నేరడిగొండ/బోథ్: నేరడిగొండ, బోథ్ ప్రభు త్వ జూనియర్ కళాశాలలను డీఐఈవో ఎండీ ఖైసర్ పాషా గురువారం ఆకస్మికంగా తనిఖీ చే శారు. బోధన తీరు, రికార్డులు, విద్యార్థుల నో ట్స్ పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతం పెంచాలని అధ్యాపకులకు సూచించారు. బోథ్‌లో విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేశా రు. ఆయన మాట్లాడుతూ.. ప్రణాళికతో చదివి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా ఖైసర్ పాషాను నేరడిగొండ ప్రిన్సిపాల్ షబాన తరన్నం, లెక్చరర్లు శాలువాతో సత్కరించారు.


