భవన నిర్మాణ భూమిపూజకు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

భవన నిర్మాణ భూమిపూజకు ఆహ్వానం

Nov 4 2026 11:52 PM | Updated on Nov 4 2026 11:52 PM

నిర్మల్‌టౌన్‌: తిరుపతిలో ఆలిండియా వెలమ అసో సియేషన్‌ ఆధ్వర్యంలో రూ.50కోట్లతో చేపట్టనున్న పద్మనాయక వెలమ భవన నిర్మాణానికి నిర్వహిస్తు న్న భూమిపూజ మహోత్సవానికి హాజరుకావాలని జిల్లా వెలమ సంఘం సభ్యులను అసోసియేషన్‌ ప్ర తినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం నిర్మల్‌కు వచ్చిన ప్రతినిధులు స్థానిక వెలమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో భవ న నిర్మాణ వివరాలు వెల్లడించారు. ఎనిమిది అంతస్తుల్లో 150గదులతో నిర్మిస్తున్న ఈ భవనంలో సా ధారణ భక్తులు, వీఐపీలకు వసతితోపాటు వివాహా ల నిర్వహణకు బ్యాంకెట్‌ హాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భవనం ద్వారా వచ్చే ఆదాయంతో పేద వెలమ విద్యార్థులకు ఏటా రూ.కోటి స్కా లర్‌షిప్‌లు అందిస్తున్నామని, భవిష్యత్‌లో ఈ మొ త్తాన్ని రూ.2కోట్ల నుంచి రూ.3కోట్లకు పెంచే ఆలో చన ఉందని పేర్కొన్నారు. శ్రీశైలంలోనూ రూ.4.5 కోట్లతో భవనం నిర్మించామని, యాదాద్రిలో మరో భవన నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఆల్‌ ఇండియా వెలమ సంఘం ప్రతినిధులను జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రావు, ప్రధాన కార్యదర్శి తిరుమలరావు శాలువాలతో సత్కరించారు. సంఘం ప్రతినిధులు తాండ్ర శ్రీనివాసరావు, దామోదర్‌రావు, భాస్కరరావు, సంజీవరావు, ప్రతాప్‌రావు, జిల్లా సంఘం బాధ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement