రైతులకు బాసటగా వైఎస్సార్‌సీపీ: వైఎస్‌ జగన్‌ | YS Jagan Teleconference With Party Leaders Over Unseasonal Rains | Sakshi
Sakshi News home page

అకాల వర్షాలతో అపార నష్టం.. రైతులకు బాసటగా వైఎస్సార్‌సీపీ: వైఎస్‌ జగన్‌

May 5 2025 11:19 AM | Updated on May 5 2025 11:44 AM

YS Jagan Teleconference With Party Leaders Over Unseasonal Rains

గుంటూరు, సాక్షి: ఏపీలో అధికార యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉందని, రైతులు నష్టపోకుండా ప్రభుత్వం సరైన చర్యలేవీ చేపట్టలేదని వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ఏపీలో అకాల వర్షాలపై పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లు, ముఖ్యనాయకులతో సోమవారం వైఎస్‌ జగన్‌ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 

‘‘కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా నిలవాలి. అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించండి.. వారికి ధైర్యం చెప్పండి. రాష్ట్రంలో పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. అనేక ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఖరీఫ్‌లో ప్రతికూల వాతావరణం, కనీస మద్దతు ధరలు లభించక ధాన్యఙ రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ రబీ సీజన్‌లో కూడా కష్టాలు పడటం ఆవేదన కలిగిస్తోంది. 

వర్షాలు కురుస్తాయన్న సమాచారం ముందస్తుగానే ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కళ్లాల్లో, పొలాల్లో రైతులవద్దనున్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో తీవ్ర నిర్లక్ష్యం కనబరిచింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా పలు చోట్ల ప్రభుత్వం ధాన్యాన్ని సరిగ్గా సేకరించడంలేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అకాల వర్షాలవల్ల మరింతగా నష్టపోతున్నారు. యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉంది. 

పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలి. రైతులకు బాసటగా నిలవాలి. రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అని కేడర్‌కు వైఎస్‌ జగన్‌ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement