
గుంటూరు, సాక్షి: జన గణనతో పాటే కుల గణన చేయాలన్న కేంద్రం నిర్ణయంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) హర్షం వ్యక్తం చేశారు. గురువారం తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. అలాగే.. వైఎస్సార్‌సీపీ హయాంలో కుల గణనను నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కుల గణన చేయాలనే కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. 2021లోనే మా ప్రభుత్వ హయాంలోనే కుల గణనపై తీర్మానం చేశాం. జనవరి 2024లో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దేశంలో మొట్టమొదటి బీసీ కుల గణనను నిర్వహించాం. కుల గణన ద్వారా వెనుకబడిన, అణగారిన వర్గాలకు మరింత సంక్షేమాన్ని అందించవచ్చు. సమాజంలోని అన్ని వర్గాలకు నిజమైన సామాజిక న్యాయాన్ని, అభివృద్ధిని అందించటంలో ఇది ఇది కీలకమైన అడుగు అని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.
I welcome the Centre’s decision to conduct a caste-based census. Andhra Pradesh, under my leadership, took the lead by passing a resolution in November 2021 and conducting the country’s first BC caste-wise enumeration in January 2024 through village and ward secretariats. A…
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 1, 2025

ఇదీ చదవండి: కులగణనకు కేంద్రం ఓకే