నీ సంగతి చూస్తా.. | MLA Rekhanayak Fire On Sarpanch | Sakshi
Sakshi News home page

నేను ఎస్టీ మహిళ అని నువ్వు రెచ్చిపోతున్నావ్‌..

Apr 12 2023 5:50 AM | Updated on Apr 12 2023 9:09 AM

సర్పంచ్‌తో వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే రేఖానాయక్‌ - Sakshi

సర్పంచ్‌తో వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే రేఖానాయక్‌

కడెం(ఖానాపూర్‌): కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, గ్రామస్తుల సమక్షంలో ఎమ్మెల్యే రేఖానాయక్‌..సర్పంచ్‌ నరేందర్‌రెడ్డి నువ్వెంత.. అంటే నువ్వెంత.. అని గొడవకు దిగారు. మంగళవారం మండల కేంద్రంతో పాటుగా కన్నాపూర్‌ గ్రామ పంచాయతీలో నిర్వహించిన డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల గ్రామసభలో ఎమ్మెల్యే రేఖా నాయక్‌ స్థానిక సర్పంచ్‌(బీఆర్‌ఎస్‌ పార్టీ) నరేందర్‌రెడ్డి పేరును ప్రస్తావించలేదు. దీంతో సర్పంచ్‌ నా ఊరికి వచ్చి నా పేరు ప్రస్తావించకుండా ఎలా మాట్లాడుతున్నావ్‌ అని ఎమ్మెల్యేను నిలదీశాడు. దీంతో ఆవేశానికి లోనైనా ఎమ్మెల్యే రేఖానాయక్‌ నేను నియోజవర్గానికి ఎమ్మెల్యేను..నీ పేరు చెప్పలేదు కావచ్చు అయితే ఏంది.. నేను ఎస్టీ మహిళ అని నువ్వు రెచ్చిపోతున్నావ్‌..రేపు నీ సంగతి చూస్తా.. అని సర్పంచ్‌ను బెదిరింపులకు గురిచేసింది.

Advertisement
 
Advertisement
Advertisement