ప్రకృతి వ్యవసాయంతో మంచి దిగుబడులు | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయంతో మంచి దిగుబడులు

Nov 20 2026 12:37 AM | Updated on Nov 20 2026 12:37 AM

● కలెక్టర్‌ రాజర్షి షా ● చాంద్‌పల్లిలో రైతులకు అవగాహన

ఆదిలాబాద్‌(బేల): ప్రకృతి వ్యవసాయంతో పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు మెరుగైన దిగుబడులు సాధించవచ్చని కలెక్టర్‌ రాజర్షిషా సూ చించారు. గురువారం బేల మండలం చాంద్‌పల్లి గ్రామంలో సీపీఎఫ్‌ సంస్థ, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. జీవామృతం, నీమాస్త్రం లాంటి సహజ ఎరువులను వినియోగిస్తూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులను అభినందించారు. జిల్లాలోని 30 క్లస్టర్లలో బయో రిసోర్స్‌ కేంద్రాలు ఏర్పా టు చేసి ఒక్కో కేంద్రానికి రూ.లక్ష విలువైన పరికరా లు ఇస్తున్నట్లు తెలిపారు. వర్షపాతం లోటు నేపథ్యంలో పంట నష్టంపై అధికారులు చేపడుతున్న స ర్వేకు రైతులు సహకరించాలని కోరారు. పత్తి తర్వా త తక్కువ నీటితో పండే శనగ, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉద్యానవన పంటలు సాగు చేయాలని సూచించారు. త్వరలో బేల మండలంలో కస్ట మ్‌ హైరింగ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనంతరం ఫుడ్‌ సెక్యూరిటీ అండ్‌ కన్సర్వేషన్‌ ప్రాజెక్ట్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రకృతి వ్యవసాయ రైతు దర్గాజీని సన్మానించారు. మండల ప్ర త్యేకాధికారి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ మనోహర్‌, డీ హెచ్‌ఎస్వో దిలీప్‌కుమార్‌, ఇన్‌చార్జి డీఏవో శ్రీధర్‌, ఎంపీడీవో మహేశ్‌కుమార్‌, తహసీల్దార్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎంఏవో సాయితేజరెడ్డి, సర్పంచ్‌ మంగళ, సీపీఎఫ్‌ సంస్థ డైరెక్టర్‌ గిరిజ, శాస్త్రవేత్తలు, వివిధ గ్రామాల సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.

అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై బేల ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్న గ్రామాల్లో తొలుత వివరాల నమోదు శిబిరాలు ప్రారంభించి సోమవారం నాటికి పూర్తిస్థాయిలో నిర్వహించాలన్నారు. మీసేవ కేంద్రాల్లోనూ ఉచి తంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్లు ఆర్‌ఎస్‌.చిత్రు, ఎస్‌.రాజేశ్వర్‌, ఐటీడీఏ పీవో మంద మకరందు, సబ్‌ కలెక్టర్‌ ప్రణయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

20నుంచి నమోదు ప్రక్రియ

ఆదిలాబాద్‌: ఈ నెల 20నుంచి జిల్లాలో ప్రారంభం కానున్న నమోదు ప్రక్రియను సమర్థవంతంగా ని ర్వహించేందుకు జిల్లా, మండల స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. జె డ్పీ కార్యాలయంలో ప్రత్యేక గ్రీవెన్స్‌ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు వెంకటేశ్వర్లును 9951935312, శశిధర్‌ రాజును 8247013660, యోగేశ్‌ను 9441485893 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

వైద్యాధికారులతో సమీక్ష

కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో కలెక్టర్‌ రాజర్షిషా సమీక్ష నిర్వహించారు. వివిధ అంశాలపై వైద్యులకు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్‌ ఎస్‌.రాజేశ్వర్‌, డీఎంహెచ్‌వో సాధన, రిమ్స్‌ సూపరింటెండెంట్‌ వెంకట్‌, వైద్యాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement