​​​​​​​బాల భీముడు | - | Sakshi
Sakshi News home page

​​​​​​​బాల భీముడు

Apr 7 2024 2:25 AM | Updated on Apr 7 2024 10:50 AM

అధిక బరువుతో జన్మించిన బాల భీమునితో తల్లి - Sakshi

అధిక బరువుతో జన్మించిన బాల భీమునితో తల్లి

నిర్మల్‌చైన్‌గేట్‌: సాధారణంగా శిశువులు 2.5 కిలోల నుంచి 3.5 కిలోల బరువుతో జన్మిస్తారు. నిర్మల్‌లో 4.900 కిలోల బరువుతో శనివారం బాబు జన్మించాడు. సారంగాపూర్‌ మండలం ఆలూరు గ్రామానికి చెందిన స్రవంతి శుక్రవారం ప్రసవం కోసం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చేరింది. హెచ్‌వోడీ డాక్టర్‌ సరోజ ఆధ్వర్యంలో డ్యూటీ డాక్టర్‌, నర్సులు సాధారణ స్రవంతికి సాధారణ ప్రసవం చేశారు. ప్రస్తుతము తల్లి, బాబు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement