YS Jagan Mohan Reddy
-
వైఎస్ జగన్ @గన్నవరం ఎయిర్ పోర్ట్
-
YSR జిల్లాలో ఐదుగురు చిన్నారుల మృతిపై జగన్ దిగ్భ్రాంతి
-
చెరువులో మునిగి ఐదుగురు పిల్లలు మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ జిల్లాలో ఈతకు వెళ్ళి ఐదుగురు చిన్నారులు మృతిచెందడంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్ జగన్.. కూటమి ప్రభుత్వాన్ని కోరారు.వివరాల ప్రకారం.. వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లెకి చెందిన ఉప్పలపాటి నారాయణ యాదవ్ ఇంటికి అతడి చెల్లెళ్లు సావిత్రి, భవాని హైదరాబాద్ నుంచి పిల్లలతో కలిసి వచ్చారు. వేసవి సెలవులు కావటంతో ఈత కొట్టాలని భావించి ఐదుగురు పిల్లలు చెరువులోకి దిగారు. ఈ క్రమంలో చెరువులో ఈతకు దిగి చరణ్ (15), పార్థు (12), హర్ష (12), దీక్షిత్ (12), తరుణ్ యాదవ్ (10) నీటిలో మునిగిపోయి మృతిచెందారు. చీకటి పడినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో చెరువు వద్దకు వెళ్లారు.పిల్లల బట్టలు ఒడ్డున ఉండటం.. చుట్టూ ఎక్కడా పిల్లల జాడ కనిపించపోవడంతో చెరువులో పిల్లలు గల్లంతైనట్టు తెలుసుకుని గాలించారు. సమాచారం అందుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పోలీసులు చెరువు వద్దకు చేరుకుని గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. రాత్రి 11 గంటల తర్వాత మృతదేహాలు లభ్యమయ్యాయి. మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్, ఎస్ఐ శివప్రసాద్ గాలింపు చర్యలను పర్యవేక్షించారు. -
జగన్ ప్రభంజనం చూసి సోనియా గాంధే భయపడింది.. ఇక బాబెంత!
-
దారి వెంట నీరాజనం..‘జై జగన్’ అంటూ నినాదాలు (ఫొటోలు)
-
అగ్నివీర్ మురళీనాయక్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, పుట్టపర్తి : ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా ఈ నెల 8న జమ్మూకశ్మీర్ లో శత్రుమూకలను చెండాడుతూ వీరమరణం పొందిన అగి్నవీర్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పరామర్శించారు. మురళీ నాయక్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిలను ఓదార్చారు. మురళి పోరాటాన్ని దేశం గర్విస్తోందని వైఎస్ జగన్ కొనియాడారు. మంగళవారం ఉదయం బెంగళూరులోని తన నివాసం నుంచి రోడ్డు మార్గం గుండా గోరంట్ల మండలం కల్లితండాకు చేరుకున్నారు. మురళీనాయక్ ఇంట్లోకి వైఎస్ జగన్ రాగానే.. జవాన్ తల్లిదండ్రులు భావోద్వేగానికి గురై బోరున విలపించారు. జగన్ రాకతో కల్లితండా జనసంద్రంలా మారింది. పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. కల్లితండా.. కన్నీరు మున్నీరు.. నాలుగైదు రోజులుగా దిగమింగుకున్న బాధను వైఎస్ జగన్మోహన్రెడ్డి రాకతో ఒక్కసారిగా భావోద్వేగంతో వ్యక్తపరిచారు. విధి నిర్వహణలో మురళీ నాయక్ త్యాగాన్ని దేశం గరి్వంచినా.. కన్నతల్లి కంట కన్నీరు మాత్రం ఎవరూ ఆపలేకపోయారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అభిమానులు జాతీయ జెండాలతో తరలివచ్చారు. గోరంట్ల – పుట్టపర్తి మెయిన్ రోడ్డు నుంచి కిలోమీటరు దూరం ఉన్న కల్లితండాకు వచ్చేందుకు గంటకుపైగా సమయం పట్టింది. గత సర్కారు సంప్రదాయమే.. దేశ రక్షణలో అమరులైన వారి కుటుంబాలకు రూ.50 లక్షల ఆర్థిక సాయం చేయాలని మొదట ప్రతిపాదన తీసుకొచ్చి.. అమలు చేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. మురళీ నాయక్ కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించడంపై వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు. మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్ సీపీ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. మార్మోగిన ‘జై జవాన్’ నినాదం.. కల్లితండాలోకి వైఎస్ జగన్ ప్రవేశించినప్పటి నుంచి ‘జై జవాన్’ నినాదం మార్మోగింది. ‘భారత్ మాతాకీ జై.. మురళీ నాయక్ అమర్ రహే’ అంటూ అభిమానులు జాతీయ జెండాలతో నినాదాలు చేశారు. మురళీనాయక్ కుటుంబాన్ని మద్దతుగా నిలిచిన వారందరికీ వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు. మురళి కుటుంబానికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి జనం రాక.. వైఎస్ జగన్ కల్లితండా పర్యటన నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి వైఎస్ జగన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. మురళీ నాయక్‌కు ఘన నివాళులర్పించారు. తరలివచ్చిన నేతలు.. వైఎస్ జగన్ వెంట రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, అనంతపుర జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు మాలగుండ్ల శంకరనారాయణ, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, అత్తార్ చాంద్‌బాషా, నియోజకవర్గ సమన్వయకర్తలు ఈరలక్కప్ప (మడకశిర), టీఎన్ దీపిక (హిందూపురం), మక్బుల్ (కదిరి), మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య, మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్, నాయకులు వజ్ర భాస్కర్ రెడ్డి, చౌళూరు మధుమతిరెడ్డి, మాదినేని ఉమామహేశ్వరనాయుడు, మహాలక్ష్మి శ్రీనివాసులు, కోగటం విజయ భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.‘‘జగనన్నా.. వచ్చావా.. మురళీ ఎక్కడ అన్నా. నువ్వయినా మా బిడ్డ మురళీని వెంట తెస్తావనుకున్నా’’ – వైఎస్ జగన్ పరామర్శించగానే బోరున విలపిస్తూ మురళీ నాయక్ తల్లి జ్యోతిబాయి ఆక్రందన ‘‘మురళీ.. పైకి లేచి సెల్యూట్ చేయి.. నీ కోసం జగన్ సర్ వచ్చాడు. మన ఇంటికే జగన్ సర్ వచ్చాడు మురళీ. లే మురళీ.. లేచి సెల్యూట్ చేయి మురళీ’’ – వైఎస్ జగన్‌ను చూడగానే మురళీ నాయక్ తండ్రి శ్రీరాం నాయక్ భావోద్వేగం‘‘మురళీ నాయక్‌ను అయితే తేలేను తల్లీ.. నీ బిడ్డ పోరాటం వృథా కాదు. ఎంతోమందికి రక్షణగా నిలిచి.. చిన్న వయసులోనే ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. మురళీ త్యాగానికి రుణపడి ఉంటాం’’ – మురళీ నాయక్ తల్లిదండ్రులతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి‘జై జవాన్’ నినాదం మార్మోగింది. కుగ్రామం కల్లితండాలో జనసునామీ పోటెత్తింది. అమర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం రాగా... అభిమాన గణం వెంట నడిచి జవాన్‌కు అశ్రు నివాళులర్పించింది. -
మురళి నాయక్ కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా
-
మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటాం: వైఎస్ జగన్
సాక్షి, పుట్టపర్తి: ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా దేశ సరిహద్దుల్లోని కశ్మీర్లో ఈనెల 8న పాకిస్తాన్‌తో జరిగిన కాల్పుల్లో వీర మరణం పొందిన అగ్నివీర్ మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. మురళీ నాయక్ వయసులో చిన్నవాడే అయినప్పటికీ దేశానికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. యావత్ భారత్ గర్వపడేలా వీరోచితంగా పోరాడి.. దేశ రక్షణలో తన వంతు బాధ్యతను నిర్వర్తించిన వీరుడన్నారు. మంగళవారం మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. ఉదయం బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన మురళీనాయక్ స్వగ్రామమైన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చేరుకున్నారు. మురళీనాయక్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. మురళి తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్ నాయక్‌లకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారు భావోద్వేగానికి గురయ్యారు. ‘మురళీ.. లే మురళీ.. జగన్ సార్ వచ్చారు.. లేచి సెల్యూట్ చేయి మురళీ’ అంటూ తండ్రి శ్రీరామ్ నాయక్ భావోద్వేగంతో పలికిన మాటలు అక్కడ ఉన్న వారందరికీ కన్నీళ్లు తెప్పించాయి. యావత్ దేశం గర్వపడేలా దేశ రక్షణలో విధులు నిర్వర్తించిన మురళీ కుటుంబానికి యావత్ దేశం రుణపడి ఉంటుందని వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.మురళీ కుటుంబానికి రూ.25 లక్షల సాయంకల్లి తండాలో వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులను పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. మురళీ నాయక్ త్యాగానికి వెల కట్టలేమని చెప్పారు. దేశం కోసం పోరాడుతూ.. తన ప్రాణ త్యాగంతో మిగిలిన అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు రక్షణ ఇచ్చారన్నారు. యావత్ భారత్ దృష్టిని ఆకర్షించిన మురళీని మన మధ్యలోకి తేలేం కానీ.. ఆయన త్యాగానికి రుణపడి ఉంటామన్నారు. దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్సీపీ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. దేశం కోసం పోరాడుతూ.. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబానికి రూ.50 లక్షలు ఆర్థిక సాయం చేసే సంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్‌లో తీసుకొచ్చింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా మురళీ కుటుంబానికి రూ.50 లక్షలు ప్రకటించడం పట్ల అభినందించారు.దారి పొడవునా స్వాగతంకర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి టోల్ ప్లాజా నుంచి కొడికొండ చెక్‌పోస్టు, కోడూరు, పాల సముద్రం, గుమ్మయ్యగారిపల్లి, కల్లి తండా వరకు దారి పొడవునా ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆత్మీయ స్వాగతం పలికారు. దేశ సరిహద్దులో వీరమరణం పొందిన మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు, పార్టీ శ్రేణులు భారీసంఖ్యలో స్వచ్ఛందంగా తరలివచ్చారు. జాతీయ జెండాలతో చిన్నారులు మార్గం మధ్యలో స్వాగతం పలికారు. వాహనంపై నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. -
మహిళలకు వైఎస్ జగన్ చేసిన మేలు ఎవరూ చేయలేదు
సాక్షి, అమరావతి: మహిళలకు దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయనంత మేలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలు తనతో పాటు అడుగులు వేయాలని, నిర్ణయాత్మక శక్తిగా ఉండాలని వైఎస్ జగన్ నమ్మారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం వైపు దేశం మొత్తం తిరిగిచూసిందన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ. కూటమి పాలనలో మహిళలని కూడా చూడకుండా కేసులు పెడుతున్నారని, ప్రభుత్వంలో ఉన్నవారి ఆదేశాలతోనే ఇదంతా చేస్తున్నారని ఆయన అన్నారు. సంయమనం, క్రియాశీలకంగా వ్యవహరించడంతో పాటు మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారికి అండగా వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ఉంటుందనే సందేశం ఇవ్వాలని సూచించారు. పార్టీ ఇతర అనుబంధ సంఘాల తరహాలోనే మహిళా విభాగం కూడా జిల్లా స్థాయిలో సమావేశం కావాలని సజ్జల రామకృష్ణారెడ్డి నిర్దేశించారు.జిల్లా, నియోజకవర్గ స్థాయిలో నాయకత్వాన్ని కలుపుకొంటూ ముందుకెళ్లాలన్నారు. పనిచేసే క్రమంలో అడ్డంకులు సహజమని, పార్టీలోని నాయకుల సహకారంతో వాటిని తొలగించుకోవాలని సూచించారు. అపోహలతో పార్టీకి దూరమైన వర్గాలకు మళ్లీ దగ్గర కావాలని చెప్పారు. ఈ కష్ట కాలంలోనూ పార్టీలో పది పదవులకు వందమంది పోటీకి వస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఏ పార్టీలోనూ ఇలా జరగదని, వైఎస్ జగన్ మీద ఉన్న అభిమానం ఎన్ని ఆటుపోట్లు వచ్చినా చెక్కుచెదరకపోగా మరింత పెరిగింది అనేందుకు నిదర్శనం ఇదేనని వివరించారు. మహిళలను నిలువునా మోసం చేసిన కూటమి: వరుదు కళ్యాణి కూటమి ప్రభుత్వం మహిళలను నిలువునా మోసం చేసిందని వరుదు కళ్యాణి అన్నారు. చంద్రబాబు పాలనలో మహిళలకు సంక్షేమం కింద ఒక్క రూపాయి కూడా అందడం లేదని, మహిళా లోకం కుమిలిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు జగనన్న పాలనలో జరిగిన లబ్ధిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్దామని, సమస్యలపై పోరాడదామని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వంలో సూపర్ సిక్స్ అంటే గంజాయి, బెల్ట్ షాప్‌లు, పర్మిట్ రూమ్‌లు, పేకాట క్లబ్‌లు, డ్రగ్స్, మహిళలపై అఘాయిత్యాలు అని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీలకు బదులు సూపర్ స్కామ్స్ అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కుట్రలకు, ప్రజా నాయకుడైన జగనన్నకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. ప్రభుత్వాన్ని అంతమొందించేందుకు నడుంబిగించాలి మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో నారా వారి నరకాసుర పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. అవమానాలు, అరాచకాలు, అఘాయిత్యాలు, అక్రమ కేసులు, వేధింపులు ఇవే సూపర్ సిక్స్ అని అన్నారు. వైఎస్సార్సీపీలోని ప్రతి మహిళా సత్యభామలా మారి ఈ ప్రభుత్వాన్ని అంతమొందించేందుకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం మహిళా లోకాన్నే మోసం చేసిందన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ మహిళా నేతలు బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారన్నారు. మాజీ హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ... వైఎస్ జగన్ ఐదేళ్లూ పరిపాలన మీదే దృష్టిపెట్టారని, మేనిఫెస్టోలో చెప్పినవాటితో పాటు, చెప్పని హామీలనూ నెరవేర్చారని అన్నారు. ఎమ్మెల్సీ కల్పలత మాట్లాడుతూ... కూటమి నాయకుడి మనసులో మెదిలితే చాలు మన మీద తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. సమావేశంలో అనుబంధ విభాగాల ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్లు, మేయర్లు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జెడ్పీ మాజీ చైర్ పర్సన్లు, మాజీ మేయర్లు, మహిళా విభాగం నాయకురాళ్లు పాల్గొన్నారు. -
YS Jagan: వీర జవాన్ మురళీ నాయక్ జీవితం స్ఫూర్తి దాయకం
-
మురళీ ఎక్కడ ఉన్నావ్.. జగన్ సార్ వచ్చాడు సెల్యూట్ చెయ్
-
వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ (ఫోటోలు)
-
మురళీ నాయక్ కుటుంబానికి జగన్ ఆర్థిక సాయం..
-
వీర జవాన్ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం: వైఎస్ జగన్
శ్రీసత్యసాయి జిల్లా: వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ పార్టీ తరఫున రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళవారం ఆయన గోరంట్ల మండలం కల్లితండాలో వీర జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వీర జవాను మురళీ నాయక్ జీవితం స్ఫూర్తి దాయకం అని.. ఆయన త్యాగానికి ప్రజలంతా రుణపడి ఉండాలన్నారు.జవాను చనిపోతే రూ. 50 లక్షల రూపాయలు ఇచ్చే సంప్రదాయం తమ ప్రభుత్వం ప్రారంభించిందని.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఇదే విధానం కొనసాగిస్తోందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రూ. 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని వైఎస్ జగన్ తెలిపారు. దేశం కోసం పోరాడుతూ, మురళీనాయక్ వీరమరణం పొందారని.. మురళీ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉందన్నారు. మురళీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. మురళీ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
Jawan Murali Naik Family: వైఎస్ జగన్ పరామర్శ
-
పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాదం నలుగురు మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
బాగేపల్లి టోల్ గేట్ వద్ద వైఎస్ జగన్ కు ఘనస్వాగతం
-
పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం వద్ద బొలెరో ట్రక్ - లారీ ఢీ కొన్న ఘటనలో నలుగురు వ్యవసాయ కూలీలు దుర్మరణం చెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతులంతా ప్రకాశం జిల్లాకు చెందిన వ్యవసాయ కూలీలుగా గుర్తించారు. వారంతా మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. -
వీరజవాన్ కుటుంబానికి నేడు వైఎస్ జగన్ పరామర్శ
-
వీరజవాన్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
శ్రీసత్యసాయి జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గోరంట్ల మండలం కల్లితండాలో పర్యటించారు. ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా జమ్ముకశ్మీర్‌లో శత్రుమూకలను తుదముట్టిస్తూ వీరమరణం పొందిన జవాన్ ముడావత్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు.మురళీనాయక్ అందరికీ స్ఫూర్తిదాయకం..పరామర్శ అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. దేశం కోసం పోరాడుతూ, మురళీనాయక్ వీరమరణం పొందారని.. మురళీ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉందన్నారు. మురళీనాయక్ అందరికీ స్ఫూర్తిదాయకం. మురళీ త్యాగానికి మనమంతా రుణపడి ఉంటాం. మురళీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. మురళీనాయక్ కుటుంబానికి వైఎస్సార్సీపీ తరఫున రూ.25 లక్షలు సాయం అందిస్తాం. మురళీ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది’’ అని వైఎస్ జగన్ అన్నారు. ఉదయం బెంగళూరులోని నివాసం నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో చిక్కబళ్లాపురం, కొడికొండ చెక్‌పోస్టు, పాలసముద్రం, గుమ్మయ్యగారిపల్లి మీదుగా గంటలకు కల్లితండాకు చేరుకున్నారు. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిని పరామర్శించిన వైఎస్ జగన్.. అనంతరం తిరుగు పయనమయ్యారు. -
వీరజవాన్ కుటుంబానికి నేడు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, పుట్టపర్తి: జమ్మూ కశ్మీర్లో ఆపరేషన్ సిందూర్‌లో వీర మరణం పొందిన అగ్నివీర్ మురళీనాయక్ కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పరామర్శించనున్నారు.ఆయన బెంగళూరు నుంచి ఉదయం 11.30 గంటలకు శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చేరుకుంటారు. మురళీనాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిను పరామర్శించి, తిరిగి బెంగళూరుకు పయనమవుతారు. -
కోహ్లి రిటైర్మెంట్పై స్పందించిన వైఎస్ జగన్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. విరాట్ భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకరని ప్రశంసించారు. విరాట్ ఆట చూడటం ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు.క్రికెట్ పట్ల విరాట్‌కు ఉన్న అభిరుచి, ఆటలో అతని స్థిరత్వం, అత్యుత్తమ ప్రదర్శన కోసం అతని దాహం సాటిలేనివని కొనియాడారు. విరాట్ రికార్డులు మాటల కంటే బిగ్గరగా మాట్లాడతాయని అన్నారు. విరాట్ వారసత్వం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని తెలిపారు. విరాట్ తన భవిష్యత్ ప్రయత్నాల్లో విజయవంతకావాలని ఎక్స్ వేదికగా తన సందేశాన్ని పంపారు.One of the greatest Indian cricketer of all time, @imVKohli, bids adieu to Test cricket.It has always been fascinating to watch him play - his passion, consistency and hunger in pursuit of excellence have been unmatched. His records speak louder than words, and his legacy will… pic.twitter.com/wBHNVEwKgY— YS Jagan Mohan Reddy (@ysjagan) May 12, 2025కాగా, 36 ఏళ్ల విరాట్ కోహ్లి ఇవాళ (మే 12) ఉదయం టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. 2011లో టెస్ట్ అరంగేట్రం చేసిన విరాట్.. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 123 టెస్ట్‌లు (210 ఇన్నింగ్స్‌లు) ఆడి 46.9 సగటున 9230 పరుగులు చేశాడు. ఇందులో 7 డబుల్ సెంచరీలు, 23 సెంచరీలు, 31 అర్ద సెంచరీలు ఉన్నాయి.టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గానూ కోహ్లికి ఘనమైన రికార్డు ఉంది. అతని సారథ్యంలో టీమిండియా 68 మ్యాచ్‌ల్లో 40 మ్యాచ్‌లు గెలిచింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంత విజయవంతమైన కెప్టెన్ ఎవరూ లేరు. -
బుద్ధ పూర్ణిమ సందర్భంగా వైఎస్ జగన్ శుభాకాంక్షలు
-
AP: సచివాలయంలో సంసారం
అనకాపల్లి: గ్రామ సచివాలయం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల చెంతకే పౌర సేవలను తీసుకువెళ్లేందుకు ఏర్పరచిన వ్యవస్థ. గ్రామ స్వరాజ్యం కలను నిజం చేసే ఈ సచివాలయాల కోసం నాటి సర్కారు పక్కా భవనాలను నిర్మించింది. అక్కడి నుంచే దేశమంతటికీ ఆదర్శంగా నిలిచిన వ్యవస్థ నడిచింది. కూటమి ప్రభుత్వంలో ఇప్పుడది తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది.రోలుగుంటలో మరో అడుగు ముందుకేసి ఓ ప్రైవేటు వ్యక్తికి నివాసంగా కూడా మారింది. స్థానిక టీడీపీ నాయకుడి అండదండలతో ఏకంగా ఆ వ్యక్తి సచివాలయంలో సంసారమే నడిపేస్తున్నాడు. సదాశయానికి గండి కొడుతున్నాడు. ఆయన కుటుంబంతో గత 8 నెలలుగా నివాసం ఉంటున్నా.. ఇదంతా కళ్ల ముందే జరుగుతున్నా.. అధికారులు ఏం చేస్తున్నారో.. కూటమి నాయకులు ఏం చెబుతారో! -
రేపు కల్లి తండాకు మాజీ సీఎం వైఎస్ జగన్
-
నేడు బుద్ధ పూర్ణిమ.. శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నేడు గౌతమ బుద్ధుడి జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అహింసను బోధించిన బుద్ధుని బోధనలు నేటికీ సదా ఆచరణీయమని వైఎస్ జగన్ కొనియాడారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. విశ్వ మానవాళికి ప్రేమతత్వాన్ని.. అహింసను బోధించిన బుద్ధుని బోధనలు నేటికీ సదా ఆచరణీయం. నేడు గౌతమ బుద్ధుడి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు’ తెలిపారు. విశ్వ మానవాళికి ప్రేమతత్వాన్ని, అహింసను బోధించిన బుద్ధుని బోధనలు నేటికీ సదా ఆచరణీయం. నేడు గౌతమ బుద్ధుడి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు.#BuddhaPurnima— YS Jagan Mohan Reddy (@ysjagan) May 12, 2025 -
రేపు కల్లి తండాకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లి తండాలో పర్యటించనున్నారు.ఉదయం 11.30 గంటలకు కల్లి తండాలోని వీర జవాన్ మురళీ నాయక్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి బయలుదేరుతారు. వీర జవాన్ మురళీ నాయక్ మృతిపట్ల ఇప్పటికే సంతాపం వ్యక్తం చేసిన వైఎస్ జగన్... కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. -
ఎల్లుండి కల్లితండాకు వైఎస్ జగన్
తాడేపల్లి: జమ్మూకశ్మీర్‌లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎల్లుండి(మంగళవారం, మే 13వ తేదీ)కల్లి తండాకు వెళ్లనున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీ నాయక్.. పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులతో ఫోన్ లో పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు వైఎస్ జగన్. దీనిలో భాగంగా 13వ తేదీన కల్లి తండాకు వెళ్లి ఆ వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు వైఎస్ జగన్.కాగా, భారత్-పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాను వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. అగ్నివీర్ పథకం కింద మూడు సంవత్సరాల క్రితం ఆర్మీ లో చేరిన మురళీ నాయక్... నాసిక్‌లో శిక్షణ పొంది అస్సాంలో పనిచేశారు. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే పాకిస్తాన్ దుశ్చర్యలను అడ్డుకునే క్రమంలో ఆ జవాన్ వీర మరణం పొందగా, ఈరోజు(ఆదివారం) సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. నిన్న(శనివారం) బెంగళూరు నుంచి కల్లి తండాకు వీర జవాన్ మురళీ నాయక్ పార్ధివదేహాన్ని తరలించగా, నేడు అంత్యక్రియలు నిర్వహించారు. -
Mother's Day: మీ ప్రేమ, బలం, త్యాగం అపరిమితమైనవి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మాతృ దినోత్సవం సందర్భంగా తల్లులందరికీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మీ ప్రేమ, బలం, త్యాగం అపరిమితమైనవి. ఎప్పటికీ మిమ్మల్ని గౌరవిస్తూనే ఉంటాం. మాతృ దినోత్సవం శుభాకాంక్షలు.. అమ్మ’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Happy Mother’s Day to all the incredible mothers. Your love, strength, and sacrifice are immeasurable. Today, we honor you for all that you do.Happy Mother’s Day Amma!#MothersDay— YS Jagan Mohan Reddy (@ysjagan) May 11, 2025 -
100 ఏళ్ల చదువుల గుడి ఎయూ శతవార్షికోత్సవాలు
ఆంధ్రరాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేకంగా ఆవిర్భవించిన మొదటి విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వ కళాపరిషత్. తెలుగు ప్రజల కోసం ఏర్పడిన భాషా ప్రయుక్త విశ్వవిద్యాలయం ఆంధ్రవిశ్వవిద్యాలయం. దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నప్పటికీ విశ్వకళాపరిషత్ అనే పేరుతో వ్యవహరించేది మాత్రం ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మాత్రమే! దేశంలో మరో విశ్వవిద్యాలయానికి లేని ప్రత్యేకత ఇది. పేరుకు తగినట్లే లలిత కళలైన నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, రంగస్థలం, నటన వంటి కళలకు యూనివర్సిటీలో స్థానం కల్పించారు. స్వతహాగా కళా సాహిత్యాల పట్ల మక్కువ ఉన్న కట్టమంచి రామలింగారెడ్డి ‘ఆంధ్ర విశ్వకళాపరిషత్’ పేరును ప్రతిపాదించారు. 1926లో మద్రాసు విశ్వవిద్యాలయ చట్టం ప్రకారం తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేకంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటైన రెసిడెన్షియల్ టీచింగ్– కమ్– అనుబంధ విశ్వవిద్యాలయంగా ఘనతకెక్కిన ఏయూ శతాబ్ది ఉత్సవాలను జరుపుకొంటోంది. మొదటగా విజయవాడలో 1926 ఏప్రిల్ 24న ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయానికి పునాదిని మొట్టమొదటి వీసీ డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి వేయగా, అప్పటి మద్రాస్ గవర్నర్ లార్డ్ గోచెన్ చాన్సలర్‌గా వ్యవహరించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని 1930 సెప్టెంబరు 5న ఈ యూనివర్సిటీ ప్రాంగణాన్ని విశాఖపట్నానికి తరలించారు. ప్రతి ఏటా సగటున వెయ్యి నుంచి పన్నెండు వందల మంది విద్యార్థులు పీహెచ్డీ పట్టాలు తీసుకునే ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ప్రస్తుతం 58 విభాగాలు, 18 పరిశోధన కేంద్రాల్లో 20 వేలమంది విద్యార్థులు చదువుకుంటున్నారు.ఏడాది పాటు శతాబ్ది ఉత్సవాలు...!ఏయూ ఏర్పాటై 2026 నాటికి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఏడాది పాటు శతాబ్ది ఉత్సవాలను నిర్వహించుకునేందుకు ఏయూ సిద్ధమయ్యింది. ఏడాదిపాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో ఎడ్యుకేషన్, రీసెర్చ్, ఔట్రీచ్– ఈ మూడు విభాగాల్లో పనిచేయాలని విజన్ డాక్యుమెంట్‌ను ఏయూ ప్రకటించింది. శతాబ్ది ఉత్సవాల లోగోను ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ లోగోను యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ విభాగంలోని బీఎఫ్ఏ విద్యార్థి షేక్ రఫీ రూపొందించారు. ఏయూ లోగో ప్రత్యేకత!ఆంధ్రా యూనివర్సిటీ లోగోను ప్రత్యేక శ్రద్ధతో తయారుచేసి, లోగోలోని ప్రతి చిహ్నానికి అర్థం స్ఫూరించేలా తయారు చేశారు. కాంతి కిరణాలతో ఉదయించే సూర్యుడు విశ్వవిద్యాలయాన్ని, దాని అనేక అధ్యయన విభాగాలను సూచిస్తుంది. ఇక కమలం శ్రేయో దేవత లక్ష్మీ, జ్ఞాన దేవత సరస్వతి– ఇద్దరినీ ప్రతిబింబిస్తుంది. సూర్యకిరణాలపై ఆర్యులలో దీవెన చిహ్నమైన స్వస్తిక ఉంటుంది. అరవై నాలుగు తామర రేకులతో కూడిన శిఖరం బయటి వృత్తం, భారతదేశ శాస్త్రీయ సంప్రదాయంలోని అరవై నాలుగు కళలను, శాస్త్రాలను సూచిస్తుంది. ఇక సముద్రాన్ని– విద్యార్థులు ప్రావీణ్యం పొందడానికి దోహదపడే విస్తారమైన జ్ఞానకేంద్రం అనే అర్థంలో తయారు చేశారు. ఉపనిషత్తులలోని ‘తేజస్వినావధితమస్తు’ అనే నినాదాన్ని కూడా లోగోలో భాగం చేశారు. దీని అర్థం ఏమిటంటే ‘దైవిక కాంతి మన అధ్యయనాలను ప్రకాశింపజేయుగాక‘ అని. ఈ జ్ఞాన చిహ్నం కింద అన్ని మతాలలోనూ ప్రాశస్త్యం కలిగిన నెలవంక ఉంది. ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని కళల అభివృద్ధికి నెలకొల్పిన సంస్థ అనే అర్థంతో ‘ఆంధ్ర విశ్వకళాపరిషత్’ అని దీనికి నామకరణం చేశారు. లోగోలోని దిగువభాగంలో ఉన్న రెండు సర్పాలు తామర రేకుల నుంచి జ్ఞానాన్ని కోరుకునేవారిని, జ్ఞాన సంరక్షకులను సూచిస్తాయి. అంతేకాకుండా, పురాతనకాలం నుంచి ఆంధ్రులలో నాగారాధన సంప్రదాయం ఉంది. ఈ లోగోను కౌతా రామమోహనశాస్త్రి రూపొందించగా, ఏయూ వ్యవస్థాపక వీసీ డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి ఆమోదించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో...వాస్తవానికి మొట్టమొదటగా బెజవాడలోని (ఇప్పటి విజయవాడ) తాత్కాలిక భవనాల్లో ఏర్పాటైన ఏయూ 1930లో విశాఖకు తరలివచ్చింది. అయితే, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మాత్రం ఏయూ ప్రాంగణం అంతా సైనిక స్థావరంగా మారిపోయింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1942 ఏప్రిల్ 6న విశాఖ హార్బర్‌పై జపాన్ బాంబులు వేసింది. ఆ దాడి తర్వాత యూనివర్సిటీ భూమిని, భవనాలను తమ అవసరాలకు ఉపయోగించుకోవాలని అప్పటి బ్రిటిష్ సైన్యం నిర్ణయించుకుంది, యూనివర్సిటీని మార్చమని బలవంతం చేసింది. బాంబు దాడి జరిగిన పది రోజుల తర్వాత– అంటే 1942 ఏప్రిల్ 16న యూనివర్సిటీని తరలించడానికి సన్నాహాలు చేసుకోవడం కోసం మూసివేశారు. కెమిస్ట్రీ మినహా చాలా విభాగాలు గుంటూరుకు మారగా, కెమిస్ట్రీ విభాగం మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలకు మారింది. భవనాలన్నింటినీ సైన్యం ఆక్రమించడంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం జూన్ 1945 వరకు అంటే మూడేళ్లపాటు విశాఖపట్నం వెలుపలి నుంచే పనిచేసింది.న్యాక్ ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్‌తో...!తెలుగు ప్రజల సుదీర్ఘ పోరాట ఫలితంగా ఆంధ్రా యూనివర్సిటీ ఏర్పడటంతో తెలుగు ప్రజలు యూనివర్సిటీతో మానసికంగా అనుబంధం పెంచుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ దేశంలోని పురాతన విద్యాసంస్థలలో ఒకటి మాత్రమే కాదు, రెసిడెన్షియల్ మల్టీ–డిసిప్లినరీ యూనివర్సిటీగా ఏర్పడిన విశ్వవిద్యాలయాలలో మొదటిది. శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమైన ఈ యూనివర్సిటీకి కట్టమంచి రామలింగారెడ్డి వ్యవస్థాపక వైస్ చాన్సలర్‌గా, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రెండో వైస్ చాన్సలర్‌గా, తిరిగి సీఆర్ రెడ్డి, అనంతరం డాక్టర్ వీఎస్ కృష్ణు్ణడు– ఈ ముగ్గురు దార్శనికులు వేసిన పునాదులు ఆ తర్వాతి దశాబ్దాల్లో ఫలవంతమై, ఏకంగా దేశంలోనే న్యాక్ ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ పొందిన మొట్టమొదటి ప్రభుత్వ యూనివర్సిటీగా 2024లో చరిత్రకెక్కింది. ఏయూలో 59 దేశాల విద్యార్థులు...దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో పాటు విదేశాల్లోని విద్యార్థులనూ ఏయూ ఆకర్షిస్తోంది. ఇక్కడ చదువుకునేందుకు విదేశీ విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఏకంగా 59 దేశాలకు చెందిన 1,130 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో చదువుకుంటున్నారు. ఎక్కువగా ఇంజినీరింగ్ కోర్సుల్లో 472 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. 2019–20 సంవత్సరంలో 190 మంది ఉన్న విదేశీ విద్యార్థుల సంఖ్య గత ప్రభుత్వ హాయంలో ప్రత్యేకంగా హాస్టల్స్ ఏర్పాటుతో పాటు ప్రత్యేక మెనూను అమలు చేయడంతో ఈ సంఖ్య 1,130కి చేరుకుంది. ఇక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు ఒకవైపు చదువుకుంటూనే, మరోవైపు సినిమాల్లోనూ నటిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ప్రధానంగా విశాఖలో జరిగే వివిధ రకాల సినిమా షూటింగుల కోసం అవసరమైన విదేశీయుల కోసం ఇక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులను దర్శకులు వెదుక్కుంటూ వచ్చి మరీ తీసుకెళుతున్నారు. ఇస్మార్ట్ శంకర్, శివం వంటి సినిమాల్లో ఇక్కడి విదేశీ విద్యార్థులు నటించారు. ఎందరో మహానుభావులు...ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకున్న అనేక మంది ఎంతో గొప్ప స్థానాలకు చేరుకున్నారు. ఆచార్య సూరి భగవంతం (భౌతికశాస్త్రం), ఆచార్య జ్ఞానానంద (అణుభౌతిక శాస్త్రం), ఆచార్య సి.మహదేవన్ (జియాలజీ), ఆచార్య టీఆర్. శేషాద్రి (రసాయన శాస్త్రం), ఆచార్య బి. రామచంద్రరావు(స్పేస్ ఫిజిక్స్), ఆచార్య సి.ఆర్‌రావు (స్టాటస్టిక్స్), ఆచార సీవీ రామన్(భౌతికశాస్త్రం), ఆచార్య ఆర్.రంగదామరావు (మీటీయరాలజీ) వంటి అనేక మంది ప్రపంచస్థాయిలో శాస్త్రవేత్తలుగా రాణించినవారే! ఇక భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ప్రస్తుత ఒడిశా గవర్నర్ ఆచార్య కంభంపాటి హరిబాబు, రాజ్యసభ మాజీ సభ్యుడు, విశ్వ హిందీపరిషత్ అద్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, పెన్‌స్టేట్ యూనివర్సిటీ (అమెరికా) అద్యక్షురాలు నీలి బెండపూడి, జీఎంఆర్ గ్రూప్ అధినేత డాక్టర్ జి.ఎం.రావు, ఆర్బీఐ మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు, లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి తదితర ప్రముఖులు ఏయూ పూర్వవిద్యార్థులలో ఉండటం విశేషం. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు నాయకత్వం వహిస్తున్న 50 మంది వీసీలను, 10 మంది చాన్సలర్లనూ అందించిన ఘనత ఏయూ సొంతం. ఇదిలా ఉంటే, ఈ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల్లో ఎనిమిది మంది శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీతలు, ముగ్గురు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలు, నలుగురు పద్మశ్రీ అవార్డు గ్రహీతలతో పాటు సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఒకరు ఉన్నారు. డిసెంబర్లో పూర్వ విద్యార్థుల సమావేశం...ఏయూ పూర్వ విద్యార్థులు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నవారు ఉన్నారు. దేశంతో పాటు విదేశాల్లోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. ఆస్ట్రేలియా, సింగపూర్, జపాన్, కెనడా, ఆఫ్రికా, జర్మనీ, ఫ్రా¯Œ ్స, రష్యా, థాయ్‌లండ్, మలేషియా మొదలైన దేశాల్లో మంచి సంఖ్యలో పూర్వ విద్యార్థులు స్థిరపడి పని చేస్తున్నారు. వీరందరూ కలిపి ఏర్పాటు చేసుకున్న ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం యూనివర్సిటీ అభివృద్ధిలోనూ ఎంతగానో సహాయ సహకారాలను అందిస్తోంది. ఈ సంఘం ద్వారా యూనివర్సిటీలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ప్రతి ఏటా డిసెంబర్లో ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపక వీసీ సీవీ రెడ్డి జయంతి సందర్భంగా పూర్వ విద్యార్థుల వార్షిక సమావేశాన్ని నిర్వహించుకుంటున్నారు. ‘నాసా’ పరిశోధనల్లోనూ...ప్రారంభంలో ఏయూ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్స్ కళాశాలలు ఉమ్మడిగా ఉండేవి. ఈ ఉమ్మడి విభాగాలకు ప్రిన్సిపల్‌గా పనిచేసిన ఎం. వెంకటరంగయ్య ‘పద్మవిభూషణ్’ అందుకున్నారు. అయితే, 1931లో ఈ రెండు విభాగాలను వేరు చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల తొలి ప్రిన్సిపాల్‌గా ఆర్.రామనాథం పనిచేశారు. జయపూర్ మహారాజా విక్రమ్‌దేవ్ వర్మ ఏయూకు విలువైన భూములను, భారీగా నగదును విరాళంగా ఇచ్చారు. సంప్రదాయ కోర్సులకు భిన్నంగా భవిష్యత్ అవసరాలను గుర్తించి కొత్త కోర్సులను విద్యార్థులకు అందించడంలో ఆంధ్రా యూనివర్సిటీ అగ్రగామిగా ఉంటోంది. ఏయూ మీటియరాలజీ, ఓషనోగ్రఫీ, జియాలజీ, నూక్లియర్ ఫిజిక్స్ వంటి వైవిధ్యభరితమైన ప్రత్యేక శాస్త్ర విభాగాలను నిర్వహిస్తోంది. దేశంలోనే మొదటిసారిగా న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేసిన యూనివర్సిటీగా ఏయూ పేరు సంపాదించింది. ఇక వివిధ రకాల పరిశోధనల కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని అడ్వాన్స్డ్ అనలిటికల్ లేబొరేటరీ, ఎన్ఎంఆర్ స్పెక్టోస్కోపీలు వర్సిటీ విశిష్టతను చాటుతున్నాయి. ఇక ‘నాసా’ చేపట్టిన లూనార్ ప్రయోగాలకు ఏయూ తన వంతు సహాయాన్ని అందించింది. తూర్పు కనుమలలోని పలు రకాల రాళ్లను సేకరించి, చంద్రమండలంలోని పదార్థాలలో పోలి ఉన్నాయా లేదా అనే ప్రయోగాన్ని నిర్వహించింది. ఇందుకు అవసరమైన సహకారాన్ని ఏయూ జియాలజీ విభాగం అందించింది. తమకు అందించిన సహకారానికి ‘నాసా’ స్వయంగా ఏయూకు కృతజ్ఞత లేఖ రాసింది. అలాగే ఏయూ ఫ్రాన్స్‌కు కూడా అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించింది.మరో ఎత్తుకు వైఎస్ జగన్ హాయంలో....!నూతన పోకడలకు అనుగుణంగా ఆంధ్రా యూనివర్సిటీలో కొంగొత్త మార్పులకు గత వైఎస్సార్సీపీ హాయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో శ్రీకారం చుట్టారు. ఎన్నడూ లేని విధంగా స్టార్టప్‌ల కోసం ప్రత్యేకంగా ఏ–హబ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు పేటెంట్ల కోసం ఏకంగా నూటికిపైగా దరఖాస్తులు చేయడంలో ఏయూ మరో శిఖరానికి చేరుకుంది. పేటెంట్లకు దరఖాస్తు చేసేందుకు ప్రత్యేకంగా ఆంధ్రా యూనివర్సిటీలో మేధాసంపత్తి హక్కులను పొందేందుకుగానూ ప్రత్యేకంగా మేధాసంపత్తి హక్కుల కేంద్రాన్ని (సీఐపీఆర్) గత ప్రభుత్వ హాయంలో అప్పటి వీసీ ప్రసాద్‌రెడ్డి సెప్టెంబరు 2020లో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా నూటికిపైగా దరఖాస్తులను పంపారు. ఇక గత ప్రభుత్వ హాయంలో చేపట్టి, పూరైన 5 ప్రత్యేక భవనాలను సీఎం హోదాలో 2023 ఆగస్టు 1వ తేదీన వైఎస్ జగన్ ప్రారంభించారు. అప్పటి వీసీ ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో ఏయూ ఈ ప్రగతిని సాధించింది. ఆ భవనాలు ఇవే... ఏ–హబ్ (ఆంధ్రా యూనివర్సిటీ స్టార్టప్ – టెక్నాలజీ ఇంక్యుబేషన్ హబ్): దీనిని రూ. 21కోట్ల వ్యయంతో 30,000 చదరపు అడుగుల స్థలంలో కొత్తగా నిర్మించారు. ఇందులో 121 స్టార్టప్స్ తమ కార్యాలయాలను ప్రారంభించి సేవలందిస్తున్నాయి. రాష్ట్రంలో స్టార్టప్స్‌కు అంకురార్పణ కూడా ఇక్కడి నుంచే ఊపందుకుందని చెప్పవచ్చు.ఎలిమెంట్(ఆంధ్రా యూనివర్సిటీ ఫార్మా ఇంక్యుబేషన్ మరియు బయోలాజికల్ మానిటరింగ్ హబ్): ఫార్మా/బయోటెక్/ జెనోమిక్స్ ఇంక్యుబేషన్, టెస్టింగ్ ల్యాబ్ కోసం 55,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్తగా నిర్మించారు. దీని నిర్మాణానికి రూ. 44 కోట్లు ఖర్చు చేశారు.ఆల్గోరిథమ్(ఆంధ్రా యూనివర్సిటీ డిజిటల్ జోన్ –స్మార్ట్ క్లాస్ రూమ్స్ కాంప్లెక్స్): దీనిని 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో రూ. 35 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇందులో 250 మంది కూర్చునేందుకు వీలు కలిగిన రెండు ఆధునిక సెమినార్ హాళ్లు, 15 స్మార్ట్ క్లాస్ రూమ్‌లలో 500 కంప్యూటర్లతో విద్యార్థులకు శిక్షణ, ఆన్లైన్ పరీక్షలను నిర్వహించుకునే వీలు కలిగింది. ఇందుకోసం ప్రత్యేక ఫ్లోర్‌ను నిర్మించారు.ఏయూ–సిబ్ (ఆంధ్రా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్): ఐఐఎం–విశాఖపట్నంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుని, రూ. 18 కోట్ల వ్యయంతో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. ఇందులో ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ అనలిటిక్స్‌లో ప్రత్యేకమైన బ్యాచిలర్ మరియు మాస్టర్ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నారు.ఏయూ–అవంతి ఆక్వాకల్చర్ ఇనోవేషన్ మరియు స్కిల్ హబ్‌మొదటి దశలో రూ. 11 కోట్లతో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మెరైన్ ఫార్మింగ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్‌లో నైపుణ్య శిక్షణను అందించడానికి దీనిని నిర్మించారు. -
ఆంధ్రప్రదేశ్‌లో తిరోగమన ప్రభుత్వం!
‘‘ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రజల కంచాల్లోని కూడు లాగేశారు.. ప్రతి ఇంటికీ బాబు మోసం" ఇది వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శ. ఈ వార్త ప్రజలకు అందిన రోజే మరో సమాచారం వచ్చింది. జీఎస్టీ ఆదాయం వసూళ్లు దేశమంతటా పైపైకి వెళుతుంటే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం నేల చూపులు చూస్తున్నట్లు ఆ కథనం చెప్పింది. జగన్ వ్యాఖ్యలకు, జీఎస్టీకి ఏమి సంబంధం? అంటే.. జగన్ ప్రభుత్వం ప్రజలకు వివిధ స్కీముల కింద ఆర్థిక సాయం చేసేది. లబ్దిదారుడికి నేరుగా నగదు అందేలా ఆ పథకాలుండేవి.ఆ డబ్బుతో ప్రజలు ముఖ్యంగా పేదలు, దిగువ మధ్య తరగతి వారు వస్తు, సేవల కొనుగోళ్లు చేసేవారు. ఫలితంగా వ్యాపార కార్యకలాపాలు సాగి ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో ఆదాయం సమకూరేది. అందువల్లే ఆ రోజుల్లో ఒకవైపు పేదరికం తగ్గినట్లు గణాంకాలు తెలిపాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. వ్యాపారాలు సరిగా సాగడం లేదని వ్యాపారస్తులు వాపోతున్నారు. ఇల్లు గడవడమే కష్టమవుతోందని పేదలు గగ్గోలు పెడుతున్నారు. ఫలితంగా దేశం అంతటా 12 శాతం వరకు జీఎస్టీ వృద్దిరేటు ఉంటే, ఏపీలో మాత్రం ఏప్రిల్ లో మైనస్ 3.4 శాతంగా మాత్రమే ఉంది. అందువల్లే జగన్ ఈ వ్యాఖ్య చేశారు.పేదల తింటున్న కడును కూటమి పెద్దలు లాగేశారని ఆయన అన్నారు. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు ఎన్నికల ప్రచారంలో ఆకాశమే హద్దుగా వాగ్దానాలు చేశారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నిటిని కొనసాగించడమే కాకుండా, సూపర్ సిక్స్ హామీలను కూడా ప్రజలకు అందిస్తామని పదే, పదే ప్రకటించారు. ఈ సూపర్ సిక్స్‌ను తొలుత మహానాడులో ప్రకటించినప్పుడు తమ్ముళ్లూ అదిరిందా? అంటూ చంద్రబాబు ప్రశ్నించే వారు. అందుకు వారంతా ఔను, ఔనని చప్పట్లు కొట్టారు. జనం కూడా ఆశపడ్డారు. తీరా అధికారం వచ్చాక టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు నాలుక మడత వేయడం ఆరంభించారు. అదిరిపోవడం జనం వంతైంది.ఇదేమి ఖర్మ.. పాలిచ్చే గేదెను వదలుకుని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామా అని ప్రజలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ తాను పలావు పెడుతుంటే, చంద్రబాబు బిర్యానీ పెడతానని ప్రచారం చేశారని, అది నమ్మి జనం ఓట్లు వేశాక, పలావు, బిర్యానీ రెండూ లేకుండా పోయాయని పలుమార్లు వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీఎం కాకముందు ప్రతి ఇంటిలో నాలుగువేళ్లు ఆనందంగా నోట్లోకి వెళ్లేవని, కూటమి వచ్చి కంచం లాగేసిందని కొద్ది రోజుల క్రితం పార్టీ సమావవేశంలో ధ్వజమెత్తారు. ఇందులో చాలా వరకు వాస్తవం ఉంది.జగన్ అమ్మ ఒడి స్కీమ్ కింద రూ.15 వేలు ఇస్తే వారికి ఆర్ధిక వెసులుబాటు వచ్చేది. చేయూత, ఆసరా, విద్యా దీవెన, రైతు భరోసా, వాహన మిత్ర తదితర స్కీముల కింద వచ్చే డబ్బు వేడినీళ్లకు చన్నీళ్ల మాదిరి ఉపయోగపడేవి. ఇప్పుడు అవేవీ రాలేదు. చంద్రబాబు తాను ప్రతి బిడ్డకు రూ.15 వేలు చొప్పున ఎందరు పిల్లలు ఉంటే అందరికి తల్లికి వందనం పేరుతో ఇస్తానని నమ్మబలికారు. రైతులకు రూ.20 వేలు, నిరుద్యోగులకు నెలకు రూ.మూడు వేలు లారీ డ్రైవర్లకు రూ.15 వేలు.. ఇలా ఎడాపెడా వాగ్దానాలు చేశారు. కాని అధికారంలోకి వచ్చాక ఒక ఏడాది పూర్తిగా ఎగవేశారు. దాంతో జనం కూడా జగన్ చెప్పినట్లు చంద్రబాబు తమ నోటికాడ కూటిని తమ నోటికాడ కూటిని లాగేశారని అనుకుంటున్నారు.జగన్ కాని, వైసీపీ నేతలు కాని చేస్తున్న ఈ విమర్శలను కూటమి పెద్దలు ఎవరూ ఖండించలేకపోతున్నారు. కాకపోతే జగన్ పాలనలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసం జరిగిందని ఏవో పడికట్టు పదాలతో పిచ్చి ఆరోపణలు చేసి ప్రజలను డైవర్ట్ చేయడానికి యత్నిస్తుంటారు. ఈ విషయంలో కూడా వారిలో ఒక స్పష్టత, కనిపించదు. జగన్ ప్రభుత్వం రూ. ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిందని ఒకసారి, రూ.పది లక్షల కోట్లు అని మరోసారి, రూ.13 లక్షల కోట్లు అని వేరొకసారి, అది రూ.14 లక్షల కోట్లు అని ఇంకోసారి చంద్రబాబు, పవన్ లు చెప్పిన వీడియోలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టిన బడ్జెట్లో మాత్రం అప్పు అంతా కలిపి రూ.ఆరు లక్షల కోట్టేనని తేలింది. అందులో సగం 2014 టర్మ్‌లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు కూడా ఉంది. 2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు అప్పులు చేయరు కాబోలు.. కొత్తగా సంపద సృష్టిస్తారేమోలే అనుకున్న వారందరికి మతిపోయేలా చేశారు. ఏకంగా రికార్డు స్థాయిలో అన్నీ కలిపి రూ.లక్షన్నర కోట్ల అప్పు చేశారు. స్కీములు అమలు చేయకుండా, పెద్దగా అభివృద్ది పనులు చేపట్టకుండా ఈ అప్పు ఏమి చేశారన్నది మిస్టరీ. దానిపై ప్రభుత్వం ఇంతవరకు వివరణ పత్రం ఇవ్వలేదు. దాంతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన సర్కార్‌గా గుర్తింపు పొందుతోంది.ఇంత అప్పు చేసి కూడా చంద్రబాబు తరచు తమకు అప్పులు పుట్టడం లేదని, సంపద సృష్టించడం ఎలాగో చెవిలో చెప్పండని కామెంట్లు చేస్తుంటే ప్రజలు నిశ్చేష్టులవుతున్నారు. తన పార్టీ సమావేశంలో జగన్ మాట్లాడుతూ ఎపిలో ప్రతి ఇంటిని బాబు మోసం చేశారని అన్నారు.అది కూడా నిజమే అనుకోవాలి. జగన్ టైమ్ లో ఏదో రకంగా 87 శాతం కుటుంబాలకు ఆర్థిక సాయం అందేది. ప్రస్తుతం పెరిగిన పెన్షన్ వెయ్యి రూపాయలు తప్ప మరేమీ అందడం లేదు. ప్రజలకు సూపర్ సిక్స్ అందకపోగా, రాక్షస రాజ్యం నడుపుతున్నారని, ప్రశ్నించేవారిపై కేసులు పెడుతున్నారని, తమకు బలం లేకపోయినా మున్సిపాల్టీ, మండల పరిషత్‌లను దౌర్జన్యంగా కైవసం చేసుకుంటున్నారని జగన్ అన్నారు. ఇందులో కూడా వాస్తవం ఉంది.సీఎం తన సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాల్టీలో టీడీపీకి బలం లేకపోయినా, భయపెట్టో, ప్రలోభపెట్టో తమ ఖాతాలో వేసుకున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి వెనుపోటే. కొన్నిచోట్ల మాత్రం వైసీపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు ధైర్యంగా అధికార కూటమి అరాచకాలను అడ్డుకున్నారు. అలాంటి వారితో జగన్ ప్రత్యేకంగా సమావేశమై వారిని అభినందించారు. జీఎస్టీ వసూళ్ల గురించి వచ్చిన డేటా విశ్లేషిస్తే, కూటమి సర్కార్ వచ్చిన ఈ పదినెలల్లో రెండు నెలలు తప్ప, మిగిలిన అన్ని నెలలు మైనస్ గ్రోత్ రేట్ నమోదైనట్లు స్పష్టమవుతోంది. ఇది ఏపీకి మంచి పరిణామం కాదు.గత ఏప్రిల్‌లో తమిళనాడులో 13 శాతం, తెలంగాణలో 12 శాతం, కర్ణాటకలో 11 శాతం, కేరళలో ఐదు శాతం, చివరికి ఒడిశాలో కూడా ఐదు శాతం వృద్ది రేటు చూపితే ఆంధ్ర ప్రదేశ్ మాత్రం మైనస్ 3.4 శాతంగానే ఉంది. అయినా దీన్ని కనిపించకుండా చేసేందుకు ఎల్లో మీడియా పాట్లు పడింది. కొద్ది రోజుల క్రితం జీఎస్డీపీలో నెంబర్ 2 వచ్చేశామంట ఒక అంకెను ప్రచారం చేశారు. ఆ తర్వాత కేంద్రం విడుదల చేసిన ఈ జీఎస్టీ లెక్కలతో ఏపీ ప్రభుత్వం చెప్పేవి బూటకపు లెక్కలని తేటతెల్లమవుతోంది! - కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వీర జవాన్ మురళి నాయక్ ఇంటికి వైఎస్ జగన్
-
అమరుడా.. నీకు వందనం
సాక్షి, న్యూఢిల్లీ/గోరంట్ల/కర్నూలు(సెంట్రల్)/సాక్షి, అమరావతి: భారత్ – పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ (22) వీర మరణం పొందాడు. దేశ రక్షణలో శుక్రవారం తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో దాయాది బుల్లెట్‌కు బలయ్యాడు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీ ‘ఆపరేషన్ సిందూర్’ సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద పని చేస్తున్నాడు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన చికిత్స నిమిత్తం విమానంలో ఢిల్లీకి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే తనువు చాలించాడు. దేశ భద్రతలో తన ప్రాణాలను పణంగా పెట్టిన మురళీ నాయక్ త్యాగం మన దేశం ఎప్పటికీ మరువలేనిదని కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు నివాళులర్పించారు. యావత్ భారత ప్రజానీకం ఈ వీర జవాన్‌కు సెల్యూట్ కొడుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఏకైక సంతానం.. దేశ సేవకు అంకితం జ్యోతిబాయి, శ్రీరాంనాయక్ దంపతులకు మురళీ నాయక్ ఏకైక సంతానం. వీరిది నిరుపేద కుటుంబం. ఈ దంపతులు 30 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం ముంబయికి వెళ్లారు. ఇద్దరూ అక్కడ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. మురళీ నాయక్ సోమందేపల్లి మండలం నాగినాయిన చెరువు తండాలో అమ్మమ్మ శాంతి బాయి వద్ద ఉంటూ సోమందేపల్లిలోని విజ్ఞాన్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో పదో తరగతి, ఇంటర్మీడియట్ అనంతపురంలోని సాయి జూనియర్ కళాశాలలో పూర్తి చేశాడు. అక్కడే డిగ్రీ చదువుతూ 2022 నవంబర్‌లో భారత సైన్యంలో చేరాడు. మహారాష్ట్రలో శిక్షణ పొందాక అసోం బార్డర్లో కొంతకాలం పనిచేశాడు. తర్వాత జమ్మూ కశ్మీర్‌కు బదిలీ అయ్యాడు. ఒక్కగానొక్క కుమారుడు కావడంతో మిలటరీలో చేరొద్దని తాము ప్రాధేయపడినా, దేశ సేవ చేయాలన్న తలంపుతో ముందుకు సాగాడని తల్లిదండ్రులు తెలిపారు. మురళీ నాయక్ ఇక లేడన్న సమాచారాన్ని భారత సైనికాధికారులు శుక్రవారం ఉదయం 9 గంటలకు తండ్రి శ్రీరాం నాయక్‌కు తెలియజేశారు. భౌతికకాయాన్ని శనివారం సాయంత్రం స్వగ్రామానికి తీసుకురానున్నట్లు సమాచారమిచ్చారు. అధైర్యపడొద్దు: సీఎం చంద్రబాబు మురళీ నాయక్ తల్లిదండ్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్య పడొద్దని చెప్పారు. శుక్రవారం అనంతపురం జిల్లా పర్యటన ముగించుకుని కర్నూలు ఎయిర్‌పోర్టుకు వర్పింన ఆయన.. అక్కడే మురళీ నాయక్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వెళ్లారు. కాగా, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత శుక్రవారం కల్లి తండాకు చేరుకుని మురళీ నాయక్ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును అందజేశారు. వీర సైనికుడి త్యాగాన్ని దేశం మరచిపోదు ‘సైనికుడు మురళీనాయక్ అమరుడవ్వడం చాలా బాధగా ఉంది. వీరోచిత పోరాటంలో తనువు చాలించిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. నాయక్ త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరచిపోదు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మలు పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మరచిపోదని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వేర్వేరు ప్రకటనల్లో కొనియాడారు. మురళీ నాయక్ భారతమాత నుదుటిన అద్దిన సింధూరమని ఏపీ ట్రైకార్ మాజీ చైర్మన్ గుండా సురేంద్ర ఘన నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మిలటరీ దుస్తుల్లో చనిపోవాలనేవాడుమురళీ నాయక్ చిట్టచివరిగా తల్లిదండ్రులకు గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ఫోన్ చేసి మాట్లాడాడు. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో బుధవారం రాత్రి నైట్ డ్యూటీ చేశానని, నిద్ర వస్తోందని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని మురళీకి సూచించారు. అంతలోనే ఇలా ఘోరం జరిగిందంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. దేశానికి సేవ చేయాలన్న సంకల్పం మురళీ నాయక్‌కు చిన్నప్పటి నుంచే బలంగా ఉండేది. ఒక్క రోజైనా భారత సైన్యంలో పనిచేసి.. మిలటరీ దుస్తులతో చనిపోవాలన్నదే తన లక్ష్యమని చెబుతుండేవాడని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు. అదే పట్టుదలతో కష్టపడి ఆర్మీలో ఉద్యోగం సంపాదించాడని, అనుకున్నట్టే యూనిఫాంతోనే వీర మరణం పొందాడని ఆవేదన వ్యక్తం చేశారు.నీ త్యాగాన్ని మరువలేంవైఎస్ జగన్ దిగ్భ్రాంతియుద్ధ భూమిలో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని ఎప్పటికీ మరువలేమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో తెలుగు జవాన్ వీర మరణం చెందడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శోకతప్తులైన మురళి కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గిరిజన బిడ్డ దేశ భద్రతలో తన ప్రాణాలను సైతం ప్రాణంగా పెట్టి.. పిన్న వయసులోనే అశువులు బాయడం బా«ధాకరం అన్నారు. ఈ అమర వీరుడి త్యాగాన్ని భారతజాతి మరువదని, మురళీనాయక్ కుటుంబీకులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు. మనోధైర్యంతో ఉండాలని సూచించారు. వైఎస్సార్సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్‌తో పాటు పలువురు నేతలు కల్లి తండాకు చేరుకొని మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. 13న కల్లితండాకు వైఎస్ జగన్జమ్మూకశ్మీర్లో వీరమరణం చెందిన జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. అందుకోసం ఈనెల 13న ఆయన శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ పరిధిలోని కల్లితండా వెళ్లనున్నారు. -
వైఎస్ జగన్‌కు జెడ్ ప్లస్ భద్రత విషయంలో.. కౌంటర్లు దాఖలు చేయండి
సాక్షి, అమరావతి: జెడ్ ప్లస్ భద్రత కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ విషయంలో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్, సీఆర్పీఎఫ్ డీజీ, ఎన్ఎస్జీ డీజీ, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు ఇచ్చింది. జెడ్ ప్లస్ భద్రతకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్ధరించే విషయంలో తగిన చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ వైఎస్ జగన్ గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర భద్రతా సంస్థలైన సీఆర్పీఎఫ్ లేదా ఎన్ఎస్జీలతో తగిన భద్రత కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధం అని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి వాదనలు విన్నారు. వైఎస్ జగన్ తరఫు న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ, నిర్దిష్ట ప్రొటోకాల్స్‌కు అనుగుణంగా వైఎస్ జగన్‌కు ఉన్న ప్రాణహానిని తాజాగా, స్వతంత్రంగా మదింపు చేసి జెడ్ ప్లస్ భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. జగన్‌కు ఉన్న ప్రాణహానిని, ఆయనపై గతంలో జరిగిన హత్యాయత్నాన్ని పరిగణనలోకి తీసుకుని జెడ్ ప్లస్ భద్రత కల్పించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత ఎలాంటి నోటీసు, ముందస్తు సమాచారం ఇవ్వకుండా వైఎస్ జగన్ భద్రతను భారీగా కుదించేశారని, ఇటీవల పలు సందర్భాల్లోనూ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించిందని చెప్పారు. పర్యటనలు, పరామర్శలకు వెళ్లినప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదన్నారు. జెడ్ ప్లస్ భద్రతను పునరుద్ధరించాలని పలుసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని నాగిరెడ్డి వివరించారు. భద్రత విషయంలో వైఎస్ జగన్ గతంలో దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉందన్నారు. ఇప్పుడు మళ్లీ పిటిషన్ వేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) పసల పొన్నారావు స్పందిస్తూ పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని చెప్పారు. -
ఈ నెల 13న కల్లితండాకు వైఎస్ జగన్
తాడేపల్లి: జమ్మూకశ్మీర్‌లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈనెల 13వ తేదీన కల్లి తండాకు వెళ్లనున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీ నాయక్.. పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందారు. వీర జవాన్ మురళీ నాయక్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. కుటుంబ సభ్యులతో ఫోన్ లో పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. దీనిలో భాగంగా 13వ తేదీన కల్లి తండాకు వెళ్లి ఆ వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు వైఎస్ జగన్.కాగా, భారత్-పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాను వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. అగ్నివీర్ పథకం కింద మూడు సంవత్సరాల క్రితం ఆర్మీ లో చేరిన మురళీ నాయక్... నాసిక్‌లో శిక్షణ పొంది అస్సాంలో పనిచేశారు. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే పాకిస్తాన్ ద దుశ్చర్యలను అడ్డుకునే క్రమంలో ఆ జవాన్ వీర మరణం పొందారు. -
ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ పిటిషన్‌పై విచారణ
అమరావతి: తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్దరించేలా ఆదేశాలు ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు(శుక్రవారం) ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తన భద్రత విషయంలో వరుస ఘటనలు ఆందోళనలు కలిగిస్తున్న కారణంగా జడ్ ప్లస్ కేటగిరీ భద్రత పునరుద్దరించేలా వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరగ్గా, వైఎస్ జగన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.‘‘వైఎస్ జగన్‌కు భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంది. జగన్‌కు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. కావాలనే జగన్ భద్రతను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఇప్పటికే భద్రతకు సంబంధించిన అంశంపై ఒక రిట్ పిటిషన్ పెండింగ్ లో ఉంది’అని వైఎస్ జగన్ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
తెలుగు జవాన్ వీర మరణంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: జమ్మూకశ్మీర్‌లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దేశ భద్రతలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి వీరమరణం పొందిన మురళీనాయక్ త్యాగాన్ని మరువలేమన్నారు. మురళీనాయక్ కుటుంబీకులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మురళీ నాయక్ కుటుంబాన్ని వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని కోరారు.భారత్-పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాను వీర మరణం పొందారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కళ్లి తండాకు చెందిన మురళీ నాయక్ పాకిస్థాన్ తుపాకులకు బలయ్యారు. అగ్నివీర్ పథకం కింద మూడు సంవత్సరాల క్రితం ఆర్మీ లో చేరిన మురళీ నాయక్... నాసిక్‌లో శిక్షణ పొంది అస్సాంలో పనిచేశారు. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నారు.Deeply pained by the martyrdom of our brave Telugu Jawan, Murali Nayak, from Penukonda, Satyasai district, in the India-Pakistan battlefield in J&K.His supreme sacrifice for the nation will forever inspire us.My heartfelt condolences to his family.We stand with them in this… pic.twitter.com/HfoFixNnZd— YS Jagan Mohan Reddy (@ysjagan) May 9, 2025దేశ సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వహిస్తుండగా.. పాకిస్థాన్ చేసిన కాల్పులకు మురళీ నాయక్ వీర మరణం పొందారు. మురళీ నాయక్ అవివాహితుడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాం నాయక్, జ్యోతీబాయి కన్నీరు మున్నీరుగా విలపించారు. మురళీ నాయక్ స్వగ్రామం కళ్లి తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీర మరణం పొందిన మురళీ నాయక్ మృతదేహం రేపు స్వగ్రామం చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పోలీసుల పేర్లు రాసి పెట్టుకోండి!
-
‘జెడ్ ప్లస్’ పునరుద్ధరించేలా ఆదేశాలివ్వండి
సాక్షి, అమరావతి: తనకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ అందచేసిన వినతి పత్రాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడాన్ని ప్రశ్నిస్తూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనకు కేంద్ర సంస్థలైన సీఆర్పీఎఫ్ లేదా ఎన్ఎస్జీలతో తగిన భద్రత కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధమంటూ గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకున్న ప్రాణహానిని తాజాగా, స్వతంత్రంగా మదింపు చేసి నిర్దిష్ట ప్రొటోకాల్‌కు అనుగుణంగా జెడ్ ప్లస్ భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు.వ్యక్తిగత భద్రతాధికారులు, జామర్లు, ఇల్లు, కార్యాలయం వద్ద భద్రత, పనిచేస్తున్న బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలా సమకూర్చలేని పక్షంలో తన సొంత బుల్లెట్‌ఫ్రూఫ్ వాహనాన్ని వినియోగించుకునేందుకు అనుమతినివ్వాలని విన్నవించారు. తనకున్న ప్రాణహాని దృష్ట్యా తక్షణమే సీఆర్పీఎఫ్, ఎన్ఎస్జీతో తగిన భద్రత కల్పిస్తూ చర్యలు తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరారు. తనకున్న ప్రాణహాని, తనపై జరిగిన హత్యాయత్నాన్ని పరిగణనలోకి తీసుకుని తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జెడ్ ప్లస్ భద్రతను కల్పించారని వైఎస్ జగన్ తన పిటిషన్లో నివేదించారు. హాని చేస్తామంటూ కూటమి వర్గాల బెదిరింపులు.. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక ఎలాంటి నోటీసు, ముందస్తు సమాచారం ఇవ్వకుండా తన భద్రతను భారీగా కుదించేశారని వైఎస్ జగన్ తెలిపారు. తనకున్న ప్రాణహానిని కనీస స్థాయిలో కూడా పరిగణనలోకి తీసుకోలేదన్నారు. భౌతికంగా హాని చేస్తామంటూ అధికార కూటమి ప్రభుత్వ వర్గాల నుంచి బెదిరింపులు వస్తున్నాయన్నారు. ప్రస్తుతం తనకు క్యాట్ బృందాలతో కల్పిస్తున్న భద్రత, పూర్తిస్థాయిలో పనిచేయని బుల్లెట్‌ప్రూఫ్ వాహనం వల్ల ఉపయోగం లేదని తెలిపారు. గతంలో ఉన్న జెడ్ ప్లస్ భద్రతను పునరుద్ధరించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.తన భద్రత కుదింపుపై గతంలోనే హైకోర్టును ఆశ్రయించానని, ఆ పిటిషన్ ఇప్పటికీ పెండింగ్‌లో ఉందని తెలిపారు. పార్టీ ఎంపీలు, సీనియర్ నేతలు తన భద్రత విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు దఫాలు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. గత ఫిబ్రవరిలో తాను రైతులకు సంఘీభావం తెలిపేందుకు గుంటూరు మిర్చి యార్డ్‌కి వెళితే కనీసం ఒక్క కానిస్టేబుల్ని కూడా అందుబాటులో ఉంచలేదన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జనాలను నిలువరించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు. ప్రజా నేతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.. 2024 తర్వాత తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై భౌతిక దాడులు పెరిగిపోయాయని వైఎస్ జగన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. తనను అంతమొందిస్తామంటూ అధికార పార్టీ నేతలు బహిరంగంగానే బెదిరిస్తున్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లా కుంటిమద్ది గ్రామం నుంచి తిరుగు ప్రయాణం సందర్భంగా తీవ్ర భద్రతా లోపాలను అందరూ చూశారన్నారు. హెలీప్యాడ్ వద్ద భద్రతా లోపాలు స్పష్టంగా కనిపించాయన్నారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పుడు తీరిగ్గా విచారణ జరుపుతున్నారని తెలిపారు.భద్రతా లోపాలను సరిదిద్దుకోవాల్సిన పోలీసులు తనను చూడటానికి వచ్చిన పార్టీ కార్యకర్తలు, ప్రజలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతలను పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రాణహాని నుంచి ప్రజా నేతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని తనకు జెడ్ ప్లస్ భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును అభ్యర్థించారు. జగన్ దాఖలు వ్యాజ్యంపై హైకోర్టు శుక్రవారం విచారణ జరపనుంది. -
వేధించే వారిని విడిచిపెట్టం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తున్న అధికారులను, పోలీసులను తాము అధికారంలోకి వచ్చాక విడిచి పెట్టేది లేదని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తేల్చి చెప్పారు. వారు సప్త సముద్రాల అవతల ఉన్నా, రిటైర్ అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. వారికి తప్పకుండా సినిమా చూపిస్తామని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. పార్టీకి చెందిన ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులతోపాటు ఆయా జిల్లాల పార్టీ ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు... జరుగుతున్న పరిణామాల గురించి చర్చించి.. పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైఎస్ జగన్ వారికి దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. చంద్రబాబు అనైతిక చర్యలు ⇒ చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఎంపీపీ చనిపోతే ఉప ఎన్నిక జరిగింది. అక్కడ మొత్తం 16 మంది వైఎస్సార్సీపీకి చెందినవారే. అయినా చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టి, ఆరుగురిని ఇక్కడి నుంచి లాక్కునే ప్రయత్నం చేయడంతోపాటు మన పార్టీ ఎంపీటీసీ సభ్యులు ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసుల ద్వారా అడ్డుకున్నారు. కోరం లేకపోయినా, కేవలం ఆరుగురు మాత్రమే అటువైపు వెళ్లినా, ఏకపక్షంగా డిక్లేర్ చేసుకున్నారు. ⇒ శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో మొత్తం 15 మంది ఎంపీటీసీ సభ్యులు వైఎస్సార్సీపీకి చెందిన వారే. అక్కడ ఒకరు చనిపోతే ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశాడు. చెడిపోయిన రాజకీయాలకు దిక్సూచిలా పని చేస్తూ, మార్గం చూపాడు. పెనుకొండలో ఎంత ప్రలోభపెట్టినా ఒక్కరూ వెళ్లలేదు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎస్సీ నియోజకవర్గం. అక్కడి మున్సిపాలిటీలో 15 మంది మన పార్టీ వారే. అక్కడా కౌన్సిలర్లను లాగాలని విశ్వప్రయత్నం చేశాడు. అంత కన్నా దిగజారిన నాయకుడు ఎవరూ ఉండరు. ⇒ అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీలో 29 వార్డుల్లో 24 మంది కౌన్సిలర్లు మనవాళ్లే. కేవలం నలుగురు టీడీపీ. ఇంకొకరు ఇండిపెండెంట్. అయినా అక్కడా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశారు. ఇన్ని అనైతిక పనులు చేస్తున్న చంద్రబాబు సిగ్గు పడాలి. ఎక్కడైనా, ఏ నాయకుడైనా ఆదర్శంగా ఉండాలి. అదే స్ఫూర్తితో మన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు విలువలు, విశ్వసనీయతతో పని చేస్తున్నారు. చంద్రబాబు సిగ్గుపడి తల దించుకునేలా మన వాళ్లు రాజకీయాల్లో అత్యంత విలువలతో పని చేస్తున్నారు. మనం మాట తప్పలేదు.. విలువలు వదల్లేదు ⇒ మనం అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్ వచ్చింది. రెండేళ్ల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగాయి. కోవిడ్ వల్ల రాష్ట్రంలో ఎప్పుడూ చూడని పరిస్థితులు... ఆదాయాలు తగ్గాయి. ఖర్చులు పెరిగాయి. కానీ, ఏనాడూ సాకు చూపలేదు. ఎగరగొట్టే పని చేయలేదు. మాట తప్పలేదు. చిక్కటి చిరునవ్వుతో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటకు కట్టుబడ్డాం. పథకాలు అమలు చేశాం. బటన్ నొక్కాం. మాట తప్పకుండా కోవిడ్‌లో అలా పని చేశాం కాబట్టే.. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలిచాం. ⇒ నాడు కేవలం రెండే రెండు మున్సిపాలిటీల్లో టీడీపీకి మెజారిటీ వచ్చింది. తాడిపత్రి మున్సిపాలిటీలో మన పార్టీ వారు 16 మంది గెలిస్తే, టీడీపీ నుంచి 18 మంది గెలిచారు. అయినా వారిని లాక్కుని, ఆ చైర్మన్ పదవి పొందాలని చూడలేదు. అందుకే చివరకు అప్పుడు నేను మన తాడిపత్రి ఎమ్మెల్యేను హౌస్ అరెస్టు చేయించాను. దాంతో తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్ పదవిని టీడీపీ గెలిచింది. మనం ఆనాడు అలా అంత విలువలతో కూడిన రాజకీయం చేస్తే.. ఇప్పుడు అదే తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యేను ఊళ్లోకి అడుగు పెట్టనీయడం లేదు. ఆయన, ఆయన అనుచరుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ⇒ ఇవన్నీ చూశాక, నేను ఒకటే చెబుతున్నా. కేవలం వైఎస్సార్సీపీని ప్రేమించినందుకు, నన్ను అభిమానించినందుకు కార్యకర్తలు పడుతున్న బాధ, ఇబ్బందులు, వారిపై వేధింపులను చూస్తున్నా. అందుకే జగన్ 2.0 లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాను. వారికి పూర్తి న్యాయం చేస్తాను. వారికి అడుగడుగునా తోడుగా, అండగా నిలబడతాను. ప్రశ్నించకూడదనే నిరంకుశత్వం, డైవర్షన్ ⇒ ఈ రోజు సాక్ష్యాలతో సంబంధం లేకుండా తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు గతంలో ఏనాడూ చూడలేదు. చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే, ఆయన ప్రజల్లో చులకన అయ్యారు. ఏ హామీలు అమలు చేయడం లేదు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. కాబట్టి, ఎవరూ ప్రశ్నించకూడదని, రాష్ట్రంలో భయానక పరిస్థితి సృష్టిస్తున్నారు. ⇒ ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ప్రజల్లో వ్యతిరేకత కనిపించినా, వెంటనే డైవర్షన్. ఒకరోజు తిరుపతి లడ్డూ అంటాడు. ఇంకో రోజు సినీ నటి కేసు. ఇలా ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఈరోజు ప్రజలు అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడు. టీడీపీ వారు ఎక్కడికి వెళ్లినా.. ఏం జరుగుతుంది? నా రూ.15 వేలు ఏమయ్యాయని పిల్లలు, మా రూ.26 వేలు ఏమయ్యాయని రైతులు, తమ రూ.36 వేలు ఏమయ్యాయని యువత అడుగుతారు. వాటికి చంద్రబాబు సమాధానం చెప్పలేరు. ఎన్నికల ముందు మాట ఇచ్చి, మోసం చేయడంతో సమాధానం చెప్పలేని దుస్థితి. వ్యవస్థలన్నీ నాశనం.. నిర్వీర్యం ⇒ ఈ రోజు అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. ప్రధానమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను పూర్తిగా నిరీ్వర్యం చేస్తున్నారు. స్కూళ్లలో నాడు–నేడు లేదు. ఇంగ్లిష్ మీడియం లేదు. పిల్లలకు ట్యాబ్‌లు లేవు. గోరుముద్ద సక్రమంగా అమలు కావడం లేదు. మన ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి చెందిన గవర్నమెంట్ బడులు రివర్స్లోకి వెళ్లాయి. పిల్లలు ఎదగాలంటే, ఆ కుటుంబం బాగు పడాలంటే, ఆ పిల్లవాడు బాగా చదవాలి. అందుకే ఫీజు చెల్లించాలి. మన ప్రభుత్వంలో ప్రతి మూడు నెలలకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తూ పక్కాగా విద్యా దీవెన ఇచ్చాం. అలాగే వసతి దీవెన కూడా పక్కాగా అమలు చేశాం. అందుకు విద్యా దీవెన కింద ప్రతి మూడు నెలలకు రూ.700 కోట్లు.. అలా ఏటా రూ.2,800 కోట్లు, వసతి దీవెన కింద మరో రూ.1,100 కోట్లు ఇవ్వాలి. వాటిని మనం ఇచ్చాం. ⇒ ఈ పెద్దమనిషి చంద్రబాబు గత ఏడాది రూ.3,900 కోట్లకు బదులు రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చాడు. ఈ ఏడాది ఏమీ ఇవ్వలేదు. దీంతో పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. వసతి దీవెన లేనే లేదు. ⇒ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. దాన్ని మనం పక్కాగా అమలు చేశాం. ఇంకా ఆరోగ్య ఆసరా కూడా అమలు చేశాం. ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు కావాలి. కానీ, కూటమి ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు. ఆరోగ్య ఆసరా అస్సలు ఇవ్వడం లేదు. దీంతో పేదలు వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. ⇒ రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. రైతు ఈ రోజు దళారుల పాలయ్యాడు. టమాటా కిలోకు రూ.2 కూడా రావడం లేదు. ఆర్బీకేలు నీరు గారిపోయాయి. ఉచిత పంటల బీమా లేదు. అదే మన ప్రభుత్వ హయాంలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యం జరిగినా, రైతులకు నష్టం జరిగినా, వెంటనే అక్కడ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం కనిపించేది. ఆ సీజన్ ముగిసేలోగానే వారిని ఆదుకునే వాళ్లం. పరిహారం ఇచ్చే వాళ్లం. మనం రైతులకు పెట్టుబడి సాయంగా రూ.13,500 ఇచ్చాం. దాన్ని రూ.26 వేలకు పెంచి ఇస్తానన్న చంద్రబాబు, వారినీ మోసం చేశాడు. యథేచ్ఛగా అవినీతి ⇒ ఎక్కడ చూసినా విచ్చలవిడిగా అవినీతి రాజ్యమేలుతోంది. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడం కోసం, అది కూడా 30 ఏళ్లు ఇచ్చేలా ‘సెకీ’ (సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)తో యూనిట్ విద్యుత్ రూ.2.49 చొప్పున మనం ఒప్పందం చేసుకుంటే, అదే ఈ రోజు కూటమి ప్రభుత్వం అదే యూనిట్ విద్యుత్‌కు రూ.4.60తో ఒప్పందం చేసుకుంది. ⇒ రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ, ఊరూ పేరూ లేని ఉర్సా కంపెనీకి రూపాయికి ఎకరా చొప్పున రూ.3 వేల కోట్ల విలువైన భూమిని, ఇంకా లూలూ కంపెనీకి రూ.1,500 కోట్ల విలువైన భూమి ఇచ్చారు. ⇒ ఊరూరా బెల్టుషాప్‌లు. మద్యం ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు. ఉచిత ఇసుక పేరుకే. కానీ, ఎక్కువ ధరకు ఇస్తున్నారు. మనం వర్షాకాల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని 80 లక్షల టన్నులు స్టాక్ పెడితే, ఈ ప్రభుత్వం వచ్చీ రాగానే ఎక్కడికక్కడ అమ్మేసుకుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఏ కంపెనీ నడపాలన్నా, ఎక్కడ ఏ మైనింగ్ చేయాలన్నా ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందే. బాండ్ల పేరుతో కొత్త అవినీతి ఇంత పచ్చిగా అవినీతి చేస్తూ, దాన్ని గత మన ప్రభుత్వం మీదకు నెడుతూ, అదే పనిగా తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. వాటికి ఎల్లో మీడియా వంత పాడుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అదే పనిగా మనపై దుష్ప్రచారం చేస్తున్నాయి. కొత్తగా బాండ్ల పేరుతో అవినీతి మొదలుపెట్టారు. ఏపీఎండీసీలో కొత్తగా బాండ్లు జారీ చేస్తూ, అవినీతికి పాల్పడుతున్నారు. అలా తాము కోరుకున్న వారికి గనులన్నీ ఇచ్చుకునే తంతు చేస్తున్నారు. ఇంత దారుణమైన అవినీతి వ్యవహారం ఇప్పటి వరకు చూడలేదు. మళ్లీ వచ్చేది మనమే.. సినిమా చూపిస్తాం చూస్తుండగానే ఏడాది గడిచింది. కళ్లు మూసుకుని తెరిస్తే మూడేళ్లు గడుస్తాయి. మనం గట్టిగా నిలబడి మూడేళ్లు ఇలాగే పోరాడితే, ఆ తర్వాత వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమే. ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తున్న వారెవ్వరినీ అప్పుడు వదిలిపెట్టబోము. మనం అధికారంలోకి వచ్చాక, వారందరికీ సినిమా చూపిస్తాం. అది మామూలుగా ఉండదు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తూ, ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసి పెట్టుకోండి. అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడదాం. ఎవ్వరినీ వదిలిపెట్టబోం. ఈ రోజు వారు (చంద్రబాబు, పోలీసులు) దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు వారు ఏదైతే విత్తనం వేస్తున్నారో రేపు అదే పెరుగుతుంది. అందుకే ఈ రోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆ రోజు ఎక్కడున్నా, రిటైర్ అయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం. పట్టుకుని తీసుకొచ్చి సినిమా చూపిస్తాం. అది మామూలుగా ఉండదు. -
YS Jagan: మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే..!
-
YSRCP అధికారంలో ఉన్నా విలువలతో కూడిన రాజకీయాలే చేశాం: YS Jagan
-
మీ బాధలు చూస్తున్నాను.. హామీ ఇస్తున్నా..
-
YS Jagan: మీ ప్రేమ, అభిమానం, తెగువకు హ్యాట్సాఫ్
-
ఎక్కడ దాక్కున్నా.. తీసుకొచ్చిమరీ... వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
-
మీ తెగువకు హ్యాట్సాఫ్: వైఎస్ జగన్ (ఫోటోలు)
-
LIVE: జగన్ అంటే ఏంటో చూపిస్తా... వైఎస్ జగన్ వైల్డ్ ఫైర్
-
‘మీ బాధలు చూశా.. ఇబ్బందిపెట్టిన వారి పేర్లు రాసుకోండి’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. రాజంపేట, మడకశిర, మున్సిపాలిటీలతో పాటు రామకుప్పం, రొద్దం మండలాల నేతలతో భేటీ అయిన ఆయన... ఇటీవల జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో టీడీపీ అక్రమాలను ప్రస్తావించారు. పచ్చగూండాల దాడులను ఎదుర్కొన్నవారిని అభినందించారు.‘‘రాష్ట్రంలో కూటమి సర్కార్.. విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తోంది. ఈ పరిస్థితుల మధ్య తులసి మొక్కల్లా.. తెగువ చూపించి, విలువలతో కూడిన రాజకీయాలకు అర్ధం చెప్పి.. వాటిని చంద్రబాబుకు చూపారు.. నిలబడిన మీ అందరికీ హ్యాట్సాఫ్. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. కానీ వాటన్నింటినీ దిగజార్చారు చంద్రబాబు. ఈ పరిస్థితి చూడాల్సి వస్తుందని అనుకోలేదు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.స్థానిక సంస్థల్లో చంద్రబాబు అనైతిక చర్యలు:రామకుప్పంతో ఒక ఎంపీటీసీ చనిపోతే, ఉప ఎన్నిక జరిగింది. అక్కడ మొత్తం 16 మంది వైఎస్సార్సీపీకి చెందినవారే. అయినా అక్కడ చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టి, ఆరుగురిని లాక్కునే ప్రయత్నం చేయడంతో పాటు, మన పార్టీ ఎంపీటీలు ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసుల ద్వారా అడ్డుకున్నారు. కోరం లేకపోయినా, కేవలం ఆరుగురు మాత్రమే అటువైపు వెళ్లినా, ఏకపక్షంగా డిక్లేర్ చేసుకున్నారు. రొద్దం మండలంలో మొత్తం 15 ఎంపీటీసీలు వైఎస్సార్సీపీకి చెందిన వారే. అక్కడ ఒకరు చనిపోతే ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశాడు. చెడిపోయిన రాజకీయాలకు దిక్సూచిలా పని చేస్తూ.. మార్గం చూపాడు. పెనుకొండలో ఎంత ప్రలోభపెట్టినా ఒక్కరూ వెళ్లలేదు. మడకశిర ఎస్సీ నియోజకవర్గం. అక్కడా 15 మంది మన పార్టీ వారే. అక్కడా కౌన్సిలర్లను లాగాలని విశ్వప్రయత్నం చేశాడు. అంత కన్నా దిగజారిన నాయకుడు ఎవరూ ఉండరు. అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీలో 29 వార్డుల్లో 24 మంది కౌన్సిలర్లు. కేవలం ముగ్గురు టీడీపీ. ఇంకొకరు ఇండిపెండెంట్. అయినా అక్కడా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేశారు.చంద్రబాబు సిగ్గు పడాలిఏ నాయకుడు అయినా ఆదర్శంగా ఉండాలి. మన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు విలువలు, విశ్వసనీయతతో పని చేస్తున్నారు. చంద్రబాబు సిగ్గుపడి తల దించుకునేలా మన వాళ్లు రాజకీయాల్లో ఉన్నారు. మనం మాట తప్పలేదు. విలువలు వదల్లేదు. మనం అధికారంలో ఉన్నప్పుడు కోవిడ్ వచ్చింది. రెండేళ్ల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగాయి. కోవిడ్ వల్ల రాష్ట్రంలో ఎప్పుడూ చూడని పరిస్థితులు. ఆదాయాలు తగ్గాయి. ఖర్చులు పెరిగాయి. కానీ, ఏనాడూ సాకు చూపలేదు. ఎగొట్టే పని చేయలేదు. మాట తప్పలేదు. చిక్కటి చిరునవ్వుతో ఉన్నాం. మ్యానిఫెస్టోలో చెప్సిన ప్రతి మాటకు కట్టుబడ్డాం. పథకాలు అమలు చేశాం. బటన్ నొక్కాం. మాట తప్పకుండా పని చేశాం కాబట్టే, కోవిడ్‌లో అలా పని చేశాం కాబట్టే.. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలిచాంఅవకాశం ఉన్నా తాడిపత్రి వదులుకున్నాంనాడు కేవలం రెండు మున్సిపాలిటీల్లోనే టీడీపీకి మెజారిటీ వచ్చింది. తాడిపత్రి మున్సిపాలిటీలో మన పార్టీ వారు 16 మంది గెలిస్తే, టీడీపీ నుంచి 18 మంది గెలిస్తే.. ఎవరినీ లాక్కోవాలని చూడలేదు. అప్పుడు నేను మన ఎమ్మెల్యేను నేను హౌజ్ అరెస్టు చేశాను. దాంతో తాడిపత్రి మున్సిపాలిటీ ఛైర్మన్ పదవిని టీడీపీ గెల్చింది. మనం ఆనాడు అలా రాజకీయం చేస్తే, అదే మాజీ ఎమ్మెల్యేను ఇప్పుడు తాడిపత్రిలోకి అడుగు పెట్టనీయడం లేదు. ఆస్తులు విధ్వంసం చేస్తున్నారు.మీ బాధలు చూస్తున్నాను.. హామీ ఇస్తున్నా..ఇవన్నీ చూశాక, నేను ఒకటే చెబుతున్నాను. కేవలం వైఎస్సార్సీపీని ప్రేమించినందుకు, పార్టీని అభిమానించినందుకు కార్యకర్తలు పడుతున్న బాధను చూశాను. అందుకే జగన్ 2.0 లో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాను. వారికి పూర్తి న్యాయం చేస్తాను. మిమ్మల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకొండి. అధికారంలోకి వచ్చాక వారిని చట్టం ముందు నిలబెడదాం. ఈరోజు నువ్వు (చంద్రబాబు, పోలీసులు) చేస్తున్న దుర్మార్గం. వారు ఈరోజు ఏదైతే విత్తనం వేస్తున్నారో రేపు అదే పెరుగుతుంది. అందుకే ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్న అధికారులు, పోలీసులు.. ఆరోజు ఎక్కడున్నా, రిటైర్ అయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం. అది మామూలుగా ఉండదు.చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే..ఈ రోజు తప్పుడు కేసులు, తప్పుడు సాక్ష్యాలు. సంబంధం లేకున్నా కేసుల్లో ఇరికిస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు గతంలో ఏనాడూ చూడలేదు. చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడంటే, ఆయన ప్రజల్లో చులకన అయ్యారు. హామీలు అమలు చేయడం లేదు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. కాబట్టి, ఎవరూ ప్రశ్నించకూడదని, రాష్ట్రంలో భయానక పరిస్థితి సృష్టిస్తున్నాడు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ప్రజల్లో వ్యతిరేకత కనిపించినా, వెంటనే డైవర్షన్. ఒకరోజు తిరుపతి లడ్డూ అంటాడు. ఇంకోరోజు సినీ నటి కేసు.ఈ రోజు ప్రజలు అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేడు. టీడీపీ వారు ఎక్కడికి వెళ్ళినా.. ఏం జరుగుతుంది?. నా రూ.15 వేలు ఏమయ్యాయని పిల్లలు, మా రూ.26 వేలు ఏమయ్యాయని రైతులు, అవ్వలు వారి రూ.48 వేలు, యువత తమ రూ.36 వేలు ఏమయ్యాయని అడుగుతారు. ఎన్నికల ముందు మాట ఇచ్చి, మోసం చేయడంతో సమాధానం చెప్పలేని దుస్థితి.అన్ని వ్యవస్థలు నాశనం చేసేశారు..ఈరోజు అన్ని వ్యవస్థలు నాశనం చేశారు. నాడు–నేడు లేదు. ఇంగ్లిష్ మీడియ లేదు. పిల్లలకు ట్యాబ్‌లు లేవు. గోరుముద్ద సక్రమంగా లేదు. గవర్నమెంటు బడులు రివర్స్లోకి వెళ్లాయి. పిల్లలు ఎదగాలంటే, ఆ కుటుంబం బాగు పడాలంటే, ఆ పిల్లవాడు బాగా చదవాలి. అందుకే ఫీజు చెల్లించాలి. మన ప్రభుత్వంలో ప్రతి మూడు నెలలకు ఫీజు రీయింబర్స్మెంట్ విద్యాదీవెన ఇచ్చాం. అందుకే ప్రతి మూడు నెలలకు రూ.700 కోట్లు, అలా ఏటా రూ.2800 కోట్లు, వసతి దీవెన కింద మరో రూ.1100 కోట్లు ఇవ్వాలి. ఇచ్చాం. కానీ, ఈ పెద్దమనిషి చంద్రబాబు గత ఏడాది రూ.3900 కోట్లకు బదులు రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చాడు. ఈ ఏడాది ఏమీ ఇవ్వలేదు.దీంతో పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు.ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. మనం పక్కాగా అమలు చేశాం. ఇంకా ఆరోగ్య ఆసరా అమలు చేశాం. ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు కావాలి. రూపాయి ఇవ్వలేదు. ఆరోగ్య ఆసరా ఇవ్వడం లేదు. దీంతో పేదలు వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. రైతు ఈరోజు దళారుల పాలయ్యాడు. టమోటా కిలో రూ.2 కూడా రావడం లేదు. ఆర్బీకేలు నీరు గారిపోయాయి. ఉచిత పంటల బీమా లేదు. మన ప్రభుత్వ హయాంలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యం జరిగినా, ప్రభుత్వ యంత్రాంగం కనిపించేది. సీజన్ ముగిసేలోగా వారిని ఆదుకునే వాళ్లం. ఇంకా మనం పెట్టుబడి సాయంగా రూ.13,500 ఇస్తే, రూ.26 వేలు ఇస్తానన్న చంద్రబాబు, వారినీ మోసం చేశాడు.అవినీతి రాజ్యమేలుతోంది..విచ్చలవిడిగా ఎక్కడ చూసినా అవినీతి యథేచ్ఛగా రాజ్యమేలుతోంది. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడం కోసం యూనిట్ విద్యుత్ కొనుగోలు కోసం సెకీతో రూ.2.49కి ఒప్పందం చేసుకుంటే, ఈ రోజు రూ.4.60కి ఒప్పందం చేసుకున్నారు. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ, ఊరూ పేరూ లేని ఉర్సా కంపెనీకి రూపాయికి రూ.3 వేల కోట్ల విలువైన భూమి. లులూ కంపెనీకి కూడా రూ.1500 కోట్ల విలువైన భూమి ఇచ్చారు. ఇక మద్యం. ఎక్కడ చూసినా అందుబాటు. ఊరూరా బెల్టుషాప్‌లు. ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. డోర్ డెలివరీ చేస్తున్నారు. ఉచిత ఇసుక పేరుకే. కానీ, ఎక్కువ ధరకు ఇస్తున్నారు. మనం వర్షాకాల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని 80 లక్షల టన్నులు స్టాక్ పెడితే, ఈ ప్రభుత్వం వచ్చీ రాగానే ఎక్కడికక్కడ అమ్మేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ కంపెనీ నడపాలన్నా, ఎక్కడ ఏ మైనింగ్ చేయాలన్నా ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందే.బాండ్ల పేరుతో కొత్త అవినీతి:ఇంత పచ్చిగా అవినీతి చేస్తూ, దాన్ని గత మన ప్రభుత్వం మీదకు నెడుతూ, అదే పనిగా తప్పుడు ఆరోపణలు. విమర్శలు చేస్తున్నారు. ఇంకా వాటికి ఎల్లో మీడియా వంత పాడుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నాయి. కొత్తగా బాండ్ల పేరుతో అవినీతి. ఏపీ ఎండీసీలో కొత్తగా బాండ్లు జారీ చేస్తూ, అవినీతికి పాల్పడుతున్నారు. అలా కోరుకున్న వారికి గనులన్నీ ఇచ్చుకునే తంతు చేస్తున్నారు. ఇలాంటి అవినీతి వ్యవహారం ఇప్పటి వరకు చూడలేదు.మళ్లీ వచ్చేది మనమే:చూస్తుండగానే ఏడాది గడిచింది. కళ్లు మూసుకుని తెరిస్తే మూడేళ్లు గడుస్తాయి. మనం గట్టిగా నిలబడి మూడేళ్లు ఇలాగే పోరాడితే, ఆ తర్వాత వచ్చేది కచ్చితంగా మన ప్రభుత్వమే. ఇప్పుడు మిమ్మల్ని వేధిస్తున్న వారెవ్వరినీ వదిలిపెట్టబోము. మనం అధికారంలోకి వచ్చాక, వారిని చట్టం ముందు నిలబెడతాం. -
YSRCP పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో YS జగన్ భేటీ
-
గరం గరం వార్తలు ఫుల్ ఎపిసోడ్
-
స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ భేటీ అయ్యారు. రాజంపేట, మడకశిర మున్సిపాలిటీలతోపాటు రామకుప్పం, రొద్దం మండల నేతలతో వైఎస్ సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఎంపీపీల ఉప ఎన్నికల్లో టీడీపీ అక్రమాలు.. పచ్చ గూండాల దాడులను ఎదుర్కొన్న వారిని వైఎస్ జగన్ అభినందించారు. అలాగే, పార్టీ భవిష్యత్తు కార్యక్రమాల గురించి దిశానిర్దేశం చేస్తున్నారు. -
ఈసారి అధికారం మనదే: వైఎస్ జగన్
రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్న పరిస్థితుల్లో మీరు కేడర్‌కు ఉత్సాహాన్నివ్వడానికి వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో మీరు క్రియాశీలకంగా పని చేయాలి. వారానికి మూడు రోజులు మీ పార్లమెంటు నియోజకవర్గాల్లో తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే ఆ జిల్లా మీద మీకు పట్టు వస్తుంది. అప్పుడే మీరు చెప్పింది వింటారు. ఇది చాలా ముఖ్యం. మీ వల్ల పార్టీకి మంచి జరగాలి. పూర్తి స్థాయి రాజకీయ నాయకుల్లా పని చేయాలి. కేసులకు భయపడితే రాజకీయాలు చేయలేం. జైలుకు పంపుతారని భయపడకూడదు. కలియుగంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం చేయాలంటే ఈ రెండు విషయాల్లో వెనకాడకూడదు. అప్పుడే మనం రాజకీయాలు చేయగలుగుతాం. రాష్ట్రంలో విద్య, వ్యవసాయం, వైద్య రంగాలన్నీ పూర్తిగా నీరుగారి పోయాయి. ప్రతి పథకం కనపడకుండా పోతోంది. మరోవైపు అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. ఈ స్థాయిలో అవినీతిని ఎప్పుడూ చూసి ఉండం. రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో కానీ.. ఈ ప్రభుత్వంలో మాత్రం రూపాయికే ఎకరం చొప్పున లూలూ గ్రూపు లాంటి వాళ్లకు రూ.1,500 కోట్ల నుంచి రూ.1,600 కోట్ల విలువైన భూములు వస్తాయి. మరొకరికి రూపాయికే ఎకరా చొప్పున రూ.3 వేల కోట్ల విలువైన భూములు కట్టబెడుతున్నారు. ఈ స్థాయిలో ఏమాత్రం భయం లేకుండా విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. -వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: మన ప్రభుత్వం ఇస్తున్న ప్రతి పథకాన్నీ ఆపేయడంతో పాటు చంద్రబాబు చెప్పింది చేయకపోవడం వల్ల ప్రజలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. ప్రజలు చంద్రబాబు తీరును గమనిస్తున్నారని, ఓటు అనే వారి ఆయుధంతో చంద్రబాబుకు తగిన శాస్తి తప్పదని చెప్పారు. సరైన సమయంలో ప్రజలు, దేవుడు మొట్టికాయలు వేస్తారని.. వచ్చే ఎన్నికల్లో అఖండ విజయంతో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు, రీజినల్ కో–ఆర్డినేటర్లతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలపై చర్చించి, పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ‘మనల్ని అభిమానించే వారిని కొడుతున్నారు.. ఇబ్బంది పెడుతున్నారు. నన్ను అభిమానించినందుకే కదా.. వీళ్లకు దెబ్బలు తగులుతున్నాయన్నది నన్ను బాధిస్తోంది. వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. వాళ్లకు ఏదైనా జరిగితే ముందు బాధపడేది నేనే. అందుకే జగన్ 2.0లో ఈ మాదిరిగా ఉండదని స్పష్టంగా చెబుతున్నా. మొదటి ప్రాధాన్యత ఉంటుంది’ అని స్పష్టం చేశారు. కార్యకర్తల్లో ఇప్పటికే మంచి చైతన్యం వచ్చిందని, కేడర్ ధైర్యంగా నిలబడిందని అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా తాను ఎక్కడికి వెళ్లినా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు తరలి వస్తున్నారని, రాష్ట్రంలో అరాచక పాలన పట్ల వివిధ రూపాల్లో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేని వారిని కూడా కక్షలకు గురి చేస్తుండటం పట్ల ప్రజల్లో తీవ్రమైన అగ్రహం ఉందని తెలిపారు. మన ప్రభుత్వ హయాంలో మన పథకాల ద్వారా పేదల నోట్లోకి నాలుగు వేళ్లూ వెళ్లేవని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలు తింటున్న కంచాన్ని చంద్రబాబు లాగేశారని చెప్పారు. వారి కడుపు కొట్టారని మండిపడ్డారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..కూటమి ప్రభుత్వం అనైతిక పనులు చంద్రబాబు రాజకీయాలను ఒక దారుణమైన స్థాయికి తీసుకెళ్లారు. రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు రాకూడదని మన ప్రభుత్వ హయాంలో చాలా కష్టపడ్డాం. చాలా మంది నాయకులను మన పరిపాలనలో కట్టడి చేశాం. తాడిపత్రిలో మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీకి స్వల్ప ఆధిక్యత వచ్చింది. వైఎస్సార్సీపీకి 16 వార్డులు, టీడీపీకి 18 వార్డులు వచ్చాయి. కానీ అప్పటి వైఎస్సార్సీపీ తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫలితాన్ని మన వైపు తిప్పుదామని యత్నించారు. కానీ, ఆ రోజు మన ప్రభుత్వంలో మన పార్టీ ఎమ్మెల్యేనే గృహ నిర్భంధం చేశాం. అదే ఇప్పుడు ఏడాది కాలంగా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగు పెట్టనీయడం లేదు. కార్యకర్తల ఆస్తులను విధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగం, కక్ష రాజకీయాలతో రాజకీయ వ్యవస్థ దారుణంగా తయారైంది. ఈ రోజు 99.99 శాతం గ్రామ స్థాయిలో కేడర్ కూడా నా దగ్గర నుంచి చంద్రబాబు తరహా రాజకీయాలు ఆశిస్తున్నారు. చంద్రబాబునాయుడు 12 నెలల రెడ్ బుక్ రాజ్యాంగం చూసిన తర్వాత ఎమ్మెల్యేలే కాదు, గ్రామ స్థాయి కార్యకర్తలు కూడా నా దగ్గర నుంచి అదే ఆశిస్తున్నారు. కేసులు పెట్టించుకునే పరిస్థితి లేకపోతే రాజకీయాలు చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో లేకుండా పోయింది.అవినీతి కంటికి కన్పిస్తోంది రైతులకు ఉచితంగా విద్యుత్ అందించడానికి మనం ‘సెకీ’ (సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)తో యూనిట్ విద్యుత్ రూ.2.49కే కొనుగోలు చేశాం. రైతులకు ఉచితంగా పగటి పూటే తొమ్మిది గంటల పాటు, నాణ్యమైన విద్యుత్‌ను 30 ఏళ్ల పాటు అందుబాటులో ఉండేందుకు మనం గొప్ప అడుగులు వేస్తే.. ఇప్పుడు నిస్సిగ్గుగా ఇవాళ వీళ్లు యూనిట్ విద్యుత్ రూ.4.60కు కొనుగోలు చేస్తున్నారు. సెక్షన్–108 ప్రకారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ) మీద ఒత్తిడి తెచ్చి అమలు చేయించుకున్నారు. మెడ మీద కత్తిపెట్టి వాళ్లతో పని చేయించుకున్నారు. అవినీతి కంటికి కనిపిస్తోంది. గ్రామాల్లో ఇసుక మాఫియా, మట్టి మాఫియా.. అన్నీ స్కాములే. పేకాట క్లబ్బులు దగ్గర నుంచి మొదలు పెడితే.. విచ్చలవిడిగా బెల్టు షాపులు.. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేకు ముట్టజెప్పందే ఏ పనీ కావడం లేదు. పరిశ్రమ నడవాలన్నా, మైనింగ్ యాక్టివిటీ కొనసాగాలన్నా ఎమ్మెల్యే ఆశీస్సులు ఉండాల్సిందే. ఎమ్మెల్యేకు ఇంత, ముఖ్యమంత్రికి ఇంత అని దండుకుంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. ప్రజలు ఓటు వేసి ఐదేళ్లు పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ప్రజలు గత్యంతరం లేక చూస్తున్నారంతే. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా తగిన తీర్పు ఇస్తారు.చరిత్ర పునరావృతం ఖాయం 2014లో ఇదే కూటమి అధికారంలో ఉంది. ఆ రోజు ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయలేదు. చరిత్ర పునరావృతం అవుతుంది. అప్పుడు కూడా రైతులకు రుణమాఫీ అని కొద్దిగా చేసి ఎగనామం పెట్టాడు. పొదుపు సంఘాలకు రుణమాఫీ అన్నాడు. అది కూడా మోసంగా తయారైంది. ఇంటింటికీ రూ.2 వేలు నిరుద్యోగ భృతి అన్నాడు. అదీ మోసమైంది. ప్రతి ఒక్కరికీ మూడు సెంట్ల స్థలం అన్నాడు.. అదీ మోసంగా మిగిలింది. అదే సమయంలో మనం పాదయాత్ర చేసి ప్రజలకు భరోసా ఇచ్చాం. చివరకు ప్రజా వ్యతిరేకత కొట్టొచ్చినట్టు ఎన్నికల ఫలితాల్లో కనిపించింది. చంద్రబాబు ప్రజా వ్యతిరేకతను చీల్చడానికి తన భాగస్వామిని వేరేగా పోటీ చేయించాడు. అయినా చంద్రబాబు ఓటమిని అడ్డుకోలేకపోయారు. ఇప్పుడు కూడా ప్రజలు చంద్రబాబు తీరును గమనిస్తున్నారు. సరైన సమయంలో మొట్టికాయలు వేస్తారు. ముఖ్యమైన వారికి కీలక బాధ్యతలు చాలా ముఖ్యమైన వ్యక్తులుగా భావించిన వారినే పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులుగా నియమించాం. పార్టీ నిర్మాణంలో ఎవరైతే క్రియాశీలకంగా ఉండగలుగుతారు.. ఎవరైతే పార్టీని నడపగలుగుతారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే పార్టీకి బలంగా ఉపయోగపడతారు.. అని చాలా అధ్యయనం చేశాకే మీకు ఈ బాధ్యతలు అప్పగించాం. ఏం జరుగుతున్నా నాతోనే నేరుగా చెప్పగలిగే చనువు మీ అందరికీ ఉంది. పార్టీని పూర్తిగా బలోపేతం చేయడం మీద 11 నెలలుగా మనం ప్రధానంగా ధ్యాస పెట్టాం. జిల్లా స్థాయి నుంచి గ్రామంలో బూత్ కమిటీల నిర్మాణం వరకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. అందులో భాగంగానే జవసత్వాలు నింపి జిల్లా అధ్యక్షులుగా కొత్తవాళ్లను నియమించాం. జిల్లా కమిటీల నుంచి బూత్ కమిటీల వరకు అన్నీ పూర్తి చేసే బృహత్తర బాధ్యతను జిల్లా అధ్యక్షులకు అప్పగించాం. వాళ్లకు సరైన సపోర్ట్ మెకానిజమ్‌గా రీజినల్ కోఆర్డినేటర్లను తీసుకొచ్చాం. రీజియన్‌ను వారు కోఆర్డినేట్ చేస్తూ, జిల్లా అధ్యక్షులకు అవసరమైన సహకారం అందిస్తూ.. వాళ్లతో పని చేయిస్తారు. అప్పుడే పని సులభం అవుతుంది.రీజినల్ కో–ఆర్డినేటర్లతో సమన్వయం జిల్లాలో ఏదైనా నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేయాలన్నా.. రీజినల్ కో–ఆర్డినేటర్లతో పాటు, మీరు కూడా మరింత మమేకమై పని చేయాలి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఆ పార్లమెంట్ నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తిని, ఆ పార్లమెంటు నియోజకవర్గంతో భావోద్వేగం లేని వాళ్లను, అల్టిమేట్‌గా పార్టీ కోసం పనిచేసే వారిని నియమించాం. వీళ్లు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తకు ఉపయోగపడేలా పని చేస్తారు. వీళ్లను ఆయా రీజినల్ కో ఆర్డినేటర్లతో మ్యాపింగ్ చేస్తాం. పార్లమెంటరీ పరిశీలకులు జిల్లా అధ్యక్షులతో మమేకం అయి పని చేయాలి. పార్టీ కమిటీల నియామకాల్లో ఆయా జిల్లా అధ్యక్షులతో కలిసి పని చేయాలి. జిల్లా కమిటీల నుంచి, బూత్ కమిటీల వరకు జిల్లా అధ్యక్షులకు సహాయకారిగా ఉండాలి. ప్రజలకు మరింత చేరువగా.. ప్రతి నియోజకవర్గంలోని పార్టీ ఇన్‌ఛార్జి పనితీరును బేరీజు వేస్తారు. సరిగ్గా పని చేసేలా మోటివేట్ చేయాలి. వారిని ప్రోత్సహించాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గ సమన్వయకర్త గెలవడం చాలా సులభం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయాల్సిన బాధ్యత పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడిదే. నియోజకవర్గ అభ్యర్థికి ఎవరితోనైనా విభేదాలు ఉంటే, వాళ్ల మధ్య సమన్వయం చేయడంలో కూడా పరిశీలకులదే కీలక బాధ్యత. ఇదంతా జిల్లా అధ్యక్షులతో కలిసి చేయాలి. మీరు, జిల్లా అధ్యక్షులు కలిసి రీజనల్ కోఆర్డినేటర్లకు కాళ్లూ, చేతుల్లా పని చేస్తారు. వారు మీ ద్వారానే అన్ని పనులు చేయించుకుంటారు.గెలుపే మీ పనితీరుకు గీటురాయి మీ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఎంత మందిని మీరు గెలిపిస్తారనేది మీకు పరీక్ష. మీకు, జిల్లా అధ్యక్షులకు మీ మీ పనితీరు ఆధారంగానే మంచి పదవులు వస్తాయి. మీ మీద నేను ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలిపించుకునే బాధ్యత తీసుకోవాలి. అలాగే రీజినల్ కోఆర్డినేటర్లు కూడా, వాళ్ల ప్రాంతాల్లో ఎంత మందిని గెలిపించుకుని వచ్చారన్న దానిపైనే వాళ్లకు పార్టీలో సముచిత స్థానం దక్కుతుంది. చంద్రబాబు ప్రభుత్వం ఏ రకంగా ఫెయిల్ అయిందో అందరికీ కనిపిస్తోంది. ఈ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ప్రజలకిచ్చిన అన్ని హామీలను అమలు చేసి, పారదర్శకంగా పథకాలిచ్చి, రూ.2.73 లక్షల కోట్లు బటన్ నొక్కి, ప్రతి ఇంటికీ పథకాలన్నీ చేర్చిన తర్వాత కూడా మన పరిస్థితే ఇలా ఉంటే, అన్ని రకాలుగా అబద్ధాలు చెప్పి మోసం చేసిన ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు.మీరు పని చేయండి.. మీ బాధ్యత నాది మీరు పని చేయండి. మీ బాధ్యత నాది. మిమ్నల్ని సముచిత స్థానాల్లో కూర్చోబెట్టే బాధ్యత నాది. ప్రతి గ్రామంలో మన పార్టీ బలంగా ఉంది. దీన్ని మరింత ఆర్గనైజ్డ్గా తీసుకుని రావాలి. గ్రామ కమిటీ సభ్యుడిగానో, బూత్ కమిటీలోనో, మహిళా కమిటీ సభ్యురాలిగానో.. ఇలా ఏదో ఒక చోట ప్రతి కార్యకర్తను తీసుకుని రావాలి. అంతిమంగా మీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకుని వచ్చారా లేదా అన్నదే నా పరీక్ష. గ్రామ, బూత్, మండల కమిటీలు ఎప్పుడైతే క్రియాశీలకంగా పని చేయడం మొదలవుతుందో అప్పడే గెలుపు సాధ్యం. మోసం మనకు చేతకాదుమనం అధికారంలోకి వచ్చే నాటికి నీరు–చెట్టు కార్యక్రమానికి సంబంధించి రూ.2,300 కోట్లు చంద్రబాబు హయాంలో పెండింగ్‌లో పెట్టిన బిల్లులు మనం చెల్లించాం. మనం ఇచ్చిన హామీ మేరకు ప్రతి పథకం అమలు చేస్తూ బటన్ నొక్కి జమ చేశాం. విలువలు, విశ్వసనీయత, క్రెడిబులిటీ కోసం మనం తాపత్రయ పడ్డాం. ప్రజల కోసమే ఆలోచన చేశాం. కాబట్టి కేడర్‌కు అనుకున్న మేరకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయాం. చంద్రబాబుకు అవేవీ లేవు. ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు చూసిన తర్వాత మన కార్యకర్తలకు కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. తొలి ప్రాధాన్యత వారికే. అదే టైంలో చంద్రబాబు మాదిరిగా మనం అబద్ధాలు చెప్పలేం. మోసాలు చేయలేం. ఎప్పుడైనా సరే నిజాయితీగానే రాజకీయాలు చేస్తాను. త్వరితగతిన కమిటీల నిర్మాణంబూత్ కమిటీల నియామకం పూర్తయ్యే సరికి పార్టీ నిర్మాణంలో దాదాపుగా 18 లక్షల మంది ఉంటారు. వారికి ఇన్సూరెన్స్ కచ్చితంగా చేస్తాం. వారి ఆలనా పాలన చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటికే పార్టీ నిర్మాణంలో 94 శాతం మండల అధ్యక్షుల నియామకం, 54 శాతం మండల కమిటీల నియామకాలు పూర్తి అయ్యాయి. అనుబంధ విభాగాలకు సంబంధించి 9 వేల మంది అధ్యక్షులను నియమించాం. మే ఆఖరులోగా మండల కమిటీలు పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేయాలి. అప్పుడు మండల కమిటీలు.. గ్రామ స్థాయి కమిటీల నియామకాలను పర్యవేక్షిస్తాయి. జూలై ఆఖరు నాటికి మున్సిపాలిటీ, గ్రామ స్థాయి విలేజ్ కమిటీల నియామకాలు పూర్తి కావాలి. ప్రతి మున్సిపాలిటీలో డివిజన్ ప్రెసిడెంట్ నియామకాలు పూర్తి కావాలి. కార్పొరేటర్ ఉన్నా కూడా డివిజన్ ప్రెసిడెంట్‌ను నియమించాలి. ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నాటికి బూత్ కమిటీలు కూడా పూర్తి కావాలి. ప్రతి గ్రామంలో అత్యధికంగా సర్పంచ్‌లు మన వాళ్లే ఉన్నారు. తొలుత 18 లక్షల మంది క్రియాశీలక (యాక్టివ్) సభ్యులకు ప్రత్యేకంగా ఐడీ కార్డు, ప్రత్యేక ఇన్సూరెన్స్ వస్తాయి. ఆ తర్వాత సభ్యత్వ నమోదు చేస్తాం. అక్టోబర్ తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతాం. తొలుత జిల్లా స్థాయిలో కమిటీలు, ఆ తర్వాత నియోజకవర్గ స్థాయి కమిటీల హెడ్లను నియమించాం. మండల స్థాయిలో అధ్యక్షుల నియామకం దాదాపు 94 శాతం పూర్తి అయింది. తొలుత నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో వివిధ అనుబంధ విభాగాల కమిటీల అధ్యక్షులను నియమించాలి. మీరు వారానికి మూడు రోజులు వెళ్లి పరిశీలించగలిగితే అన్ని నియామకాలు పూర్తవుతాయి. వచ్చే ఏడాది బ్రహ్మాండంగా ప్లీనరీ నిర్వహిద్దాం.మన హయాంలో రైతులకు భరోసా⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామ సచివాలయంలో కనీస మద్దతు ధరలతో జాబితా పెట్టే వాళ్లం. మద్దతు ధర కోసం రూ.7,600 కోట్లు ఖర్చు చేసి రైతులకు మేలు చేశాం. మన హయాంలో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కన్నా తక్కువ ధర వస్తే అప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకునేది. ఆ పంటలు కొనుగోలు చేసేది. పొగాకు విషయంలో కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం జోక్యం చేసుకునేది. ⇒ ప్రైవేటు కంపెనీలతో పోటీ పడి వేలంలో పాల్గొని, రైతులను ఆదుకున్నాం. ఆయిల్‌పామ్ రైతులనూ ఆదుకున్నాం. తెలంగాణతో సమాన స్థాయిలో ధర వచ్చేలా చూశాం. రూ.80 కోట్లు ఇచ్చాం. ఎలాంటి విపత్తులు వచ్చినా రైతులను ముందుగా ఆదుకునే వాళ్లం. ధాన్యానికి ఎమ్మెస్పీ ఇవ్వడమే కాదు.. అదనంగా గన్నీ బ్యాగ్స్, లేబర్ చార్జీలు, రవాణా ఖర్చు (జీఎల్టీ) కూడా ఇచ్చాం. ⇒ సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే సంప్రదాయం మన దగ్గరే ప్రారంభమైంది. క్రమం తప్పకుండా ఇన్సూరెన్స్ ఇచ్చే వాళ్లం. వ్యవసాయ రంగంపై ఇంత ఫోకస్ పెట్టిన ప్రభుత్వం మనదైతే, ఏ ఫోకస్ పెట్టనిది కూటమి ప్రభుత్వం. క్రమం తప్పకుండా ఐదేళ్ల పాటు మనం రైతులకు పెట్టుబడి సహాయం అందించాం. విపత్తులు వస్తే తక్షణమే వెళ్లి ఆదుకున్నాం. ⇒ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. కనీస మద్దతు ధర అందడం లేదు. రైతును పట్టించుకునే నాధుడే లేడు. ప్రజలకు సమస్యలొస్తే మీరు అక్కడికి వెళ్లాలి. ప్రజలకు అండగా ఉండాలి. ప్రజా సమస్యల పట్ల ఎంత ఎక్కువగా వారికి అండగా ఉంటే.. అంత గట్టిగా ప్రజల్లో బలపడే పరిస్థితి వస్తుంది. అలా జరగకుండా చేసేందుకే చంద్రబాబు వేధింపులకు దిగుతున్నాడు. అయినా ప్రజల కష్టాల్లో వారికి అండగా ఉండాలి’. -
గిఫ్ట్ రద్దు అధికారం జగన్‌కు ఉంది
సాక్షి, హైదరాబాద్: చెల్లెలిపై ప్రేమ, అభిమానంతో చేసుకున్న తొలి ఒప్పందమే రద్దయినప్పుడు... ఆ ఒప్పందం ప్రకారం చేసుకున్న గిఫ్ట్‌డీడ్ చెల్లుబాటే కాదని వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫున ఎన్సీఎల్టీలో న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘చెల్లెలు షర్మిలపై ప్రేమ, అభిమానాలతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమెకు తన సొంత ఆస్తుల్లో వాటా ఇవ్వాలనుకున్నారు. ఆయన ఇవ్వాలనుకున్న ఆస్తి కుటుంబ వారసత్వంగా వచ్చింది కాదు. ఆయన సొంత ఆస్తి. ఈ మేరకు 2019లో తల్లి, చెల్లెలు సమక్షంలో ఎంఓయూ చేసుకున్నాక... పలు ఆస్తులు కోర్టు వివాదాల్లో ఉన్నాయి కనక కేసులన్నీ తేలాక ఎంఓయూ ప్రకారం ఆమెకు ఆస్తులు బదలాయించాలని భావించారు. కానీ 2024లో షర్మిల రాజకీయాల్లోకి వచ్చారు. జగన్‌కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలో చేరారు. జగన్‌ను, ఆయన ప్రభుత్వాన్ని బహిరంగంగా తూలనాడుతూ విమర్శలు చేశారు. సయోధ్యకు జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరలేదు. వారసత్వంగా వచ్చిన ఆస్తుల్ని తండ్రి ఎవరికివ్వాల్సింది వారికిచ్చారని, ప్రేమాభిమానాలతో తాను ఇస్తానన్న ఆస్తులు ఆమె అంతలా తూలనాడుతున్నప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదని జగన్ భావించారు. తీరు మారకపోతే ఎంవోయూ రద్దు చేసుకుంటానని చెప్పారు. దీంతో షర్మిల తమ తల్లి విజయమ్మపై ఒత్తిడి తెచ్చి సరస్వతి పవర్లో షేర్లను చట్టవిరుద్ధంగా బదిలీ చేయించుకున్నారు. షేర్ సర్టిఫికెట్, షేర్ బదిలీ ఫారం పోయిందని చెప్పి.. అక్రమంగా బదిలీ చేసేసుకున్నారు. ఇది చట్టవిరుద్ధం. 51 శాతం షేర్లున్న వ్యక్తికి కనీస సమాచారం కూడా ఇవ్వకుండా బదిలీ చేయటం న్యాయవిరుద్ధం’అని జగన్ న్యాయవాది పేర్కొన్నారు. గిఫ్ట్‌డీడ్‌కు సంబంధించి విజయమ్మ ఓ ట్రస్టీ మాత్రమేనని, ఆమెకు షేర్లు బదిలీ చేసే అధికారం లేదని జగన్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. బాండ్ కాపీని కోర్టుకు ఇవ్వాలని కోరగా... ఇప్పుడు లేదని, తెప్పించి ఇస్తామని చెప్పారు. బోర్డు భేటీకి తాను హాజరుకాకున్నా హాజరైనట్లు పత్రాలు సృష్టించారని డైరెక్టరు యశ్వంత్ తరఫు న్యాయవాది వెల్లడించారు. విజయమ్మ, జగన్ కలిసే ఉంటున్నారని.. తల్లి అంటే ఆయనకు ప్రేమ, అభిమానం ఉన్నాయని విజయమ్మ తరఫు సీనియర్ న్యాయవాది వివేక్‌రెడ్డి చెప్పారు. ఒకే ఇంట్లో ఉంటున్నారు కనుక షేర్ సర్టిఫికెట్ జగన్ వద్ద ఉన్నా.. విజయమ్మ వద్ద ఉన్నా ఒకటేనన్నారు. రాజీవ్ భరద్వాజ్(జ్యుడిషీయల్), సంజయ్ పూరి(టెక్నికల్)తో కూడిన బెంచ్ ఈ వాదనలు విన్న అనంతరం... తదుపరి విచారణను మే 30కి వాయిదా వేసింది. అప్పటిలోగా లిఖిత పూర్వక వాదనలుంటే సమర్పించాలని న్యాయవాదులకు స్పష్టం చేసింది. -
YSRCPలో చేరిన APNGO అసోసియేషన్ లీడర్స్
-
వైఎస్సార్సీపీలోకి పలువురు మాజీ ఉద్యోగ సంఘం నేతలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పలువురు మాజీ ఉద్యోగ సంఘాలకు చెందిన నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.వైఎస్సార్సీపీ ఉద్యోగులు, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి నేతృత్వంలో ఉద్యోగుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బీవీ సుబ్బారావు, ఏపీఎన్జీవో సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, శ్రీకాకుళం జిల్లా మాజీ ఎన్జీవోస్ కార్యదర్శి బి.ఉమామహేశ్వరరావు, రెవెన్యూ అసోసియేషన్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి, కృష్ణా జిల్లా ఎన్జీవోస్ సంఘం నాయకులు తోట సీతారామంజనేయులు తదితరులు పార్టీలో చేరారు. అనంతరం వారు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.ఉద్యోగుల సమస్యలపై ఉద్యమిస్తాం: నలమారు చంద్రశేఖర్ రెడ్డికూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు న్యాయం జరగడం లేదు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఇప్పటికే ఉద్యోగులు గత వైయస్ఆర్సీపీ పాలనను తలుచుకుంటున్నారు. తాజాగా ఉద్యోగ నాయకుల చేరికతో వైయస్సార్సీపీ ఉద్యోగులు, పెన్షనర్స్ విభాగం మరింత బలోపేతం అయ్యింది. అందరం కలిసికట్టుగా ఉద్యోగుల, పెన్షనర్ల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాం. వైయస్సార్సీపీని బలోపేతం చేయడం ద్వారా వైయస్ జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కృషి చేస్తాం.వైఎస్ జగన్‌ను సీఎం చేసుకోవడమే లక్ష్యం: : బీవీ సుబ్బారావువైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలన్న లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వంపై ఉద్యోగ వర్గాల ఆలోచనల్లో వచ్చిన మార్పులను ఆయనకు వివరించడం జరిగింది.ఉద్యోగులకిచ్చిన హామీలు నెరవేర్చాలి: బండి శ్రీనివాసరావుమాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. మాట తప్పను, మడమ తిప్పను అని మాటల్లో కాకుండా తన ఐదేళ్ల సంక్షేమ పాలనతో నిరూపించుకున్న గొప్ప నాయకుడు జగన్. మేనిఫెస్టోను ఖురాన్ బైబిల్ భగవద్గీతగా భావించి పరిపాలన చేశారు. ఆయన్ను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న లక్ష్యంతో పనిచేస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు.అధికారంలోకి వచ్చి 11 నెలలు గడిచినా ఉద్యోగులకు ఎన్నికల్లో ఏ ఒక్క హామీని నేటికీ అమలు చేయలేదు. కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్లను క్రమబద్ధీకరించకుండా కాలయాపన చేస్తున్నారు. పెన్షనర్లకు ఎన్‌క్యాష్ మెంట్ ఆఫ్ ఎర్రర్ లీవ్ బెనిఫిట్స్, రెగ్యులర్ ఉద్యోగులు, పోలీసుల సరెండర్ లీవ్ బెనిఫిట్స్ అమలు కాలేదు. డీఏలు పెండింగ్‌లో ఉంచారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్సీపీలో చేరడం జరిగింది.జగన్ వస్తేనే మళ్లీ ఉద్యోగులకు మంచిరోజులు: ఉమామహేశ్వరరావు2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్ తన సంక్షేమ పాలనతో గుప్తుల స్వర్ణయుగాన్ని గుర్తుకు తెచ్చారు. కరోనా విలయతాండవంతో ప్రపంచమంతా వణికిపోయినా సంక్షేమ పథకాలను ఆపకుండా రాష్ట్ర ప్రజలను తన కుటుంబంలా కాపాడుకున్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే లక్షన్నర కోట్లకుపైగా అప్పులు చేసినా ఆ డబ్బంతా ఏం చేసిందో అర్థంకాని పరిస్థితి. మోసపూరిత హామీలతో అధికారం చేజిక్కించుకున్న కూటమి ప్రభుత్వం కారణంగా సామాన్య ప్రజలే కాకుండా ఉద్యోగులు, పెన్షనర్లు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మళ్లీ వైయస్ జగన్ ను సీఎం చేసుకుంటేనే ఈ రాష్ట్రానికి మంచి రోజులొస్తాయి.ఉద్యోగుల సంక్షేమం కోసమే వైఎస్సార్సీపీలో చేరా: విజయసింహారెడ్డిఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం కోసం వైయస్సార్సీపీలో చేరడం జరిగింది. వైఎస్ జగన్ సీఎం అయితేనే ఉద్యోగులకు మళ్లీ మంచిరోజులొస్తాయి. -
YSRCP పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో YS జగన్ భేటీ
-
YS Jagan: ఆపరేషన్ సిందూర్ అనివార్యమైన చర్య
-
చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేను: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మీరంతా సమర్థులని భావించి ఈ బాధ్యతలు అప్పగించడం జరిగిందని.. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులకు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. బుధవారం ఆయన వైఎస్సార్సీపీ పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయిలో ఉన్న బూత్ కమిటీల వరకూ ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.రీజినల్ కో-ఆర్డినేటర్లకు పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు సహాయకారులుగా ఉంటారు. రీజినల్ కో-ఆర్డినేటర్లతో అనుసంధానమై, వారికి కాళ్లు, చేతులుగా పార్లమెంటు పరిశీలకులు పనిచేస్తారు. నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌ఛార్జిలు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడగలగాలి. మీరు పరిశీలకుడిగా ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఎంతమందిని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తారనేది మీకు పరీక్ష. మీ పనితీరు ఆధారంగా మీకు మంచి మంచి పదవులు వస్తాయి.. తప్పకుండా మనం అధికారంలోకి వస్తాం, అందులో ఎలాంటి సందేహం లేదు.. ఈ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు’’ అని వైఎస్ జగన్ చెప్పారు.‘‘ప్రజలకిచ్చిన హామీలను పూర్తిగా పారదర్శకంగా అమలు చేసిన మనకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇక అబద్ధాలు చెప్పి, మోసాలు చేసిన చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుంది?. 2014లో కూడా చంద్రబాబు తానిచ్చిన హామీలను అమలు చేయలేదు. మనం పాదయాత్ర చేసి, ప్రజలకు భరోసా ఇచ్చాం. 2019 ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత కొట్టిచ్చినట్టు ఎన్నికల ఫలితాల్లో కనిపించింది. ప్రజావ్యతిరేకతను చీల్చడానికి చంద్రబాబు తన రాజకీయ భాగస్వామిని వేరేగా పోటీచేయించారు. అయినా చంద్రబాబు తన ఓటమిని అడ్డుకోలేకపోయారు. చంద్రబాబు రాకముందు.. మన పథకాల ద్వారా పేదల నోట్లోకి నాలుగు వేళ్లూ వెళ్లేవి. ఇప్పుడు చంద్రబాబు ప్రజలు తింటున్న కంచాన్ని లాగేశాడు’’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు.‘‘అంతేకాదు తానిచ్చిన హామీలను కూడా చంద్రబాబు అమలు చేయలేదు. రెండు రకాలుగా చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు. విద్య, వ్యవసాయం, వైద్య రంగాలు పూర్తిగా నీరు గారిపోయాయి. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. రైతులకు పెట్టుబడి సహాయంగా ఉన్న రైతు భరోసా ఎగిరిపోయింది. అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ, అదే రూపాయికి వేల కోట్ల విలువైన భూములు కట్టబెడుతున్నారు. లూలుకు రూ.1500 కోట్ల భూములు కట్టబెట్టారు. మరొకరికి రూ.3వేల కోట్ల భూములు కట్టబెట్టారు...రైతులకు ఉచితంగా విద్యుత్ అందించడానికి సెకీతో మనం రూ.2.49లకే విద్యుత్ కొనుగోలు చేశాం. కాని ఇవాళ వీళ్లు రూ.4.60లకు కొనుగోలు చేశారు. సెక్షన్ 108 ప్రకారం ఏపీఆర్సీపీమీద ఒత్తిడి తెచ్చి మరీ అమలు చేయించుకున్నారు. అవినీతి మన కంటికి కనిపిస్తోంది. మట్టి మాఫియా, ఇసుక మాఫియా, పేకాట క్లబ్బులు, బెల్టుషాపులు, ఎమ్మార్పీ ధర కన్నా లిక్కర్ ఎక్కువకు అమ్ముకుంటున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేకు మట్టజెప్పనిదే ఏమీ కావడంలేదు. ఇవన్నీ కంటికి కనిపిస్తున్నాయి. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. ఒక్కసారి ఓటు వేశాక, ఐదేళ్లపాటు ప్రజలు వేచి చూడాలి. అందుకే ఇప్పుడేమీ చేయలేక ప్రజలు అన్నింటినీ చూస్తున్నారు..సమయం వచ్చినప్పుడు కచ్చితంగా ప్రజలు కచ్చితంగా తగిన తీర్పు ఇస్తారు. ఇప్పుడు కలియుగం పాలిటిక్స్ నడుస్తున్నాయి. కేసులకు భయపడితే రాజకీయాలు చేయలేం. చంద్రబాబు రాజకీయాలను ఒక దారుణమైన స్థాయికి తీసుకెళ్లారు. రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని మన ప్రభుత్వంలో చాలా కష్టపడ్డాం. మన పరిపాలనలో చాలామంది నాయకులను కట్టడి చేశాం.తాడిపత్రిలో మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీ స్వల్ప ఆధిక్యత వచ్చింది. వైఎస్సార్సీపీకి 16, టీడీపికి 18 వచ్చాయి. కాని అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మన పార్టీ వైపునకు ఫలితాన్ని తిప్పుదామని యత్నించారు. ఆ రోజు మన పార్టీ ఎమ్మెల్యే అయిన పెద్దారెడ్డిని గృహనిర్బంధం చేశాం. ఇప్పుడు ఏడాది కాలంగా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగుపెట్టనీయడంలేదు. కార్యకర్తల ఆస్తులను విధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. చంద్రబాబు రెడ్‌బుక్ రాజ్యాంగం, కక్ష రాజకీయాలతో రాజకీయ వ్యవస్థ దారుణంగా తయారైంది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు చూసిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. కార్యకర్తలకు కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరినీ గొప్ప స్థానంలో కూర్చోబెడతాను. ఈ సారి కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యత. చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేను. ప్రజలకు హామీలు ఇస్తే కచ్చితంగా నెరవేరుస్తాను. కార్యకర్తల్లో ఇప్పటికే మంచి చైతన్యం వచ్చింది. కేడర్ ధైర్యంగా నిలబడింది. రాష్ట్రవ్యాప్తంగా నేను ఎక్కడకు వెళ్లినా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివస్తున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన పట్ల వివిధ రూపాల్లో వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పరిపాలన పట్ల తీవ్రమైన ఆగ్రహం ఉంది. రాజకీయాలతో సంబంధం లేనివారినికూడా కక్షలకు గురిచేస్తున్నారు. వచ్చే ఏడాది ప్లీనరీని నిర్వహిద్దాం. బ్రహ్మాండంగా ప్లీనరీని నిర్వహిద్దాం...బూత్ కమిటీలు పూర్తయ్చే సరికి పార్టీ నిర్మాణంలో దాదాపుగా 18 లక్షలమంది ఉంటారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు, కనీస మద్దతు ధర అందడంలేదు. వైఎస్సార్ ప్రభుత్వం హయాంలో ప్రతి గ్రామ సచివాలయంలో కనీస మద్దతు ధరలతో జాబితాను పెట్టేవాళ్లం. ఎంఎస్పీ కన్నా తక్కువ ధర వస్తే అప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకునేది. పొగాకు విషయంలో కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం జోక్యంచేసుకునేది. ప్రైవేటు కంపెనీలతో పోటీపడి వేలంలో పాల్గొన్నాం. రైతులను ఆదుకున్నాం. అలాగే ఆయిల్‌పాం రైతులను ఆదుకున్నాం. తెలంగాణతో సమాన స్థాయిలో ధర వచ్చేలా చూశాం. ఎలాంటి విపత్తులు వచ్చినా రైతులను ముందుగా ఆదుకునే వాళ్లం...ధాన్యానానికి ఎంఎస్పీ ఇవ్వడమే కాదు, ఎంఎస్పీకి అదనంగా జీఎల్టీ కూడా ఇచ్చాం. వ్యవసాయరంగంపై ఇంత ఫోకస్ పెట్టిన ప్రభుత్వం మనదైతే, ఏ ఫోకస్ పెట్టని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. పంటలకు నష్టం వస్తే సీజన్ మగిసేలోగా వారికి ఇన్పుట్ సబ్పిడీ ఇచ్చేవాళ్లం. మళ్లీ సీజన్‌లోగా పరిహారిం ఇచ్చేవాళ్లం. క్రమంగా ప్పతకుండా ఇన్సూరెన్స్ ఇచ్చేవాళ్లం. ఇప్పుడు ఏమీ లేవు. క్రమం తప్పకుండా ఐదేళ్లపాటు మనం రైతులకు పెట్టుబడి సహాయం అందించేవాళ్లం’’ అని వైఎస్ జగన్ గుర్తు చేశారు. -
నేడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ ట్వీట్
-
ఉగ్రవాద స్థావరాలు,శిబిరాలపై దాడి అనివార్య చర్య: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు, పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముందు ఆపరేషన్ సిందూర్‌పై పార్టీ ముఖ్య నేతలతో కాసేపు చర్చించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్‌ను ప్రస్తావిస్తూ..ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలపై దాడి అనివార్య చర్య. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, ఉగ్రవాదుల దాడుల నుంచి తన పౌరులను రక్షించుకోడం అన్నది దేశానికి అత్యంత ముఖ్యమైన కర్తవ్యం’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.కశ్మీర్‌లోని పహల్గాంలో ఉన్న బైసరన్ వ్యాలీకి పర్యాటకులుగా వెళ్లిన అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి మానవత్వంపై జరిగిన దాడి. అలాంటి ఉగ్ర చర్యలపై భారత రక్షణ దళాలు గట్టిగా స్పందించాయి. ఆపరేషన్ సిందూర్ అనివార్యమైన చర్య. భారత రక్షణ బలగాలకు యావత్‌దేశం అండగా నిలుస్తుంది. దేశ పౌరుల భద్రత ధ్యేయంగా రక్షణ బలగాలు తీసుకుంటున్న చర్యలకు దేశమంతా మద్దతుగా నిలుస్తోంది’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్ సింహాచలం బాధితులకు ఆర్థిక సాయం
-
నేడు అల్లూరి వర్ధంతి.. వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు అల్లూరి సీతారామరాజుగారి వర్ధంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. అల్లూరి సీతారామరాజుకు నివాళి అర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శమని కొనియాడారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. అడవి బిడ్డల హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శం. నేడు అల్లూరి సీతారామరాజుగారి వర్ధంతి సందర్భంగా నివాళులు’ అని పోస్టు చేశారు.బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. అడవిబిడ్డల హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శం. నేడు అల్లూరి సీతారామరాజుగారి వర్ధంతి సందర్భంగా నివాళులు.… pic.twitter.com/iCLvQgElEG— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2025 -
పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు సహా పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలపై వైఎస్ జగన్ వారితో చర్చిస్తున్నారు. ఈ భేటీకి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు హాజరయ్యారు. -
ఆపరేషన్ సింధూర్ పై వైఎస్ జగన్ ట్వీట్
-
భారత సైన్యానికి అండగా ఉందాం.. జైహింద్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: పాకిస్తాన్‌పై భారత్ దాడులు ఆపరేషన్ సిందూర్‌పై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్ర దాడి ఘటనకు మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు.ఆపరేషన్ సిందూర్‌పై వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘పహల్గాంలో ఉగ్ర దాడి ఘటనకు ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు ఆపరేషన్ సిందూర్ ప్రారంభించాయి. మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి సమయంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. దేశ ప్రజలను రక్షించడానికి కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ పోరాటంలో మేమంతా అండగా నిలుస్తాం. జైహింద్’ అని పోస్టు చేశారు. The Indian Defence Forces have launched #OperationSindoor in a decisive response to the heinous Pahalgam terror attack.During such times,Such inevitable actions reflect the nation’s unwavering strength in safeguarding its sovereignty and protecting its citizens.All of us stand…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2025 -
నేడు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి ఆ పార్టీ పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, రీజనల్ కో–ఆర్డినేటర్లు హాజరుకానున్నారు. -
రైతుల కోసం కూటమిపై YS జగన్ పోరాటం
-
సంక్షేమ పథకాల ట్రెండ్ సెట్టర్ గా వైఎస్ జగన్
-
వైఎస్ జగన్ వచ్చినపుడు భద్రతా ఏర్పాట్లలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం
-
Garam Garam Varthalu: గరం గరం వార్తలు ఫుల్ ఎపిసోడ్..
-
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా నిలవాలి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులకు అండగా నిలవాలని.. వారిని పరామర్శించి ధైర్యం చెప్పాలని వైఎస్సార్సీపీ నాయకులను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అందుబాటులో ఉన్న రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ ముఖ్య నాయకులతో ఆయన ఫోన్లో మాట్లాడారు. అకాల వర్షాలు, ఈదురుగాలుల వల్ల రాష్ట్రంలో పలుచోట్ల ధాన్యం తడిసిపోవడంతో పాటు ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. వర్షాలు కురుస్తాయన్న సమాచారం ముందస్తుగానే ఉన్నప్పటికీ.. కల్లాల్లో, పొలాల్లో రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని.. అధికార యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉందని వైఎస్ జగన్ మండిపడ్డారు.ఖరీఫ్‌లో ప్రతికూల వాతావరణం, కనీస మద్దతు ధరలు లభించక తీవ్ర ఇబ్బందులు పడిన వరి రైతులు.. ఈ రబీ సీజన్లో కూడా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా పలు చోట్ల ప్రభుత్వం ధాన్యాన్ని సరిగ్గా సేకరించకపోవడంతో రైతులు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఇప్పుడు అకాల వర్షాల వల్ల మరింతగా నష్టపోతున్నారని వైఎస్ జగన్ అన్నారు. దీంతో పాటు అకాల వర్షాల వల్ల పలు ఉద్యానవన పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేసి.. రైతులకు బాసటగా నిలవాలని, వారిని ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆదేశించారు. -
రైతులపై కూటమి నిర్లక్ష్యం YS జగన్ ఆగ్రహం
-
‘అప్పుడు రూ. 2.49.. ఇప్పుడు రూ. 4.60.. మరి ఇదేంటి బాబూ?’
సాక్షి,విశాఖ: వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు వార్తలు రాసిన ఎల్లోమీడియా క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. యాక్సిస్‌తో కుదుర్చుకున్న ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకితో వైఎస్ జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే అవినీతి జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. లక్ష కోట్ల అవినీతి జరిగిందని తప్పుడు వార్తల రాశారు. సెకితో అత్యంత తక్కువ రేటుకు 2.49 రూపాయలకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కూటమి ప్రభుత్వం యాక్సిస్ కంపెనీతో యూనిట్‌కు రూ.4.60 రూపాయలకు విద్యుత్ ఒప్పందం చేసుకుంది. రూ.2.49 రూపాయలకు ఒప్పందం చేసుకుంటే అవినీతి జరిగిందన్న మీరు రూ.4.60 ఎలా ఒప్పందం చేసుకున్నారు. రూ.2.11 రూపాయలకు ఎక్కువ కొనుగోలు చేశారు. ఈ ఒప్పందాలపై ఎల్లో మీడియా ఎందుకు వార్తలు రాయడం లేదు. రూ.2.49 అత్యంత తక్కువ ధరకు కొనుగోలు చేసిన వైఎస్ జగన్‌పై రాసిన తప్పుడు వార్తలకు ఎల్లోమీడియా క్షమాపణలు చెప్పాలి.కూటమి ప్రభుత్వ కొనుగోలు వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.11 వేల కోట్ల రూపాయల గండి పడుతుంది. దీనిపై కూటమి పార్టీల నేతలు ఏం సమాధానం చెబుతారు. డబ్బులు ఎలా కొట్టి వేయాలనే దానిమీద ఈ ఏడాది పరిపాలన జరిగింది. యాక్సెస్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి. ప్రభుత్వ అవినీతిని ప్రజల్లో పెడతామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, వ్యవసాయ విద్యుత్ అవసరాలకు దాదాపు 30ఏళ్ల పాటు ఢోకా లేకుండా రైతులకు పగటి పూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేలా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో ఏడువేల మెగావాట్ల విద్యుత్ ఒప్పందాన్ని కారుచౌకగా నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం యూనిట్‌కు రూ.2.49కే అందించేలా ఒప్పందం చేసుకుంది. అయితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం యాక్సెస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో యూనిట్‌కు ఏకంగా రూ.4.60లు కొనుగోలు చేస్తూ ఒప్పందం కుదుర్చుకుంది. -
Aluru Sambasiva: మాట తప్పుడు మడమ తిప్పడు అని ఊరికే అనలేదు..
-
రైతులకు బాసటగా YSRCP... నేతలతో వైఎస్ జగన్ టెలికాన్ఫరెన్స్
-
రైతులకు బాసటగా వైఎస్సార్సీపీ: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఏపీలో అధికార యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉందని, రైతులు నష్టపోకుండా ప్రభుత్వం సరైన చర్యలేవీ చేపట్టలేదని వైఎస్సార్సీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. ఏపీలో అకాల వర్షాలపై పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ముఖ్యనాయకులతో సోమవారం వైఎస్ జగన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా నిలవాలి. అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించండి.. వారికి ధైర్యం చెప్పండి. రాష్ట్రంలో పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. అనేక ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఖరీఫ్‌లో ప్రతికూల వాతావరణం, కనీస మద్దతు ధరలు లభించక ధాన్యఙ రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ రబీ సీజన్లో కూడా కష్టాలు పడటం ఆవేదన కలిగిస్తోంది. వర్షాలు కురుస్తాయన్న సమాచారం ముందస్తుగానే ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కళ్లాల్లో, పొలాల్లో రైతులవద్దనున్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో తీవ్ర నిర్లక్ష్యం కనబరిచింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా పలు చోట్ల ప్రభుత్వం ధాన్యాన్ని సరిగ్గా సేకరించడంలేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అకాల వర్షాలవల్ల మరింతగా నష్టపోతున్నారు. యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉంది. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలి. రైతులకు బాసటగా నిలవాలి. రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అని కేడర్‌కు వైఎస్ జగన్ సూచించారు. -
నేడు భగీరథ మహర్షి జయంతి.. వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: నేడు భగీరథ మహర్షి జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. సగర కులస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. కఠోర శ్రమ, పట్టుదలతో ఎంతటి ఆశయాన్ని అయినా సాధించగలమని నిరూపించిన మహనీయులు భగీరథుడు అని కొనియాడారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘కఠోర తపస్సుతో గంగను భువికి తీసుకువచ్చి ప్రజలకు వరంగా అందించిన మహా రుషి భగీరథ మహర్షి. కఠోర శ్రమ, పట్టుదలతో ఎంతటి ఆశయాన్ని అయినా సాధించగలమని నిరూపించిన మహనీయులు భగీరథుడు. నేడు భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సగర కులస్తులకు శుభాకాంక్షలు’ చెప్పారు.కఠోర తపస్సుతో గంగను భువికి తీసుకువచ్చి ప్రజలకు వరంగా అందించిన మహా రుషి భగీరథ మహర్షి. కఠోర శ్రమ, పట్టుదలతో ఎంతటి ఆశయాన్ని అయినా సాధించగలమని నిరూపించిన మహనీయులు భగీరథుడు. నేడు భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సగర కులస్తులకు శుభాకాంక్షలు.#BhagirathaMaharshiJayanthi pic.twitter.com/HUc3jwv16G— YS Jagan Mohan Reddy (@ysjagan) May 4, 2025 -
కూటమి ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోవడంలేదు: వైఎస్ జగన్
-
అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
-
అన్నం పెట్టే రైతులకు సున్నమా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు కనీస మద్దతు ధర లభించక రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా, టీడీపీ కూటమి ప్రభుత్వంలో పట్టించుకునే వారు కరువయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఒక్క ఎకరాకు సంబంధించి ఒక్క క్వింటాల్ కూడా కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3 వేల కోట్లు పెట్టి, ఐదేళ్లలో రికార్డు స్థాయిలో మార్కెట్లో ధర లేని పంట ఉత్పత్తుల సేకరణ ద్వారా రైతులను ఆదుకునేందుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రూ.7,796 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.చరిత్రాత్మక నిర్ణయాలతో కనీస మద్దతు ధరల జాబితాలో లేని పొగాకు సహా అనేక పంటల రైతులను ఆదుకున్నామని గుర్తు చేశారు. ‘మీరు కొత్తగా ఏమీ చేయకపోయినా, కనీసం మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కదా?’ అని ప్రశ్నిచారు. రాష్ట్రంలో రైతుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ‘ఎక్స్’ వేదికగా శనివారం ఆయన ఎండగట్టారు. ఆ పోస్ట్‌లో ఇంకా ఏమన్నారంటే.. కనీస బాధ్యతను విస్మరించారు⇒ చంద్రబాబు గారూ.. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులు కూడా రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం వారి వైపు కన్నెత్తి కూడా చూడక పోవడం ధర్మమేనా? ⇒ మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశనగ, టమాటా, అరటి, చీని, పొగాకు ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధర రావడం లేదు. చొరవ చూపి, మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యతను విస్మరించారు. పైగా డ్రామాలతో రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా? ⇒ మిర్చి విషయంలో కూడా మీరు రైతులను నమ్మించి మోసం చేశారు. మిర్చి కొనుగోలు అంశం కేంద్రం పరిధిలో లేకపోయినా, నాఫెడ్ కొనుగోలు చేస్తుందని మొదట నమ్మబలికారు. క్వింటాకు రూ.11,781కు కొంటామని చెప్పి, ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టకుండా, ఒక్క రైతు నుంచి కానీ, ఒక్క ఎకరాకు సంబంధించి కానీ, ఒక్క క్వింటాల్ గానీ కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు. ఇది వాస్తవం కాదా?⇒ మా హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3 వేల కోట్లు పెట్టి, ఐదేళ్లలో రూ.7,796 కోట్లు ఖర్చు చేశాం. చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని కనీస మద్దతు ధరల జాబితాలో లేని పొగాకు సహా అనేక పంటల రైతులను ఆదుకున్నాం. మీరు కొత్తగా ఏమీ చేయకపోయినా, కనీసం మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కదా? పైగా ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ.300 కోట్లు కేటాయించడం దారుణం కాదా? ఇందులో కూడా కనీసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా? ⇒ ధాన్యం, కోకో, పొగాకు, ఆక్వా రైతులు ఆయా జిల్లాల్లో ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారు. జనాభాలో 60 శాతం మంది ప్రజలు ఆధారపడే వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది తీవ్ర సంక్షోభానికి దారితీస్తే, లక్షల మంది ఉపాధికి గండి పడితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? వెంటనే ప్రభుత్వం తరఫున మార్కెట్లో జోక్యం చేసుకోవాలి. కనీస మద్దతు ధరలు లభించని పంటల విషయంలో ప్రభుత్వమే జోక్యం చేసుకుని, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి. -
రైతుల ఆందోళనపై వైఎస్ జగన్ ట్వీట్
-
చంద్రబాబూ.. రైతుల గోడు వినిపించడం లేదా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రైతుల ఆందోళనలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా? అని ప్రశ్నించారు. జిల్లాల్లో రైతులు ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు.. కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తికూడా చూడకపోవడం ధర్మమేనా?మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, వేరుశెనగ, టమోటా, అరటి, చీని, పొగాకు ఇలా ఏ పంట చూసినా కనీస మద్దతు ధరలు రావడం లేదు. చొరవ చూపి, మార్కెట్లో జోక్యం చేసుకోవాలన్న కనీస బాధ్యతను విస్మరించారు. పైగా డ్రామాలతో ఆ రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఇది న్యాయమేనా?మిర్చి విషయంలో కూడా మీరు రైతులను నమ్మించి మోసం చేశారు. మిర్చి కొనుగోలు అంశం కేంద్రం పరిధిలో లేకపోయినా, నాఫెడ్ కొనుగోలు చేస్తుందని మొదట నమ్మబలికారు. క్వింటాలు రూ.11,781కు కొంటామని చెప్పి, ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టకుండా, ఒక్క రైతు నుంచి కాని, ఒక్క ఎకరాకు సంబంధించి కాని, ఒక్క క్వింటాల్ గాని కొనకుండా అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు. మా హయాంలో ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3వేల కోట్లు పెట్టి, ఐదేళ్లలో రూ.7, 796 కోట్లు ఖర్చుచేశాం. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని కనీస మద్దతు ధరల జాబితాలో లేని పొగాకు సహా అనేక పంటల రైతులను ఆదుకున్నాం. మీరు కొత్తగా ఏమీ చేయకపోయినా, కనీసం మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేది కదా? పైగా ఈ ఏడాది బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించడం దారుణం కాదా? ఇందులో కూడా కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా?.ధాన్యం, కోకో, పొగాకు, ఆక్వా రైతులు ఆయా జిల్లాల్లో ఆందోళనలు చేస్తుంటే, ఇప్పటికీ రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారు. జనాభాలో 60శాతం మంది ప్రజలు ఆధారపడే వ్యవసాయరంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది తీవ్ర సంక్షోభానికి దారితీస్తే, లక్షల మంది ఉపాధికి గండిపడితే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? వెంటనే ప్రభుత్వం తరఫున మార్కెట్లో జోక్యం చేసుకోవాలని, కనీస ధరలు లభించని పంటల విషయంలో ప్రభుత్వమే జోక్యంచేసుకుని, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు..@ncbn గారూ… కనీస మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా వారి గోడు పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులూ రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకు పోతున్నారు. మీరు, మీ మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తికూడా చూడకపోవడం… pic.twitter.com/cW0REI1bV6— YS Jagan Mohan Reddy (@ysjagan) May 3, 2025 -
జగన్ 3,648 కిలోమీటర్లు పాద యాత్ర ఓటు కోసం కోదు..
-
రోడ్డు ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి : నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందడంపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీశైలంలో దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు వైఎస్ జగన్ ఇటువంటి దుర్ఘటనలు జరగటం అత్యంత బాధాకరమని, ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు వైఎస్ జగన్.కాగా, నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువు వద్ద శుక్రవారంఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు, గుంటూరు ప్రధాన జాతీయ రహదారిపై బోలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 16 మందికి గాయాలు కాగా, అందులో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీశైల క్షేత్రంలో దైవదర్శనానికి వెళ్లి బొలెరో వాహనంలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారు, మృతులు కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఇందిరానగర్, రాజీవ్ నగర్ లకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. -
వెన్నుపోటుతోనే చంద్రబాబు రాజకీయ ప్రస్థానం మొదలైంది: వైఎస్ జగన్
-
ప్రతి ఇంటినీ చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ ఆగ్రహం
-
‘మద్దతు ధర’ ఎక్కడ బాబూ?
ధాన్యం నుంచి టమాటా వరకు.. మిరప నుంచి పత్తి వరకు.. పొగాకు మొదలు బత్తాయి వరకు.. కోకో మొదలు కూరగాయల వరకు.. ఏ పంట చూసినా మద్దతు ధర కరువు. పెట్టిన పెట్టుబడి దక్కక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. కందులు, మినుము, పెసలు, శనగ, వేరుశనగ, పసుపు, జొన్న, సజ్జ, పొగాకు.. ఇలా అన్ని పంటల రైతులదీ దయనీయ పరిస్థితి. తుదకు పూలు, కూరగాయలకు కూడా మంచి ధర లేని దుస్థితి. కూటమి ప్రభుత్వ పాలనలో వ్యవసాయం పనికిరానిదైపోయింది. అన్నదాతలు రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలతో గోడు చాటుతున్నా ఈ ప్రభుత్వంలో చలనం లేదు. మొద్దు నిద్ర వీడలేదు.సాక్షి, అమరావతి : రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కల్పించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. «మిరప మొదలుకొని టమాటా వరకు ఏ పంట చూసినా ధర లేక రైతులు నష్టపోతుంటే అండగా నిలిచేందుకు కనీస ప్రయత్నం కూడా చేయలేదు. ధరల స్థిరీకరణ నిధి కింద బడ్జెట్లో కంటి తుడుపు చర్యగా రూ.300 కోట్లు కేటాయించినప్పటికీ, ఆ నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసిన పాపాన పోలేదు. ఓ వైపు కరువు, మరో వైపు తుపాన్లు, వరదలు, అకాల వర్షాలు అన్నదాతలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ప్రభావంతో పంటలు ముందెన్నడూ లేని రీతిలో తెగుళ్లు, చీడపీడల బారిన పడి దిగుబడులు దిగజారిపోయాయి. చివరికి చేతికొచ్చిన పంటకు మద్దతు ధర దక్కక రైతులు విలవిల్లాడి పోతున్నారు. కూలీల ఖర్చులు కూడా మిగిలే పరిస్థితి లేక కొంత మంది రైతులు తమ పంటలను పశువుల మేతకు వదిలేస్తే.. మరికొంత మంది రైతులు కల్లాల్లోనే దున్నేస్తున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితిలో పంటల కొనుగోలు కోసం మార్క్‌ఫెడ్, మార్కెటింగ్ శాఖాధికారులు పంపిన ప్రతిపాదనలను బుట్టదాఖలు చేసిందే తప్ప రైతులను ఆదుకోవాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏకోశానా ఉన్నట్టు కన్పించలేదు. కేంద్రానికి లేఖలు పేరిట మిరప రైతును మోసగించినట్టే పొగాకు రైతులను అడ్డగోలుగా మోసగించింది. ఖరీఫ్ పంట చివరి దశకు వచ్చిన తర్వాత కందులు, పెసలు, శనగ కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. కొద్ది మొత్తంలో కందులు, పెసలు, శనగలు సేకరించారు. ఇందుకోసం ఖర్చు చేసిన నిధులన్నీ కేంద్రానివే. గత సీజన్లో క్వింటా 27 వేలకు పైగా పలికిన తేజా రకం మిరప సైతం ఈసారి రూ.8 వేలకు మించి పలకడం లేదని గగ్గోలు పెడుతూ రైతులు ధర్నాలు, రాస్తారోకోలతో ఆందోళన బాట పట్టినా మద్దతు ధర అంటూ హంగామా చేసిన కూటమి ప్రభుత్వం తుదకు చేతులెత్తేసింది. ఆ ఐదేళ్లూ అన్నదాతకు పండగవైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడమే కాకుండా, ధర లేని ప్రతీసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకొని ఆ పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారు. తద్వారా ఆయా పంటల ధరలు పెరిగేందుకు కృషి చేశారు. ఇలా ఐదేళ్లలో 6.20 లక్షల మంది రైతుల నుంచి రూ.7,796.47 కోట్ల విలువైన 21.73 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి అన్నదాతకు అండగా నిలిచారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన పత్తిని సైతం నాటి ప్రభుత్వం కొనుగోలు చేసింది.చివరికి 2023–24 రబీ సీజన్లో జొన్న ధర పతనమవుతుందని తెలియగానే మార్కెట్లో జోక్యం చేసుకొని రూ.38.60 కోట్ల విలువైన 12,136 టన్నులు కొనుగోలు చేసి భరోసా కల్పించింది. మరో వైపు 39 లక్షల మంది రైతుల నుంచి రూ.68 వేల కోట్ల విలువైన 3.53 కోట్ల టన్నుల ధాన్యాన్ని మద్దతు ధరకు సేకరించి వరి రైతులకు అండగా నిలిచింది. ప్రతి రైతుకు జీఏల్టీ (గన్ని, లేబర్, ట్రాన్స్‌పోర్టు) భారాన్ని సైతం నాటి ప్రభుత్వమే భరించింది.పెట్టుబడిలో సగం కూడా దక్కలేదు రెండెకరాల్లో టమాటా పంట వేశాను. ఎకరాకు రూ.20 వేలు పెట్టుబడి అయ్యింది. తీరా పంట చేతికొచ్చే సమయానికి 25 కిలోల బాక్స్ రూ.100 నుంచి రూ.150కి మించి పలకలేదు. 2 ఎకరాలకు రూ.40 వేలు పెట్టుబడి పెడితే రూ.20 వేలు కూడా రాలేదు. ఇంత అధ్వాన పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదు. ధరలు పడిపోయి రైతులు నష్టాలపాలైనా ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. – కృష్ణమూర్తి, అయినగల్, ఆస్పరి మండలం, కర్నూలు జిల్లా గిట్టుబాటు ధరలేక నష్టపోతున్నాం నాకున్న కొద్దిపాటి కొబ్బరి తోటలో అంతర పంటగా కోకో సాగు చేస్తున్నా. గత ఏడాది కిలో రూ.800–1200 వరకు ధర పలికింది. కానీ ఈ ఏడాది రూ.550కి మించి కొనడం లేదు. సరైన గిట్టుబాటు ధర లేక ఆర్థికంగా నష్టపోతున్నాం. అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం కిలో రూ.900కు తక్కువ కాకుండా కొనుగోలు చేసేలా కంపెనీలను ఒప్పించాలి. – తూత బాలాజీ కుమార్, తడికలపూడి, కామవరపుకోట మండలం, ఏలూరు జిల్లాఎకరాకు రూ.50 వేలు నష్టపోయా 18 ఎకరాలు కౌలుకు తీసుకొని నల్లబర్లీ పొగాకు సాగు చేశాను. గతేడాది ఎకరాకు 17–18 క్వింటాళ్లు రాగా, ఈ ఏడాది 11–12 క్వింటాళ్లకు మించి రాలేదు. గతేడాది నాణ్యమైన పొగాకు క్వింటాకు రూ.16–18 వేలు ధర పలుకగా, తేమ శాతం ఎక్కువగా ఉన్నా సరే క్వింటాకు రూ.14–15 వేల వరకు దక్కింది. కానీ ఈ ఏడాది తేమ శాతం సాకుతో క్వింటాకు రూ.2500 నుంచి రూ.3 వేలకు మించి ఇవ్వడం లేదు. గతేడాది ఎకరాకు రూ.లక్షకుపైగా మిగిలితే ఈ ఏడాది ఎకరాకు రూ.50 వేలకుపైగా నష్టపోవాల్సి వచ్చిoది. – నర్సెట్టి శ్రీనివాసరావు, ఇనగొల్లు, బాపట్ల జిల్లా ఈ ప్రభుత్వం అన్నింటా ఘోరంగా విఫలం రాష్ట్రంలో ధాన్యం సహా మిరప, పత్తి, పొగాకు, మినుము, పెసర, శనగ, కంది తదితర పంట ఉత్పత్తుల ధరలు దారుణంగా పతనమయ్యాయి. ఈ సీజన్లో ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఏమీ పట్టనట్టుగా ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.20 వేల పెట్టుబడి సాయం, పంట నష్టపరిహారం ఇవ్వలేదు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఈ ప్రభుత్వం అన్నింటా ఘోరంగా విఫలమైంది. – జీ.ఈశ్వరయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం -
రాక్షస రాజ్యం
‘‘రాజకీయాలంటే నీ మాదిరిగా చేయడం కాదు..! ఎంపీటీసీలమైనా, జెడ్పీటీసీలమైనా మమ్మల్ని చూసి నేర్చుకో..! విలువలు, విశ్వసనీయతకు అద్దం పట్టే రాజకీయమంటే ఇదీ..! అని చంద్రబాబు నాయుడుకు మీరంతా గట్టిగా చాటి చెప్పారు. గొప్ప తెగువ ప్రదర్శించారు. విలువలు, విశ్వసనీయత పట్ల చూపించిన నిబద్ధతకు మీ అందరికీ హ్యాట్సాఫ్ చెబుతున్నా’’ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రెడ్ బుక్, రాక్షస పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వంలో తెగువ చూపించి నిబద్ధతతో నిలబడి విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేశారని వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ, ప్రకాశం జిల్లా మార్కాపురం, శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట, చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు.పిఠాపురం మున్సిపాలిటీ కౌన్సిలర్లు, మార్కాపురం ఎంపీపీ, ఎంపీటీసీలు, గాండ్లపెంట ఎంపీటీసీలు, కుప్పం మున్సిపాలిటీ కౌన్సిలర్లతోపాటు ఆయా జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు దీనికి హాజరయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఆయన ఏమన్నారంటే.. మనకు, చంద్రబాబుకు తేడా ఇదీ...మన రాజకీయాలకు, చంద్రబాబు రాజకీయాలకు మధ్య తేడా ఈ 12 నెలల పాలనలో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. మన రాజకీయ జీవిత ప్రస్థానం అంతా ప్రజలు అధికారం ఇస్తేనే తీసుకున్నాం. ఏనాడూ దొడ్డిదారిన, వెన్నుపోట్లతోనూ మోసాలు చేసి రాజకీయాలు చేయలేదు. అదే చంద్రబాబు రాజకీయ ప్రస్థానం వెన్నుపోటుతో మొదలవుతుంది. బిడ్డను ఇచ్చిన మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడవడం దగ్గర నుంచి మొదలుపెడితే అధికారం కోసం జీవితమంతా వెన్నుపోట్లు పొడుస్తూనే రాజకీయాలు సాగిస్తూ వచ్చారు. స్థానిక ఉప ఎన్నికల్లో కూటమి అరాచకాలు..శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంటలో ఏడు ఎంపీటీసీ స్థానాల్లో ఆరింట వైఎస్సార్సీపీ గుర్తు మీద గెల్చారు. టీడీపీ గుర్తుతో ఒక్కరే నెగ్గారు. అలాంటప్పుడు ఎంపీపీ పదవి కచ్చితంగా వైఎస్సార్సీపీకే రావాలి. ఒక్కడే ఉన్న టీడీపీకి ఎలా వస్తుంది? అక్కడ ఏం జరిగిందో మనమంతా చూశాం. యుద్ధ వాతావరణం సృష్టించి బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసులను వాచ్మెన్లకన్నా హీనంగా వాడుకుంటున్నారు. పోలీసుల సమక్షంలోనే దౌర్జన్యాలు చేస్తున్నారు. మనం గట్టిగా నిలబడి ఎన్నికలను బాయ్‌కాట్ చేసి వాయిదా వేయించుకోగలిగాం. కానీ రెండు మూడుసార్లు వాయిదా వేసిన తర్వాత కోరం లేకపోయినా వాళ్లంతట వాళ్లే సర్దుబాటు చేసుకుంటున్నారు. అలాంటి దుర్మార్గమైన పాలన చూస్తున్నాం. ప్రకాశం జిల్లా మార్కాపురంలో 15 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్సీపీ తరపున మన పార్టీ గుర్తు మీద 15కు 15 స్థానాలు మనమే గెలిచాం. అక్కడ కూడా ఎంపీపీ మనకే రావాలి. పోలీసులు బెదిరించడంతో అయినా మనం క్యాంపులు పెట్టుకోవాల్సి వచ్చింది. కూటమి పార్టీల నాయకులు సూట్‌కేసులతో ప్రలోభాలు పెట్టారు. అక్కడ మనవాళ్లు అంతా గట్టిగా ఒక్కటిగా నిలబడ్డారు. ఎవరూ జారిపోలేదు. మీ అందరి తెగువకు హ్యాట్సాఫ్ చెప్పాలి.కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాల్టీలో 30 మంది కౌన్సిలర్లలో 26 మంది మన పార్టీ గుర్తు మీద గెల్చారు. మరి అక్కడ మున్సిపల్ ఛైర్మన్‌గా వైఎస్సార్సీపీ గెలవాల్సి ఉండగా రకరకాల ప్రలోభాలతో బెదిరింపులకు పాల్పడ్డారు. అక్కడ కూడా మనవాళ్లు గట్టిగా నిలబడ్డారు.కుప్పం మున్సిపాల్టీని చూస్తే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాకముందు ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో 25 వార్డులకుగాను వైఎస్సార్సీపీ 19 గెలిచింది. టీడీపీ కేవలం 6 మాత్రమే నెగ్గింది. అలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ తరపున మున్సిపల్ చైర్మన్ కావాలి. కానీ అక్కడ కూడా దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అదిస్థాయిలో అంటే.. మున్సిపల్ ఛైర్మన్‌ను బెదిరించి రాజీనామా చేయించి వాళ్ల పార్టీలోకి తీసుకున్నారు. చంద్రబాబు అంతటితో ఆగిపోకుండా... ఇది కుప్పం...! నా నియోజకవర్గం.. నేను ముఖ్యమంత్రిని.. నేను ఒక రాక్షసుడిని.. రాక్షస సామ్రాజ్యానికి రాజుని.. నా కుప్పం నియోజకవర్గంలో ఎలా రాక్షస పాలన చేయాలో నేర్పుతా.. రాష్ట్రమంతా తెలుగుదేశం వాళ్లు ఇలాగే చేయాలని కుప్పం నుంచి సంకేతాలు ఇచ్చాడు..! అలా సంకేతాలు ఇచ్చి బలవంతంగా మున్సిపల్ చైర్మన్ పోస్టును తీసుకున్నారు. కేవలం 6 స్థానాలు మీరు (టీడీపీ) గెలిస్తే.. 19 స్థానాలు మేం గెలిచాం. అయినా కుప్పం చైర్మన్ మీదేనని చెప్పుకుంటున్నారు. ఒక్కో కౌన్సిలర్‌కు రూ.50 లక్షలు ఇచ్చి మీవైపు తిప్పుకున్నారు. ముఖ్యమంత్రిగా నువ్వు చేయాల్సిన పని ఇదా చంద్రబాబూ? ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు నువ్వు అద్దం పెట్టి చూపించాలి. రాజ్యాంగం అనేది భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది. ప్రతి రాజకీయ నాయకుడు ప్రమాణం చేసేటప్పుడు రాజ్యాంగానికి లోబడి ఉంటానని చెబుతాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే దగ్గరుండి రాజ్యాంగాన్ని తగలబెడుతున్నాడు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఆయనే కుప్పం నియోజకవర్గంలో తప్పుడు సంకేతాలను పంపించారు. 19 మంది కౌన్సిలర్లు వైఎస్సార్సీపీ నుంచి గెలిచినా ప్రలోభాలకు, పోలీసుల దౌర్జన్యాలకు నిదర్శనంగా కుప్పం నిలిచింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కుప్పాన్ని మున్సిపాల్టీ చేసింది మనమే. చంద్రబాబు నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయినా కూడా కుప్పాన్ని మున్సిపాల్టీగా చేయాలన్న ఆలోచనే రాలేదు. కనీసం కుప్పంలో ఒక రెవెన్యూ డివిజన్ పెట్టే ఆలోచన కూడా చంద్రబాబుకు ఏరోజూ తట్టలేదు. రెవెన్యూ డివిజన్ మాట అటుంచి తాగడానికి కుప్పానికి తాగు నీళ్లు కూడా ఇవ్వలేదు. అది కూడా మన హయాంలోనే చేశాం. కుప్పంలో చంద్రబాబు నాయుడు రాక్షస పాలన చేస్తున్న నేపథ్యంలో... తెగువ చూపించి నిలబడిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు హ్యాట్సాఫ్ చెబుతున్నా.జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట..ఇంతకు ముందు మన ప్రభుత్వ హయాంలో బహుశా కార్యకర్తలకు అనుకున్న మేరకు చేయలేకపోవచ్చు. జూన్‌లో మనం ప్రమాణ స్వీకారం చేస్తే.. తదుపరి మార్చి కల్లా కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితిని ఎవరూ ఊహించి ఉండరు. ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు ప్రజల ఆరోగ్యం మీద ఎక్కువగా ధ్యాస పెట్టి పాలన నడపాల్సి వచ్చింది. కార్యకర్తలు పడుతున్న కష్టాలను మీ జగన్ చూశాడు. మీరు చూపిస్తున్న తెగువను కూడా మీ బిడ్డ చూశాడు. మీ అందరికీ మాట ఇస్తున్నా. వచ్చే జగన్ 2.0లో మీ అందరికీ పెద్ద పీట వేస్తా. రాత్రి తర్వాత పగలు రాక తప్పదు. కచ్చితంగా మంచి రోజులు వస్తాయి. మళ్లీ మనమే అఖండ మెజార్టీతో వస్తాం. -
కంచం లాగేశారు! : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు రాక మునుపు ప్రతి ఇంట్లో మహిళలు, రైతన్న, చిన్న పిల్లాడికి నాలుగు వేళ్లు ఆనందంగా నోట్లోకి పోతుండేవి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి కంచాన్ని లాగేశాడు. మన ప్రభుత్వంలో అమలైన అన్ని పథకాలను రద్దు చేశాడు. సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలన్నీ పూర్తి మోసంగా మార్చేశాడు. ఎన్నికల ముందు మాత్రం జగన్ ఇచ్చినవి అన్నీ కొనసాగుతాయి.. అంతే కాకుండా అధికంగా ఇస్తానని నమ్మబలికారు. చంద్రబాబు మాటలను నమ్మి ఆయన ఇచ్చిన బాండ్లను ప్రజలు ఇంట్లో పెట్టుకున్నారు. తమ ఇంటికి ఎవరైనా టీడీపీ కార్యకర్తలు వస్తే నిలదీయాలని ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఏ టీడీపీ కార్యకర్త కూడా ప్రజల ఆశీస్సులు కోరే పరిస్థితి లేదు..’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘మనం రాక్షస రాజ్యంలో, కలియుగంలో ఉన్నామని చెప్పేందుకు ఈ రాష్ట్రంలో పాలన చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది. అంతటి దారుణమైన, దుర్మార్గమైన పాలన చూస్తున్నాం..’ అని చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ, ప్రకాశం జిల్లా మార్కాపురం, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట, చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..ఏ ఇంటికైనా కాలర్ ఎగరేసుకుని వెళ్లగలం.. మరి వాళ్లు వెళ్లగలరా?రాజకీయాలలో గెలుపోటములు సహజం. కానీ ఓడిపోయినా కూడా ప్రజల గుండెల్లో బతికే ఉన్నామా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమున్న అంశం. వైఎస్సార్సీపీ కార్యకర్త గ్రామంలో ఏ ఇంటికైనా కాలర్ ఎగరేసుకుని వెళ్లగలుగుతాడు. మా పాలనలో మేం చెప్పిన ప్రతి మాట నెరవేర్చామని గర్వంగా చెప్పగలుగుతాడు. కానీ ఇవాళ చంద్రబాబు 12 నెలల పాలనలో ఆ పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఏ ఇంటికైనా వెళ్లి వాళ్ల దీవెనలు, ఆశీర్వచనాలు పొందగలరా? ఆ పార్టీ కార్యకర్తలు చంద్రబాబు, కూటమి నేతల ఫొటోలు తీసుకుని ఏ ఇంటికి వెళ్లినా.. చిన్న పిల్లాడి దగ్గర నుంచి అందరూ ప్రశ్నిస్తారు. ఆ చిన్న పిల్లవాడు తల్లికి వందనం కింద నా రూ.15 వేలు ఏమయ్యాయని అడుగుతాడు. ఆ తర్వాత ఆ పిల్లాడి తల్లి బయటకు వచ్చి ఆడబిడ్డ నిధి కింద నా రూ.18 వేలు ఏమైందని అడుగుతుంది. ఆ తల్లుల అమ్మలు, అత్తలు బయటకు వచ్చి మాకు 50 ఏళ్లకే పెన్షన్ల ద్వారా రూ.48 వేలు ఇస్తామన్నారు కదా..! వాటి సంగతేంటని అడుగుతారు. అదే ఇంట్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువకుడు నా రూ.36 వేల నిరుద్యోగ భృతి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తాడు. అదే ఇంట్లో నుంచి రైతన్న బయటకు వచ్చి అన్నదాతా సుఖీభవ కింద నా రూ.26 వేల సంగతి ఏమిటని నిలదీస్తాడు.సూపర్ సిక్స్ గాలికి.. దారుణ వంచనచంద్రబాబు పాలనలో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయాయి. చివరికి చిన్న చిన్న హామీలైన ఉచిత బస్సు లాంటివి కూడా గాలికి ఎగిరిపోయాయి. కడప నుంచి విశాఖపట్నం వెళ్లి వద్దామనుకున్నాం..! కర్నూలు నుంచి అమరావతికి పొద్దున పోయి సాయంత్రానికి చూసి వద్దామనుకున్నాం..! ఆ ఉచిత బస్సు ఏమైందని మహిళలు అడుగుతున్నారు. అన్నిటికన్నా దారుణమైన విషయం ఏమిటంటే.. చంద్రబాబు రాక మునుపు ప్రతి ఇంట్లో మహిళలు, రైతన్న, చిన్న పిల్లాడికి నాలుగు వేళ్లు ఆనందంగా నోట్లోకి పోతుండేవి. చంద్రబాబు సీఎం అయిన తర్వాత వారి కంచాన్ని లాగేశాడు. మన ప్రభుత్వంలో అమలైన అన్ని పథకాలను రద్దు చేశాడు. ఆయన ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా మోసంగా మార్చేశాడు. ఎన్నికల ముందు చంద్రబాబు మాటలు నమ్మి ఆయన ఇచ్చిన బాండ్లను ప్రజలు ప్రతి ఇంట్లో పెట్టుకున్నారు. ఎవరైనా టీడీపీ కార్యకర్తలు వస్తే అడగాలని చూస్తున్నారు. ఏ టీడీపీ కార్యకర్త కూడా ప్రజల ఆశీస్సులు కోరే పరిస్థితి లేదు. బాబుకు సింగిల్ డిజిటే..ఇంత దారుణమైన పాలన, ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజులు నిలబడదు. దేవుడు, ప్రజలు అంతా చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు ఫుట్‌బాల్‌ను తన్నినట్లు తంతారు. ఎంతో మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉంటే.. ఎన్నో మోసాలు చేసి, అబద్ధాలు చెప్పి, దుర్మార్గంగా పరిపాలన చేసిన ఆయన పరిస్థితి ఏమిటో ఊహించవచ్చు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సింగిల్ డిజిట్‌కు రావడం ఖాయం. ఆ రోజు త్వరలోనే వస్తుంది. దానికోసం మనం అంతా గట్టిగా శ్రమించాలి.వ్యవస్థలన్నీ నిర్వీర్యం..⇒ గ్రామాల్లో ఇవాళ దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్కూళ్లలో నాడుృనేడు ఆగిపోయింది. గోరుముద్ద నాణ్యత లేకుండా పోయింది. ఇంగ్లిష్‌మీడియం పక్కకు పోయింది. మూడో తరగతి నుంచి అమలు చేసిన టోఫెల్ పీరియడ్ తీసేశారు. ఎనిమిదో తరగతికి వచ్చే సరికి ప్రతి పిల్లవాడికి ట్యాబులు ఇచ్చే స్కీం కూడా అటకెక్కించేశారు. మన హయాంలో ప్రభుత్వ బడులలో నో వేకెన్సీ బోర్డులు ఉన్న పరిస్థితి నుంచి.. ఇవాళ అమ్మో ప్రభుత్వ బడులకు వద్దనే దుస్థితికి తెచ్చేశారు. ప్రతి కుటుంబంలో పిల్లలు డాక్టరు, ఇంజనీర్ లాంటి పెద్ద చదువులు చదివితేనే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుంది. అలాంటి గొప్ప పరిస్థితులు రావాలని విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో పూర్తి ఫీజులు చెల్లిస్తూ.. లాడ్జింగ్ బోర్డింగ్ ఖర్చుల కోసం వారి చేతిలో డబ్బులు పెడుతూ ప్రతి క్వార్టర్ ముగిసిన వెంటనే వారికి క్రమం తప్పకుండా అందించాం. ఇవాళ ఆ పిల్లలు ఫీజులు కట్టలేక చదువులు మానేస్తున్నారు. చంద్రబాబు పుణ్యమాని విద్యాదీవెన, వసతి దీవెన గాలికెగిరిపోయాయి.⇒ ఆరోగ్యశ్రీ చూస్తే.. పేదవాడు తలెత్తుకుని ఏ కార్పొరేట్ ఆసుపత్రికైనా వెళ్లి రూ.25 లక్షల వరకు ఉచితంగా చికిత్స పొందే పరిస్థితి మన హయాంలో ఉండేది. ఆ తర్వాత విశ్రాంతి తీసుకునే సమయంలో నెలకు రూ.5 వేలు ఆరోగ్య ఆసరా కింద వాళ్ల బ్యాంకు అకౌంట్లో వేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు 11 నెలల టీడీపీ పాలనలో ఆరోగ్యశ్రీ నాశనం అయింది. నెలకి రూ.300 కోట్లు చొప్పున ఏడాదికి దాదాపు రూ.3,500 కోట్లు బకాయిలు పెట్టారు. ఆరోగ్య ఆసరా లేదు. రూ.450 కోట్ల బకాయిలు ఇవ్వలేదు. పేదవాడు నెట్వర్క్ ఆసుపత్రులకు వస్తే వైద్యం చేయబోమని బోర్డు తిప్పేశారు. పేదవాడికి ఆరోగ్యం బాగా లేకపోతే అప్పులు పాలైతే గానీ వైద్యం అందే పరిస్థితి లేదు.⇒ మన ప్రభుత్వంలో రైతన్నలకు పెట్టుబడి సహాయం ఇస్తూ.. దళారీ వ్యవస్థ లేకుండా రైతుల పంటలు ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేశాం. ఇవాళ చంద్రబాబు రైతుకు పెట్టుబడి సహాయంగా ఇస్తానన్న హామీ మోసంగా మిగిలిపోయింది. మన హయాంలో ఉచిత పంటల బీమా ఉంటే.. ఇవాళ రైతులు ఇన్సూరెన్స్ కట్టుకునే పరిస్థితి లేకుండా చేశాడు. ఆర్బేకేలు నీరుగారిపోయాయి. ఈృ క్రాప్ కనబడకుండా పోయింది. రైతులు ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కని దుస్థితిలో ఉన్నారు. ధాన్యం, మిర్చి, పత్తి, కందులు, పెసలు, మినుమలు, శనగ, అరటి, పామాయిల్, చీనీ.. ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు.ఎక్కడ చూసినా మాఫియాలే..ఒకవైపు దారుణమైన పాలన చేస్తున్నారు.. మరోవైపు విచ్చలవిడిగా స్కామ్‌లు జరుగుతున్నాయి. మన హయాంలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి పారదర్శకంగా డబ్బులు వచ్చాయి. ఏడాదికి రూ.750 కోట్లు వచ్చేవి. ఈ ప్రభుత్వంలో విచ్చలవిడిగా అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వానికి ఆదాయం లేదు. ఇసుక మాఫియా, మట్టి, మద్యం మాఫియా అరాచకం నడుస్తోంది. మన హయాంలో మద్యం అమ్మకాలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటే.. ఇవాళ ఏ గ్రామంలో చూసినా.. గుడి, బడి, వీధి చివర ఎక్కడ చూసినా బెల్టు షాపులే. ప్రతి బెల్టు షాపులో ఎమ్మార్పీ కంటే రూ.20– రూ.30 ఎక్కువకే అమ్ముతున్నారు. ఎక్కడ చూసినా మాఫియాలే. నియోజకవర్గంలో మైన్స్, ఫ్యాక్టరీలు నడపాలంటే ఎమ్మెల్యేకు అంతో ఇంతో ఇవ్వాలి. ఆయన ముఖ్యమంత్రికి ఇవ్వాలి. ఇలా రాష్ట్రమంతా రెడ్‌బుక్ రాజ్యాంగం, దోచుకో పంచుకో తినుకో (డీపీటీ) నడుస్తోంది.నీకింత.. నాకింత అని పంచుకుంటున్నారు..⇒ విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఏం చేస్తున్నారంటే.. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ చంద్రబాబు తన బినామీలకు మాత్రం రూ.మూడు వేల కోట్ల విలువైన భూములిస్తారు. ఊరూ పేరు లేని ఉర్సా, లూలూ, లిల్లీ లాంటి కంపెనీలకు రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల విలువైన భూములను ధారాదత్తం చేస్తున్నారు. లంచాలు తీసుకుని నాకింత.. నీకింత అని పంచుకుంటున్నారు. ⇒ మనం మొబిలైజేషన్ అడ్వాన్సులు విధానాన్ని తీసేస్తే వీళ్లు అదే పనిగా తీసుకొచ్చారు. రివర్స్ టెండరింగ్‌ను మనం తెస్తే.. వీళ్లు రద్దు చేశారు. మనం తీసుకొచ్చిన జ్యుడిషియల్ ప్రివ్యూను రద్దు చేశారు. కాంట్రాక్టర్లు రింగ్‌గా మారి ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచి టెండర్లు వేస్తున్నారు. వారికి చంద్రబాబు మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద 10 శాతం ఇచ్చి 8 శాతం తిరిగి వెనక్కి తీసుకుంటున్నారు. కుల గణన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాంకుల గణన చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో దేశంలోనే తొలిసారిగా బీసీ కుల గణన నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘కుల ఆధారిత జనాభా గణన నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. కుల గణన చేయాలని నా నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2021 నవంబర్‌లో తీర్మానాన్ని ఆమోదించాం. 2024 జనవరిలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీ కులాల వారీ గణనను నిర్వహించాం. కుల గణన ద్వారా వెనుకబడిన, అణగారిన వర్గాలకు మరింత సంక్షేమాన్ని అందించవచ్చు. సమాజంలోని అన్ని వర్గాలకు నిజమైన సామాజిక న్యాయాన్ని, అభివృద్ధిని అందించటంలో ఇది కీలక అడుగు’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
కులగణనపై కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: వైఎస్ జగన్
-
కులగణన చేసిన మొదటి సీఎం వైఎస్ జగన్
తాడేపల్లి: కులాల వారీగా జనగణన చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్ సీపీ స్వాగతిస్తుందన్నారు పార్టీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పోతిన మహేష్. కుల గణన చేసిన మొదటి సీఎం వైఎస్ జగన్ అని ఈ సందర్భంగా పోతిన పేర్కొన్నారు. తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన పోతిన.. ‘వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడే దీనిపై తీర్మానం చేశారని గుర్తుచేశారు. ‘అణగారిన వర్గాల అభివృద్ధికి ఈ కుల గణన ఎంతో మేలు చేస్తుంది. జగన్ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎంతో మేలు చేశారు. కుల గణన కోసం ఆరుగురు అధికారుల తో కమిటీని కూడా జగన్ నియమించారు. దేశంలో కుల గణన చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్.కుల గణన చేసిన మొదటి సీఎం వైఎస్ జగన్. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అణగారిన వర్గాలకు అందించిన గొప్ప వ్యక్తి జగన్. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం అందించడానికి మీ కులం, ప్రాంతం ఏంటి అని అడుగుతున్నారు’ అని పోతిన మహేష్ స్పష్టం చేశారు. -
Watch Live: మీ తెగువకు హ్యాట్సాఫ్.. మీ అందరికీ మాటిస్తున్నా
-
‘కుల గణన’ నిర్ణయంపై వైఎస్ జగన్ హర్షం
గుంటూరు, సాక్షి: జన గణనతో పాటే కుల గణన చేయాలన్న కేంద్రం నిర్ణయంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) హర్షం వ్యక్తం చేశారు. గురువారం తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. అలాగే.. వైఎస్సార్సీపీ హయాంలో కుల గణనను నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కుల గణన చేయాలనే కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. 2021లోనే మా ప్రభుత్వ హయాంలోనే కుల గణనపై తీర్మానం చేశాం. జనవరి 2024లో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దేశంలో మొట్టమొదటి బీసీ కుల గణనను నిర్వహించాం. కుల గణన ద్వారా వెనుకబడిన, అణగారిన వర్గాలకు మరింత సంక్షేమాన్ని అందించవచ్చు. సమాజంలోని అన్ని వర్గాలకు నిజమైన సామాజిక న్యాయాన్ని, అభివృద్ధిని అందించటంలో ఇది ఇది కీలకమైన అడుగు అని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.I welcome the Centre’s decision to conduct a caste-based census. Andhra Pradesh, under my leadership, took the lead by passing a resolution in November 2021 and conducting the country’s first BC caste-wise enumeration in January 2024 through village and ward secretariats. A…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 1, 2025ఇదీ చదవండి: కులగణనకు కేంద్రం ఓకే -
తాడేపల్లిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం
-
కార్మిక సోదరులకు వైఎస్ జగన్ మేడే శుభాకాంక్షలు
-
కార్మిక సోదరులకు వైఎస్ జగన్ మేడే శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: మేడే సందర్భంగా కార్మికులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఏ దేశ అభివృద్ధికైనా శ్రామికులే పట్టుగొమ్మలు. ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటి వారు. నేడు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా కార్మిక సోదర సోదరీమణులందరికీ మే డే శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ఏ దేశ అభివృద్ధికైనా శ్రామికులే పట్టుగొమ్మలు, ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటి వారు. నేడు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా కార్మిక సోదర సోదరీమణులందరికీ మే డే శుభాకాంక్షలు.#MayDay #InternationalLabourDay— YS Jagan Mohan Reddy (@ysjagan) May 1, 2025 -
కేవలం చంద్రబాబు నిర్లక్ష్య వైఖరితో అనేక మంది ప్రాణాలు బలి: వైఎస్ జగన్
-
ఇవాళ YSRCP స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో YS జగన్ సమావేశం
-
మనం రాక్షస రాజ్యంలో ఉన్నాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాక్షస పాలనలో ఉన్నామని.. ఈ రాష్ట్రంలో పాలన చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుందంటూ చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కాకినాడ జిల్లా పిఠాపురం మునిసిపాలిటీ, ప్రకాశం జిల్లా మార్కాపురం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం వైఎస్సార్సీపీ నేతలతో ఆయన సమావేశమయ్యారు.ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై వైఎస్ జగన్ చర్చించారు. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ, మండలాల ఉప ఎన్నికల్లో టీడీపీ గూండాల దాడిని ఎదుర్కొన్న వైనంపై కూడా ఆయన చర్చించారు. ‘‘ఇలాంటి రెడ్ బుక్ రాక్షస పాలన చేస్తున్న ఇలాంటి ప్రభుత్వంలో తెగువ చూపించి, నిబద్ధతతో నిలబడి, విలువలకు, విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ... చంద్రబాబూ మావి నీ మాదిరి రాజకీయాలు కాదు.. ఎంపీటీసీలమైనా, జడ్పీటీసీలమైనా మమ్నల్ని చూసి నేర్చుకోమని చంద్రబాబుకి కూడా చూపించి.. గొప్ప తెగువ చూపించారు’’ అని వైఎస్ జగన్ ప్రశంసించారు.‘‘మీ అందరి తెగువకు, విలువలు పట్ల, విశ్వసనీయత పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ అందరికీ హేట్సాఫ్. మన రాజకీయాలకు చంద్రబాబు రాజకీయాలకు మధ్య ఈ 12 నెలల పాలనలో చాలా తేడా కనిపిస్తోంది. 12 నెలల చంద్రబాబు పాలనలో రాజకీయాలకు, మన రాజకీయాలకు తేడా చాలా ఉంది. ప్రజలు మనకు అధికారం ఇస్తేనే తీసుకున్నాం. దొడ్డిదారిన వెన్నుపోటు పొడిచి రాజకీయం చేయలేదు. చంద్రబాబు రాజకీయ ప్రస్ధానం.. వెన్నుపోటుతో మొదలుపెడితే ఆ తర్వాత అధికారం కోసం ప్రజలను జీవితమంతా వెన్నుపోటు పొడుస్తూనే రాజకీయమంతా కొనసాగిస్తూ వచ్చారు’’ అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.‘‘సత్యసాయి జిల్లా గాండ్ల పెంటలో ఏడు ఎంపీటీసీ స్ధానాలు ఉంటే.. ప్రజలు వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఏడింట ఆరు మందిని గెలిపించారు. టీడీపీకి ఒక్కటే ఉంది. అలాంటప్పుడు ఎంపీపీ పదవి వైఎస్సార్సీపీకే రావాలి. కానీ అక్కడ ఏం జరుగుతుందో మనమంతా చూశాం. బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసులను వాచ్ మెన్ లకన్నా హీనంగా వాడుకుంటున్నారు. చివరికి మనం గట్టిగా నిలబడి ఎన్నికలను బాయ్ కాట్ చేసి ఎన్నిక వాయిదా వేయించుకోగలిగాం. కానీ రెండు మూడుసార్లు వాయిదా వేసిన తర్వాత కోరం లేకపోయినా వాళ్లంతట వాళ్లే గెలిచినట్లు ప్రకటించుకున్నారు...ప్రకాశం జిల్లా మార్కాపురంలో 15 ఎంటీసీ స్థానాలకు వైఎస్సార్సీపీ తరపున మన పార్టీ గుర్తు మీద 15కు 15 స్థానాలు మనమే గెలిచాం. అక్కడ ఎంపీపీ మనకే రావాలి. అక్కడ కూడా సూట్ కేసులతో ప్రలోభాలు పెట్టారు. బెదిరింపులకు పాల్పడ్డారు. అక్కడ కూడా మన వాళ్లు అంతా ఒక్కటిగా నిలబడ్డారు. మీ తెగువకు హేట్సాఫ్ చెప్పాలి. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాల్టీలో 30 మంది కౌన్సిలర్లు.. ఇక్కడ వైఎస్సార్సీపీ గుర్తు మీద ఏకంగా 26 మంది గెలిచారు. మరి అక్కడ వైఎస్సార్సీపీ వాళ్లే గెలవాల్సి ఉండగా.. అక్కడ ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడ్డారు. అక్కడ కూడా మన వాళ్లు గట్టిగా నిలపబడ్డారు...ఇక కుప్పం మున్సిపాల్టీ చూసుకుంటే.. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే 25 వార్డులకు గాను వైఎస్సార్సీపీ 19 గెలిస్తే.. టీడీపీ కేవలం 6 మాత్రమే గెలిచింది. అలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ తరపున మున్సిపల్ చైర్మన్ కావాలి కానీ అక్కడ కూడా దౌర్జన్యాలు.. ఏ స్థాయిలో అంటే.. మనవాళ్లను బెదిరించి వాళ్ల పార్టీలోకి తీసుుకుంటున్నారు. ఇది నా నియోజకవర్గం.. నా కుప్పం నియోజకవర్గంలో ఎలా రాక్షస పాలన చేయాలో నేర్పుతాను. రాష్ట్రమంతా ఇలానే చేయాలని సంకేతాలు ఇచ్చాడు చంద్రబాబు. అలా సంకేతాలు ఇచ్చి బలవంతగా మున్సిపల్ చైర్మన్ పోస్టును తీసుకున్నారు. ఒక్కో కౌన్సిలర్‌కు రూ.50 లక్షలు ఇచ్చి తమ వైపు తిప్పుకున్నారు...రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఆయనే కుప్పం నియోజకవర్గంలో తప్పుడు సంకేతాలను పంపించారు. ప్రలోభాలకు, పోలీసుల దౌర్జన్యాలకు నిదర్శనంగా కుప్పం మున్సిపాల్టీ నిలిచింది. కుప్పాన్ని మున్సిపాల్టీ చేసింది మనమే. చంద్రబాబు కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ కూడా చేయలేదు. డివిజన్ మాట అటుంచి తాగడానికి కుప్పానికి నీళ్లు కూడా ఇవ్వలేదు. అలాంటి పరిస్థితులలో తెగువ చూపించిన నిలబడిన వైయస్సార్పీపీ కౌన్సిలర్లకు హేట్సాఫ్ చెప్పాలి. రాజకీయలలో గెలుపోటములు సహజం. కానీ ఓడిపోయినా ప్రజల గుండెల్లో ఉన్నామా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమున్న అంశం. మా పాలనలో మేం చెప్పిన ప్రతి మాట నెరవేర్చామని వైఎస్సార్సీపీ ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి గర్వంగా పోగలుగుతాడు. కానీ ఇవాళ చంద్రబాబు, ఆ పార్టీ కార్యకర్తలు తమ పాలనలో ఏ ఇంటికైనా వెళ్లి వాళ్ల దీవెనలు, ఆశీర్వచనాలు పొందగలడా అని ప్రశ్నిస్తున్నాను...ఏ ఇంటికైనా వాళ్ల కార్యకర్తలు వెలితే చిన్న పిల్లాడి దగ్గర నుంచి ప్రశ్నిస్తారు. చిన్న పిల్లవాడు నా రూ.15వేలు ఏమయ్యాయని అడుగుతాడు. ఆ తర్వాత ఆ పిల్లాడి తల్లి బయటకు వచ్చి నా రూ.18వేలు ఏమైందని అడుగుతారు. ఆ తర్వాత వాళ్ల ఆ తల్లుల అమ్ములు, ఆ ఇంట్లో నుంచి రైతన్నలు, ఉద్యోగం కోసం చూస్తున్న యువకుడు మాకిచ్చిన హామీలు ఏమయ్యాయని అడుగుతారు. చంద్రబాబు పాలనలో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయాయి. చివరికి చిన్న, చిన్న హమీలైన ఉచిత బస్సు లాంటివి కూడా గాలికి ఎగిరిపోయాయి. ప్రజలు ఆ హామీలు ఏమయ్యాయని అఢుగుతున్నారు. ఉచిత బస్సు ఉంటే కడప నుంచి విశాఖపట్నం, కర్నూలు నుంచి అమరావతి వెళ్లి వద్దామనుకున్నాం.. అవి ఏమయ్యాయని అడుగుతున్నారు...చంద్రబాబు రాక మునుపు ప్రతి ఇంట్లో ప్రతి మహిళ, రైతన్న, చిన్న పిల్లాడికి నాలుగు వేళ్లు ఆనందంగా నోట్లోకి పోతుండేవి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి నోటి కాడ కంచాన్ని లాగేశాడు. మన ప్రభుత్వంలో అమలవుతున్న ప్రతి పథకాన్ని రద్దు చేశాడు. అలా రద్దు చేయడమే కాకుండా జగన్ ఇచ్చినవే కాకుండా అధికంగా ఇస్తానని ఎన్నికల్లో చెప్పాడు. చంద్రబాబు చెప్పిన మాటలు, ఆయన ఇచ్చిన బాండ్లు ప్రజలు దగ్గర పెట్టుకున్నారు. ఎవరైనా టీడీపీ కార్యకర్తలు వస్తే అడగాలని ఎదురుచూస్తున్నారు. ఇదీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి.స్కూళ్లలో నాడు-నేడు ఆగిపోయింది. గోరుముద్ద నాణ్యత లేకుండా పోయింది. ఇంగ్లిషు మీడియం పక్కకు పోయింది. టోఫెల్ పీరియడ్ తీసేశారు. ఎనిమిదో తరగతికి వచ్చే సరికి ప్రతి పిల్లవాడికి ట్యాబులు ఇచ్చే స్కీం కూడా అటకెక్కించేశారు. పిల్లలు ప్రభుత్వ బడులకు పోవాలంటే నో వేకెన్సీ బోర్డుల ఉన్న మన హయాం నుంచి ఇవాళ అమ్మో ప్రభుత్వ బడులకు వద్దు అన్ని స్థితికి తెచ్చేశారు. ఉన్నత విద్య కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చే పరిస్థితి మన హయాంలో ఉండేది. ప్రతి మూడు నెలలకు వారికి ఫీజులు మన హయాంలో చెల్లిస్తే.. నేడు చంద్రబాబు పుణ్యమాని విద్యాదీవెన, వసతి దీవెన గాలికెగిరిపోయింది. పేదవాడు ఏ కార్పోరేట్ ఆసుపత్రికైనా వెళ్లి ఉచితంగా రూ.25 లక్షల వరకు చికిత్స చేయించుకునే పరిస్థితి మన పాలనలో ఉండేది.ఇప్పుడు 11 నెలల టీడీపీ పాలనలో ఆరోగ్యశ్రీ నాశనం అయింది. నెలకి రూ.300 కోట్లు చొప్పున ఏడాదికి దాదాపు రూ.3500 కోట్లు సుమారుగా బకాయిలు పెట్టారు. ఆరోగ్యఆసరా లేదు. పేదవాడు నెట్ వర్క్ ఆసుపత్రులకు వైద్యం కోసం వస్తే నిరాకరిస్తున్నారు. మన ప్రభుత్వంలో రైతన్నలకు పెట్టుబడి సహాయం ఇస్తూ.. ఆర్బీకేల ద్వారా దళారీ వ్యవస్థ లేకుండా... రైతుల పంటలు కొనుగోలు చేసే కార్యక్రమం చేశాం. ఇవాళ రైతులకు ఇన్సూరెన్స్ కట్టుకునే పరిస్థితి కూడా లేకుండా చేశాడు. ఇ- క్రాప్ కనబడకుండా పోయింది.ఆర్బీకేలు నీరుగార్చాడు. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్ధితుల్లో ఉన్నారు. ధాన్యం, అరటి, కంది, చీనీ ఇలా ఏ పంటకైనా గిట్టుబాటు ధర లేదు. ఇంత దారుణమైన పాలన చేస్తున్నారు.మరోవైపు విచ్చలవిడి స్కాంలు జరుగుతున్నాయి. మన హయాంలో ఇసుకలో ప్రభుత్వానికి డబ్బులు వచ్చాయి. ఈ ప్రభుత్వంలో మన హయాంలో కన్నా అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వానికి ఆదాయం లేదు. ఏ గ్రామంలో చూసినా ఇవాళ గుడి చివర, బడి చివర, వీధి చివర ఎక్కడ చూసినా బెల్టు షాపులే. ఏ నియోజకవర్గంలో మైన్, ఫ్యాక్టరీ నడపాలన్నా ఎమ్మెల్యేకు అంతో ఇంతో ఇవ్వాలి. ఆయన ముఖ్యమంత్రికి ఇవ్వాలి. పంచుకో, దోచుకో తినుకో నడుస్తోంది.రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ... చంద్రబాబు తన మనుషులకు రూపాయికి ఎకరా కేటాయిస్తున్నాడు. ఊరూ పేరు లేని ఉర్సా, లూలూ, లిల్లీ గ్రూపులకు అడ్డగోలుగా భూములు కేటాయిస్తున్నారు. రివర్స్ టెండరింగ్ క్యాన్సిల్ చేశాడు. జ్యుడీషియల్ రివ్యూ తీసేశారు. కొత్తగా మొబలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడం మొదలుపెట్టారు. మొబలైజేషన్ అడ్వాన్స్ కింద 10 శాతం ఇచ్చి 8 శాతం తీసుకుంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఇంతటి దారుణమైన పాలన సాగిస్తున్నప్పుడు ఇలాంటి దుర్మార్గం ఎక్కువ రోజులు నిలబడదు. ప్రజలు కూడా చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు పుట్ బాల్ తన్నినట్లు తంతారు.ఎంతో మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉంటే.. ఎన్నో మోసాలు చేసి, అబద్దాలు చెప్పిన ఆయన పరిస్థితి ఏంటో ఇట్టే అర్థమవుతుంది. ఆ రోజు త్వరలోనే వస్తుంది. దానికోసం మనం అంతా గట్టిగా శ్రమించాలి...ఇంతకుముందు మన హయాంలో కార్యకర్తల కోసం అనుకున్నవిధంగా మనం చేయలేకపోయి ఉండవచ్చు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్ వచ్చింది. కోవిడ్ లాంటి మహమ్మూరి వల్ల... ఆ తర్వాత రెండు సంవత్సరాలు పాటు ప్రజల ఆరోగ్యం మీద పాలన మీద దృష్టి పెట్టి నడపాల్సి వచ్చింది. కార్యకర్తలు పడుతున్న కష్టాలు మీ జగన్ చూశాడు. మీ అందరికీ మాట ఇస్తున్నాను. వచ్చే జగన్ 2.0లో మీ అందరికీ పెద్ద పీట వేస్తాడు. రాత్రి వచ్చిన తర్వాత పగలు రాకతప్పదు. కష్టాలు వచ్చిన తర్వాత మంచి రోజులు కూడా వస్తాయి’’ అని వైఎస్ జగన్ చెప్పారు. -
చంద్రబాబే బాధ్యుడు: వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సింహాచలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటనలో పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదేనని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. దాదాపు ఏడాది కాలంగా గుడులు, గోపురాల్లో జరుగుతున్న ఘటనలన్నింటిలో చంద్రబాబే అసలు దోషి అని మండిపడ్డారు. వైకుంఠ ఏకాదశి, చందనోత్సవం ఎప్పుడు జరుగుతాయో ముందే తెలిసినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోక పోవడం చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ధ్వజమెత్తారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు, ఇప్పుడు ఇక్కడ చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు చనిపోవడంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం కళ్లకు కడుతోందని చెప్పారు. సింహాచలం ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. మొత్తం ఏడుగురు చనిపోగా, ఇందులో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు మంచి జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. మృతులు పిల్లా ఉమామహేశ్వరరావు, పిల్లా శైలజ కుటుంబ సభ్యులను చంద్రంపాలెం వద్ద ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింహాచలంలో చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో.. ఎంత మంది భక్తులు వస్తారో తెలిసినా కనీస ఏర్పాట్లు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత ముఖ్యమైన గోడను ముందే ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. 70 అడుగుల పొడవు, 10 అడుగుల ఎత్తున గోడను నాలుగు రోజుల్లో నిర్మాణం పూర్తి చేశారని, ఏమాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని ధ్వజమెత్తారు. గాలికి ఫ్లెక్సీ ఊగినట్లు ఈ గోడ కూలిపోయే ముందు ఊగిందని భక్తులు చెబుతున్నారంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థం అవుతోందన్నారు. ‘ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? మంత్రుల పర్యవేక్షణ ఏమైంది? ఐదుగురు సభ్యుల కమిటీ ఏం చేసింది? టెండర్లు పిలవకుండానే ఇంత పెద్ద గోడ ఎలా నిర్మించారు? కాంక్రీట్ గోడ (రీ ఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ వాల్) కట్టాల్సిన చోట ఫ్లైయాష్ ఇటుకలతో నిర్మించారు. ఎక్కడా కాలమ్స్ లేవు. ఏ మాత్రం నాణ్యత పాటించ లేదు. ఇలాగైతే ఆ గోడ ఎలా నిలబడుతుంది? రెండు రోజుల క్రితం పూర్తయిన ఈ గోడ పక్కనే అంత మంది భక్తులను ఎలా నిలబెట్టారు? ఫలితంగా ఆ గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం దారుణం’ అని నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. బాబు పాలనలో అన్నీ దారుణాలే.. చంద్రబాబు పాలన ప్రారంభమైనప్పటి నుంచి అన్నీ దారుణాలే జరుగుతున్నాయి. రాజకీయాల కోసం తిరుమల శ్రీవారి ప్రసాదంపై దు్రష్పచారం చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కనీస ఏర్పాట్లు చేయడంలో విఫలం కావడం వల్లే తిరుపతిలో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి ఆరుగురు చనిపోయారు. భద్రతా సిబ్బందిని చంద్రబాబు పర్యటనకు కుప్పం పంపారు. అదే సమయంలో తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం వచి్చన భక్తులందరినీ ఓ పార్కులోకి పంపారు. వారందరినీ ఒక్కసారిగా వదలడం వల్ల తొక్కిసలాట జరిగింది. గోశాలలో ఆవులు పెద్ద ఎత్తున మృత్యువాత పడ్డాయి. వైఎస్సార్ జిల్లా కాశినాయన క్షేత్రాన్ని కలెక్టర్ సమక్షంలోనే బుల్డోజర్లతో కూల్చి వేశారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంలో తాబేళ్లు మృత్యువాత పడ్డాయి. చంద్రబాబు గత పాలనలో గోదావరి పుష్కరాల సందర్భంగా ఆయన ప్రచార ఆర్భాటం కోసం భక్తులను గుంపుగా వదలడం వల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మృత్యువాత పడ్డారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చంద్రబాబు వస్తారు.. ఎంక్వైరీ వేస్తున్నామంటారు. తీరా ఎలాంటి చర్యలూ ఉండవు. ఎందుకంటే ఆయా ఘటనలన్నింటికీ చంద్రబాబే బాధ్యుడు కాబట్టి. తిరుపతి క్యూలైన్లలో తొక్కిసలాట ఘటనలో తూతూ మంత్రంగా కంటి తుడుపు చర్యలు తీసుకున్నారు. పైగా వాటన్నిటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అందుకు సంబంధించిన ఏ అధికారికైనా ఉద్యోగాలు పోతాయి.. యూనిఫాం పోతుందని ఒంట్లో భయం ఉండాలి. అప్పుడే క్రమశిక్షణ ఉంటుంది. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటం ఆగిపోతుంది. పశ్చాత్తాపం ఉండాలి» ఈ ఫొటో చూడండి.. ఎక్కడైనా కాలమ్స్ కనిపిస్తున్నాయా చెప్పండి? 10 అడుగుల ఎత్తు.. 70 అడుగుల పొడవున్న గోడ కూలిపోయేటప్పుడు ఫ్లెక్సీ మాదిరిగా ఊగిందని చెబుతున్నారు. ఏం నిర్మాణం చేశారు? ఏ రకంగా పని చేయిస్తున్నారు? జగన్ ఇచ్చే లోపే ఆ కుటుంబాలకు రూ.కోటి ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నా. బాధ్యులపై, బాధ్యత తీసుకున్న మంత్రులపై, ఆలయాన్ని నడిపే బాధ్యతలో ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇటువంటివి పునరావృతం కావు.» ప్రతీదీ డైవర్షన్ పాలిటిక్సే.. ఎక్కడా కూడా తప్పు చేశామన్న పశ్చాత్తాపం వీళ్లలో కనిపించడం లేదు. చంద్రబాబులో అది ఎక్కడా కనిపించదు. నేను ఇక్కడకు వస్తున్నానని తెలుసుకుని మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం, ఒక ఉద్యోగం ప్రకటించారు. ప్రభుత్వం అనేది ప్రజలకు భరోసా ఇచ్చేలా ఉండాలి. ప్రజలకు తోడుగా ఉండాలి.» ఏదైనా ప్రమాదం జరిగి ప్రజలు చనిపోతే.. ప్రభుత్వంలో ఉన్నవారు పశ్చాత్తాపం చెందాలి. మనం ఆ కుటుంబానికి ఏం చేస్తున్నామనేది మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. మన ప్రభుత్వంలో ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ఒక్కొక్క కుటుంబానికి రూ.కోటి ఇచ్చి ఆదుకున్నాం. ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ఈ ఘటన జరిగినప్పుడు ఆ కుటుంబానికి నువ్వేం చేస్తున్నావ్ చంద్రబాబూ? నేను ఒకటే చెబుతున్నా.. మీరు ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. ఈ కుటుంబాల్ని గుర్తు పెట్టుకుంటున్నాను. మేం మళ్లీ అధికారంలోకి వచి్చన తర్వాత రూ.కోటికి మిగిలిన బ్యాలెన్స్ నేను ఇప్పిస్తాను. » ఈ కార్యక్రమంలో మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమర్నాథ్, భీమిలి ఇన్చార్జ్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, తలశిల రఘురాం, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, మాజీ ఎంపీ బొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొన్నారు.ఈ గోడ ఎవరు కట్టారో తెలియదట! ప్రతి చోటా నిర్లక్ష్యమే. ప్రతిచోటా డైవర్షన్ పాలిటిక్సే. డైవర్షన్ పాలిటిక్స్ ఏ స్థాయిలో దిగజారిపోయాయో మంత్రుల ప్రకటనలు చూస్తేనే అర్థమవుతోంది. సింహాచలం ఘటనలో మంత్రులు మొదటగా ఏమన్నారంటే.. ఈ గోడ ఎవరి హయాంలో.. ఎవరు కట్టారో చూడాలని మాట్లాడారు. వారి తీరు చూస్తే.. వేరే వాళ్లపై నెట్టేసేందుకేనని అర్థమవుతోంది. వాళ్ల హయాంలోనే వారం రోజుల క్రితమే గోడ కట్టారని ఎప్పుడైతే తెలుసుకున్నారో.. గోడ పిల్లర్లతో కట్టారో.. సిమెంట్‌తో కట్టారో.. బ్రిక్స్‌తో కట్టారో అనేది మాకు తెలీదని మాట్లాడుతున్నారు.ఏమీ తెలుసుకోకపోతే.. ముందస్తు ఏర్పాట్ల పేరుతో మంత్రుల కమిటీ పేరుతో ఎందుకు ఇక్కడికి వచ్చారు? మీ సమక్షంలోనే ముందస్తు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ గోడ ఎందుకు కట్టారు? 70 అడుగుల పొడవు.. 10 అడుగుల ఎత్తుతో ఒక్క కాంక్రీట్ పిల్లర్ కూడా లేకుండా గోడ ఎందుకు కట్టించారు? చందనోత్సవం జరిగిన ప్రతిసారీ వర్షం పడింది. కొత్త గోడ అని తెలిసి.. వర్షం పడుతుందని తెలిసినప్పుడు ఈ గోడ పక్కన ఎందుకు భక్తుల్ని ఉంచారు?అండగా ఉంటాం..మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ భరోసా రూ.కోటి పరిహారం వచ్చేలా చూస్తామని హామీమధురవాడ (విశాఖ): చందనోత్సవంలో గోడ కూలి మృతి చెందిన ఉమా మహేశ్వరరావు, శైలజ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం మధురవాడ చంద్రంపాలెం ఎన్జీవోస్ కాలనీ శ్మశాన వాటిక వద్ద పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వైఎస్ జగన్‌ను చూసి మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆయన బాధితులతో మాట్లాడారు. వారు ఎన్ని గంటలకు దేవస్థానానికి వెళ్లారు.. ప్రమాదం ఎలా జరిగింది.. పిల్లలు ఎంత మంది.. పరిహారం ఎంత ఇస్తున్నారు.. తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.తాము రూ.కోటి అడిగామని, రూ.25 లక్షలు, ఉద్యోగం ఇస్తామని మంత్రులు చెప్పారన్నారు. అది ప్రభుత్వ ఉద్యోగమా.. ప్రైవేటు ఉద్యోగమా అని అడగ్గా.. ప్రభుత్వ ఉద్యోగమేనని చెప్పారు. తమ కుటుంబాన్ని అన్ని విధాలుగా పోషించే వ్యక్తి చని పోయాడని, మూడేళ్ల క్రితం అల్లుడు కూడా చనిపోయాడని, చెల్లి పిల్లలను కూడా తమ కొడుకే సాకుతున్నాడని ఇప్పుడు అతడు కూడా చనిపోయాడని మృతుడి తల్లిదండ్రులు అప్పలనాయుడు, శాంతి గుండెలవిసేలా రోదిస్తూ చెప్పారు. తాము అండగా ఉంటామని, రూ.కోటి పరిహారం వచ్చేలా చూస్తామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. బాధితుల తరఫున గట్టిగా మాట్లాడతామని పేర్కొన్నారు. -
జగన్ వస్తున్నారని తెలిసి ప్రభుత్వంలో వణుకు
ఆరిలోవ/డాబాగార్డెన్స్: సింహాచలం ఘటన గురించి తెలిసిన వెంటనే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖకు బయలుదేరారన్న సమాచారం అందుకున్న ప్రభుత్వం కలవరపాటుకు గురైంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారని వణికిపోయింది. వైఎస్ జగన్ కేజీహెచ్ మార్చురీకి చేరుకునేలోపే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వారి బంధువులకు అప్పగించేందుకు రాష్ట్ర హోం మంత్రి అనిత పడరాని పాట్లు పడ్డారు. పోస్టుమార్టంకు అంగీకరిస్తూ సంతకాలు చేయాలంటూ బాధిత కుటుంబాల కాళ్లావేళ్లాపడ్డారు.శవపంచనామాకు సహకరించాలని, ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారంతోపాటు రూ.కోటి పరిహారం అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మొరపెట్టుకున్నారు. తమను నమ్మాలని ప్రాధేయపడ్డారు. అయినా మృతుల కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. వారం రోజుల్లోనే నాణ్యత లేకుండా గోడ నిర్మించి తమ కుటుంబీకుల మరణానికి కారణమైన ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదంటూ భీష్మించారు. రాతపూర్వకంగా ఇవ్వాలని, లేదా మీడియా ముందు స్పష్టంగా ప్రకటించాలని తేల్చిచెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోని హోంమంత్రి అనిత వైఎస్ జగన్ వచ్చేలోపే పోస్టుమార్టం పూర్తిచేసి మృతదేహాలను బంధువులకు అప్పగించాలని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్‌తోపాటు పోలీసు అధికారులను ఆదేశించారు. వారి చేత మృతుల కుటుంబాలపై తీవ్ర ఒత్తిడి చేయించారు. మృతులు భీమిలి నియోజకవర్గం వారు కావడంతో వారిని ఒప్పించాలని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుయాయులనూ బతిమిలాడారు. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్‌రాజు కూడా మృతుల కుటుంబ సభ్యులకు నచ్చజెప్పేందుకు శతవిధాలా యత్నించారు. చివరకు సంతకాలు లేకుండానే మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తిచేయించారు. సింహాచలం ఘటన గురించి విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ పట్టించుకోలేదు. సింహాచలం దేవస్థానం వైపు కన్నెత్తి చూడలేదు. -
చంద్రబాబు పాలనలో.. జగన్ పాలనలో
-
బాబే అన్నింటికీ దోషి.. సింహాచలం బాధిత కుటుంబానికి వైఎస్ జగన పరామర్శ (ఫొటోలు)
-
వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో రేపు వైఎస్ జగన్ భేటీ
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి భేటీ కానున్నారు. గురువారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ, ప్రకాశం జిల్లా మార్కాపురం, శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ప్రస్తుత రాజకీయాలపై చర్చ, పార్టీ బలోపేత చర్యల్లో భాగంగా స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో వరుసగా వైఎస్ జగన్ సమావేశం అవుతున్న సంగతి తెలిసిందే. రేపటి సమావేశానికి ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలను ఆహ్వనించారు. వీరితో పాటు ఆయా జిల్లాలకు సంబంధించిన పార్టీ ముఖ్య నాయకులు కూడా హాజరు కానున్నట్లు వైఎస్సార్సీపీ ఒక ప్రకటనలో తెలిపింది. -
బాబు ఏడాది పాలనలోనే ఇంతటి దారుణాలు చూడాల్సి వచ్చింది: వైఎస్ జగన్
విశాఖపట్నం, సాక్షి: చంద్రబాబు ఏడాది పాలనలోనే దారుణమైన పరిస్థితులు.. అదీ ఆలయాల్లో చూడాల్సి వస్తోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం సింహాచలం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.సింహాచలంలో గోడ కూలిపోయి ఏడుగురు చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వైకుంఠ ఏకాదశి నాడు కూడా ఇలాగే చేశారు. నాడు తిరుపతిలో జరిగిన తోపులాటలో ఆరుగురు చనిపోయారు. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో ఈ ప్రభుత్వానికి తెలీదా?. లక్షల మంది భక్తులు వస్తారని తెలిసి కూడా నిర్లక్ష్యం వహించారు. కనీస సౌకర్యాలు కూడా లేవని భక్తులు చెబుతున్నారు. ఆరు రోజుల కిందట గోడ కట్టడం మొదలుపెట్టారు. రెండు రోజుల కిందట పూర్తి చేశారు. పదడుగుల ఎత్తు.. డెబ్బై అడుగుల పొడవుతో గోడ కట్టారు. కనీసం ఎటువంటి టెండర్లు లేకుండా ఈ గోడ పని పూర్తి చేశారు. దాదాపుగా సంవత్సరం అయ్యింది చంద్రబాబు అధికారంలోకి వచ్చి. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో చంద్రబాబుకి తెలియదా?. జరుగుతుందని తెలిసి కూడా ముందే గోడ కట్టే కార్యక్రమం చేపట్టలేకపోయారు?. ముందస్తు ఏర్పాట్లపై ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు. మంత్రుల కమిటీ ఏం చేసిందసలు?. కాంక్రీట్ గోడతో కట్టాల్సిన చోట.. ఫ్లైయాష్ ఇటుకలతో నిర్మించారు. కనీసం నాణ్యంగా ఆ గోడను ఎందుకు నిర్మించలేకపోయారు?. వర్షం పడిందని తెలుసు. చందనోత్సవం సందర్భంగా ప్రతీసారి వర్షం పడుతుందని తెలుసు. అయినా రెండు రోజుల కిందట కట్టిన ఆ గోడ పక్కనే క్యూ లైన్ పెట్టారు. చంద్రబాబు ఏడాది పాలనలో దారుణాలు చూడాల్సి వస్తోంది. రాజకీయాల కోసం తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేశారు. తొక్కిసలాట ఘటనలో ఏడుగురిని బలిగొన్నారు. తిరుమల గోశాలలో గోవులు కూడా చనిపోయాయి. కాశినాయన గుడిని బుల్డోజర్లతో కూల్చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం ఆలయంలో తాబేళ్లు మృతి చెందాయి. అంతకు ముందు గోదావరి పుష్కరాల్లో 29 మందిని బలిగొన్నారు. ఇన్ని జరుగుతున్నా చర్యలు లేవు. ఎందుకంటే అన్నింటిలోనూ చంద్రబాబే దోషి. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. ఈ ఘటనలోనూ నిందను మాపైకి నెట్టే యత్నం చేశారు. కానీ, వాళ్ల హయాంలో.. అదీ రెండు రోజుల కిందటే ఆ గోడ కట్టిందని తేలింది. అయినా చంద్రబాబులో ఎక్కడా పశ్చాత్తాపం కనిపించడం లేదు.ప్రభుత్వం అంటే ప్రజలకు భరోసా ఇచ్చేదిగా ఉండాలి. మొక్కుబడిగా రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. జగన్ వస్తున్నాడనే ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వం తప్పిదం కాబట్టి పరిహారం పెంచి ఇవ్వాలి. మా ప్రభుత్వంలో ఇలాంటి ప్రమాదాలు జరిగితే.. బాధ్యతగా అధిక పరిహారం చెల్లించాం. ఈ బాధిత కుటుంబాలకు కూడా మా ప్రభుత్వం వచ్చాక ఆ పని తప్పకుండా చేస్తాం’’ అని వైఎస్ జగన్ ప్రకటించారు. కానీ, బాధ్యులపైనా కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటివి పునరావృతం కావని చంద్రబాబుకి వైఎస్ జగన్ హితవు పలికారు. -
ఉమామహేష్, శైలజకు నివాళి.. జగన్ భావోద్వేగం
విశాఖపట్నం, సాక్షి: సింహాచలం బాధిత కుటుంబాన్ని పరామర్శించే క్రమంలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) భావోద్వేగానికి లోనయ్యారు. ఆ కుటుంబ సభ్యులను ఓదారుస్తూ ధైర్యం చెప్పారు. సింహాచలంలో దైవదర్శనానికి వెళ్లిన పిల్లా ఉమామహేష్, అతని భార్య శైలజ గోడ కూలిన ఘటనలో మృతి చెందారు. వాళ్ల కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు వైఎస్ జగన్ మధురవాడలోని చంద్రంపాలెంకు వెళ్లారు. ఆయన్ని చూసి ఆ కుటుంబ సభ్యులు భావోద్వేగాన్ని లోనయ్యారు. దీంతో ఆయన వాళ్లను హత్తుకుని ఓదార్చారు. అనంతరం.. ఉమా మహేశ్వరరావు, శైలజ భౌతికకాయాలకు నివాళి అర్పించి మీడియాతో మాట్లాడారాయన. -
నెల్లూరు: వైద్య విద్యార్థుల మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
గుంటూరు, సాక్షి: నెల్లూరు జిల్లా కారు ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్ధులు, మరొకరు మృతి చెందడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్న ఆయన.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారాయన.నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద ఇవాళ ఘోర ప్రమాదం జరిగింది. ముంబయి జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్‌బంకు వద్దకు రాగానే ఓ కారు అదుపు తప్పిన ఓ హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న వెంకట రమణయ్య (50) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే.. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వైద్య విద్యార్థుల్లో.. ఐదుగురు మరణించారు. తీవ్రంగా గాయపడ్డ మరో విద్యార్థికి ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. ఇదీ చదవండి: నెల్లూరులో కారు బీభత్సం: ఘోర ప్రమాదం ఇలా.. -
Simhachalam: విశాఖకు మాజీ సీఎం వైఎస్ జగన్
-
విశాఖ: సింహాచలం బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చేరుకున్నారు. సింహాచలం ఘటనలో మృతిచెందిన బాధిత కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. మృతిచెందిన ఉమామహేష్, శైలజ భౌతికాయాలకు నివాళులర్పించిన వైఎస్ జగన్.. మృతుల కుటుంబాలను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్ క్యూలైన్ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలోనే మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రంపాలెం బయల్దేరి వెళ్లారు,. తొలుత తాడేపల్లి నుంచి విశాఖకు చేరుకున్న వైఎస్ జగన్.. అక్కడ నుంచి చంద్రంపాలెం వెళ్లారు. -
సింహాచలం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
Vishakha: సింహాచలం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
విశాఖ,సాక్షి : విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. గోడ కుప్పకూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ విషాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్ క్యూలైన్ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. -
ఏపీలో అంతులేని అవినీతి, అంతా అరాచకమే: వైఎస్ జగన్
-
అంతులేని అవినీతి.. అంతా అరాచకం: వైఎస్ జగన్
రాష్ట్రంలో ఇప్పుడు ఏ పంటకూ మద్దతు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వివిధ జిల్లాల్లో కష్టాలు ఎదుర్కొంటున్నారు. మనం వారి తరఫున నిలబడి గట్టిగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. అన్న దాతలకు ఆయా జిల్లాల్లో మీరంతా అండగా నిలిచి వారి డిమాండ్ల సాధనకు బలంగా ఉద్యమించాలి. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు అన్నింటా ఘోర వైఫల్యం చెందిందని.. యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని.. అంతులేని అవినీతి జరుగుతోందని.. వీటన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ జిల్లాల అధ్యక్షులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదని మండిపడ్డారు. విద్య, వైద్యం, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాల్లో విధ్వంసమే కొనసాగుతోందన్నారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. ప్రజల పక్షాన గట్టిగా పోరాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా అధ్యక్షులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లాల అధ్యక్షులతోపాటు రీజినల్ కో ఆర్డినేటర్లు, ఎంపీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే...ఎల్లప్పుడూ బాసటగా నిలిచేది మనమే..చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాల వల్ల కష్టాల్లో కూరుకుపోయిన ప్రజలకు అండగా నిలబడాలి. ఆ కార్యక్రమాలు రాష్ట్ర స్థాయి దృష్టిని ఆకర్షిస్తాయి. వాటి ద్వారా మీ పనితీరు కూడా బయటపడుతుంది. ఈ ప్రక్రియలో పార్టీ జిల్లా అధ్యక్షులది చాలా కీలక బాధ్యత. సమాజంలో గొంతులేని వారికి బాసటగా నిలిచేది ఎప్పుడైనా మనమే. ప్రతి సమస్యలోనూ మనం బాధితులకు తోడుగా ఉంటాం. తొలి నుంచి అలా నిలుస్తోంది, ఆ పని చేస్తోంది ఒక్క వైఎస్సార్సీపీనే.అక్టోబర్‌లోగా బూత్ కమిటీలుమే నెలాఖరులోపు పార్టీ మండల కమిటీలు ఏర్పాటు కావాలి. జూన్, జూలైల్లో గ్రామస్థాయి, మున్సిపాల్టీల్లో డివిజన్ కమిటీలను పూర్తి చేయాలి. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో బూత్ కమిటీలన్నీ ఏర్పాటవ్వాలి. ఇదే లక్ష్యంగా మీరంతా పని చేయాలి. అలాగే పార్టీని జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ మరింత బలంగా తీసుకెళ్లే బాధ్యత కూడా మీపై ఉంది. ఆ దిశలో పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగాలి. పార్టీలో జిల్లా అధ్యక్షుల పాత్ర చాలా కీలకం. గ్రామస్థాయి బూత్ కమిటీలు, గ్రామ కమిటీల ఏర్పాటు అనేది అత్యంత కీలక విధుల్లో ఒకటి. అందుకే పార్టీలో సమర్థులు ఎవరు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు లీడ్ చేయగలరు? అనేది ఆలోచన చేసి మీకు బాధ్యతలు అప్పగించాం.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి మీరే పార్టీ.. పార్టీయే మీరుమీ జిల్లాల్లో పార్టీ మీద మీకు పట్టు ఉండాలి. పార్టీ బలోపేతం కోసం గట్టిగా కృషి చేయాలి. బాధ్యతల నుంచే అధికారం వస్తుంది. పార్టీకి జిల్లాల్లో మీరే సర్వం. మీరే పార్టీ.. పార్టీయే మీరు. జిల్లాల్లో అన్ని స్థానాల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మీది. మనసా వాచా కర్మణా అదే తలంపుతో పార్టీని నడపాలి. దీనికోసం ఏం చేయాలన్న దానిపై వ్యూహంతో కదలండి. గట్టిగా పని చేయండి. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ప్రతి కమిటీ బలంగా ఉండాలి. ఏదైనా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పనితీరు బాగోలేకపోతే పిలిచి చెప్పగలగాలి. అప్పటికీ పరిస్థితి మారకపోతే ప్రత్యామ్నాయం చూడాలి. అక్కడా మీ భాగస్వామ్యమే కీలకం. పార్టీలో ఎక్కడైనా ఇద్దరి మధ్య వివాదం తలెత్తితే వారిని పిలిచి సమన్వయం చేయాల్సిన బాధ్యత మీది. మీ పరిధిలో జిల్లాలో అన్ని స్థానాలు గెలిపించాల్సిన బాధ్యత మీది. అందుకే ఆ బాధ్యత, అధికారం.. రెండూ తీసుకోండి. మీరు సమర్థులని భావించి ఈ బాధ్యతలు అప్పగించాం. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయం చేయడం, జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ కమిటీల నిర్మాణం మీ ప్రధాన బాధ్యత. అలాగే ప్రజా సంబంధిత అంశాల్లో చురుగ్గా ఉండాలి. నాయకత్వ ప్రతిభ బయటపడేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే..ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయట పడుతుంది. భారీ లక్ష్యం ఉన్నప్పుడే బ్యాట్స్‌మన్ ప్రతిభ బయట పడుతుంది. అప్పుడే ఆ బ్యాట్స్‌మన్ ప్రజలకు ఇష్టుడు అవుతాడు. ఇది కూడా అంతే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసే పనుల వల్ల ఎలివేట్ అవుతాం. తద్వారా ప్రజల దగ్గర, పార్టీలోనూ గౌరవం పెరుగుతుంది. ఇమేజీ కూడా పెరుగుతుంది. మన పనితీరు వల్లే మన్ననలు పొందగలుగుతాం. అందరూ ధోనీల్లా తయారు కావాలి. జిల్లాల్లో ఏం జరిగినా మీరు ప్రజల తరఫున నిలబడాలి. చురుగ్గా కార్యక్రమాలు చేయాలి. ప్రజా వ్యతిరేక అంశాల మీద గట్టిగా పోరాటం చేయాలి. లేదంటే పార్టీపరంగా మనం అవకాశాలను కోల్పోయినట్టే. ప్రజలకు మరింత చేరువవుదాంబాధితులకు మనం ఎప్పుడూ అండగా ఉండాలి. మనమంతా రాజకీయ నాయకులం. మన జీవితాలను రాజకీయాల కోసం కేటాయించామనే విషయం మరిచిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకూడదు. ప్రతిపక్షంగా మనకు వచ్చిన అవకాశాలను వదిలి పెట్టకూడదు. జిల్లా స్థాయిలో ప్రజా సంబంధిత అంశాలను మీరు బాగా వెలుగులోకి తీసుకొస్తేనే ప్రజలకు మరింత దగ్గరవుతాం. మనం అధికారంలోకి వస్తేనే ప్రజలకు మరింత మంచి చేయగలం. ప్రజలకు మరింత మంచి చేయాలన్న తపన, తాపత్రయం ఉంది కాబట్టే రాజకీయాలు చేస్తున్నాం. నాన్నగారు చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలనుకున్నాను కాబట్టే నేను రాజకీయాలు చేస్తున్నాను. అలాగే ప్రతి జిల్లాల్లో మీ సేవల గురించి మాట్లాడుకోవాలి.ఏడాదిలోపే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతసాధారణంగా రెండు, మూడేళ్లయితే గానీ ప్రభుత్వ వ్యతిరేకత బయటకు కనిపించదు. కానీ ఏడాదిలోపే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉంది. అందుకే యుద్ధ ప్రాతిపదికన కమిటీల నిర్మాణం పూర్తి చేయాలి. దీని తర్వాత పార్టీ పరంగా మీకూ, నాకూ పూర్తి స్థాయిలో పని ఉంటుంది. అందరం కలసికట్టుగా పార్టీ కార్యక్రమాలను బలంగా ముందుకు తీసుకెళ్లాలి. అందుకే పార్టీ పరంగా నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. ఈ ప్రక్రియలో గ్రామస్థాయిలో కూడా కమిటీలు, బూత్ కమిటీలు ఏర్పాటు అయితేనే మనం పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉన్నట్లు అవుతుంది. ప్రతి జిల్లాలో బలంగా పార్టీ నిర్మాణం ద్వారా దాదాపు 12 వేల మంది మన పార్టీ కార్యక్రమాల కోసం మీకు అందుబాటులో ఉంటారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపు 1,500 మంది అందుబాటులో ఉంటారు.ప్రజా సమస్యలపై సమన్వయంతో పోరాటంచంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రాష్ట్రంలో ఆయన చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. విద్య, వైద్యం, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాల్లోనూ విధ్వంసమే కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో మీ జిల్లాలో పార్టీ ఓనర్షిప్ మీదే. ప్రజా సంబంధిత అంశాల్లో మరింత చొరవ చూపాలి. ఒకరి ఆదేశాల కోసం ఎదురు చూడొద్దు. మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలి. నియోజకవర్గ ఇన్చార్జిని స్వయంగా కలవాలి. వారితో కలసి మొదట -పార్టీ జిల్లా అధ్యక్షులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం -
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు జరిగాయి. పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో పాటు.. సింగనమల అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్తగా సాకే శైలజానాథ్‌ను నియమిస్తూ.. పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు వీరే1.శ్రీకాకుళం-కుంభా రవిబాబు (ఎమ్మెల్సీ)2.విజయనగరం- కిల్లి సత్యనారాయణ3.అరకు- బొడ్డేటి ప్రసాద్4.అనకాపల్లి-శోభా హైమావతి (మాజీ ఎమ్మెల్యే)5.విశాఖ-కదిరి బాబూరావు (మాజీ ఎమ్మెల్యే)6.కాకినాడ- సూర్యనారాయణరాజు (మాజీ ఎమ్మెల్సీ)7.అమలాపురం-జక్కంపూడి విజయలక్ష్మి8.ఏలూరు-వంకా రవీంద్రనాథ్ (ఎమ్మెల్సీ)9.రాజమండ్రి- తిప్పల గురుమూర్తిరెడ్డి10.మచిలీపట్నం -జెట్టి గురునాథం11.నరసాపురం- ముదునూరి మురళీకృష్ణంరాజు12.విజయవాడ-మోదుగుల వేణుగోపాలరెడ్డి (మాజీ ఎంపీ)13.గుంటూరు-పోతిన మహేష్14.నరసరావుపేట-డా.పూనూరు గౌతంరెడ్డి15.బాపట్ల-తూమటి మాధవరావు (ఎమ్మెల్సీ)16.ఒంగోలు-బత్తుల బ్రహ్మానందరెడ్డి17.నెల్లూరు-జంకె వెంకటరెడ్డి (మాజీ ఎమ్మెల్యే)18.తిరుపతి-మేడా రఘునాథరెడ్డి (ఎంపీ)19.చిత్తూరు-చవ్వా రాజశేఖర్‌రెడ్డి20.రాజంపేట- కొత్తమద్ది సురేష్‌బాబు (మేయర్)21.కడప-కొండూరి అజయ్‌రెడ్డి22.అనంతరం-బోరెడ్డి నరేష్‌కుమార్‌రెడ్డి( మాజీ ఎమ్మెల్సీ)23.హిందూపురం-ఆర్.రమేష్‌రెడ్డి24.నంద్యాల- కల్పలతారెడ్డి (ఎమ్మెల్సీ)25.కర్నూలు-గంగుల ప్రభాకర్‌రెడ్డి (మాజీ ఎమ్మెల్సీ) -
హామీల అమలులో ‘కూటమి’ ఘోర వైఫల్యం: మేరుగు నాగార్జున
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ‘వాయిస్ ఆఫ్ వాయిస్‌లెస్’గా వైఎస్సార్సీపీ పని చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశించారని మాజీ మంత్రి, పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున వెల్లడించారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారుఆ బాధ్యత పార్టీపై ఉంది:రాబోయే రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిర్దేశించారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ, ప్రజాసమస్యలపై ఉద్యమించేందుకు సిద్దంగా ఉండేలా పార్టీని సమాయత్తం చేయాలని ఆయన ఆదేశించారు. కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమై, ప్రజల గోడు పట్టించుకోని నిర్లక్ష్యం తాండవిస్తోందని, దీనిపై ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత పార్టీపై ఉందని జగన్ గుర్తు చేశారు.వాటిపై దృష్టి సారించాల్సి ఉంది:రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారికి వైఎస్సార్సీపీ అండగా ఉండాలనే కోణంలో సమావేశంలో జగన్ పలు అంశాలు నిర్దేశించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ, కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేయడంతో పాటు, పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. నియోజకవర్గ సమన్వయకర్త నుంచి మండల స్థాయి వరకు పార్టీ శ్రేణులు పూర్తి సమన్వయంతో పని చేయాలని కోరారు.హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలి:రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయి. బాధితులకు అన్యాయం జరుగుతున్న ప్రతిచోటా వైయస్ఆర్సీపీ ఉండాలని వైయస్ జగన్ సూచించారు. ప్రజలకు కూటమి పార్టీలు 143 వాగ్ధానాలను ఇచ్చాయి. సూపర్ సిక్స్ కాస్తా గాలికి వదిలేశారు. గత వైయస్ఆర్సీపీ హయాంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలు, ప్రజల జీవన ప్రమాణాల్లో తీసుకువచ్చిన మార్పులను మరోసారి గుర్తు చేసుకోవాలి.ఇప్పుడు వాగ్దానాల అమలు అనేది ఎక్కడా లేదు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు జరుగుతోంది. సంక్షేమ పథకాలు పేదలకు చేరువ కావడం లేదు. విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. పేదలు తమ పిల్లలను చదివించుకోలేక, బడికి పంపాల్సిన పిల్లలను కూలికి పంపుతున్నారు. ఇటువంటి స్థితిలో వైయస్సార్సీపీ వారికి అండగా నిలబడుతుంది.రైతుల్లో భరోసా కల్పించాలి:రైతులను పట్టించుకునే తీరికే కూటమి ప్రభుత్వానికి లేదు. గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయంలో రైతేరాజుగా ప్రాధాన్యత ఇచ్చాం. రైతుభరోసా ద్వారా రైతులకు అండగా నిలిచాం. విత్తనం నంచి విక్రయం వరకు ఆర్బీకేల ద్వారా ఆనాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆదుకుంది. నేడు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటీవలే గుంటూరు మిర్చియార్డ్‌కు వెళ్ళిన వైఎస్ జగన్‌కి మిర్చిరైతులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. దీనిపై వెంటనే సీఎం చంద్రబాబు స్పందించి కేంద్రానికి ఒక లేఖ రాసి, కేంద్రం ద్వారా మిర్చి కొనుగోళ్లు చేయిస్తామంటూ ఒక ప్రకటన చేసి, చేతులు దులుపుకున్నారు. ఆ తరువాత మిర్చి రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.ఇప్పుడు మిర్చి రైతులు కనీస ధరలు లేక, అప్పులపాలై దారుణ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మిర్చి రైతులకు అండగా వైయస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడంతో పాటు, రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి వస్తే ఏ రకంగా మిర్చి రైతులను ఆదుకుంటామో కూడా వారికి ఒక భరోసాను కల్పించాలని వైఎస్ జగన్ నిర్ధేశించారు.పొగాకు రైతుల గోడు కూటమి సర్కార్‌కు పట్టడం లేదు:పొగాకు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పొగాకు రైతులు తమ పంటను వ్యాపారులు కనీస మద్దతు ధరకు కూడా కొనుగోలు చేయడం లేదని చెబితే, సదరు వ్యాపారుల ఫ్యాక్టరీలకు కరెంట్ తీసేస్తాను అంటూ చంద్రబాబు డ్రామాలు ఆడారు. పొగాకు రైతులను అప్పటికప్పుడు నమ్మించి పంపి, ఆ తరువాత వారి గోడును కనీసం పట్టించుకోని ఘనుడు చంద్రబాబు.అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పొగాకు రైతుల విజ్ఞప్తులకు స్పందించి వ్యాపారులు తప్పకుండా కొనుగోలు చేయాలని, లేని పక్షంలో మేమే కొనుగోలు చేస్తామని చెప్పి, మార్క్‌ఫెడ్ ద్వారా రూ.200 కోట్లకు పైగా వెచ్చించి మద్దతు ధరకు కొనుగోలు చేయించారు. అదీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ చిత్తశుద్ది. ఈరోజు మార్కెట్లో క్వింటా పొగాకు రూ.36 వేలు ధర పలకాల్సి ఉండగా, మార్కెట్లో రూ.22 వేలకు కూడా కొనడం లేదు. అందుకే పొగాకు రైతుల పక్షాన ఉద్యమించడానికి వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉండాలని సమావేశంలో వైఎస్ జగన్ నిర్దేశించారని మాజీ మంత్రి మేరుగు నాగార్జున వివరించారు. -
Merugu Nagarjuna: ఎందాకైనా పోరాటం.. అన్యాయం జరిగిన వారికి అండగా జగన్
-
LIVE: YSRCP జిల్లా అధ్యక్షులతో YS జగన్మోహన్రెడ్డి భేటీ
-
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదంటూ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులతో ఆయన సోమవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు సహా అనేక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతాకాదు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్నిరంగాల్లోనూ విద్వంసమే. రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతోంది. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. వీటిని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లాలి’ అని సూచించారు. జిల్లాలో పార్టీ ఓనర్షిప్ మీదిప్రజా సంబంధిత అంశాల్లో ఒకరి ఆదేశాలకోసం మీరు ఎదురు చూడొద్దు. మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలి. నియోజకవర్గ ఇన్‌ఛార్జితో కలిసి మొదట కదలాల్సిందే మీరే. ప్రజలకు అండగా మీరు చేస్తున్న కార్యక్రమాల వల్ల అది రాష్ట్రస్థాయి దృష్టిని ఆకర్షిస్తుంది. దీనిద్వారానే మీ పనితీరు బయటపడుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ మన్ననలు పొందాల్సిన బాధ్యత మీది. సమాజంలో గొంతులేని వారికి బాసటగా నిలిచేది వైయస్సార్సీపీయే. ప్రతి సమస్యలోనూ బాధితులకు తోడుగా నిలిచేది వైఎస్సార్సీపీయే. మే నెలలోపు మండల కమిటీలు పూర్తిచేయాలిజూన్-జులైల్లో గ్రామస్థాయి, మున్సిపాల్టీలల్లో డివిజన్ కమిటీలు పూర్తిచేయాలి. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో బూత్ కమిటీలు ఏర్పాటు కావాలి. ఈమేరకు లక్ష్యంగా పెట్టుకోండి. జిల్లా స్థాయి నుంచి పార్టీని గ్రామస్థాయి వరకూ తీసుకువెళ్లే బాధ్యతల్లో మీరు ఉన్నారు. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగాలి. జిల్లా అధ్యక్షుల పాత్ర పార్టీలో చాలా కీలకమైనది. గ్రామస్థాయి బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు ఏర్పాటు అనేది అత్యంత కీలక విధుల్లో ఒకటి. పార్టీలో సమర్థులు ఎవరు, ప్రతిపక్షంలో ఎవరు లీడ్ చేయగలరు అని ఆలోచన చేసి మీకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. మీమీ జిల్లాల్లో పార్టీ మీద మీకు పట్టు ఉండాలి. పార్టీ బలోపేతం కోసం గట్టిగా కృషిగా చేయాలి. బాధ్యతల నుంచే అధికారం వస్తుంది.జిల్లాల్లో మీరే సర్వం. మీరే పార్టీ.. పార్టీయే మీరుజిల్లాల్లో అన్నిస్థానాల్లో గెలిపించాల్సిన బాధ్యత మీది. మనసా వాచా కర్మేణా అదే తలంపుతో పార్టీని నడపాలి. జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో గెలిపించే బాధ్యత మీది. అది మీ ప్రధాన బాధ్యత. దీనికోసం ఏం చేయాలన్నదానిపై మీరు గట్టిగా పనిచేయాలి. జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ ప్రతి కమిటీ బలంగా ఉండాలి. ఏదైనా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పనితీరు బాగోలేకపోతే పిలిచి చెప్పగలగాలి. అప్పటికీ పనితీరు బాగోలేకపోతే ప్రత్యామ్నాయం చూడ్డంలో మీ భాగస్వామ్యం కీలకం. పార్టీలో ఇద్దరి మధ్య వివాదం ఉన్నప్పుడు పిలిచి సమన్వయం చేయాల్సిన బాధ్యత మీది. మీ పరిధిలో 7కు ఏడు గెలిపించాల్సిన బాధ్యత మీది. బాధ్యత, అధికారం రెండూ తీసుకోండి. మీరు సమర్థులని భావించి, మీకు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయం చేయడం, జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ కమిటీ నిర్మాణం మీ ప్రధాన బాధ్యత. అలాగే ప్రజా సంబంధిత అంశాల్లో చురుగ్గా ఉండాలి.ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయటపడుతుందిప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయటపడుతుంది. భారీ లక్ష్యం ఉన్నప్పుడే బ్యాట్స్‌మన్ ప్రతిభ బయటపడుతుంది. అప్పుడే ఆ బ్యాట్స్‌మెన్ ప్రజలకు ఇష్టుడు అవుతాడు. ఇదికూడా అంతే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసే పనులవల్ల మనం ఎలివేట్ అవుతాం. ప్రజల దగ్గర, పార్టీలోనూ గౌరవం పెరుగుతుంది. ఇమేజీ పెరుగుతుంది. మన పనితీరు వల్లే మనం మన్ననలను పొందగలుగుతాం. అందరూ ధోనీల్లా తయారు కావాలి. అప్పుడే మీ జిల్లాల్లో ఏడుకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలవగలుగుతాం. జిల్లాల్లో ఏ జరిగినా మీరు ప్రజల తరఫున నిలబడాలి.కార్యక్రమాలు చురుగ్గాచేయాలి, ఆయా కార్యక్రమాల్లో పాల్గొనాలి. ప్రజా వ్యతిరేక అంశాలమీద గట్టిగా పోరాటం చేయాలి. లేదంటే పార్టీపరంగా మనం అవకాశాలను కోల్పోయినట్టే. బాధితులకు మనం అండగా ఉండాలి.మనమంతా రాజకీయ నాయకులంమనమంతా రాజకీయ నాయకులం. మన జీవితాలను రాజకీయాలకోసం పెట్టామనే విషయం మరిచిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వెనకడుగు వేయకూడదు. ప్రతిపక్షంగా మనకు వచ్చిన అవకాశాలను వదిలిపెట్టకూడదు. జిల్లాస్థాయిలో ప్రజా సంబంధిత అంశాలను మీరు బాగా వెలుగులోకి తీసుకు వస్తేనే ప్రజలకు దగ్గరవుతాం. మనం అధికారంలోకి వస్తేనే ప్రజలకు మరింత మంచి చేయగలం. ప్రజలకు మరింత మంచి చేయాలన్న తపన, తాపత్రయం ఉంది కాబట్టే రాజకీయాలు చేస్తున్నాం. నాన్నగారు చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలనుకున్నాను కాబట్టే నేను రాజకీయాలు చేస్తున్నాను. అలాగే ప్రతి జిల్లాల్లో మీ సేవల గురించి మాట్లాడుకోవాలి.రెండు మూడు సంవత్సరాలు అయితే కాని ప్రభుత్వ వ్యతిరేకత సాధారణంగా బయటకు కనిపించదు. కాని ఏడాదిలోపే ప్రభుత్వంమీద వ్యతిరేకత తీవ్రంగా ఉంది. అందుకే యుద్ధ ప్రాతిపదికన కమిటీ నిర్మాణం పూర్తిచేయాలి. దీని తర్వాత పార్టీ పరంగా మీకూ, నాకూ పూర్తిగా పని ఉంటుంది. అందరం కలిసికట్టుగా పార్టీపరంగా కార్యక్రమాలు బలంగా ముందుకు తీసుకెళ్లాలి. అందుకనే పార్టీ పరంగా నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలి. గ్రామస్థాయిలోకూడా కమిటీలు, బూత్ కమిటీల ఏర్పాటు పూర్తిచేస్తే… పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉన్నట్టు అవుతుంది ప్రతి జిల్లాల్లో పార్టీ నిర్మాణం ద్వారా దాదాపు 12వేల మంది పార్టీ కార్యక్రమాలకోసం మీకు అందుబాటులో ఉంటారు. ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపుగా 1500 మంది ఉంటారు.మద్దతు ధరలు దొరక్క రైతులు తీవ్రంగా నష్టపోతున్నారువివిధ జిల్లాల్లో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రైతుల తరఫున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు జిల్లాల్లో రైతులకు అండగా ఉండాలి. రైతుల డిమాండ్లపై పోరాటం చేయాలి. -
ఇవాళ YSRCP జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ సమావేశం
-
కేటీఆర్ త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్ష
-
Garam Garam Varthalu: గరం గరం వార్తలు ఫుల్ ఎపిసోడ్
-
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా గాయపడిన మాజీ మంత్రి కేటీఆర్(KTR) త్వరగా కోలుకోవాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బ్రదర్ కేటీఆర్.. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని వైఎస్ జగన్ పోస్టు చేశారు. ఇక, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా గాయపడ్డారు. దీంతో, కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేటీఆర్‌కు వైద్యులు ఆయనకు సూచించారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్లో పోస్టు చేశారు. వైద్యుల పర్యవేక్షణలో రికవరీ అవుతున్నట్లు పేర్కొన్నారు. త్వరగా కోలుకొని రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న పలువురు నేతలు, అభిమానులు కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.Wishing you a speedy recovery, brother. Get well soon! @KTRBRS— YS Jagan Mohan Reddy (@ysjagan) April 29, 2025 Picked up a slip disc injury during a gym workout session. Have been advised a few days of bed rest and recovery by my doctorsHope to be back on my feet soon— KTR (@KTRBRS) April 28, 2025 -
ఈ ప్రశ్నకు జవాబు ఉందా?
ఒక సీజనల్ పొలిటీషియన్ ఎంత ‘లోతు’ తక్కువ రాజకీయాలు చేయగలిగితే,అంతలా వేగంగా మాటలు మారుస్తూ, ఎన్నాళ్ళు అయినా ఎలాగోలా అధికా రంలో ఉండగలడు. అయితే ఒక లీడర్‌గా వారి స్థాయి ఏమిటి అనేది రేపు చరిత్ర ఎటూ రికార్డు చేస్తుంది. తమదొక ‘పొలిటికల్ ఫిలాసఫీ’ అని ఇటువంటివారు నమ్మబలికితే, ‘అదే మని’ ఎవరూ ప్రశ్నించరు. అదేమిటో చెప్పలేక పోయినా, అదేమిటో ఎవరికీ తెలియకపోయినా, అప్పటికే దాని నుంచి ఫలాలు కోసుకునే వర్గం వారి వెనుక తమ ‘టర్న్’ కోసం కనిపెట్టుకుని ఉండి గుంపుగా తయారై ఆ నాయకునికి సమర్థన కూడా మొదలవుతుంది. విషయాల లోతులు మనకు అక్కర లేనప్పుడు, ఆ మేరకే మన ఎంపికలు కూడా ఉంటాయి. అక్కడ ఎక్కువ ఆశించడం తప్పు. ఇటువంటి చోట – ‘నువ్వు నన్ను నమ్మనప్పుడు, నిన్ను నేను మాత్రం ఎందుకు నమ్మాలి?’ అనే లాజిక్ నాయకునికి ఎటూ ఉంటుంది. ఇలా పరస్పర విశ్వాసాలు లేకుండానే ఎన్నికయిన నాయకులకు ఈ అధి కారం, తమకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని వారు అను కోరు కనుక ఇప్పటికి ఇదే ప్రస్తుతం.బ్రిటిష్ పాలన తర్వాత కూడా యాభై–అరవై దశకాల్లో భూమి–నీరు–వ్యవసాయం కేంద్రితంగా మన రాష్ట్ర రాజకీయాలు ఉండేవి. కారణం ప్రజలు జీవన సంస్కృతి ఆ రెండింటి చుట్టూనే ఉండేది. అయితే, డెబ్బై దశకంలో వచ్చిన ‘జై ఆంధ్ర’ ఉద్యమ రూపంగా పొడచూపిన 1972 నాటి సాంఘిక సంజ్ఞను సకాలంలో మనం అర్థం చేసుకోలేక పోయాం. అప్పుడే దాన్ని గుర్తించి దాన్ని ‘అడ్రెస్’ చేసి ఉంటే, మన పరిస్థితి మరోలా ఉండేది. అప్పట్లో ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు మొదలైన రైతు కుటుంబాల యువత ఉపాధి వలసల తీవ్రత తగ్గేది. ఆ వలసల ఒత్తిడితో ఆ దశకం చివర 1978లో కొత్తగా రంగారెడ్డి జిల్లా ఏర్పాటు అవసరం అయింది. రంగా రెడ్డి ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ వద్ద ఆంధ్రుల రద్దీతో విషయం అర్థమయినా అప్పటికే ఇక్కడ కొత్తగా మహిళా కళాశాలలు కూడా మొదలయ్యాయి.ఏమైంది, గుప్పిట్లోని ఇసుకలా కాలం కళ్ళముందు అలా జారిపోయింది. వెనక్కి తిరిగివచ్చి చూసుకుంటే, ఒకప్పటి తయారీ రంగం ఉపాధి అవకాశాల్ని ‘సర్వీస్ సెక్టార్’ ఆక్రమించాక, మూడు దశాబ్దాలుగా ఎక్కడా నిలకడ లేని ఉపాధిరంగం మిగిలింది. ఇప్పుడు ఉన్నది భుజానికి సంచి (షోల్డర్ బ్యాగ్ఎంప్లాయ్మెంట్) ఉపాధి. ఇక్కడ ఉద్యోగే కాదు,కంపెనీ అధిపతిది కూడా అమూర్త (రూపం తెలి యని) స్థితే. ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారో అది ఎన్నాళ్ళో తెలియని స్థితి.అయినా ‘లీడర్’ అంటే ప్రజలు–ప్రాంతము పక్షంగా నిలబడి, అక్కడి సామాజిక పర్యావరణానికి తగిన ‘జియో–ప్లానింగ్’తో అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి కల్పన వాతావరణం సృష్టించాలి. మన ప్రయోజనాలు కాపాడుకుంటూనే, మనవి కాని బయట పవనాల వేగాన్ని అతడు ఎదుర్కోవాలి. అది లేకపోగా ముప్పై ఏళ్ళుగా ఏదొచ్చినా అదంతా నా వల్లనే అని ‘క్లెయిం’ చేసుకునే పరిస్థితి. ఇక్కడే అస్సలు ఒక నాయకుడి మూలాలు ప్రశ్న అవుతున్నాయి. అప్పట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు (74) కాలం చూస్తే, 1995 నుంచి తొమ్మిదేళ్లు; మధ్యప్రదేశ్ దిగ్విజయ్ సింగ్ (78) 1993 నుంచి పదేళ్ళు, శరద్ పవార్ (84) మహరాష్ట్రలో 1988 నుంచి 1995 వరకూ కనిపిస్తారు. వీరిలో చంద్రబాబుది తప్ప మిగతా ఇద్దరిదీ రాజకీయ కుటుంబ నేపథ్యం. దిగ్విజయ్ సింగ్ తండ్రి 1951లో శాసనసభ్యులు, శరద్ పవార్ తండ్రి 1937–1952 మధ్య మూడుసార్లు జిల్లా బోర్డు సభ్యుడు, ఖాదీ, సహకార చక్కెర రైతు సంఘాల రాష్ట్ర నాయకుడు. అయితే, ఈ కాలంలో స్వయం ప్రతిభతో ఎదిగిన నాయకుడు లాలూప్రసాద్ యాదవ్. పట్నా యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్‌గా చేస్తూ 1977లో 29 ఏళ్లకే ఎంపీగా పార్లమెంట్‌లోకి వెళ్ళిన అరుదైన చరిత్ర ఆయనది. బిహార్‌పై వీరి బలమైన ప్రభావం 1990–1997 వరకూ ఉంది. ఆయన సతీమణి రబ్రీదేవి ప్రభావం 2000–2005 వరకూ కనిపిస్తుంది. స్వాతంత్య్రం తర్వాత ఈ దేశం గురించి సమీక్ష అంటే, దాన్ని మండల్ కమీషన్ నివేదిక అమలు, పి.వి. నరసింహారావు ఆర్థిక సంస్కరణలు ఈ పూర్వరంగంలో విధిగా చూడాలి. అలా ‘లాలూ– బిహార్’ లోతుల్ని కనుక వెతికితే ఏముంది? ఒక ప్పుడు ఆసియా జ్ఞాన కేంద్రాలకు నెలవైన బిహార్‌లో ‘రీ మ్యాపింగ్ ఇండియా’ మొదలై– జార్ఖండ్, ఛత్తీస్ గఢ్ అనే మరో రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి.వీరితో పోల్చినప్పుడు జగన్ మోహన్ రెడ్డికి సీఎంగా గత అనుభవం లేదు, అయినా ‘జై ఆంధ్ర’ ఉద్యమ 50 ఏళ్ళ చరిత్ర తర్వాత, జరిగిన రాష్ట్ర విభజన వల్ల ‘పరిపాలన–అభివృద్ధి–సంక్షేమం–ఉపాధి’ రాష్ట్రం అంచులకు చేరేలా ‘జియో–ప్లానింగ్’ చేశారు. మరో 13 జిల్లాలు ఏర్పాటు చేసి, 26 జిల్లాలతో తన వికేంద్రీకరణ పని మొదలు పెట్టారు. ఆ పాలనలోని మంచి–చెడులు గురించి ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు. అది సహజం కానీ, పార్టీలకు రాజకీయా లకు బయట ఉండి రాష్ట్ర ప్రజల మేలు కోసం ఆలో చించేవారు, ఏపీకి కీలకమైన కాలంలో తాము ఎంత బాధ్యత కలిగిన పౌరసమాజంగా ఉన్నాం? అనే ప్రశ్నకు మాత్రం జవాబు వెతుక్కోవలసి ఉంటుంది.జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
నేడు జిల్లాల అధ్యక్షులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ జిల్లాల అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. తాజా పరిణామాలపై చర్చించి.. పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. -
రేపు పార్టీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ భేటీ
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(మంగళవారం) పార్టీ జిల్లా అధ్యక్షులతో భేటీ కానున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు సహా అనేక అంశాలపై పార్టీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ చర్చించే అవకాశం ఉంది. -
పోలీసు కేసులు ప్రజాదరణను దూరం చేయలేవు!
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఒక వ్యాఖ్య చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఏమవుతుందని ప్రశ్నించారు. జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచి వేయలేరని ఆయన స్పష్టం చేశారు. గతంలో తనను 16 నెలలు జైలులో పెట్టారని, పార్టీని నడిపే పరిస్థితి లేకుండా చేశారని, అయినా ప్రజలు ఆశీర్వదించారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో పార్టీ ఉందని, ఎన్ని కేసులు పెడితే ప్రజలు అంత తీవ్రంగా స్పందిస్తారని పేర్కొన్నారు. జగన్ వ్యాఖ్యలు హేతుబద్దమైనవి. మద్యం కేసుతో పాటు సీనియర్ పోలీసు అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్టు చేయడంపై ఆయన స్పందించారు. ఒక్కసారి గతంలోకి వెళితే 2011లో జగన్ కాంగ్రెస్ ఎంపీగా ఉండే వారు. తండ్రి మరణం తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన సొంతంగా పార్టీని స్థాపించుకోవాలని నిర్ణయించుకుని పదవికి రాజీనామా చేశారు. కడప లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో 5.45 లక్షల ఓట్ల అధిక్యతతో విజయం సాధించి జగన్ సంచలనం సృష్టించారు. అప్పుడు కూడా కాంగ్రెస్, టీడీపీలు కలిసే కుట్ర చేశాయి. జగన్‌ను ప్రజా క్షేత్రంలో ఓడించాలేమన్న భయంతో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా వ్యవహరించి కాంగ్రెస్‌కు అండగా నిలిచారు. ఆ తర్వాత జగన్ కంపెనీలతో సంబంధం లేని కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరరావుతో హైకోర్టులో ఫిర్యాదు చేయించడం, దానికి టీడీపీ మద్దతివ్వడం, ఆ వెంటనే హైకోర్టు ఆ కేసును సీబీఐకి అప్పగించడం జరిగిపోయాయి.తదుపరి సీబీఐ కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ముఖ్యంగా సోనియాగాంధీ ఆదేశాల ప్రకారం వ్యవహరించి జగన్‌ను జైలులో పెట్టింది. బెయిల్ రాకుండా కూడా అడ్డుపడ్డారు. చివరికి 16 నెలల తర్వాత బెయిల్ లభించింది. అయినా ఆయన రాజకీయంగా నిలబడ్డారు. జైలులో ఉన్నప్పుడు జరిగిన 18 ఉప ఎన్నికలలో 15 చోట్ల జగన్ పార్టీ విజయ దుంధుభి మొగించింది. ఆ అనుభవాలను మననం చేసుకుంటే సరిగ్గా అదే రీతిలో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వైసీపీ నేతలపై, కొందరు అధికారులపై కేసులు పెడుతున్నట్లు కనిపిస్తుంది. కూటమి అధికారంలోకి రాగానే రాజకీయ ముద్ర వేసి కొందరు అధికారులను సస్పెండ్ చేయడం చేశారు. పోస్టింగులు ఇవ్వకుండా వేధించారు. ఒక మోసకారి నటిని పట్టుకు వచ్చి పోలీసు ఉన్నతాధికారిపై కేసు పెట్టించి, తదుపరి ఆయనను జైలులో పెట్టారు. మరో వైపు అనేక మంది వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడుతూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇందు కోసం కొందరు రిటైర్డ్ పోలీసు అధికారులను కూడా ఉపయోగించుకుంటున్నారని చెబుతారు. ఆ తర్వాత తమ రెడ్‌బుక్‌ను పై స్థాయికి తీసుకు రావడానికి ప్రయత్నాలు ఆరంభించారు. దీనికి తగ్గట్లే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో కూడా ఈ కేసుపై చర్చించారని అనుకోవాలి. పైకి పోలవరం-బనకచర్ల తదితర అంశాలపై షా ను కలిసినట్లు ఎల్లో మీడియాలో వార్తలు రాయించుకున్నారు. ఆ పత్రికలలోనే జగన్‌పై మద్యం కేసు విషయంపై కూడా మాట్లాడారని తెలిపారు. అంటే గతంలో కాంగ్రెస్‌తో కుమ్మక్కై పెట్టినట్లుగానే, ఈసారి బీజేపీతో ఒప్పందమై ఇలాంటిదేదో చేయాలని చూస్తున్నట్లు ఉన్నారు.2014 టర్మ్‌లో బీజేపీతో పొత్తులో ఉన్నపుడు ప్రధాని మోడీని చంద్రబాబు కలిసినప్పుడల్లా కేవలం జగన్ కేసులపై ఏదో ఒకటి చేయాలని కోరుతుండేవారని, అప్పటి బీజేపీ అధ్యక్షుడు, ఇప్పటి టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆ రోజుల్లో పలుమార్లు చెప్పేవారు. అదే తరహాలో ఇప్పుడు కూడా బీజేపీ పెద్దలతో సంప్రదించి తన కుట్ర ప్లాన్ అమలు చేయాలని తలపెట్టినట్లు అనుమానాలు వస్తున్నాయి. జగన్ పై 2011 లో పెట్టిన కేసులు ఏమిటి? ఆయన కంపెనీలలో కొందరు పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టారని అందులో క్విడ్ ప్రోక్ జరిగిందని సీబీఐ ఆరోపించింది. అయితే ఇందుకు సంబంధించిన ఏ కంపెనీ కూడా జగన్‌పై ఫిర్యాదు చేయలేదు. అలాగే ప్రభుత్వం, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలతో జగన్‌కు సంబంధం లేదు. అయినా తన కంపెనీలు ఏర్పాటైన మూడేళ్ల తర్వాత కక్షపూరితంగా కేసులు పెట్టారు. ఇప్పుడు కూడా అదే మోడల్ కనిపిస్తుంది. మద్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఏ డిస్టిలరీ ఫిర్యాదు చేయలేదు. ఎవరో దారినపోయే వ్యక్తి లెటర్ రాయడం, ఆ వెంటనే దానిపై ప్రభుత్వ కార్యదర్శి ఏసీబీ విచారణకు విచారించాలని పంపడం, తదుపరి ఆగమేఘాల మీద కేసు పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులను బెదిరించి వాంగ్మూలాలను తీసుకోవడం, వారు హైకోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత వేధింపులు తట్టుకోలేక పోలీసు అధికారులు కోరిన స్టేట్మెంట్ పై సంతకాలు చేశారట. తదుపరి మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డిని ఒక పావుగా వాడుకున్నట్లు అనిపిస్తుంది. ఆయన తనకేదో దీని నుంచి రక్షణ కలుగుతుందని అనుకున్నారో ,ఏమో కాని, రాజ్ కెసిరెడ్డి అన్న మాజీ ఐటి సలహాదారుపై ఆరోపణలు చేశారు.దాంతో విజయసాయిని అదుపులోకి తీసుకోకుండా సిట్ బృందం వదలి వేసింది. ఆ తర్వాత సుప్రీం కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన ఎంపీ మిథున్ రెడ్డిని విచారించారు. ఆయన తన వాదన చాలా స్పస్టంగా వినిపించగలిగారు. ఆధారాలు ఉంటే కోర్టులో రుజువు చేయండని సవాల్ చేశారు. తమ కుటుంబంపై చంద్రబాబు కాని, ఎల్లో మీడియా కాని పగపట్టి ఇటీవలి కాలంలో ప్రచారం చేసిన ఉదంతాలను ఆయన మీడియా ముందు ప్రస్తావించి వాటిలో ఒక్కదానిని కూడా నిరూపించలేకపోయిన విషయాన్ని తెలిపారు. ఆ తర్వాత గోవా నుంచి హైదరాబాద్ వచ్చిన రాజ్ కెసిరెడ్డిని హడావుడిగా అదుపులోకి తీసుకున్నారు. ఎల్లో మీడియాలో ఆయనపై పలు కథనాలు రాయించారు. గోవా నుంచి హైదరాబాద్ వచ్చి, అక్కడ నుంచి చెన్నై ద్వారా విదేశాలకు వెళ్లాలని ఆయన ప్లాన్ చేశారని అర్థం, పర్థం లేని రాతలు రాశారు. నిజంగానే అలా వెళ్లదలిస్తే నేరుగా గోవా నుంచో, లేక దగ్గరలో ఉన్న ముంబై, లేదా చెన్నై వెళ్లి విదేశాలకు పోయి ఉండవచ్చు కదా అన్న ప్రశ్నకు జవాబు దొరకదు. కెసిరెడ్డిని విచారించిన సందర్భంలో కూడా పలు పరస్పర విరుద్దమైన అంశాలను సిట్ రిమాండ్ రిపోర్టులో కనిపించాయి. ఒకసారి ఆయన సీఎంఓ అధికారులకు మద్యం డబ్బు చేరవేసినట్లు, మరోసారి ఆయనే ఆయా కంపెనీలలో పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారట. నాలుగు డిస్టిలరీల నుంచే మద్యం ఎక్కువగా తీసుకోవడంపై రిమాండ్ రిపోర్టులో సందేహం వ్యక్తం చేశారు. మరి అదే తరహాలో చంద్రబాబు ప్రభుత్వంలోను జరిగింది కదా అన్నదానికి రిప్లై లేదు.అన్నిటికి మించి రిమాండ్ రిపోర్టుపై రాజ్ సంతకం పెట్టడానికి నిరాకరించారని కూడా సిట్ తెలియ చేసింది. అలాంటప్పుడు ఆ రిపోర్టుకు ఎంత విలువ ఉంటుంది? కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియాలో బానర్లు పెట్టుకుని ఆనందపడడానికి తప్ప. జగన్ పేరేదో ఆయన నేరుగా చెప్పారన్నట్లుగా ప్రచారం చేసిన ఈ మీడియా దానిపై రాజ్ సంతకం లేదన్న అంశానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా జాగ్రత్తపడింది. అంటే దీనర్థం ఏదో రకంగా జగన్‌ను జనంలో పలచన చేయడం ద్వారా ప్రజలు ఆ అంశంపై చర్చించుకుంటూ, చంద్రబాబు అండ్ కో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను మర్చిపోవాలనే కదా! మరో సంగతి చెప్పాలి. విజయసాయి తననేదో వదలి వేస్తారని అనుకున్నట్లు ఉన్నారు. రాజ్ అరెస్టు కాగానే ఆయన ఒక కామెంట్ చేశారట. దొరికిన దొంగలు, దొరకని దొంగలు అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన కూడా నిందితుడే అయినందున ఏ తరహా కిందకు వస్తారో తేల్చుకోవాలి. ఒకటి మాత్రం వాస్తవం. ప్రజలలో కూటమి సర్కార్ పై విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తోంది. అదే టైమ్‌లో జగన్ ఎక్కడకు వెళ్లిన వేల సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. అంటే భవిష్యత్తులో తన పార్టీకి, తన వారసులకు జగన్ పెద్ద బెడద అవుతారని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే ఈ రకమైన కక్ష రాజకీయాలు చేస్తున్నారు.అమిత్ షా తో కూడా ఇదే అంశంపై మాట్లాడడానికి ఢిల్లీ వెళ్లారంటే ఆయనకు ప్రజలకు ఇచ్చిన హామీలకన్నా, జగన్‌ను ఎలాగొలా ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యం ఉన్నట్లు అర్థం అవుతోంది కదా! ఇవన్ని గమనించిన తర్వాత జగన్ పీఏసీ సమావేశంలో మాట్లాడినట్లు ఆయన కాని, వైసీపీ శ్రేణులు కాని అన్నిటికి సిధ్దమైనట్ల స్పష్టం అవుతోంది కదా! ఇదే చంద్రబాబుకు అతి పెద్ద సవాల్!- కొమ్మినేని శ్రీనివాస రావు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
Garam Garam Varthalu: గరం గరం వార్తలు ఫుల్ ఎపిసోడ్
-
వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. 14 మంది రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. -
మా కుటుంబానికి అండగా ఉన్న వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు
-
ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ మృతిపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి, తాడేపల్లి: ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ‘‘భారతదేశ అంతరిక్ష చరిత్రలో ఆయన చెరగని ముద్ర వేశారు. కస్తూరి రంగన్‌కి నివాళులు అర్పిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కస్తూరి రంగన్ గతంలో జేఎన్‌యూ ఛాన్సలర్‌గా, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఈయన పూర్తి పేరు కృష్ణస్వామి కస్తూరి రంగన్. కేరళ ఎర్నాకులంలో కస్తూరిరంగన్ జన్మించారు. ఈయనది విద్యావంతుల కుటుంబం. ముంబై యూనివర్సిటీలో ఫిజిక్స్‌లో మాస్టర్స్ చేసిన రంగన్.. అహ్మదాబాద్ ఫిజికల్ రీసెర్చ్ లాబోరేటరీ నుంచి 1971లో డాక్టరేట్ అందుకున్నారు. ఖగోళ శాస్త్రం, స్పేస్ సైన్స్ మీద 240 పేజీల థియరీని సమర్పించారాయన.1994 నుంచి 2003 దాకా.. తొమ్మిదేళ్లపాటు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO)కి ఆయన చైర్మన్‌గా పని చేశారు. 2003-09 మధ్య రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. 2004 నుంచి 2009 మధ్య కాలంలో బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు.మోదీ సర్కార్ తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి కస్తూరి రంగన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్‌తో సత్కరించింది. మొత్తం 27 యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారాయన. ఇస్రో శాస్త్రవేత్త నంబీ నారాయణన్ మీద దేశద్రోహం ఆరోపణలు వచ్చిప్పుడు ఇస్రో చైర్మన్‌గా ఉంది కస్తూరి రంగనే. 1969లో లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. రంగన్ భార్య 1991లో కన్నుమూశారు.Deeply saddened to learn of the passing of Dr. K. Kasturirangan, former Chairman of #ISRO — an eminent scientist, visionary educator, and passionate environmentalist. He leaves an indelible mark on the annals of India’s space history. My tributes to this legend. May his soul rest… pic.twitter.com/cDEHln1tet— YS Jagan Mohan Reddy (@ysjagan) April 25, 2025 -
ఉగ్రదాడిలో మృతి చెందిన కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శ
-
Garam Garam Varthalu: గరం గరం వార్తలు ఫుల్ ఎపిసోడ్
-
మోసాల కూటమిని ప్రజలు క్షమించరు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం, ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకుని నులమడం అసాధ్యం..! ఇచ్చిన మాట, మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నిలబెట్టుకోకుంటే నీ తోలు తీస్తాం.. అని చెప్పగలిగిన సత్తా వైఎస్సార్ సీపీకి ఉంది..’ అని చంద్రబాబు సర్కారును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరించారు. హామీల అమలు, ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలపై గ్రామ గ్రామాన వైఎస్సార్సీపీ కార్యకర్తలు నిలదీస్తారని చెప్పామని గుర్తు చేశారు. ‘వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో తెగువ ఎలా ఉంటుందనేది రాష్ట్రానికి చాటి చెప్పిన నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు సెల్యూట్ చేస్తున్నా’ అని పార్టీ శ్రేణులను అభినందించారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ మండలం స్థానిక సంస్థల వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. టీడీపీ కూటమి సర్కారు ప్రలోభాలు, బెదిరింపులకు లొంగకుండా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పక్షాన గట్టిగా నిలబడిన ప్రజాప్రతినిధులను అభినందించారు. ఆయా మున్సిపల్ ఛైర్పర్సన్లు, వైస్ ఛైర్పర్సన్లు, కౌన్సిలర్లతో పాటు ఎంపీపీలు, ఎంపీటీసీలు, జిల్లాల పార్టీ ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తొలుత కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారికి వైఎస్ జగన్, నాయకులు నివాళులు అర్పించారు. సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే..మీ తెగువకు మరోసారి సెల్యూట్..ఇవాళ రాష్ట్రంలో ప్రజలు యుద్ధ వాతావరణంలో బతుకుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి దుర్మార్గమైన, రెడ్ బుక్ పాలన రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ చూసి ఉండరు. ఇలాంటి పరిస్థితుల మధ్య కూటమి సర్కారు అన్యాయాలు, దౌర్జన్యాలకు ఎదురొడ్డి నిలిచిన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు నుంచి వచ్చిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు.. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ నుంచి వచ్చిన ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, గోపవరం పంచాయితీ నుంచి వచ్చిన సర్పంచి, వార్డు మెంబర్లకు, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ నుంచి వచ్చిన ఛైర్పర్సన్లు, వైస్ ఛైర్పర్సన్లు, కౌన్సిలర్ల తెగువకు మరోసారి సెల్యూట్ చేస్తున్నా.జీర్ణించుకోలేక అక్రమ కేసులు..» ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఎక్కడా టీడీపీకి బలం లేదు. ప్రతి చోటా వైఎస్సార్సీపీ జెండా మీద, గుర్తు మీద గెలిచిన సభ్యులే ఉన్నారు. » అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కంబదూరులో 15కు 15 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ గెలిచింది. మరి అక్కడ టీడీపీ ఎందుకు పోటీ పెట్టింది? అక్కడ ఎన్ని ప్రలోభాలు పెట్టినా 13 మంది వైఎస్సార్సీపీ వెంట నిలబడ్డారు. అది మనమే గెల్చుకున్నాం.» ప్రొద్దుటూరులో గోపవరం చిన్న పంచాయితీ. అక్కడ ఉప సర్పంచ్ ఎన్నికలో చంద్రబాబు తన బుద్ధి ప్రదర్శించారు. 20 మంది వార్డు మెంబర్లకుగానూ 19 మంది వైఎస్సార్సీపీకి చెందిన వారే ఉన్నా చంద్రబాబు ఎందుకు పోటీ పెట్టారు? అక్కడ ఎంత దారుణంగా భయపెట్టారో, దాడులు చేయించారో రాష్ట్రమంతా చూసింది. చివరికి గొడవల ద్వారా మొదటిసారి ఎన్నికలు వాయిదా వేశారు. రెండోసారి కారణం దొరక్క.. ఎన్నికల అధికారికి హఠాత్తుగా గుండెపోటు అని చెప్పి వాయిదా వేశారు.» తిరుపతి రూరల్ మండలానికి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు ఇల్లు ఉంది. చంద్రబాబు మొదటిసారి గెలిచింది, మళ్లీ ఓడిపోయింది ఇక్కడే. సొంత నియోజకవర్గంలో ప్రజలు ఓడిస్తే.. ఇక్కడ ప్రజలు తంతే చంద్రబాబు కుప్పం వెళ్లారు.బీసీలు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో వారికి ప్రాధాన్యతనిచ్చి పైకి తేవాలని ఎవరైనా ప్రయత్నిస్తారు. బీసీలు ఆర్థికంగా అంత బలంగా ఉండరు కాబట్టి వారిని తొక్కిపెట్టవచ్చని చంద్రబాబు అక్కడ పాగా వేశారు. చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి రూరల్ మండలంలో 40 మంది ఎంపీటీసీలకు గానూ 34 మంది వైఎస్సార్సీపీ తరపున గెలిచారు. అక్కడ నామినేషన్ వేయకుండా రకరకాలుగా భయపెట్టారు. 34 మందిలో 33 మందితో మోహిత్ ఓటేయించాడు. ఒక్కరే జారిపోయారు. మిగిలిన అందరూ ఒక్క తాటిమీద నిలబడి వైఎస్సార్సీపీ తెగువను చూపించారు. దాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేక ఎన్నికలు అయిపోయిన తర్వాత జై జగన్, జై వైఎస్సార్సీపీ అన్నారని వారి మీద కేసులు పెట్టించారు.» వెంకటగిరి మున్సిపాలిటీకి సంబంధించి 25 మంది కౌన్సిలర్లు ఉంటే ఒక్కరూ టీడీపీ నుంచి గెలవలేదు. అక్కడ ఛైర్మన్‌ను దింపాలని చంద్రబాబు ఆరుగురిని భయపెట్టి, బెదిరించి కొనుగోలు చేయగలిగారు. మిగిలిన 19 మంది వైఎస్సార్సీపీ వెంట నిలబడ్డారు.» అంతకుముందు రాష్ట్రంలో 50 చోట్ల స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగితే 39 చోట్ల వైఎస్సార్సీపీ జెండా ఎగిరింది. చంద్రబాబుకి ఎక్కడా బలం లేదు. ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదు. ఆయన ఎందుకు ఇంతలా దిగజారిపోయాడంటే సంవత్సరం పాటు చేసిన పాలనే నిదర్శనం. అన్నీ కోతలు.. అవకతవకలేఇవాళ వ్యవస్థలు పూర్తిగా అధ్వాన్నమైన పరిస్థితుల్లో నీరుగారిపోయాయి. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఏ గ్రామంలో చూసినా బెల్టుషాపులు గుడి, బడి పక్కనే కనిపిస్తున్నాయి. ఏ బెల్టు దుకాణాన్ని చూసినా.. షాపుల్లో ధర కన్నా రూ.20 ఎక్కువకు అమ్ముతున్న పరిస్థితి కళ్లముందే కనిపిస్తోంది. మన హయాంలో కన్నా ఇసుక రెండింతలు ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. మన హయాంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం లేదు. మట్టి, మైనింగ్, నియోజకవర్గంలో ఏ పరిశ్రమ నడవాలన్నా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి అంతో ఇంతో ముట్టజెప్పాల్సిందే. ఆయన ముఖ్యమంత్రికి ముట్టజెప్పాలి. నాకింత.. నీకింత అని దోచుకుని తింటున్న పరిస్థితి రాష్ట్రమంతా కనిపిస్తోంది. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రోజుకొక డైవర్షన్ టాపిక్ ఎంచుకుంటున్నారు. అడ్డగోలుగా భూ పందేరాలు..విశాఖపట్నంలో ఊరూపేరు లేని ‘ఉర్సా’ లాంటి కంపెనీకి రూ.3 వేల కోట్ల విలువైన భూములిస్తున్నారు. ఒక చిన్న ఇంట్లో, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో నివాస గృహాలకు చెల్లించే కరెంటు బిల్లును ఆ కంపెనీ కడుతోంది. ఇక అమెరికాలో వాళ్ల ఆఫీసు చూస్తే.. అది కూడా చిన్న ఇల్లే. ఊరూపేరు లేని కంపెనీకి రూ.3 వేల కోట్ల విలువ చేసే భూమి, అది కూడా కేవలం రూ.99 పైసలకే ఎకరా భూమి కట్టబెడుతున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్సులు..చంద్రబాబు వచ్చిన తర్వాత మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడం మొదలుపెట్టారు. 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సు ముందే ఇస్తారు. వాళ్ల దగ్గర నుంచి 8 శాతం చంద్రబాబు తీసుకుంటారు! ఇలా రాష్ట్రాన్ని దోచేస్తున్నారు. అప్పు అంతా ఏమైపోతోంది..?మరి చేసిన అప్పులన్నీ ఎక్కడికి పోతున్నాయి? సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్లు ఎందుకు లేవు? గతంలో జగన్ చేయగలిగాడు...మరి చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు? అంటే అందుకు కారణం ఎన్నికలప్పుడే చెప్పా. జగన్ నేరుగా బటన్ నొక్కుతాడు. అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వెళుతుంది. అదే చంద్రబాబు ఉంటే బటన్లు ఉండవు. నేరుగా ఆయన జేబుల్లోకే పోతుందని ఆ రోజు ఎన్నికలప్పుడు నేను మొత్తుకుని చెప్పా. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పా. ఆ రోజు నేను చెప్పింది మీరు మళ్లీ వింటే.. జగన్ కరెక్టుగా చెప్పాడు, మనమే మోసపోయామని మీకే అర్ధం అవుతుంది. ఈరోజు ప్రతి ఇంట్లో ఇదే చర్చ జరుగుతోంది.ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్‌జరుగుతున్న వాటికన్నింటికీ సమాధానం చెప్పుకోలేకే ప్రతి రోజూ డైవర్షనే. ఒక రోజు లడ్డూ, మరోరోజు బోటు.. ఇంకోరోజు ఐపీఎస్ ఆధికారుల అరెస్టులు అంటాడు. షాక్ కొట్టేలా పెంచిన కరెంట్ బిల్లుల గురించి అడిగితే... ఆయన చేసిన లిక్కర్ స్కాంను ఇంకొకరి మీద రుద్ది అరెస్టు చేస్తాడు. ఇలా ప్రతి రోజూ ఏదో ఒకటి సృష్టించి టాపిక్ డైవర్షన్ చేయడం పరిపాటిగా మారింది. చరిత్రలో రోమన్ రాజులు మీద ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా వస్తోందని గ్లాడియేటర్స్ అని గేమ్స్ నిర్వహించేవారు. మనుషులు చేతుల్లో కత్తులు పెట్టి, జంతువులను బరిలో దించి చనిపోయేవరకు యుద్ధాలు చేయించేవారు. వాటిని ప్రజలు చూసేలా చేసి మభ్యపెట్టి డైవర్ట్ చేసేవారు. దీంతో రాజు ఎలా పరిపాలన చేస్తున్నారో చర్చించడం మాని ప్రజలు వాటి గురించే చర్చించేవారు. మిగిలిన విషయాలు పక్కకు పోయేవి. ఇలా ప్రతి రోజూ ఒక డైవర్షన్ టాపిక్, డ్రామా. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పాలన జరుగుతోంది.హామీలకు దిక్కులేని పరిస్థితుల్లో పాలన..చాలా మంది ఇళ్లల్లో చంద్రబాబు మేనిఫెస్టో ఉంది. అప్పట్లో భారీగా ప్రకటనలు ఇచ్చారు. మేనిఫెస్టోను ప్రతి ఇంటికి పంపి బాండ్లు కూడా రాసిచ్చారు. జగన్ ఇచ్చినవన్నీ చంద్రబాబు కూడా ఇస్తారని, అంతేకాదు అదనంగా కూడా ఇస్తారంటూ వాళ్ల కార్యకర్తలతో చెప్పించి బాండ్లు కూడా ఇచ్చారు. మేనిఫెస్టోలో ఇంకా 143 హామీలు ఇచ్చారు. మరి నా అక్కచెల్లెమ్మలు ప్రొద్దుటూరు, కడపలో నిరీక్షిస్తున్నారు. ఉచిత బస్సు ద్వారా విశాఖపట్నం వెళ్లి రావాలని ఎదురు చూస్తున్నారు. దానికి కూడా దిక్కులేని పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రంలో పరిపాలన సాగుతోంది.వ్యవస్థలన్నీ విధ్వంసం.. » మరోవైపు వ్యవస్థలన్నీ ఇప్పుడు పూర్తిగా విధ్వంసం అయ్యాయి. వైఎస్సార్సీపీ హయాంలో మా పిల్లలు ప్రభుత్వ బడులలో చదువుతున్నారని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉండేది. అప్పట్లో ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ బోర్డులు ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించడానికి తల్లిదండ్రులు సందేహిస్తున్న దుస్థితికి తీసుకొచ్చారు. ప్రభుత్వ స్కూళ్లు అంతలా నాశనం అయ్యాయి. ఇంగ్లిషమీడియం, మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసేశారు. మూడో తరగతి నుంచే టోఫెల్‌ని సైతం పీరియడ్‌గా పెట్టి చదివించే గొప్ప కార్యక్రమాన్ని రద్దు చేశారు. నాడు–నేడు ఆగిపోయింది. గోరుముద్ద నాసిరకంగా అయిపోయింది. పిల్లలను బడికి పంపిస్తే తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చిన అమ్మ ఒడి గాలికెగిరిపోయింది. నాడు 8వ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు కనిపించే పరిస్ధితి ఉండేది. ఇప్పుడు వాటిని కూడా ఆపేశారు. బడికి పిల్లలు పోవటాన్ని ఇవాళ నరకంగా మార్చేశారు. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉచితంగా పూర్తి ఫీజులు కట్టి వారి వసతి ఖర్చుల సైతం ఇచ్చిన కార్యక్రమాలు రద్దయ్యాయి. విద్యాదీవెన, వసతి దీవెన అందక ఇంజనీరింగ్ విద్యార్థులు చదువులు మానేస్తున్న పరిస్థితి నెలకొంది.» వైద్య రంగం ఇంకా దారుణంగా తయారైంది. ఏ పేదవాడికైనా ఆరోగ్యం బాగా లేకపోతే ఉచితంగా పెద్దాసుపత్రిలో వైద్యం చేయించుకుని చిరునవ్వుతో ఇంటికి వెళ్లే పరిస్థితి గతంలో ఉండేది. రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు 3,300 ప్రొసీజర్లు ఉచితంగా వైద్యం చేయించుకునే పరిస్థితి గతంలో ఉండేది. ఇవాళ ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు చొప్పున 12 నెలలకు రూ.3,600 కోట్లు బకాయిలు పెట్టారు. రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. దీంతో ఆరోగ్యశ్రీ రోగులకు వైద్యం చేయలేమని బోర్డు పెట్టాయి. ఇవాళ దురదృష్టవశాత్తూ ఎవరికైనా ఆరోగ్యం సరిగా లేకపోతే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకుని అప్పులు పాలైతేగానీ పేదవాడు బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు.» ఇక వ్యవసాయం రంగం గురించి చూస్తే ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఏ పంటకూ గిట్టుబాటు ధర రాని పరిస్థితి. ఉచిత పంటల బీమా గాలికెగిరిపోయింది. ఈ–క్రాప్ ఎక్కడుందో తెలియని దుస్థితి. రైతులు రోడ్డున పడి అల్లాడుతున్నారు. జగన్ ఇచ్చిన రూ.13,500 పెట్టుబడి సాయం ఆగిపోయింది. అన్నదాతా సుఖీభవ కింద చంద్రబాబు ఇస్తానన్న రూ.26 వేలు పెట్టుబడి సాయం కూడా గాలికెగిరిపోయిందని ఇవాళ ప్రతి రైతూ చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు.వైఎస్సార్సీపీ అఖండ విజయంతో అధికారంలోకి రావడం తథ్యం..నేను అందరికీ ఒక్కటే చెబుతున్నా. ఇంత మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చొన్నాం. ఇక ఏ మంచీ చేయని, మోసం చేసిన చంద్రబాబునాయుడు పరిస్ధితి ఎలా ఉంటుందో చెప్పక్కరలేదు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పరిస్థితి ఒకేలా ఉంటుంది. ఇంత మోసం చేసిన మనిషిని ప్రజలు సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితుల్లోకి పరిమితం చేస్తారు. తప్పకుండా ఆరోజు వస్తుంది. మరో మూడేళ్లు గడిచిన తర్వాత.. కచ్చితంగా వైఎస్సార్సీపీ అఖండ మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. ఈసారి వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్తకు.. మన ప్రభుత్వంలో మీ జగన్ 2.0లో తోడుగా ఉంటాడు అని హామీ ఇస్తున్నా. గతంలో మీరు అనుకున్నంత స్థాయిలో కార్యకర్తలకు తోడుగా ఉండి ఉండకపోవచ్చు. కారణం.. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కోవిడ్ వచ్చింది. రెండేళ్లు కోవిడ్ వల్ల వేరే అంశాల మీద ధ్యాస పెట్టలేకపోయాం. పూర్తిగా ప్రజల బాగోగులు, వారి ఆరోగ్యం మీదనే ధ్యాస పెట్టాల్సిన పరిస్థితుల మధ్య పాలన సాగింది. -
మీ తెగువకు నా సెల్యూట్: YS Jagan
-
చంద్రబాబు మాత్రం 21 ఎకరాలు ఇస్తాడు: YS Jagan
-
విశాఖ: చంద్రమౌళి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ పరామర్శ
విశాఖ: కశ్మీర్ లోని పెహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన జరజాపు చంద్రమౌళి కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. ఈరోజు(గురువారం) చంద్రమౌళి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన వైఎస్ జగన్.. వారికి ధైర్యం చెప్పారు. కాగా, జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి మృతదేహం బుధవారం రాత్రి విశాఖకు చేరుకుంది. ఆయన ఇద్దరు కుమార్తెలు అమెరికా నుంచి గురువారం సాయంత్రం నగరానికి చేరుకునే అవకాశం ఉంది.. శుక్రవారం అంత్యక్రియలు జరగనున్నాయి. ఉగ్రదాడిలో మృతిచెందిన కావలి వాసి మధుసూదన్ రావు కుటుంబ సభ్యులను సైతం వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వైఎస్ జగన్.. వారికి ధైర్యం చెప్పారు. మధుసూదన్ రావు భార్య ప్రసన్న లక్ష్మీ, బావ నరేస్‌లతో ఫోన్లో మాట్లాడారు వైఎస్ జగన్. -
రాష్ట్రంలో వ్యవస్థలన్నీ విధ్వంసం: YS జగన్
-
LIVE: జీవితంలో మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా: YS Jagan
-
తెగువ చూపారు.. వారందరికీ సెల్యూట్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఉప ఎన్నికలు, అవిశ్వాస తీర్మానాల సమయంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు తెగువ చూపారని.. వారందరికీ సెల్యూట్ చేస్తున్నానని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో గురువారం ఆయన భేటీ అయ్యారు. ముందుగా జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన వారి మృతికి సంతాపంగా వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ నాయకులు కాసేపు మౌనం పాటించారు. అనంతరం సమావేశం ప్రారంభించారు. దుర్మార్గమైన రెడ్‌బుక్ పాలనలో..‘ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. యుద్ధ వాతావరణంలో ప్రజలు బతుకుతున్నారు. దుర్మార్గమైన రెడ్‌బుక్ పాలన జరుగుతోంది’’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రజావ్యతిరేకతను అణచివేయడం సాధ్యం కాదన్న ఆయన.. మేనిఫెస్టో అమలు చేయకపోతే ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త నిలదీస్తాడని చెప్పారు. ‘‘బలం లేకపోయినా స్థానిక సంస్థల్లో టీడీపీ పోటీ చేస్తోంది. ప్రజలు ఓడించారు కాబట్టే.. చంద్రబాబు తన సొంత నియోజకవర్గం చంద్రగిరిని విడిచిపెట్టి కుప్పం వెళ్లిపోయాడు. అక్కడ బీసీలు ఉన్నారు.. వారు ఆర్థికంగా ఇతరత్రా బలంగా ఉండరు కాబట్టి, వారిని తొక్కితొక్కిపెట్టవచ్చని చంద్రబాబు కుప్పంలో పాగావేశారు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.జై జగన్.. అన్నారని కేసులు పెట్టారు..చంద్రగిరి ఎంపీపీ ఉప ఎన్నికల్లో గెలిచాక జై జగన్, జై వైఎస్సార్సీపీ అన్నారని కేసులు పెట్టారు. గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు తిరిగే ధైర్యంలేదు. తిరిగితే ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ విధ్వంసం. ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లడాన్ని నరకంగా మార్చేశారు. విద్యా, వైద్య రంగాలు దారుణంగా తయారయ్యాయి. చంద్రబాబుగారు అధికారంలో వచ్చాక 4 లక్షలు పెన్షన్లు తీసేశారు. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. బెల్టుషాపులు గుడి, బడి పక్కనే కనిపిస్తున్నాయి.రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ....ప్రతి బాటిల్‌పైన రూ.20ల ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. వైఎస్సార్సీపీలో కన్నా ఇసుక రేటు రెండింతలు పెరిగింది. ఉచితం అని చెప్పి.. దోచుకుంటున్నారు. పైనుంచి కిందిదాకా ముడుపులు చెల్లిస్తేనే మైనింగ్ అయినా, పరిశ్రమ అయినా నడిచేది. అవినీతినుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ టాపిక్స్ ఎంచుకుంటున్నారు. విశాఖపట్నంలో ఊరూపేరు లేని ఉర్సా లాంటి కంపెనీలకు రూ.3,000 కోట్లు ఖరీదు చేసే భూములిస్తున్నారు. ఒక చిన్న ఇంట్లో రెషిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టే కరెంటు బిల్లు ఆ కంపెనీ కడుతుంది. అమెరికాలో వాళ్ల ఆఫీసు చూస్తే.. అది కూడా చిన్న ఇల్లే. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ చంద్రబాబు హయాంలో ఉర్సా లాంటి ఊరూ పేరు కంపెనీకి రూ.3,000 కోట్ల డబ్బులు దోచిపెడుతున్నారు. విశాఖఫట్నంలో లూలు గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు రూ.1500- 2000 వేల కోట్లు ఖరీదు చేసే భూములను.. టెండర్లు లేకుండా కట్టబెట్టారు.జగన్ చేయగలిగాడు.. బాబు ఎందుకు చేయలేకపోతున్నాడు?’..లెఫ్ట్, రైట్, సెంటర్ రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. అమరావతి నిర్మాణ పనుల్లోనూ దోపిడీ. 2018లో ఐదేళ్ల కిందట చంద్రబాబు హయాంలో టెండర్లు పిలిచినప్పుడు పనుల విలువ రూ. రూ.36,000 కోట్లు. అప్పట్లో ఇప్పటికన్నా స్టీలు, సిమెంట్లు రేట్లు ఎక్కువ. అయినా కూడా ఆ రూ.36,000 కోట్ల విలువ ఈరోజు రూ.78,000 కోట్లకు పెంచేశారు. టెండర్లు రింగ్ ఫార్మ్ చేసి వాళ్ల కాంట్రాక్టర్లకే ఇచ్చుకుంటున్నారు. మొబలైజేషన్ అడ్వాన్వులు కొత్తగా ఇవ్వడం మొదలుపెట్టాడు. 10 శాతం మొబలైజేషన్ అడ్వాన్స్‌లు ఇవ్వడం, అందులో 8శాతం కమీషన్లుగా తీసుకోవడం.. ప్రభుత్వం చేసిన అప్పులన్నీ ఎక్కడకు పోతున్నాయో తెలియడంలేదు. గతంలో ఎందుకు జగన్ చేయగలిగాడు.. చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.బాబు హయాంలో బటన్లు లేవు.. నేరుగా ఆయన జేబులోకే డబ్బులు‘‘జగన్ నేరుగా బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వేసేవాడు. ఇప్పుడు చంద్రబాబు హయాంలో బటన్లు లేవు.. నేరుగా ఆయన జేబులోకే పోతున్నాయి. ఇదే విషయాన్ని ఎన్నికల సమయంలో మొత్తుకుని చెప్పాను. చంద్రబాబు నాయుడుని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే. ఈ రోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. వీటికి సమాధానం చెప్పుకోలేక ప్రతిరోజూ డైవర్షనే. ఒక రోజు లడ్డూ, మరోరోజు బోటు.. ఇంకోరోజు ఐపీఎస్ ఆధికార్ల అరెస్టులు అంటూ డైవర్షన్లుఇలాంటి పాలనే రాష్ట్రంలో జరుగుతోంది....కరెంటు బిల్లులు షాక్ కొట్టేలా పెంచారు.. వీటి గురించి అడిగితే.. ఆయన చేసిన లిక్కర్ స్కాంను మరలా ఇంకొకరు మీద రుద్ది అరెస్టు చేస్తాడు. ఇలా ప్రతి రోజూ ఏదో ఒక సెన్షేషన్ క్రియేట్ చేసి దాన్నుంచి టాపిక్ డైవర్షన్ చేయడం పరిపాటిగా మారింది. రోమన్ రాజులు మీద ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా వస్తుందని గ్లాడియేటర్స్‌ను పెట్టిన గేమ్స్ ఆడించేవాళ్లు. మనుషులు చేతుల్లో కత్తులు పెట్టి, జంతువులను పెట్టి.. చనిపోయేవరకు యుద్ధాలు చేయించేవారు. వాటని ప్రజలు చూసేలా చేసి వారిని మభ్యపెట్టి డైవర్ట్ చేసేవారు. దీంతో రాజు ఎలా పరిపాలన చేస్తున్నారో చర్చించడం మాని ప్రజలు ఆ ఆటలు గురించే చర్చించేవారు. మిగిలిన విషయాలు పక్కకు పోయేవి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పాలన జరుగుతుంది. ఎంతో మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చొన్నాం. ఇక ఏ మంచీ చేయకుండా, మోసం చేసిన చంద్రబాబు పరిస్ధితి ఎలా ఉంటుందో చెప్పక్కరలేదు..ఇంత మోసం చేసిన మనిషిని ప్రజలు సింగిల్ డిజిట్ రాని పరిస్థితుల్లోకి పరిమితం చేస్తారు.ఆ రోజు వస్తుంది. కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. ప్రతి కార్యకర్తకు.. మన ప్రభుత్వంలో మీ జగన్ 2.0లో తోడుగా ఉంటాడు అని హామీ ఇస్తున్నాను. ఈ రోజు కార్యకర్త ఎంతలా ఇబ్బంది పడుతున్నాడో చూస్తున్నాను’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
పహల్గామ్ మృతులకు వైఎస్ జగన్ సంతాపం
-
వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం (ఫొటోలు)
-
కోనేరు హంపికి అభినందనలు తెలిపిన వైఎస్ జగన్
భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (FIDE) మహిళల గ్రాండ్‌ప్రి టైటిల్ గెలిచిన హంపీ.. తన విజయంతో దేశం గర్వపడేలా చేశారని ప్రశంసించారు. ఆమె సాధించిన విజయం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. హంపి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.నల్ల పావులతో ఎక్కువ గేమ్‌లు ఆడికాగా అంతర్జాతీయ చెస్ సమాఖ్య (FIDE) మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్ ఐదో అంచె టోర్నమెంట్లో.. ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పుణె వేదికగా బుధవారం ముగిసిన ఈ టోర్నీలో హంపి, చైనా గ్రాండ్‌మాస్టర్ జు జినెర్‌తో కలిసి 7 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు.అయితే, ఈ టోర్నమెంట్లో నల్ల పావులతో ఎక్కువ గేమ్‌లు (5) ఆడినందుకు హంపికి టైటిల్ ఖరారైంది. మరోవైపు.. నల్ల పావులతో తక్కువ గేమ్‌లు (4) ఆడిన జు జినెర్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. పది మంది మేటి చెస్ క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరిగింది. Congratulations @Humpy_Koneru On winning the FIDE Women’s Grand Prix title! Another glorious feather in your cap. Your brilliance continues to make India proud. A true inspiration to countless young minds, especially aspiring women in sports. #Chess #GrandPrix— YS Jagan Mohan Reddy (@ysjagan) April 24, 2025 -
పహల్గామ్ ఉగ్రదాడి.. మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ సంతాపం
-
పహల్గాం మృతులకు వైఎస్ జగన్ నివాళి
గుంటూరు, సాక్షి: పహల్గాం ఉగ్రదాడి మృతులకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) నివాళులర్పించారు. గురువారం పలు జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ భేటీకి ముందు ఆయన మృతుల కుటుంబాలకు సంతాపం తెలపడంతో పాటు నివాళులర్పించారు.సమావేశం ప్రారంభంలో.. జమ్ము కశ్మీర్ పహల్గాం(Pahalgam Attack)లో ఉగ్రవాదులు జరిపిన ఆటవిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మౌనం పాటించి నివాళులర్పించి సమావేశం ప్రారంభించారు. ఈ భేటీలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ వైఎస్సార్సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఇంతకుముందు.. పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన వైఎస్ జగన్.. ఇద్దరు ఏపీ వాసులు మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారారాయన. ఈ క్రమంలో.. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఉగ్రదాడిని ఖండిస్తూ.. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ వైఎస్సార్సీపీ శ్రేణులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించాయి కూడా. -
నేడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం
-
నేడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) గురువారం సమావేశం కానున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాల్లో భాగంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగనుంది. దీనికి ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలను ఆహ్వానించారు. వీరితో పాటు ఆయా జిల్లాలకు సంబంధించిన వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు కూడా హాజరుకానున్నారు. -
రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ వైఎస్సార్సీపీ స్థానిక సంస్ధల ప్రజా ప్రతినిధులతో రేపు(గురువారం) ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం కానున్నారు.స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలలో భాగంగా రేపు తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ వైఎస్సార్సీపీ నేతలతో భేటీ కానున్నారు.ఈ సమావేశానికి ఎంపీపీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలను ఆహ్వానించారు. వీరితో పాటు ఆయా జిల్లాలకు సంబంధించిన పార్టీ ముఖ్య నాయకులు కూడా హాజరు కానున్నారు. -
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్సీపీ శాంతి ర్యాలీ
సాక్షి, తాడేపల్లి: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన శాంతి ర్యాలీ తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రారంభమైంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ చేస్తున్నారు. పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణమూర్తి, అధికార ప్రతినిధులు కారుమూరి వెంకటరెడ్డి, శివశంకర్, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, మంగళగిరి ఇన్‌ఛార్జి వేమారెడ్డి, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, పహల్గాం ఘటన పిరికిపంద చర్య అని.. ఇలాంటి దాడులతో భారతీయ స్ఫూర్తిని చెదరగొట్టలేరన్నారు. వైఎస్ జగన్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించామని సజ్జల పేర్కొన్నారు. ‘‘మా ఉక్కు సంకల్పాన్ని కొనసాగిస్తాం. మృతుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ తరపున సానుభూతి తెలియజేస్తున్నాం.. అందరం సంఘటితంగా నిలపడాల్సిన సమయం ఇది’’ అని సజ్జల చెప్పారు.కశ్మీర్‌లోని పహల్గామ్లో టూరిస్టులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీలు చేపట్టింది. ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని పార్టీ నాయకులకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఉగ్రవాదుల దాడిని అమానుష చర్యగా పేర్కొన్న వైఎస్ జగన్.. దేశం అంతా ఒక్కతాటిపై నిలవాలన్నారు. పహల్గాం ఘటనలో పలువురు మరణించండం అత్యంత బాధాకరమన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడం అత్యంత బాధాకరమన్నారు. విజయవాడ నగరంలో..పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్సీపీ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఉగ్ర దాడిలో పర్యాటకులు మృతి చెందడం విచారకరమన్నారు. ఉగ్రదాడిలో ఏపీకి చెందిన ఇద్దరు మరణించారని.. వారి కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఉగ్ర వాదంపై కేంద్రం కఠినంగా వ్యవహరించాలన్నారు.తూర్పుగోదావరి జిల్లాలో..పహల్గాం జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ రాజమండ్రిలో వైఎస్సార్సీపీ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్ జగన్ పిలుపు మేరకు భారీ శాంతి ర్యాలీ చేపట్టారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని, ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీ నేతలు నినదించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రులు తానేటి వనిత, వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాన్ని భరత్, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, వెంకటరావు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పాల్గొన్నారు.అనంతపురం జిల్లాలో..అనంతపురం జిల్లా: జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యకు నిరసనగా అనంతపురంలో వైఎస్సార్సీపీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి సప్తగిరి సర్కిల్ దాకా నిరసన ప్రదర్శన చేపట్టింది. ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని.. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేశారు.వైఎస్సార్ జిల్లాలో..జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడులకు నిరసనగా కడపలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. దుశ్చర్యకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.తిరుపతిలో..జమ్మూకశ్మీర్ పహల్గాం ఘటనకు నిరసనగా వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. పద్మావతిపురంలో భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టింది. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిని ఖండిస్తున్నాం. ఉగ్రవాదులను సమూలంగా ఏరివేయాలని భూమన అన్నారు.విశాఖలో.. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి వైఎస్సార్ పార్కు వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని.. ఈ ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలన్నారు. అమాయకులైన ప్రజల ప్రాణాలను తీసుకోవడం ఉన్మాద చర్యగా ఆయన అభివర్ణించారు. 145 కోట్ల భారతీయులు ఏకతాటిపైకి రావాలని.. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్న మట్టు పెట్టాలన్నారు. బాధితులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. -
పహల్గాం ఉగ్రదాడి.. శాంతి ర్యాలీకి వైఎస్ జగన్ పిలుపు
తాడేపల్లి,సాక్షి: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శాంతిర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ మేరకు, పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ బుధవారం సాయంత్రం అన్నీ జిల్లా కేంద్రాల్లోనూ వైఎస్సార్సీపీ శ్రేణులు క్యాండీల్ ర్యాలీ నిర్వహించాలని ఆదేశించారు. వైఎస్ జగన్ పిలుపుతో ఈ రోజు సాయంత్రం పార్టీ శ్రేణులు క్యాండిల్ ర్యాలీలు నిర్వహించనున్నారు. పహల్గాం ఉగ్రదాడిలో తెలుగు ప్రజల మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జగన్.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిఅనంత్నాగ్ జిల్లా పహల్గాంలోని బైసరన్ లోయ మైదానాల్లో మంగళవారం మధ్యాహ్నాం సైనికుల దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 28 మంది మరణించారు. ఈ ఉగ్రదాడిని వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ఖండించారు. Shocked to hear about the terror attack in Pahalgam, condemn this cowardly act of violence. My thoughts are with the victims and their families. Praying for the speedy recovery of those injured.#Pahalgam— YS Jagan Mohan Reddy (@ysjagan) April 22, 2025పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి గురించి విని షాకయ్యా. ఈ పిరికిపందల హింసాత్మక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్లో పేర్కొన్నారు. -
పహల్గాం ఉగ్రదాడి.. ఏపీవాసుల మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
గుంటూరు, సాక్షి: పహల్గాం ఉగ్రదాడిలో తెలుగు ప్రజల మృతిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జగన్.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలోని బైసరన్ లోయ మైదానాల్లో మంగళవారం మధ్యాహ్నాం సైనికుల దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 28 మంది మరణించారు. ఇందులో విశాఖ వాసి చంద్రమౌళి, కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు ఉన్నారు. చంద్రమౌళి ఎస్బీఐ రిటైర్డ్ ఎంప్లాయి కాగా, మధుసూదన్ ఓ సాఫ్ట్వేర్ కంపెఈలో సీనియర్ ఆర్కిటెక్ట్‌గా పని చేస్తున్నారు. ఈ ఇద్దరి మృతిని ధృవీకరించిన కేంద్ర హోం శాఖ.. ప్రత్యేక విమానంలో మృతదేహాలను స్వస్థలాలకు పంపించింది.ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్.. పర్యాటకులను దారుణంగా కాల్చి చంపడం అమానవీయ చర్యగా పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలను కేంద్రం ప్రభుత్వం ఆదుకుని ఆండగా నిలవాలని వైఎస్ జగన్ కోరుతున్నారు.