● భైంసాలో క్వింటాకు రూ.7,301 కుంటాల: మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ఎంపీసీ, బైపీసీ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలన్న లక్ష్యంతో ఎక్సలెన్స్ పాఠాలను బోధించనున్నట్లు డీఈవో భోజన్న, ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐఐటీ, జేఈఈ, మె యిన్స్ శిక్షణకు అర్హులైన ఆరుగురు ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. గణితం ఏ–బీ (2), భౌతిక శాస్త్రం (1), రసాయన శాస్త్రం (1), వృక్షశాస్త్రం (1), జంతు శాస్త్రం (1) అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత సబ్జెక్టులలో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలని తెలిపారు. ఐఐటీ, నీట్‌లో శిక్షణ లేదా ఫౌండేషన్ కోర్సుల్లో కనీసం మూడేళ్లు అనుభవం ఉండి, సబ్జెక్టులపై పూర్తి అవగాహన, ఆంగ్లభాషలో నైపుణ్యం, ఐసీటీ ఆధారిత బోధన, స్మార్ట్ క్లాసులు బోధించేవారు అర్హులని వెల్లడించారు. గౌరవ వేతనం గంటకు రూ.650 చెల్లిస్తారని తెలిపారు. ఈనెల 10వ తేదీ లోపు ఆదర్శ పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9666663309 నంబర్‌లో సంప్రదించాలని ఆయన కోరారు.
సోయా ధర ౖపైపెకి..
భైంసాటౌన్: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో సోయా ధర రోజురోజుకూ పెరుగుతోంది. తొలుత క్వింటాల్‌కు రూ.6వేల వరకే ఉండగా, బుధవారం గరిష్టంగా రూ.7,301 పలికింది. మార్కెట్‌కు మొత్తం 187 లాట్లు విక్రయానికి వచ్చాయి. కనిష్టంగా రూ.5,888, మోడల్ ధర రూ.7,069 పలికింది. ఇక, తొగర్లు రూ.8,601, జొన్నలు రూ.2,626, మక్కలు రూ.3,039, పెసర్లు రూ.6,011, నువ్వులు రూ.14,888, మినుములు రూ.8,001 ధర పలికాయి. ప్రైవేట్ కాటన్ జిన్నింగ్ మిల్లుల్లో పత్తి క్వింటాల్ ధర రూ.8,821గా నమోదైంది. కాగా, సోయా ధర గత నెల 1న రూ.6,175 ఉండగా, 6న రూ.6,279, 7న రూ.6,426, 14న రూ.7,099, 15న రూ.7,279 పలికింది. బుధవారం రూ.7,031 గా నమోదైంది.
దరఖాస్తుల ఆహ్వానం