5-11-2026
అంతర్గాం శివారులో పులి సంచారం
తాంసి: భీంపూర్ మండలంలోని అంతర్గాం శివారులో పులి సంచారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పెన్‌గంగ సరిహద్దుగా ఉన్న పంట చేలలో బుధవారం ఉదయం రైతులు పులి పాదముద్రలు గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సెక్షన్ అధికారి మోపత్‌రావు, బీట్ అధికారి రామేశ్వర్, రైతులతో కలిసి పరిశీలించి పులి పాదముద్రలుగా నిర్ధారించారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


