భూమిపూజలో జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్
కై లాస్‌నగర్/నార్నూర్: మహారాష్ట్రలోని వాసిం జిల్లా మానోరా తాలుకాలోని బంజారా కాశీ పౌరాదేవిలో చేపట్టిన జగదాంబ దేవి, సంత్ సేవాలాల్ మహారాజ్, రామారావ్ మహారాజ్ మందిరం నిర్మాణ భూమి పూజలో ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం రూ.593 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ మందిర నిర్మాణ భూమిపూజ ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జగదాంబదేవి భక్తులు శేఖర్ మహారాజ్, బాబు సింగ్ మహారాజ్‌ల అధ్యక్షన జరిగిన ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మంత్రి సంజయ్ రాథోడ్, మాజీ కేంద్ర మంత్రి హంసరాజ్ గంగారం ఆహీర్‌లతో కలిసి భూమిపూజలో పాల్గొన్నారు. వారితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.


