
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జడ్పీ ఛైర్మన్‌లు కలిశారు. కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ హారికపై టీడీపీ సైకోల దాడిని తీవ్రంగా ఖండించిన ఛైర్మన్‌లు.. హారికకు అండగా నిలిచిన వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. స్థానిక సంస్ధలను బలోపేతం చేయాలన్నారు.
వైఎస్సార్‌సీపీని బూత్ లెవల్‌నుంచి మరింత బలోపేతం చేయాలని.. అందుకు తగిన కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగాలని సూచించారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ-రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో కార్యక్రమాన్ని గట్టిగా నిర్వహించాలి’’ అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో.. పిరియా విజయ (శ్రీకాకుళం), మజ్జి శ్రీనివాసరావు (విజయనగరం), జల్లిపల్లి సుభద్ర (ఏఎస్‌ఆర్ జిల్లా), విప్పర్తి వేణుగోపాలరావు (తూర్పుగోదావరి), బూచేపల్లి వెంకాయమ్మ (ప్రకాశం), ఆనం అరుణమ్మ (ఎస్సీఎస్ నెల్లూరు), ముత్యాల రామగోవిందు రెడ్డి (వైఎస్సార్), యర్రబోతుల పాపిరెడ్డి (కర్నూలు), బోయ గిరిజమ్మ (అనంతపురం), గోవిందప్ప శ్రీనివాసులు (చిత్తూరు) ఉన్నారు.