
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ హాస్టళ్లలో సౌకర్యాలు లేకపోవడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సౌకర్యాలు ఎలా ఉన్నాయో పరిశీలించిన లీగల్ సర్వీసెస్ అథారిటీ.. కోర్టుకు రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో భాగంగా నర్సీపట్నంలో ఉన్న బాలికల వసతి గృహంలో 228 మందికి ఒక బాత్రూమే పని చేస్తున్నట్టు రిపోర్ట్‌లో పేర్కొంది.
మరో రెండు, మూడు హాస్టళ్లలో కూడా ఇదే పరిస్థితి ఉందని రిపోర్ట్ ఇచ్చింది. వచ్చే సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ సెక్రటరీ హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హాస్టల్స్ వసతుల కల్పన కోసం ఏ చర్యలు తీసుకుంటారో పూర్తి వివరాలు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.