కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా కౌటాలలో కంకలమ్మ– కేతేశ్వరస్వామి ఆలయ మహా జాతర ఘనంగా నిర్వహించారు.
సోమవారం శ్రీ 11 శ్రీ డిసెంబర్ శ్రీ 2023
8లోu
ఇక్కడ కనిపిస్తున్న విద్యార్థిని గుమ్ముల శైలజ. ఈమెది సిరికొండ. ఇచ్చోడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ప్రతి రోజు కాలేజీకి వెళ్లాలంటే ప్రైవేట్ వాహనాలే దిక్కు. రానూపోను రూ.50 ఖర్చు చేయాల్సి వస్తోందని చెబుతుంది. మండలం ఏర్పాటైన కొత్తలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సులు నడిపినప్పటికీ, తర్వాత సర్వీస్‌ను నిలిపివేశారు. దీంతో ఆర్థిక భారం తప్పట్లేదు అని వాపోతుంది ఈమె. ప్రస్తుతం మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ ఉచిత సేవలు అందుబాటులోకి వచ్చినా వినియోగించుకోలేకపోతున్నట్లు చెబుతోంది. ఒక్క శైలజ మాత్రమే కాదు.. చాలా మంది విద్యార్థినులదీ ఇదే పరిస్థితి.
ఇక్కడ కనిపిస్తున్న మహిళ నీలాదేవి. తాంసి మండలం అంబుగాం గ్రామం. మండల కేంద్రం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి రహదారి సౌకర్యం ఉంది. అయితే బస్సు సదుపాయం లేకపోవడంతో మండల కేంద్రం నుంచి నడక తప్పని పరిస్థితి. అత్యవసర పరిస్థితుల్లో తమ ఇక్కట్లు వర్ణనాతీతం అంటుంది ఈమె. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తెచ్చినా తాము వినియోగించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
న్యూస్‌రీల్


