గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఇద్దరికి గాయాలు.. కూలిన ఇల్లు | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఇద్దరికి గాయాలు.. కూలిన ఇల్లు

Jul 18 2023 4:22 AM | Updated on Jul 18 2023 9:26 AM

- - Sakshi

ఆదిలాబాద్‌ : గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఇద్దరికి గాయాలయ్యాయి. తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మీసాల కిషన్‌ సోమవారం సాయంత్రం ఇంటి వద్ద వంట గ్యాస్‌ మరమ్మతు చేయిస్తున్నాడు.

ఈ క్రమంలో ఒక్కసారిగా సిలిండర్‌ లీకై ంది. దీని తీవ్రతకు ఇల్లు కూలిపోయింది. కిషన్‌కు తీవ్రంగా, అతనితో ఉన్న ప్రసాద్‌కు స్వల్పగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని గ్రామస్తులు ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. సిలిండర్‌ పేలి మంటలు సంభవిస్తే పెద్ద ఎత్తున ప్రమాదం జరిగేదని స్థానికులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement