ఆదిలాబాద్: జిల్లాలో హాకీ క్రీడకు పూర్వ వైభవం తీసుకురావాలని ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నా రు. కామారెడ్డిలో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) పోటీల్లో అండర్–14 బా లికల హాకీ విభాగంలో మూడో స్థానం సాధించిన జిల్లా జట్టును ఐపీ స్టేడియంలో సోమవా రం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయస్థాయిలోనూ రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో డీటీఎస్వో పార్థసారథి, ఎస్జీఎఫ్ సెక్రెటరీ రామేశ్వర్, రవి, షబీర్, గోవింద్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.


