పత్తి మాటున మత్తు! | - | Sakshi
Sakshi News home page

పత్తి మాటున మత్తు!

Nov 20 2026 12:37 AM | Updated on Nov 20 2026 12:37 AM

● అంతర పంటగా సాగుచేసి అక్రమార్జన ● నిఘా పెట్టి పట్టుకుంటున్న పోలీసులు ● గత నెల 21న నిగిని గ్రామ శివారులోని చేనులో మడావి లక్ష్మణ్‌ సాగు చేస్తున్న సుమారు రూ.4లక్షల విలువైన 40 గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ● గత నెల 24న పట్నాపూర్‌ శివారులో పోలీసులు నిర్వహించిన వేర్వేరు దాడుల్లో కొమ్రం రాములు చేను నుంచి రూ.1.70 లక్షల విలువైన 17 గంజాయి మొక్కలు, కౌలుకు తీసుకుని సాగు చే స్తున్న సిడాం చిత్రు చేను నుంచి రూ.1.60 లక్షల విలువైన 16మొక్కలను ఎస్సై పురుషోత్తం ఆధ్వ ర్యంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ● ఈనెల 4న సొనాల మండలంలోని కోట(కె) గ్రా మంలో పత్తి, కందిచేల మధ్య శివరాం గంజాయి సాగు చేస్తుండగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ● బోథ్‌ మండలం సాంగ్వి పల్లెలో అంతరపంటగా సాగు చేస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకుని నిందితుడు పెందూర్‌ శంభును అరెస్ట్‌ చేశారు. ● ఈ నెల 5న సొనాల గ్రామానికి చెందిన చౌహాన్‌ జైపాల్‌సింగ్‌ ఇంటి వెనుక పెరటిలో గంజాయి మొక్క సాగు చేయగా పోలీసులు పట్టుకున్నారు. ● ఈనెల 6న బోథ్‌ మండల కేంద్రంలోని పాత సినిమా టాకీస్‌ ప్రాంతంలో గంజాయి సేవిస్తున్న బోథ్‌కు చెందిన మహ్మద్‌ అమన్‌, రాంనగర్‌ గ్రామానికి చెందిన తగిరె ఇందల్‌, సాబ్లె జోర్‌ సింగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

బోథ్‌: పత్తి సాగు మాటున మత్తు సామ్రాజ్యం విస్తరిస్తోంది. అంతరసాగుతో కొందరు దారి తప్పుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా పత్తి మొక్కల మధ్య గంజాయి సాగు చేస్తూ అమాయకులను మత్తు ఊబిలోకి నెడుతున్నారు. బోథ్‌, సొనా ల మండలాల్లో అత్యధికంగా పత్తి సాగు చేస్తుండగా ఏపుగా పెరిగిన మొక్కల మధ్య గంజాయి మొక్కలు నాటుతున్నారు. సొంత భూముల్లోనే కాకుండా, బంధువుల నుంచి కౌలుకు తీసుకున్న భూములనూ ఈ అక్రమ సాగుకు వేదికగా మార్చుకుంటున్నారు. వినియోగానికి అలవాటుపడిన కొందరు, విక్రయాలకు పాల్పడేవారు మరికొందరు ఈ తరహా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దీంతో పోలీసులు సరిహద్దులు, మారుమూల గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. గంజా యి సాగు చేసినా, రవాణా చేసినా, విక్రయించినా పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

ఇటీవల పట్టుకున్న ఘటనల్లో కొన్ని..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement