
సాక్షి, తాడేపల్లి: నేడు భగీరథ మహర్షి జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.. సగర కులస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. కఠోర శ్రమ, పట్టుదలతో ఎంతటి ఆశయాన్ని అయినా సాధించగలమని నిరూపించిన మహనీయులు భగీరథుడు అని కొనియాడారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘కఠోర తపస్సుతో గంగను భువికి తీసుకువచ్చి ప్రజలకు వరంగా అందించిన మహా రుషి భగీరథ మహర్షి. కఠోర శ్రమ, పట్టుదలతో ఎంతటి ఆశయాన్ని అయినా సాధించగలమని నిరూపించిన మహనీయులు భగీరథుడు. నేడు భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సగర కులస్తులకు శుభాకాంక్షలు’ చెప్పారు.
కఠోర తపస్సుతో గంగను భువికి తీసుకువచ్చి ప్రజలకు వరంగా అందించిన మహా రుషి భగీరథ మహర్షి. కఠోర శ్రమ, పట్టుదలతో ఎంతటి ఆశయాన్ని అయినా సాధించగలమని నిరూపించిన మహనీయులు భగీరథుడు. నేడు భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సగర కులస్తులకు శుభాకాంక్షలు.#BhagirathaMaharshiJayanthi pic.twitter.com/HUc3jwv16G
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 4, 2025