
సాక్షి, తాడేపల్లి: నేడు అల్లూరి సీతారామరాజుగారి వర్ధంతి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.. అల్లూరి సీతారామరాజుకు నివాళి అర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శమని కొనియాడారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు. అడవి బిడ్డల హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శం. నేడు అల్లూరి సీతారామరాజుగారి వర్ధంతి సందర్భంగా నివాళులు’ అని పోస్టు చేశారు.

బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. అడవిబిడ్డల హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శం. నేడు అల్లూరి సీతారామరాజుగారి వర్ధంతి సందర్భంగా నివాళులు.… pic.twitter.com/iCLvQgElEG
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2025