ఆదిలాబాద్‌రూరల్: మాలీలు ఎస్టీ హోదా విషయంలో ఐక్యంగా ఉద్యమించాలని అఖి ల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పేట్కులే అన్నారు. జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో గల పూలే గెస్ట్ హౌస్‌లో ఆదివారం మాలీ ఉద్యోగుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల జూనియర్ లెక్చరర్లుగా ఎంపికై న బెల్లపు నగేశ్, గురునులే దత్త సొంకాస్, ఉ పాధ్యాయులుగా ఎంపికై న సాయికుమార్, ప్రధాన్ గిరిగాం, రాగి సంజీవ్, కుచ్లాపూర్ విజయ్, మాహుర్లే జైనథ్‌ను సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఇందులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న, ఉపాధ్యక్షుడు సురేశ్, ప్రచార కార్యదర్శి మురళీధర్, జిల్లా అధ్యక్షుడు విజయ్ పాల్గొన్నారు.


