నేరడిగొండ: గ్రామానికి అన్నివిధాలా అండగా ఉంటానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని బోరిగాం గ్రామంలో బుధవా రం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రూ.3కోట్ల 30లక్షల వ్యయంతో నిర్మించనున్న రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఎంపీపీఎస్ పాఠశాలను ప్రారంభించారు. అలాగే రూ.10లక్షలతో మహిళా సంఘ భవ నం, రూ.10లక్షలతో కమ్యూనిటీహాల్, రూ. 10లక్షలతో జగదాంబ దేవి ఆలయ ప్రహరీ నిర్మాణాలకు భూమిపూజ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, సర్పంచ్ వినేశ్, ఉప సర్పంచ్ సంగీతబాయి, మాజీ సర్పంచ్ పవన్, పండరీ, రవీందర్ రెడ్డి, శివారెడ్డి, శ్రీకాంత్, జీవన్, తదితరులు పాల్గొన్నారు.


