అంతా రహస్యమే..! | - | Sakshi
Sakshi News home page

అంతా రహస్యమే..!

Nov 4 2026 11:40 PM | Updated on Nov 4 2026 11:40 PM

వైద్యశాఖలో కాంట్రాక్ట్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ

అధికారిక వెబ్‌సైట్‌కే పరిమితమైన నోటిఫికేషన్‌

హడావుడిగా దరఖాస్తుల స్వీకరణ

పైరవీలకే పెద్దపీట అనే ప్రచారం

నిరుద్యోగుల్లో ఆందోళన

సాక్షి,ఆదిలాబాద్‌: అవి కాంట్రాక్ట్‌ పోస్టులు.. నోటిఫికేషన్‌ విడుదల చేసినా కేవలం అధికారిక వెబ్‌సైట్‌కే పరిమితం చేశారు.. స్వల్ప వ్యవధి ఇచ్చి హడావుడిగా దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. అప్లికేషన్‌ ఫారాలు సైతం ఆన్‌లైన్‌లో ఆలస్యంగా అందుబా టులోకి తెచ్చారు.. ఒకరి నుంచి మరొకరు తెలుసుకొని నిరుద్యోగులు ఎలాగోలా తిప్పలు పడి దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప్రక్రియ ముగిసి నెలరో జులవుతుంది. ఇప్పటికీ అసలెంత మంది దరఖాస్తు చేసుకున్నారో తెలియని పరిస్థితి. మరోవైపు దరఖా స్తు చేసుకున్న కొంత మంది పలుకుబడితో పైరవీ చేసుకొని ఉద్యోగం దక్కించుకుంటున్నారనే ప్రచా రం జోరుగా సాగుతోంది. మొత్తంగా ఇంత రహస్యంగా ఎందుకు ప్రక్రియ నిర్వహిస్తున్నారనే దాని పై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లా వైద్యారోగ్యశాఖలో సెప్టెంబర్‌ 26న నోటిఫికేషన్‌ నం.4015/2026 జారీ చేసినట్టుగా దరఖాస్తు ఫారంలో ఉంది. ఎన్‌హెచ్‌ఎం పరిధిలో వైద్యుల నుంచి మొదలుకుంటే 32 వివిధ కాంట్రాక్ట్‌ విధానంలో ఉద్యోగాల భర్తీకి జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ పొందుపర్చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వెంటనే సమచారం ఇవ్వకపోవడంతో ఆలస్యంగా తెలిసిందని, అప్లికేషన్‌ ఫారం కూడా లేట్‌గా అందుబాటులోకి తీసుకురావడంతో హడావుడి పడాల్సి వచ్చిందని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్‌ 29 నుంచి అక్టోబర్‌ 3 వరకు (ఇందులో ఒక రోజు గాంధీ జయంతి సెలవు) దరఖాస్తులు స్వీకరించడం గమనార్హం. స్వల్ప వ్యవధిలో ప్రక్రియ చేపట్టడం వెనుక మతలబు ఏమిటన్న చర్చ సాగుతోంది.

ఆ తర్వాత అదే పరిస్థితి..

నెల క్రితం దరఖాస్తు స్వీకరణ ముగిసింది. పలు క్యాడర్‌ పోస్టులు అందులో ఉండగా, ఆ సంఖ్యకు అనుగుణంగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయనేది అధికారికంగా వెల్లడించలేదు. ‘సాక్షి’ విషయమై ఆ శాఖ అధికారిని వివరణ కోరగా.. స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య మినహా మిగతా వాటి వివరాలు క్యాడర్‌వారీగా వెల్లడించలేదు. ఆయా పోస్టులకు మొత్తం వచ్చిన దరఖాస్తుల సంఖ్య మాత్రమే చెప్పడం గమనార్హం.

జాబితా విడుదలలోనూ అదేతీరు..

ప్రొవిజినల్‌ జాబితా విడుదలలోనూ వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడం నిరుద్యోగ అభ్యర్థులను అసహనానికి గురయ్యేలా చేస్తోంది. ఈ వి షయంలో పలువురు ‘సాక్షి’ దృష్టికి తీసుకురావడంతోనే ఈ ప్రక్రియపై దృష్టి సారించాల్సి వచ్చింది. మంగళవారం రాత్రి వరకు పూర్తి జాబితా అందుబా టులోకి తీసుకొస్తున్నామని అధికారులు చెప్పినప్పటికీ కేవలం రెండు రకాల పోస్టుల జాబితానే పత్రిక ప్రకటన ద్వారా వెల్లడించారు. మిగతా పోస్టుల జాబితాను బుధవారం కార్యాలయ బోర్డుపై పొందుపరిచారు. అయితే వెబ్‌సైట్‌లో అందుబాటులో లేకపోవడంతో అభ్యర్థులంతా డీఎంహెచ్‌వో కార్యాలయానికి వచ్చి చూసుకోవాల్సిన పరిస్థితి.

జోరుగా పైరవీలనే ప్రచారం..

ఇంత రహస్యంగా ప్రక్రియ కొనసాగిస్తుండడంతో అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మార్కుల ఆధారంగా కాకుండా లక్కీడ్రాతో పోస్టులను కేటాయిస్తున్నారని, రాజకీ య, పలుకుబడి ఉన్నవారితో పైరవీలు చేసుకున్న వారికి ఓకే చేస్తున్నారని, ఒక్కో పోస్టుకు రూ.లక్షల డిమాండ్‌ సాగుతుందని.. ఇలా రకరకాల ప్రచారా లతో అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు.

నోటిఫికేషన్‌ వివరాలు ఇలా..

పోస్టుల సంఖ్య 32 (13 క్యాడర్‌

కాంట్రాక్ట్‌ బేసిక్‌

పోస్టులు)

వచ్చిన దరఖాస్తులు 1,588

ఏయే పోస్టులు : వైద్యులు, స్టాఫ్‌నర్సు, ఫార్మాసిస్టు, రేడియోగ్రాఫర్‌, ఇతర క్యాడర్‌ పోస్టులు

అత్యధిక పోస్టులు ఉన్నవి స్టాఫ్‌నర్స్‌(8)

వీటికి వచ్చిన దరఖాస్తులు 677

గతంలో ఉన్న గైడ్‌లైన్స్‌ ప్రకారమే..

వైద్యారోగ్య శాఖలో గతంలో ఉన్న గైడ్‌లైన్స్‌ ప్రకారమే ఈసారి కూడా ఉద్యోగాల భర్తీలో పాటించాం. దినపత్రికల్లో నోటిఫికేషన్‌ కాకుండా ప్రకటన జారీ చేశాం. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాం. మొదట్లోనే పైరవీలకు ఆస్కారం లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. దరఖాస్తులు ఎన్ని వచ్చాయనేది కూడా గైడ్‌లైన్స్‌ ప్రకారమే ముందుగా చెప్పలేకపోయాం. ప్రొవిజినల్‌ జాబితాను విడుదల చేశాం.

– నందిని, ఏఓ, వైద్యారోగ్యశాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement