సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

Nov 4 2026 11:40 PM | Updated on Nov 4 2026 11:40 PM

● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: సైబర్‌ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. ప్రతినెల మొదటి బుధవారం నిర్వహించే సైబర్‌ జాగ్రత్త దివస్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రణామ్‌ కేంద్రంలో వయోవృద్ధులకు అవగాహన కల్పించారు. సైబర్‌ నేరాల నివారణ పోస్టర్‌ ఆవిష్కరించారు. అనంతరం ఆ యన మాట్లాడుతూ బ్యాంకు అధికారులమని, ఇతర సంస్థల ప్రతినిధులమని ఫోన్‌ చేసే అపరిచి తులకు బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, ఏటీఎం పిన్‌, పాస్‌వర్డ్‌లు చెప్పవద్దని పేర్కొన్నారు. తెలియ ని లింక్‌లను ఓపెన్‌ చేయడం, నకిలీ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయడం, భారీ డిస్కౌంట్ల పేరుతో వచ్చే ఆఫర్లను నమ్మడం ద్వారా ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని సూచించారు. ఆన్‌లైన్‌ లావాదేవీలు, యూపీఐ చెల్లింపుల సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని, అధికారిక వెబ్‌సైట్లు, యాప్‌లనే వినియోగించాలని చెప్పారు. ఎవరైనా సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.ఇందులో ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌రెడ్డి, వయోవృద్ధుల సంక్షేమ అధికారి మిల్కా, వయోవృద్ధుల సంఘం అధ్యక్షుడు దేవిదాస్‌ దేశ్‌పాండే, సైబర్‌ క్రైమ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement