కై లాస్‌నగర్: ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణానికి ఆటంకంగా ఉన్న 765 కేవీ విద్యుత్ లైన్ మళ్లింపునకు పవర్‌గ్రిడ్ సంస్థ, కలెక్టర్ మధ్య ఎంవో యూ ఒప్పందం కుదిరింది. ఈ మేరకు పవర్‌గ్రిడ్ ఉన్నతాధికారులు మంగళవారం సాయంత్రం కలెక్ట ర్ రాజర్షి షాను క్యాంపు కార్యాలయంలో కలిసి, లైన్ మళ్లింపు ప్రక్రియపై వివరించారు. విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఈ ఒప్పందం కీలకంగా నిలవనుంది. ఇందులో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, పవర్‌గ్రిడ్ సీనియర్ జనరల్ మేనేజర్ పి.ఆర్.ఎస్. యాద వ్, డీజీఎం వెంకన్న, చీఫ్ ఇంజినీర్ పరిమళ, సీని యర్ డీజీఎం భిక్షపతి, సీఈ చౌహాన్ పాల్గొన్నారు.
19నుంచి ‘ఇందిరమ్మ బీమా’ప్రత్యేక శిబిరాలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిర మ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఈ నెల 19నుంచి అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ పరిధిలో ప్రత్యేక శిబిరాలు ప్రారంభమయ్యేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ఈమేరకు మంగళవారం వెబ్‌ఎక్స్ ద్వారా మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికా రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేషన్ కార్డుల ఆధారంగా అర్హులైన ప్రతీ కుటుంబానికి పథకం ప్రయోజనం అందేలా చూడాలన్నారు. 18 న స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రేషన్ డీలర్లతో మండల స్థాయిలో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ జీపీకి ఒక ప్రత్యేక శిబిరం, పట్టణ ప్రాంతాల్లో మూడు, నాలుగు వార్డులకు కలిపి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. దరఖాస్తుల స్వీకరణ, వివరాల నమోదు ప్రక్రియలో మహిళా స్వ యం సహాయక సంఘాల సిబ్బంది సేవలు విని యోగించుకోవాలని సూచించారు. మున్సిపల్ కమి షనర్, తహసీల్దార్లు, వార్డు అధికారులు, రేషన్ డీల ర్లు సమన్వయంతో వ్యవహరించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. కంప్యూటర్, ప్రింటర్ సదుపాయాలున్న శిబిరాల్లో దరఖాస్తుల నమోదు, ప్రింటింగ్, సంతకాల ప్రక్రియను అక్కడికక్కడే పూర్తి చేయాలన్నారు. పథకం అమలు పు రోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక ఎక్సెల్ ట్రాకింగ్ షీట్ నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఆర్‌ఎస్ చిత్రు, రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
ఇండస్ట్రీయల్ పార్క్
భూసేకరణపై సమావేశం
కై లాస్‌నగర్: భోరజ్ మండలంలో ఏర్పాటు చేయనున్న ఇండసీ్ట్రయల్ కారిడార్ పరిధిలోని గిమ్మ, గూడ, రాంపూర్, హాత్తిగాట్ గ్రామాల నిర్వాసిత రైతులతో కలెక్టర్ రాజర్షి షా మంగళవారం కలెక్టరేట్‌లో సమావేశం అయ్యారు. భూసేకరణ, నష్టపరిహారం నిర్ణయానికి సంబంధించి వారి అభిప్రాయాలు స్వీకరించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిహారంపై వారికున్న సందేహాలను నివృత్తి చేశారు. నిబంధనల ప్రకారం న్యాయమైన, మెరుగైన నష్టపరిహారం అందించేలా చూస్తామని వారికి భరోసానిచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో జగదీశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.


