సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మార్కెట్‌లో కొద్ది రోజులుగా ప్రైవేట్‌లో పత్తి ధర విషయంలో దోబూ చులాట కొనసాగుతోంది. ఇటీవల ఇచ్చోడ కంటే ఆదిలాబాద్ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.180 త క్కువ ఇవ్వడం ద్వారా ఇక్కడి వ్యాపారులు రైతుల ను ఆర్థికంగా దెబ్బతీశారు. ఈ వైనాన్ని రైతులు మ రవకముందే మళ్లీమళ్లీ అదేతీరు ప్రదర్శిస్తూ మోసానికి గురిచేస్తున్నారు. కొద్ది రోజుల కిందట పత్తి ధర క్వింటాల్‌కు రూ.9వేల లోపే ఉండడంతో రైతులు విక్రయించే విషయంలో ఆచీతూచి వ్యవహరించా రు. దీంతో వ్యాపారులు జిమ్మిక్కులు ప్రదర్శించా రు. ధర పెంచి రైతులను ఆకర్షించేలా చేశారు. తీరా పత్తి విక్రయించేందుకు ఇదే సరైన సమయమని రై తులంతా సిద్ధమవుతున్న వేళ మళ్లీ ఒక్కసారిగా ధర తగ్గించారు. మంచి ధర ఉంటుందని గురువారం ఉ దయం పెద్ద ఎత్తున మార్కెట్‌కు పత్తి బండ్లు వచ్చా యి. తీరా వ్యాపారులు ధర తగ్గించడంతో రైతులు హతాశులయ్యారు. మధ్యాహ్నం నుంచి వాహనాల రాక పూర్తిగా తగ్గిపోయింది. రైతుల పరిస్థితితో ఆదిలాబాద్ మార్కెట్‌లో ఆడుతున్న ఈ దోబూచులాట చూస్తున్న వారిని విస్మయానికి గురిచేస్తోంది.
వ్యాపారుల నిర్వాకం.. రైతులకు నష్టం
ఆదిలాబాద్ మార్కెట్‌లో పత్తి క్రయ, విక్రయాల్లో వ్యాపారులు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు. అస లే అంతంత మాత్రం వచ్చిన దిగుబడిని మంచి ధర కు విక్రయించడం ద్వారా కొంతైనా ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని ఆశించిన రైతన్న ఆశలను వ్యాపారులు అడియాశలు చేస్తున్నారు. మూడు రోజులుగా పత్తి ధర అమాంతంగా పెంచి మార్కెట్‌కు దిగుబడులను తీసుకువచ్చేలా చేసిన వ్యాపారులు వ్యూహాత్మకంగా మళ్లీ ధర తగ్గించడంతో రైతులు ఇబ్బందులకు గురయ్యారు. నిల్వ చేసిన దిగుబడులను మార్కెట్‌కు తీసుకువచ్చేలా చేశారు. తీరా రేటు తగ్గించి తమ నడ్డి విరుస్తున్నారని పలువురు రైతులు వాపోయారు.
ఆదిలాబాద్ మార్కెట్‌లో విక్రయాలు
తేదీ రైతుల విక్రయించిన
సంఖ్య పత్తి (క్వింటాళ్లలో)
నవంబర్ 16న 728 14,452
17న 768 15,063
18న 801 16,264
19న 591 11,711


