బడి నుంచే.. భద్రత పాఠం! | - | Sakshi
Sakshi News home page

బడి నుంచే.. భద్రత పాఠం!

Nov 4 2026 11:52 PM | Updated on Nov 4 2026 11:52 PM

● ఆందోళన కలిగించిన రాప్తాడు ఘటన ● ఆత్మరక్షణతోనే పిల్లల్లో ఆత్మవిశ్వాసం ● స్వీయరక్షణ పాఠ్యాంశమైతే మేలు ● దూరం కానున్న మత్తు, హింసా ప్రవృత్తి ● పలు పాఠశాలల్లో సెల్ఫ్‌డిఫెన్స్‌ క్లాస్‌లు

ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది

అమ్మాయిలకు ఆత్మరక్షణ కోసం నేర్పే విద్య వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇందుకు మాటేగాం అక్షయనే ఉదాహరణ. పదోతరగతి వరకు సోన్‌ కేజీబీవీలో చదివిన అక్షయ ప్రస్తుతం దిలావర్‌పూర్‌ కేజీబీవీలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతోంది. బాలికా విద్యాలయాల్లోనే సెల్ఫ్‌డిఫెన్స్‌లో భాగంగా నేర్పిన కిక్‌బాక్సింగ్‌పై కాసింత దృష్టిపెట్టి బాగా ప్రాక్టీస్‌ చేసింది. దీంతో అక్షయ ఏకంగా నేషనల్‌ లెవెల్‌లో కిక్‌బాక్సింగ్‌ చాంపియన్‌గా నిలిచి గోల్డ్‌మెడల్‌ అందుకుంది. చాలా పోటీల్లో విజేతగా నిలిచింది.

ధైర్యే సాహసే ‘లక్ష్మి’..

రాప్తాడు స్కూల్‌ ఘటనలో విద్యార్థిని గోపికపై ఎలక్ట్రిక్‌ రంపంతో హేమంత్‌ దాడి చేస్తున్నపుడు ఉపాధ్యాయురాలు, విద్యార్థులంతా పరుగులు తీస్తుండగా, ఒక్క లక్ష్మి మాత్రమే ధైర్యం చేసింది. ప్రాణాలకు తెగించి ఆ రాక్షసుడిని నిలువరించేందుకు యత్నించింది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో రంపం జారి లక్ష్మి మోకాళ్ల నుంచి పాదాల వరకు బలమైన గాయాలయ్యాయి. అలా.. లక్ష్మి ధైర్యంగా పోరాడితేనే గోపిక ప్రాణాలతో ఆస్పత్రికి చేరుకోగలిగింది. లేకుంటే అక్కడే ప్రాణాలు కోల్పోయేది.

బాలికల

సంఖ్య

72,461

విద్యార్థుల

సంఖ్య

1,48,408

స్కూళ్లు, ఇంటర్‌ కాలేజీలు

1,065

బాలుర

సంఖ్య

75,947

నిర్మల్‌: బడి అంటే భద్రతకు చిరునామా.. తరగతి గది అంటే భవిష్యత్‌కు పునాది. అలాంటి చోటే దా డులు జరిగితే బాలికల భద్రతపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జి ల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి వి ద్యార్థినిపై జరిగిన దారుణ దాడి ప్రతి ఒక్కరినీ కలచివేసింది. పాఠశాలల్లోనే విద్యార్థినుల భద్రతకు భ రోసా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘట న భద్రతతో పాటు బాలికల్లో ఆత్మరక్షణ నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెంచాల్సిన అవసరాన్ని మరో సారి గుర్తుచేస్తోంది. మరోవైపు విద్యార్థి దశలోనే గంజాయి లాంటి మత్తుకు అలవాటు పడటం, హింసాత్మక సినిమాలు, రీల్స్‌ చూస్తూ అలాంటి ప్రవృత్తిని పెంచుకోవడంపైనా చర్చ కొనసాగుతోంది.

భయం కాదు.. ధైర్యం నింపాలి

బాలికల భద్రత అంటే తల్లిదండ్రులు వెంట ఉండటం, పాఠశాలల్లో కాపలాదారులను ఏర్పాటు చేయ డమే కాదు. ప్రమాదకర పరిస్థితులను ముందుగానే గుర్తించడం, అనుమానాస్పద ప్రవర్తనను తేలిగ్గా తీసుకోకపోవడం, అవసరమైనప్పుడు స్పందించడం, సురక్షిత ప్రాంతాలను ఎంచుకోవడం లాంటి అంశాలపై బాలికలకు అవగాహన కల్పించాలి.

స్వీయ రక్షణ శిక్షణ తప్పనిసరి

కరాటే, జూడో, తైక్వాండో లాంటి మార్షల్‌ ఆర్ట్స్‌తో పాటు ప్రాథమిక స్వీయ రక్షణ పద్ధతులపై బాలికలకు శిక్షణ ఇవ్వాలి. ప్రమాదం ఎదురైనప్పుడు ఎలా స్పందించాలి? దాడి చేసే వ్యక్తి నుంచి ఎలా దూరం కావాలి? ఎప్పుడు అక్కడి నుంచి తప్పించుకోవాలి? సహాయం కోసం ఎవరినీ ఆశ్రయించాలి? తదితర అంశాలను నిపుణుల ద్వారా నేర్పించాలి. ముఖ్యంగా ఆయుధాలతో దాడి లాంటి ప్రాణాపా య పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలో నేర్పించాల్సిన అవసరముంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో బా లికల కోసం క్రమం తప్పకుండా స్వీయ రక్షణ శిక్షణ తరగతులు నిర్వహించాలి. ప్రస్తుతం ప్రభుత్వ ఉన్న త పాఠశాలు, కేజీబీవీల్లో 45రోజులు, పీఎంశ్రీ స్కూళ్లల్లో 75రోజుల పాటు కరాటే, జూడో, కిక్‌బా క్సింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఇలాంటి ఆత్మరక్షణ వి ద్యనూ ఓ పాఠ్యాంశంగా మార్చి కేజీ టు పీజీ వరకు అందరికీ నేర్పించాలన్న డిమాండ్‌ పెరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement