లోకేశ్వరం: నీటిని పొదుపుగా వాడుకోవాలని డీపీవో శ్రీనివాస్ సూచించారు. బుధవారం మండలంలోని హథ్గాం గ్రామంలో ఇంటింటా తిరిగి మిషన్ భగీరథ నల్లాలను పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలో వీబీ జీరామ్‌జీ పథకంపై మేట్‌లకు ఇస్తున్న శిక్షణ తరగతుల్లో పాల్గొని మాట్లాడారు. భూగర్భజలాలు పెరిగేందుకు పంట పొలాల్లో నీటి కుంటలు, గ్రామాల్లో ఇంటింటా ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలని సూచించారు. వీబీ జీరా మ్‌జీ పనులకు కూలీల శాతం పెంచాలని ఆదేశించారు. ఎంపీడీవో సోలమాన్‌రాజ్, భైంసా డీఎల్పీవో లక్ష్మణ్, ఏపీవో అనిల్, టీఏలు శార ద, మంజుల, హరిత, రవీందర్ పాల్గొన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులకు రక్షణ కల్పించాలి
నిర్మల్‌టౌన్: విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ ఉ ద్యోగులపై దాడులను అరికట్టి, రక్షణ కల్పించాలని నిర్మల్ డిపో సిబ్బంది డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డిపోకు చెందిన కండక్టర్ గుండ్ల ప్రవళికపై చిల్లర విషయంలో జరిగిన వివాదంలో దాడి జరగడం, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ ఘ టనను నిరసిస్తూ.. బుధవారం జిల్లా కేంద్రంలోని బస్ డిపో నుంచి జేఏసీ ఆధ్వర్యంలో కొ వ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ.. దాడుల ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కండక్టర్ ప్రవళిక మృతికి కారణమైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. డిపో మేనేజర్ పండరి, ఆర్టీసీ జేఏసీ నాయకులు, ఉద్యోగులున్నారు.
కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహిస్తున్న సిబ్బంది


