ఒక్కొక్కరుగా.. ముఖ్య నేతల జంప్‌! | - | Sakshi
Sakshi News home page

ఒక్కొక్కరుగా.. ముఖ్య నేతల జంప్‌!

Jan 5 2024 11:48 PM | Updated on Jan 6 2024 7:53 AM

- - Sakshi

సాక్షి,ఆదిలాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లాలోనూ ప్రాబల్యం కోల్పోతుంది. ఆ పార్టీ నుంచి ప్రజాప్రతినిధులుగా ఉన్న నేతలు అధికార కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు. ఒకరొకరుగా పార్టీ మారుతున్నారు. ముఖ్య నేతలతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు సైతం హస్తం బాటపడుతున్నారు. పార్లమెంట్‌, పంచాయతీ ఎన్నికలకు ముందు ఇది మరింత కొనసాగే అవకాశం ఉంది. జిల్లాలో ఈపరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.

హస్తం బాట..
డీసీసీబీ చైర్మన్‌ అడ్డి భోజారెడ్డితో పాటు జైనథ్‌ జెడ్పీటీసీ అరుంధతి, పార్టీ ఆ మండల అధ్యక్షుడు వెంక ట్‌ రెడ్డితో పాటు మరికొంత మంది నేతలు హైదరా బాద్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క సమక్షంలో గురువారం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. పలువు రు సర్పంచులు, ఎంపీటీసీలు కూడా ఇప్పటికే హ స్తం గూటికి చేరుకున్నారు. జెడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జ నార్దన్‌ కూడా బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదివరకు ఆదిలాబాద్‌ జిల్లా అంటే గులాబీ పార్టీకి అడ్డాగా ఉండేది. ఎన్నికల తర్వాత పూర్తిగా తారుమారైంది. ఒకరొకరుగా ముఖ్య నేతలు పార్టీ వీడుతున్నా రు. ఎన్నికలకు ముందే బోథ్‌ టికెట్‌ దక్కకపోవడంతో మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఖానాపూర్‌లో టికెట్‌ రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌ కూడా పార్టీని వీడి హస్తం పార్టీలో చేరారు. అలాగే ఆదిలాబాద్‌లో డీసీసీబీ మాజీ చైర్మన్‌ దామోదర్‌ రెడ్డి, డైరెక్టర్‌ గోవర్ధన్‌ రెడ్డి కూడా బీఆర్‌ఎస్‌ వీడి కాంగ్రెస్‌లో చేరారు.

ఎంత మార్పో..!
ఎన్నికలకు ముందు ఇటు ఎమ్మెల్యేలుగా అటు ముఖ్యమైన పదవుల్లో మొత్తం గులాబీ నేతలదే హవా కనిపించేది. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ నెలరోజుల్లోనే జిల్లా రాజకీయాల్లో పూర్తిగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. డీసీసీబీలో ఇప్పటికి బీఆర్‌ఎస్‌కు మెజార్టీ డైరెక్టర్లు ఉన్నారు. అయితే అధ్యక్షుడు కాంగ్రెస్‌కు మారడంతో మున్ముందు వారు అవిశ్వాసం పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తారా.. లేనిపక్షంలో ఎలా ఉంటుందనేది చూడాల్సిందే. ఇక జెడ్పీ పాలకవర్గం గడువు మరికొద్ది నెలల్లో ముగియనుంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం చైర్మన్‌ బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పినప్పటికీ ఇప్పుడు దీంట్లో వచ్చే పెద్ద మార్పులు ఏమి ఉండకపోవచ్చని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. జిల్లాలోని రెండు నియోజకవర్గాలుండగా.. ప్రస్తుతం బోథ్‌ ఎమ్మెల్యే మాత్రమే బీఆర్‌ఎస్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆదిలాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా జోగు ప్రేమేందర్‌ వ్యవహరిస్తున్నారు. పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు నామినేటెడ్‌ పోస్టుల్లో కొనసాగుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు జిల్లా రాజకీయ సమీకరణాలు జోరుగా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుందని పలువురు రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి చ‌ద‌వండి: 'ప్రతీ కార్యకర్తను కాపాడుకుంటా' : మంత్రి పొన్నం ప్రభాకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement