కైలాస్‌నగర్: ఉద్యోగుల పాలిట శాపంగా మారి న సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్మదీక్ష పేరిట నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రా ష్ట్రవ్యాప్త సామూహిక సాధారణ సెలవు కార్యక్రమంలో భాగంగా ఈ ధర్మదీక్ష చేపట్టినట్లుగా పేర్కొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ రాజేశ్వర్‌ను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఇందులో సంఘ నాయకులు సత్యనారాయణ, నరేశ్, పోచన్న, దీపక్, శారద, శ్రీలత, విజయ్‌కుమార్, శేఖర్, సందీప్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.


