కైలాస్‌నగర్: అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను సక్ర మం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎల్‌ఆర్‌ఎస్ గడువు సమీపిస్తోంది. ఫీజులో 25 శాతం రాయితీతో ప్లాట్లను క్రమబద్ధీకరించుకునే గడువు ఈ నెల 31తో ముగియనుంది. దీంతో ఫీజు చెల్లించేందుకు దరఖాస్తుదారులు బల్ది యా కార్యాలయానికి క్యూ కడుతున్నారు. వారి కున్న సందేహాలు నివృత్తి చేసుకుంటూ ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లిస్తున్నారు. ఇందుకోసం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగంలో పది ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. మున్సిపల్ సిబ్బందితో పాటు జిల్లాలోని అన్ని మీసేవ కేంద్రాలు, ఎల్‌ఆర్‌ఎస్– 2020 వెబ్‌సైట్‌లోనూ సిటిజన్ లాగిన్ ద్వారా నేరుగా ఇంటి నుంచే ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించేందుకు అవకాశముంది. అయితే ఇప్పటి వరకు కేవలం 10.6 శాతం మంది మాత్రమే చెల్లించారు. ఇక మిగిలింది (గురువారం మినహా) నాలుగు రోజు లే గడువుండటంతో వేలాది దరఖాస్తుల పరిస్థితి ప్రశ్నార్థకంగానే మారనున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
విస్తృత ప్రచారం కల్పించినా..
అక్రమ లేఅవుట్లలోని పది శాతం ప్లాట్లు విక్రయించి, మిగిలిపోయిన వాటితో పాటు గతంలో ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకోని ప్లాట్లకు సైతం ఎల్‌ఆర్‌ఎస్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నెల 31లోగా వాటిని రెగ్యులరైజ్ చేసుకుంటే ఫీజులో 25శాతం రాయితీ కల్పిస్తామని పేర్కొంటూ గత ఫిబ్రవరి 20న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఈ ప్రక్రియకు కొంత అవరోధం ఏర్పడింది. కోడ్ ముగిసిన వెంటనే ప్రక్రియ వేగవంతం చేసేలా బల్దియా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం కల్పించిన రాయితీ అవకాశాన్ని ప్రజలకు తెలియజేసేలా ప్రధాన కూడళ్లలో హో ర్డింగ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు ఆటోల ద్వారా విస్తృత ప్రచారం కల్పించారు. దీనికి తోడు దరఖాస్తుదారులు సకాలంలో ఫీజు చెల్లించేలా వార్డు ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు అదే పనిగా దరఖాస్తుదారులకు ఫోన్లు చేస్తూ ఫీజు చెల్లించాలని కోరుతున్నారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ వేగవంతం చేయడంతో పాటు దరఖాస్తుదారులకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఫీజులో 25శాతం రాయితీ అవకాశం కల్పించింది. మార్చి 31లోపు ప్లాట్లను క్రమబద్ధీకరించుకుంటే ఇది వర్తిస్తుందని పేర్కొంది. జిల్లాలో 22,369 మంది ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకోగా ఈ నెల 25వరకు 1,881మంది ఫీజు చెల్లించారు. బల్ది యా ఖాజానాకు రూ.3.80 కోట్ల ఆదాయం చేకూరింది. బుధవారం 250 మంది ఫీజు చెల్లించారు. మొత్తంగా 2,131మంది ఫీజు చెల్లించారు. అయితే మొత్తం దరఖాస్తులతో పరిశీలిస్తే ఇది కేవలం 10.06శాతం మాత్రమే ఉండడం గమనార్హం. రా యితీతో కూడిన ఎల్‌ఆర్‌ఎస్ చేసుకునేందుకు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండటంతో వేలాది దరఖాస్తులు నిర్ణీత గడువులో ఎలా అవుతాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపు కోసం వచ్చిన వారితో సందడిగా బల్దియా టౌన్ ప్లానింగ్ విభాగం
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో..
మొత్తం ఎల్‌ఆర్‌ఎస్ బ్లాక్‌లు: 08
అందిన దరఖాస్తులు : 22,369
ఫీజు చెల్లించాలని సమాచారం ఇచ్చినవి: 14,400
ఫీజు చెల్లించనవి : 2,131
బల్దియాకు ఇప్పటి వరకు
వచ్చిన ఆదాయం : రూ.3.80 కోట్లు
మీ సేవ కేంద్రాల్లోనూ అవకాశం
అక్రమ లేఅవట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. మార్చి 31లోపు ఎల్‌ఆర్‌ఎస్ చేసుకుంటే ఫీజు లో 25శాతం రాయితీ అందనుంది. దరఖా స్తుదారులు ఈ ఫీజును బల్దియా కార్యాలయంతో పాటు మీ సేవకేంద్రాల్లోనూ చెల్లించవచ్చు. అలాగే ఎల్‌ఆర్‌ఎస్ 2020 వెబ్‌సైట్ ద్వారా ఇంటి నుంచే సెల్‌ఫోన్‌లో గూగుల్‌పే, ఫోన్ పే ద్వారా కూడా చెల్లించవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– నవీన్‌కుమార్, టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్


