ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మరింత పెంచాలని డీఈవో మాధవి సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యా విధానాలు, ఏఐ ఎక్సల్ పథకానికి సంబంధించి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ విద్యార్థికి తెలుగు, గణితం, ఇంగ్లిష్‌కు సంబంధించిన కనీస సామర్థ్యాలు మెరుగుపడేలా చూడాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో జిల్లా ఐదో స్థానంలో ఉందని, మరింత కష్టపడితే ర్యాంక్ మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఏఎంవో లక్ష్మణ్, ఆర్పీలు కృష్ణ, అరుణ, విజయ్, గంగాధర్, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.


