‌లో ఓ ఉపాధ్యాయుడిపై ఇటీవల పోక్సో కేసు నమోదైంది. విద్యార్థినులు షీటీమ్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టి సదరు ఉపాధ్యాయుడిపై కేసు నమో దు చేశారు. దీంతో ఆయన జైలు పాలయ్యాడు.
● ఇంద్రవెల్లి మండలంలోని ఓ పాఠశాల ఉపాధ్యాయుడిపై విద్యార్థినులు షీటీమ్‌కు ఫిర్యాదు చేశా రు. ఆతర్వాత స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు న మోదైంది. ఇటీవల పోక్సోకేసు నమోదుతో సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.
● తాంసి మండల కేంద్రంలోని ఓ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు షీటీమ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు. ఇటీవల సదరు ఉపాధ్యాయుడిని విద్యాశాఖాధికారులు సస్పెండ్ చేశారు.
● ఉట్నూర్‌లో పనిచేసే ఎస్జీటీ ఓ విద్యార్థినిపై ఇటీవల అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసు స్టేషన్‌లో కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. ఆయనపై పోక్సో కేసు నమోదైంది.
● ఉట్నూర్ మండలం లక్కారం పాఠశాలలో ఓ ఉ పాధ్యాయుడు విద్యార్థినులపై అసభ్యంగా ప్రవ ర్తించడంతో ఆయనపై పోక్సో కేసు నమోదైంది.
● మావలలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఓ ప్రిన్సి పాల్ విద్యార్థిని వేధించడంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఇటీవల ఆ ఉపాధ్యాయుడికి జైలు శిక్ష సైతం పడింది.
● తాంసి మండలంలోని ఘోట్కురి పాఠశాలలో పనిచేసే ఓ ఉపాధ్యాయుడు, వాగాపూర్‌లో పని చేసే మరో ఉపాధ్యాయుడు గతంలో విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించడంతో వారిపై సస్పెన్షన్ వేటువేశారు. వేరేపాఠశాలకు బదిలీ చేశారు.
● జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ స్కూల్‌లో పనిచేసే ఇద్దరు కోచ్‌లు విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించడంతో వారిపై వేటు పడింది. విధుల నుంచి తొలగించారు. ఇటీవల ఓ కోచ్‌పై వన్‌టౌన్‌లో పోక్సో కేసు నమోదైంది.
న్యూస్‌రీల్
అసభ్యంగా ప్రవర్తిస్తే చర్యలు
టీచర్లు పోక్సో కేసుపై అవగాహన కలిగి ఉండాలి. విద్యార్థినులను బ్యాడ్ టచ్ చేయవద్దు. శారీరకంగా ఇబ్బందులకు గురిచేస్తే పోక్సో కేసు నమోదు చేస్తాం. అసభ్యంగా ప్రవర్తించే వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం.
– ఎల్.జీవన్‌రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ
బడిలో కీచకపర్వం..
విద్యార్థులకు చదువు, సంస్కారం నేర్పాల్సిన పాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. మంచి, చెడు చెప్పాల్సిన వారే సమాజంలో తలదించుకునే పనులు చేస్తున్నారు. ఇటీవల జిల్లాలో వరుసగా విద్యార్థినులపై గురువుల అఘాయిత్యాలు పెరగడంతో పోక్సో కేసులు నమోదవుతున్నాయి. టీచర్లు ఇలాంటి పనులు చేయడం ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు.