breaking news
Rayalaseema - telangana
-
'బురద' రాజకీయాలు మానాలి!
‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’పై బురద చల్లే కార్యక్రమాన్ని ఆపి సీమను ఆదుకునే పనిపై సంబంధిత పక్షాలన్నీ దృష్టి పెట్టాలి. ఈ పథకంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం తూతూ మంత్రంగా తప్పు పట్టడం, ఆ పథకం ప్రాధాన్యాన్ని తక్కువ చేసి మాట్లాడటం, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం దీనికి ప్రత్యామ్నాయం అన్నట్లు మాట్లాడటం సరికాదు. కొంత మంది రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం లేదనీ, 800 అడుగుల నుంచి నీరు తీసుకుంటే నీళ్లు కాదు బురద వస్తుందనీ మాట్లాడటం అభ్యంతరకరం. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్రత్యామ్నాయం కాదు. అసలు రెండు ప్రాజెక్టులకు పోటీ పెట్టి మాట్లాడటమే పొరపాటు. రెండు ఎత్తిపోతల పథకాల ద్వారా రాయలసీమకు నీటిని గరిష్ఠ స్థాయిలో ఎలా తీసుకోవాలి అనే విషయంపై ప్రభుత్వం ఆలోచన చేయాలి.ముచ్చుమర్రి ఎలా ప్రత్యామ్నాయం?ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్రత్యామ్నాయంగా మాట్లాడుతున్నారు. శ్రీశైలంలో నీటిమట్టం 798 అడుగులు ఉన్నపుడు కూడా నీటిని తోడే అవకాశం ముచ్చుమర్రి ద్వారా సాధ్యం అవుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనలకు ప్రతిరూపమే ముచ్చుమర్రి. 2007లో వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు 90 కోట్ల రూపాయల ఖర్చుతో పాలనాపరమైన, ఆర్థిక పరమైన అనుమతులు ఇవ్వడంతో పాటు దాదాపు 50 శాతం పనులు పూర్తి చేశారు. అయితే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ముచ్చుమర్రి వలన ప్రయోజనాలు, పరిమితులను నిజా యతీగా విశ్లేషించుకోవాలి.ఈ పథకం ద్వారా కేసీ కెనాల్‌కు 1,000 క్యూసెక్యులు,హంద్రీ–నీవా ప్రాజెక్టుకు 3,000 క్యూసెక్యుల నీటిని రెండు మార్గాల ద్వారా లిఫ్ట్ చేస్తున్నారు. మల్యాల నుంచి మరో 3,000 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేయడం ద్వారా హంద్రీ–నీవాకు సరఫరా చేస్తున్నారు. అయితే మల్యాల నుంచి లిప్ట్ చేయాలంటే శ్రీశైలంలో 834 అడులు నీరు ఉంటేనే సాధ్యం. ముచ్చుమర్రి దగ్గర కృష్ణానది నుంచి సిద్ధేశ్వరం దాకా 7 కి.మీ. మేరకు కాలువ తవ్వడం వలన నీటిని ఎత్తిపోతల ద్వారా హంద్రీ– నీవా, కేసీ కెనాల్లకు పరిమిత స్థాయిలో సరఫరా చేయవచ్చు. 11,574 క్యూసెక్కులు నిరాటంకంగా తోడితే ఒక టీఎమ్సీ నీటిని తోడవచ్చు. ఒక్క హంద్రీ–నీవాకే 40 టీఎమ్సీలు అవసరం. 2017లో ప్రారంభమైన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా గడిచిన 7, 8 సంవత్సరాలలో ఏడాదికి 7 నుంచి 9 టీఎమ్సీల నీటిని మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. హంద్రీ–నీవాకు 40 టీఎమ్సీలూ, కేసీ కెనాల్‌కు పూర్తి స్థాయి అవసరాలకూ అనుగుణంగా నీరు సరఫరా సాధ్యం కావడం లేదు. అలాంటి పరిస్థితిలో అదనంగా పోతిరెడ్డిపాడు ద్వారా నీరు విడుదల చేయా ల్సిన ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్, కేసీ కెనాల్, తెలుగుగంగ, నెల్లూరు జిల్లా సోమశిల వంటి వాటికి ముచ్చుమర్రి ద్వారా నీరు ఇవ్వడం ఎలా సాధ్యం అవుతుంది?పోతిరెడ్డిపాడు కింద ఎస్ఆర్ఎమ్సీ వద్ద రోజుకు మూడు టీఎమ్సీల నీటిని సరఫరా చేసే అవకాశం రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా లభిస్తుంది. కానీ, ప్రభుత్వం మాత్రం ముచ్చుమర్రి ద్వారా మొత్తం సమస్యకు పరిష్కారం లభిస్తుంది అన్నట్లు మాట్లా డటం సరికాదు. ముచ్చుమర్రి ద్వారా వచ్చే పరిమిత ప్రయోజ నాలను కొనసాగిస్తూ అదనపు ప్రయోజనాలకు అనుగుణంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి.అవగాహన లేని వ్యాఖ్యలుకొందరు ఏకంగా శ్రీశైలంలో 800 అడుగులు నుంచే నీరు లిఫ్ట్ చేస్తే బురద వస్తుందనడం అభ్యంతరకరం. మరి అంతకన్నా కొన్ని అడుగుల క్రింద నుంచే గడిచిన ఏడెనిమిది సంవత్సరాలుగా ముచ్చుమర్రి ద్వారా నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 800 అడుగుల కింద నుంచే నీటిని లిఫ్ట్ చేస్తోంది. అక్కడెక్కడా రాని బురద రాయలసీమ ఎత్తిపోతల పథకంలో మాత్రమే వస్తుందనడం న్యాయమా? కొందరు మంత్రులు ఏకంగా ముచ్చుమర్రి నుంచే పోతిరెడ్డిపాడుకు నీరు లిఫ్ట్ చేసుకుందాం అంటూ ప్రకటనలు చేస్తున్నారు. ముచ్చుమర్రి, మల్యాల నుంచి హంద్రీ–నీవా అవస రాలకు 40 టీమ్సీల నీరు అవసరం అయితే, అందులో సగం నీరు కూడా తీసుకోలేని దుఃస్థితిలో ఉంటే... అదనంగా పోతిరెడ్డిపాడుకు కూడా ముచ్చుమర్రి నుంచే నీరు లిఫ్ట్ చేసుకుందాం అనడం దారుణం.రాయలసీమ ప్రాజెక్టులకు ప్రస్తుతం ఉన్న ఏర్పాట్లతో నికర జలాలు సగం కూడా తీసుకోలేక పోతున్నాము. ఇంక వరద జలాలపై ఆధారపడిన గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలుగొండ, సోమశిలలకు నీరు ఎలా తీసుకుంటాం? బాధ్యత గల ప్రభుత్వాలు శ్రీశైలం నుంచి అవకాశం ఉన్న మేరకు గరిష్ఠ స్థాయిలో నీటిని తీసుకునేందుకు మార్గాలను అన్వేషించాలి. సింహ భాగం పూర్తి అయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తే నష్టపోయేది రాయలసీమ ప్రజలే!మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి వ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయ కర్త -
సమాధానం చెప్పలేకే తిట్ల దండకం!
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు.. అవినీతి.. చీకటి ఒప్పందాలను సాక్ష్యాధారాలతో బట్టబయలు చేస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంధించిన ప్రశ్నాస్త్రాలకు సమాధానం చెప్పలేక ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు తిట్ల దండకం అందుకున్నారని మేధావులు, రాజకీయ పరిశీలకులు, ప్రజా సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి సీఎం చంద్రబాబు, మంత్రులు, టీడీపీ నేతలు తమకు అలవాటైన రీతిలో పోటీ పడి దూషణలకు దిగుతున్నారంటూ ఆక్షేపిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా, ప్రజాభ్యుదయమే పరమావధిగా, ప్రజాధనం దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో ప్రతిపక్ష నేతగా చిత్తశుద్ధితో ప్రజల తరఫున వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తే.. చిత్తశుద్ధితో సీఎం చంద్రబాబు, మంత్రులు వాటికి సమాధానాలు చెప్పాల్సిందిపోయి, దూషణల పర్వానికి దిగడం ద్వారా తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై రాయలసీమ ఎత్తిపోతలను ఆపేయించానంటూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు, భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ చోరీ, రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతిపై ఆర్బీఐ నివేదిక, పారిశ్రామిక ప్రగతి పేరిట చేస్తున్న అవినీతి, అప్పుల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, పన్నుల పేరిట బాదుడే బాదుడుతోపాటు.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయానికి గండికొడుతూ చేస్తున్న అవినీతిపై సాక్ష్యాధారాలతో గురువారం వైఎస్ జగన్ మీడియా సమావేశంలో ప్రభుత్వానికి ప్రశ్నాస్త్రాలను సంధించిన విషయం తెలిసిందే. ఇదే సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నలకు వైఎస్ జగన్ స్పందిస్తూ.. రాజధానికి తొలి దశ భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకుండా, వారికి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రెండో దశలో మళ్లీ 50 వేల ఎకరాలు సమీకరిస్తుండటంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ప్రశ్నించిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా సీఎం చంద్రబాబు, మంత్రులు సమాధానాలు చెప్పలేక నీళ్లు నములుతూ తమకు అలవాటైన రీతిలో తిట్ల దండకాన్ని అందుకున్నారు. వారితో పాటు ఎల్లో మీడియా సైతం పోటీ పడి దూషణల పర్వానికి దిగింది.స్వలాభం కోసం ఎందాకైనా బాబు సిద్ధం⇒ స్వలాభం కోసం ప్రజలకు ఎంతటి మోసాన్ని చేయడానికైనా సీఎం చంద్రబాబు వెనుకాడరన్నది రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని వైఎస్ జగన్ ఎత్తిచూపడంతో చంద్రబాబు సర్కార్ ఆత్మరక్షణలో పడింది. ⇒ 2014–19 మధ్య భూ సేకరణను కోర్టు కేసులతో సంక్లిష్టం చేసి చంద్రబాబు సర్కార్ చేతులెత్తేస్తే 130 కేసులను పరిష్కరించి, 2019–24 మధ్య 2,700 ఎకరాల భూమిని సేకరించి.. రూ.960 కోట్లతో మూడు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించి.. భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను ప్రారంభించింది వైఎస్ జగన్. 2026 నాటికి ఎయిర్‌పోర్టు సిద్ధమవుతుందని అప్పుడే చెప్పిన అంశాన్ని వైఎస్ జగన్ గుర్తు చేస్తూ చంద్రబాబు క్రెడిట్ చోరీ నిర్వాకాన్ని సాక్ష్యాధారాలతోసహా బట్టబయలు చేయడంతో బాబు అబాసుపాలయ్యారు. ⇒ 2019–24 మధ్య రూ.3.31 లక్షల కోట్లు అప్పు చేస్తే.. అందులో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో రూ.2.73 లక్షల కోట్లను ప్రజల ఖాతాల్లో జమ చేశామని.. ఎవరెవరి ఖాతాల్లో ఏ పథకం కింద ఎంత వేశామన్నది ఆధార్ కార్డులతో సహా ఇస్తామని వైఎస్ జగన్ చెప్పారు. కానీ.. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన 19 నెలల్లోనే రూ.3.02 లక్షల కోట్లు అప్పు చేసినా.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పథకాలు అమలు చేయలేదని.. అప్పుగా తెచ్చిన ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లిందని వైఎస్ జగన్ నిలదీయడంపై కూడా వారెవరూ జవాబు చెప్పలేదని మేధావులు స్పష్టీకరిస్తున్నారు.⇒ ఇసుక నుంచి క్వార్ట్జ్ వరకూ ఎడాపెడా దోచేస్తూ.. మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని టీడీపీ నేతలు జేబుల్లోకి వేసుకుంటున్నారని గణాంకాలతోసహా ఎత్తిచూపితే ఎందుకు వాటిపై స్పందించరని మేధావులు నిలదీస్తున్నారు. అమరావతి మదర్ ఆఫ్ స్కామ్స్ కాదా?⇒ బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో అత్యంత అధునాతన సదుపాయాలతో చదరపు అడుగు రూ.4 వేల చొప్పున భవనాలను నిర్మిస్తుంటే.. రాజధానిలో చదరపు అడుగు రూ.పది వేలతో నిర్మిస్తున్నారని ఎత్తిచూపుతూ ఈ వ్యవహారంలో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుందని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారులను కి.మీ రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల చొప్పున నిర్మిస్తుంటే.. రాజధాని అమరావతిలో కిలోమీటర్‌కు రూ.180 కోట్లు వెచ్చించి రహదారి నిర్మిస్తున్నాని ఎత్తిచూపుతూ.. భారీ ఎత్తున దోచుకుంటున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లతో కలిసి నీకింత–నాకింత అంటూ దోచుకుంటున్నారని నిగ్గదీసి అడిగారు. దీనిపై కూడా సమాధానం రాలేదు. ⇒ గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో 50 వేల ఎకరాల ప్రాంతాన్ని రాజధానిగా 2015లో ప్రభుత్వం ప్రకటించింది. లోతట్టు ప్రాంతమైన ఆ భూమిలో రోడ్లు, విద్యుత్, తాగునీరు, మురుగు నీటి వ్యవస్థ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికే ఎకరానికి రూ.2 కోట్లు చొప్పున రూ.లక్ష కోట్లు అవసరమని కేంద్రానికి చంద్రబాబు సర్కార్ డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) సమర్పించింది. ఇప్పుడు మరో 50 వేల ఎకరాలు సేకరిస్తోంది. దీని అభివృద్ధికి మరో రూ.లక్ష కోట్లు కావాలి. మొత్తంగా రూ.రెండు లక్షల కోట్లు. అంతపెద్ద ఎత్తున అప్పు తెచ్చి ఎవరైనా రాజధాని నిర్మిస్తారా? అని వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నకూ సమాధానం లేదు.⇒ ‘మచిలీపట్నంలో పోర్టును నిర్మిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ వెస్ట్రన్ బైపాస్ పూర్తయింది. గన్నవరం ఎయిర్‌పోర్టు ఉంది. విజయవాడ–గుంటూరు మధ్యలో రహదారికి సమీపంలో లేదా విజయవాడ–మచిలీపట్నం మధ్య రహదారికి సమీపంలో రాజధానిని నిర్మించి ఉంటే తక్కువ ఖర్చుతో ఈ పాటికే మహానగరంగా అభివృద్ధి చెంది ఉండేది కాదా?’ అని వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నకూ వారి నుంచి సమాధానం లేదు.సమాధానం చెప్పేందుకు నోరు పెగలట్లేదెందుకు?⇒ రాజ్యాంగంలో ఎక్కడైనా రాజధాని ప్రస్తావన ఉందా? వైఎస్ జగన్ చెప్పినట్టుగా సీఎం, మంత్రులు ఎక్కడ కూర్చొని కార్యకలాపాలు నిర్వహిస్తే అదే రాజధాని. ఇది అబద్ధమని సాక్ష్యాధారాలతో ఒక్కరైనా సమాధానం చెప్పగలిగారా?⇒ రివర్ బేసిన్లో, ముంపు ప్రాంతంలో రాజధాని అమరావతిని నిర్మిస్తున్నారని.. ఎక్కడైనా లోతట్టు ప్రాంతం, వరద ముప్పు ఉండే ప్రాంతంలో రాజధాని నిర్మించారా? అన్న వైఎస్ జగన్ ప్రశ్నకు సూటిగా సమాధానం ఎందుకు చెప్పడం లేదు? ⇒ కొండవీటి వాగు, పాల వాగు వరద వల్ల తరచుగా రాజధాని ప్రాంతం ముంపునకు గురవుతుండటం నిజం కాదా. ఈ వరద ముప్పును తప్పించడానికే శాఖమూరు, కృష్ణాయపాలెం, నీరుకొండ వద్ద 3 రిజర్వాయర్లు నిర్మిస్తున్న మాట వాస్తవం కాదా? కొండవీటి వాగు వరద నీటిని ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోయడానికి ఇప్పటికే 5 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో ఉండవల్లి వద్ద ఎత్తిపోతల చేపట్టలేదా? తాజాగా 8,400 క్యూసెక్కులను ఎత్తిపోసేందుకు మరో ఎత్తిపోతల చేపట్టింది వాస్తవం కాదా? ⇒ రాజధానికి తొలి దశ భూ సమీకరణ కింద రైతులు భూములు ఇచ్చి 11 ఏళ్లు పూర్తయినా, ఇప్పటికీ అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వక పోవడం నిజం కాదా? రైతులకు అభివృద్ధి చేయకుండా ఇచ్చిన ప్లాట్లను కూడా చెరువుల్లో, వాగుల్లో, వంకల్లో ఇవ్వడం నిజం కాదా?⇒ తాజాగా సీడ్ యాక్సిస్ రోడ్డు, ఎన్–8 రోడ్డు వంటి రోడ్ల విస్తరణ పేరుతో రైతుల ఇళ్లను కూడా సమీకరణ కింద ప్రభుత్వం లాక్కుంటుంటే.. ఈ అన్యాయంపై మంత్రి నారాయణను రైతు రామారావు ప్రశ్నిస్తూ ఆవేదనతో గుండె పగిలి చనిపోవడం నిజం కాదా?⇒ రెండో దశ భూ సమీకరణ చేసేందుకు వడ్లమానులో నిర్వహించిన గ్రామసభలో ఇదే అంశంపై మంత్రి నారాయణను రైతులు నిలదీయడం వాస్తవం కాదా? -
బాబు స్వార్థ ప్రయోజనాల కోసం 'సంజీవని తాకట్టు': వైఎస్ జగన్
శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు. పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి స్థాయిలో నీటిని తరలించాలంటే 881 అడుగులు ఉండాలి. తెలంగాణ 777–825 అడుగుల మధ్య రోజుకు 8 టీఎంసీల నీళ్లు వాడుకుంటుంటే, మనం కేవలం 0.6 టీఎంసీలు మాత్రమే తీసుకుంటున్నాం. ఇలాగైతే నీటి మట్టం ఎప్పుడు 881 అడుగులకు చేరుతుంది? ఎప్పుడు శ్రీశైలం నిండుతుంది? శ్రీశైలంలో 881 అడుగుల స్థాయిలో నీళ్లు ఎన్ని రోజులు ఉంటాయి? ఎప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కిందనున్న రిజర్వాయర్లకు నీళ్లు వస్తాయి? రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల పరిస్థితి ఏమిటి ? చిత్తూరు జిల్లాలోనే పుట్టిన చంద్రబాబు ఏరోజైనా ఈ ఆలోచన చేశాడా? – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతలపై చంద్రబాబు, జల వనరుల శాఖ మంత్రి కలిసి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలను ఖండిస్తారని అందరూ భావించారు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టే స్థాయికి దిగజారిపోరని ప్రతీ రైతూ ఆశించారు. కానీ.. ఆశ్చర్యకర రీతిలో రాయలసీమ ఎత్తిపోతల అవసరమే లేదంటూ చంద్రబాబు బరితెగించి మాట్లాడటమే కాకుండా, జలవనరుల మంత్రితో మాట్లాడించిన మాటలు చూస్తుంటే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో తను (చంద్రబాబు) చేసుకున్న రహస్య ఒప్పందానికి అధికారికంగా ఆమోద ముద్ర వేసినట్లుగా కన్పిస్తోంది. స్వలాభం కోసం ప్రజలకు ఎంతటి ద్రోహమైనా, ఎంతటి మోసమైనా చేయడానికి చంద్రబాబు వెనుకాడడని మరోసారి రుజువైంది. తన స్వార్థం కోసం పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్టే.. జన్మనిచ్చిన సీమకు కూడా ఏమాత్రం వెనుకాడకుండా వెన్నుపోటు పొడుస్తాడన్నది మరోసారి నిరూపితమైంది.పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగుగంగ, గాలేరుృనగరి, ఎస్సార్బీసీ, చెన్నైకి తాగునీరు రూపంలో దాదాపు 101 టీఎంసీల కేటాయింపులున్నాయి. ప్రస్తుత స్పిల్ లెవల్ 841 అడుగులు. ఈ స్థాయిలో నీరు ఉంటే కేవలం 2 వేల క్యూసెక్కులు వస్తుంది. 854 అడుగులకు నీరు చేరితే 7 వేల క్యూసెక్కులు వస్తుంది. ఈ లెక్కన పూర్తి సామర్థ్యం 44 వేల క్యూసెక్కుల నీరు కిందకు (కాలువలోకి) రావాలంటే శ్రీశైలంలో 881 అడుగులకు నీరు చేరాలి. గత 20 ఏళ్లలో కేవలం మూడు, నాలుగు సార్లు మాత్రమే కేటాయించిన మేరకు నీళ్లు వాడుకోగలిగాం. మరొకవైపు యథేచ్ఛగా ఎత్తిపోతలు, పవర్ హౌస్ ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ రోజుకు 8 టీఎంసీలను శ్రీశైలం నుంచి తెలంగాణ దిగువకు తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తున్న పరిస్థితి. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో రాయలసీమ ఎత్తిపోతల అత్యంత అవశ్యం. గుక్కెడు నీళ్ల కోసం అల్లాడిపోతున్న ప్రజల గొంతు తడపాలని, ప్రజలకు మంచి చేయాలని ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడూ ఉండదు. ఎప్పుడుచూసినా దిక్కుమాలిన అబద్ధాలు, మోసాలు. ప్రజల కోసం చీకు, చింతా లేవు. చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ దొంగ పనులే. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు కొత్తదేమీ కాదు. రాయలసీమ, నెల్లూరు, చెన్నైకి తాగునీటి అవసరాలు తీర్చేందుకు గతంలో కేటాయింపుల మేరకు ముందే కట్టి ఉన్న రిజర్వాయర్లకు నీటిని సప్లిమెంట్ చేసే పథకమే ఇది.కృష్ణా నదిలో వరద వచ్చే రోజులు ఏటా తగ్గిపోతున్నాయి. ఏడాదిలో 20ృ30 రోజులకు మించి వరద రావడం లేదు. మరొకవైపు లిఫ్టులు, పవర్ హౌస్‌ల ద్వారా తెలంగాణ ఎడాపెడా రోజుకు 8 టీఎంసీల నీళ్లు తోడేస్తోంది. శ్రీశైలం నుంచి 777ృ825 అడుగులకే నీళ్లు ఖాళీ చేసేస్తున్నారు. ఈ పరిస్థితిలో తక్కువ సమయంలోనే ఇప్పటికే కట్టి ఉన్న ప్రాజెక్టులకు నీళ్లు నింపలేని పరిస్థితిని చక్కదిద్దేందుకే ఈ ప్రాజెక్టు చేపట్టాం. దీంట్లో కొత్త రిజర్వాయర్లు ఏమీ లేవు. ఉన్న రిజర్వాయర్లకు నీళ్లు పంపేందుకు ఉద్దేశించిందే ఈ ప్రాజెక్టు.అటు తెలంగాణ.. ఇటు ఆంధ్రప్రదేశ్.. అందరూ మాట్లాడేది ఒకటే భాష. అందరూ అన్నదమ్ములమే. తెలంగాణ ప్రాంతం వాళ్లకు నష్టం చేయాలని జగన్ ఏ రోజూ ఆలోచన చేయడు. కానీ మన రాష్ట్ర ప్రజలకు నష్టం జరగకుండా చూసుకోవడం మన ధర్మం. కొంత మంది పాలకులు ఇందులో ఎమోషనల్ డ్రామాలు ప్లే చేసి, భావోద్వేగాలను రెచ్చగొట్టి.. ఇరు ప్రాంతాల ప్రజల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేయడం చాలా తప్పు. అందరూ అన్నదమ్ములుగానే ఉన్నాం.. కలిసి మెలిసి ఉన్నాం.. కలిసి మెలిసి పెరిగాం.. అలాగే ఉండాలి. -వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు రాయలసీమ ఎత్తిపోతల సంజీవని అని, ఇన్సూరెన్స్ పాలసీ వంటిదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. అలాంటి రాయలసీమ ఎత్తిపోతలపై సీఎం చంద్రబాబు, ఆయన ప్రభుత్వంలోని జల వనరుల శాఖ మంత్రి మాట్లాడుతున్న మాటలు వింటుంటే ‘వీళ్లు అసలు మనుషులేనా?’ అనిపిస్తోందని మండిపడ్డారు. వాళ్లు మాట్లాడిన ప్రతీ మాట రాక్షసులను గుర్తు చేస్తోందంటూ దుయ్యబట్టారు. ఏపీ సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమైనప్పుడు (క్లోజ్డ్ డోర్ మీటింగ్) రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపేయాలని తాను అడిగానని, తనపై ఉన్న గౌరవంతో చంద్రబాబు ఆ ప్రాజెక్టును ఆపేశారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆ రాష్ట్ర అసెంబ్లీ నిండు సభలో ప్రకటించారని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డితో సాన్నిహిత్యం కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని ఏ విధంగా అమ్మకానికి పెట్టారో చెప్పేందుకు రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనే నిదర్శనమన్నారు. చంద్రబాబు సీఎం కుర్చీలో కూర్చొని స్వప్రయోజనాల కోసం సొంత రాష్ట్రాన్ని ఏ విధంగా తాకట్టు పెట్టాడో.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తన స్వార్థం కోసం ఏ విధంగా పణంగా పెడుతున్నాడో చెప్పేందుకు రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలే సాక్ష్యాలని ధ్వజమెత్తారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల రైతుల దృష్టిలో చంద్రబాబు ఓ విలన్ కేరక్టర్‌గా కన్పిస్తున్నారన్నారు. బహుశా దేశ చరిత్రలో ఇలాంటి చరిత్ర హీనుడు ఎవరూ ఉండకపోవచ్చని నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల, భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ చోరీ, పెట్టుబడులు–ఉపాధి కల్పన–అప్పులపై నాణేనికి మరో పార్శ్వం తదితర అంశాలకు సంబంధించి సాక్ష్యాధారాలతో సహా వాస్తవాలను వివరిస్తూ చంద్రబాబు సర్కార్ వ్యవహార శైలిని ఏకిపారేశారు. రాయలసీమ ఎత్తిపోతలపై చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి కలిసి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలను ఖండిస్తారని అందరూ ఆశిస్తే.. ఆశ్చర్యకరంగా బాబు రహస్య ఒప్పందానికి అధికారికంగా ఆమోద ముద్ర వేసినట్లుగా కన్పిస్తోందన్నారు. తక్షణమే రాయలసీమ ఎత్తిపోతల పనులను ప్రారంభించి.. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలని, లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమ ఎత్తిపోతలను వాయు వేగంతో పూర్తి చేసి, రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘రాయలసీమ ఎత్తిపోతల’ గొప్ప ఆలోచన నిజంగా రాయలసీమ ఎత్తిపోతల అనేది గొప్ప ఆలోచన. గొప్ప ఉద్దేశం. కరువు కోరల్లో చిక్కుకున్న రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయం ప్రశ్నార్థకమైన పరిస్థితులు.. తాగడానికి మంచినీళ్లు కూడా ఒక్కోసారి దొరకని పరిస్థితి. ఇలాంటి ప్రాంతానికి ఈ రాయలసీమ ఎత్తిపోతల అనేది ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది. రాయలసీమతోపాటు నెల్లూరు, చెన్నైలకు సంజీవని లాంటిది. ఈ విషయంలో అందరూ ఆలోచించాలని చెబుతున్నా. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. శ్రీశైలం నుంచి రాయలసీమకు, నెల్లూరుకు, చెన్నై ప్రాంతాలకు నీటిని విడుదల చేసే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ స్పిల్ లెవల్ 841 అడుగులు. కానీ ప్రస్తుతం ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గరిష్ఠ సామర్థ్యం 44 వేల క్యూసెక్కులు. ఆ స్థాయిలో ప్రధాన కాలువలోకి నీళ్లు రావాలంటే శ్రీశైలంలో 881 అడుగుల్లో నీళ్లుండాలి. శ్రీశైలంలో 841 అడుగుల్లో నీరు ఉంటే కేవలం 2 వేల క్యూసెక్కులు, 854 అడుగులకు చేరితే 7 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ప్రధాన కాలువలోకి వస్తుంది. ఈ లెక్కన 44 వేల క్యూసెక్కుల నీరు కిందకు (కాలువలోకి) రావాలంటే శ్రీశైలంలో 881 అడుగులకు నీరు చేరాలి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ, చెన్నైకి తాగునీరు రూపంలో దాదాపు 101 టీఎంసీల కేటాయింపులున్నా సరే... గడిచిన 20 ఏళ్లలో కేవలం 3–4 సార్లు మాత్రమే కేటాయించిన మేరకు నీళ్లు వాడుకోగలిగాం. అందరూ ఆలోచించాల్సిన వాస్తవాలు ఇవి. ఇలాంటి దుర్భర పరిస్థితులు ఒకవైపు ఉండగా, విభజన తర్వాత తెలంగాణలో ఏం జరిగిందో ఒకసారి పరిశీలించాలి.ఓటుకు కోట్లు కేసు కోసం రాష్ట్ర ప్రయోజనాలు పణం ⇒ 2015లో ఇక్కడ చంద్రబాబు సీఎంగా ఉండగా, అక్కడ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ సమయంలో కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచారు. శ్రీశైలంలో 802 అడుగుల నుంచే నీళ్లు తోడుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం ఈ పనులు చేపట్టింది. మరోవైపు 800 అడుగుల్లోనే రోజుకు మరో 2 టీఎంసీలు వాడుకునేందుకు వీలుగా పాలమూరు–రంగారెడ్డి–దిండి ప్రాజెక్టు పనులు మొదలు పెట్టారు. ఇంకో వైపున 825 అడుగులకే ఎస్ఎల్బీసీ నుంచి మరో 40 టీఎంసీలు తీసుకెళ్లేలా నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ⇒ శ్రీశైలంలోకి నీళ్లు రాకముందే జూరాల నుంచి నెట్టంపాడు, కోయల్ సాగర్, భీమా ఎత్తిపోతల ద్వారా మరొక టీఎంసీ నీళ్లు అటు నుంచి అటే తెలంగాణకు తరలిస్తున్న పరిస్థితి. ఇంకొక వైపు 777 అడుగుల నుంచి శ్రీశైలం ఎడమ వైపున ఉన్న పవర్ హౌస్‌లో విద్యుదుత్పత్తి కోసం రోజుకు 4 టీఎంసీల నీళ్లు ఇష్టమొచ్చినట్టుగా ఎడాపెడా తీసుకొని శ్రీశైలం నుంచి ఖాళీ చేస్తున్నారు. ఈ విషయాలన్నీ గమనించాలి.⇒ ఇటువైపు మన రాష్ట్రంలో నీళ్లు లేక ప్రజలు అల్లాడిపోతుంటే.. మరొకవైపు అటు యథేచ్చగా ఎత్తిపోతలు, పవర్ హౌస్ ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ రోజుకు 8 టీఎంసీలను శ్రీశైలం నుంచి తెలంగాణ దిగువకు తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏపీది అడ్డుకోలేని పరిస్థితి. శ్రీశైలం ఎడమ వైపున పవర్ హౌస్‌లో విద్యుత్ ఉత్పత్తికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రోజుకు 4 టీఎంసీల నీళ్లను ఖాళీ చేస్తున్నా అడ్డుకోలేకపోతున్నాం. నాగార్జున సాగర్ ఎడమ గట్టు పవర్ హౌస్, దాని నిర్వహణ అన్నీ వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. ⇒ మొన్నటి వరకు మన భూ భాగంలో ఉన్న నాగార్జున సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్, దాని నిర్వహణ కూడా తెలంగాణ చేతుల్లోనే ఉండేది. ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాగార్జునసాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్, దాని నిర్వహణను స్వాధీనం చేసుకుంది. నాగార్జున సాగర్ కిందనున్న పులిచింతల ప్రాజెక్టు, దాంట్లో ఎడమ వైపున ఉన్న పవర్ హౌస్ కూడా తెలంగాణ చేతుల్లోనే ఉంది. రాష్ట్రానికి, రాయలసీమకు తీవ్ర విఘాతం కల్గించే ఈ నిర్ణయాలన్నీ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు హయాంలో తీసుకున్నవే. ఇందుకు కారణం.. ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నోరు మెదపని పరిస్థితి. అప్పట్లోనే మన రాష్ట్ర హక్కుల కోసం ప్రతిపక్ష నేతగా ఉన్న నేను కర్నూలులో జల దీక్ష కూడా చేశాను. చంద్రబాబు మౌనం.. రాష్ట్రానికి శాపం ⇒ చంద్రబాబు మౌనం వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో ఎడమ వైపు తెలంగాణ చేపట్టిన ఎత్తిపోతల ప్రాజెక్టుల పనులు 2019 వైఎస్సార్సీపీ వచ్చే నాటికి చకచకా జరుగుతున్నాయి. కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ విస్తరణ పనులతోపాటు పాలమూరు–రంగారెడ్డి–దిండి ఎత్తిపోతల పథకాలలో ఏ ఒక్కదానికి పర్యావరణ అనుమతుల్లేవు. ఈ పనులు ఆపాలని ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) 2021 అక్టోబర్‌లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆదేశాలిచ్చినా వారు పట్టించుకోలేదు. ⇒ ఇదే విషయమై ఎన్జీటీ 2022లో తెలంగాణ ప్రభుత్వానికి రూ.920 కోట్ల జరిమానా కూడా విధించింది. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం ఎత్తిపోతలు, పవర్ హౌస్ ఆపరేషన్స్ ద్వారా శ్రీశైలంలో 777 అడుగుల నుంచి 825 అడుగుల వరకు రోజుకు 8 టీఎంసీల నీళ్లు తీసుకుంటున్న పరిస్థితి. మరోవైపు మన రాష్ట్ర పరిస్థితి చూస్తే 834 అడుగుల వద్ద మల్యాల వద్ద చిన్న ఎత్తిపోతల ద్వారా 0.3 టీఎంసీలు, ముచ్చుమర్రిలో 795 అడుగుల వద్ద 0.3 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకోగలుగుతున్నాం. ⇒ తెలంగాణ వాళ్లు 8 టీఎంసీలు నీళ్లు వాడుకుంటుండగా, మనం కేవలం 0.6 టీఎంసీలు మాత్రమే తీసుకుంటున్నాం. శ్రీశైలం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు.. పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి స్థాయిలో నీటిని తరలించాలంటే 881 అడుగులు ఉండాలి. రోజుకు 777–825 అడుగుల వద్ద 8 టీఎంసీలు నీళ్లు ఖాళీ అవుతుంటే.. ఎప్పుడు 881 అడుగులకు నీరు చేరుతుంది? ఎప్పుడు శ్రీశైలం నిండుతుంది? శ్రీశైలంలో 881 అడుగుల స్థాయిలో నీళ్లు ఎన్ని రోజులు ఉంటాయి? ఎప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కిందనున్న రిజర్వాయర్లకు నీళ్లు వస్తాయి? రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల పరిస్థితి ఏమిటి ? చంద్రబాబు చిత్తూరు జిల్లాలోనే పుట్టాడు. ఏరోజైనా ఆలోచన చేశాడా? రిజర్వాయర్లకు.. స్టెబిలైజింగ్ రిజర్వాయర్లకు తేడా తెలియదా? ⇒ రాయలసీమ ఎత్తిపోతల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉంటుందన్న జ్ఞానం కూడా ఈ పెద్దమనిíÙకి లేదు. పైగా ఈ ప్రాజెక్టును ఇంకా గందరగోళంలో పడేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రయోజనాలను, కరువు పీడిత రాయలసీమ, నెల్లూరు ప్రజలను చులకన చేసి మాట్లాడతున్నాడు. ఆ ఎత్తిపోతలలో కింద స్టెబిలైజింగ్ రిజర్వాయర్లను పట్టుకొని రిజర్వాయర్లంటాడు. అక్కడ కట్టింది రిజర్వాయర్లు కాదన్న విషయాన్ని తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. ⇒ స్టెబిలైజింగ్ రిజర్వాయర్లు కట్టకపోతే కుప్పంకు, చిత్తూరుకు తాగునీళ్లు కూడా పోయే పరిస్థితి ఉండదు. తాను పుట్టిన చిత్తూరు జిల్లా ప్రజలపై మమకారం లేదు. తనకు ఓటేసి గెలిపించిన కుప్పం ప్రజలపై కృతజ్ఞతా లేదు. హంద్రీ–నీవా ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు 500 కిలోమీటర్లకు పైబడి నీళ్లు ప్రయాణం చేయాలి. ఈ ప్రాంతం పూర్తిగా శివారు (టెయిల్ ఎండ్)లో ఉంటుంది. ఈ పరిస్థితిని అధిగమిస్తూ చిత్తూరు జిల్లాకు నీళ్లు ఇవ్వాలని, కుప్పంకు నీళ్లు ఇవ్వాలని ఆలోచన చేశాం. జీఎన్ఎస్ఎస్ (గాలేరు–నగరి) ద్వారా గండికోటకు నీళ్లు వస్తే.. అక్కడ ఎత్తిపోతలు పెట్టి హెచ్ఎన్ఎస్ఎస్ (హంద్రీ–నీవా) కాలువలోకి మరిన్ని నీళ్లు పంపి తద్వారా తంబళ్లపల్లి, పీలేరు మదనపల్లె, పుంగనూరు, కుప్పం, చిత్తూరులకే కాకుండా రాయచోటికి నీళ్లు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ⇒ ఇదే ఆలోచనతో పనులు చేపట్టాం. దాంట్లో భాగంగానే ఈ స్టెబిలైజేషన్ రిజర్వాయర్లు నిర్మించాం. వీటి నిల్వ సామర్థ్యం ఎంతో తెలుసా? కాలేటి వాగు సామర్థ్యం 1.2 టీఎంసీలు. ముదివేడు సామర్థ్యం 2 టీఎంసీలు. నేతిగుంటిపల్లి సామర్థ్యం ఒక టీఎంసీ. ఆవులపల్లి సామర్థ్యం 3 టీఎంసీలు. మా హయాంలో వీటిని కట్టాం. 500 కిలోమీటర్లు దాటి శివారు ప్రాంతానికి వెళ్లా్లలంటే, ఈ స్టెబిలైజింగ్ రిజర్వాయర్లు లేకపోతే ఎలా వెళ్తాయో ఒక్కసారి ఆలోచన చేయండి.భావోద్వేగాలను రెచ్చగొట్టి.. ⇒ అటు తెలంగాణ కానివ్వండి.. ఇటు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి.. అందరూ మాట్లాడేది ఒకటే భాష. అందరూ అన్నదమ్ములమే. తెలంగాణ ప్రాంతం వాళ్లకు నష్టం చేయాలని జగన్ ఏరోజూ ఆలోచన చేయడు. కానీ మన రాష్ట్ర ప్రజలకు నష్టం జరగకుండా చూసుకోవడం మన ధర్మం. ఇందులో ఎమోషనల్ డ్రామాలు ప్లే చేసి, భావోద్వేగాలను రెచ్చగొట్టి, ఇరు ప్రాంతాల ప్రజల మధ్య గొడవలు సృష్టించే కార్యక్రమం పాలకులుగా కొంత మంది చేస్తున్నారు. ఇది చాలా తçప్పు. వాస్తవాలు, నిజాలు నిక్కచ్చిగా చెప్పాలి. అప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటారు. ⇒ అందరూ అన్నదమ్ములుగానే ఉన్నాం. కలిసి మెలిసి ఉన్నాం.. కలిసి మెలిసి పెరిగాం. అలాగే ఉండాలి. గతంలో రాయలసీమలో ఏ ప్రాజెక్టును కూడా పూర్తిగా వాడుకోలేని పరిస్థితి. చంద్రబాబు 40 ఏళ్లు ఇండస్ట్రీ అంటాడు.‡ 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా చేశాడు. మళ్లీ సీఎం పదవిలో కూర్చొని 19 నెలలవుతోంది. రాయలసీమలో ఉన్న రిజర్వాయర్లలో పూర్తి సామర్థ్యం మేరకు నీళ్లు నింపుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇదే పెద్దమనిషి ప్యాకేజీలు విడగొడతాడు.. జీవో నెంబర్ 22, జీవో నెంబర్ 63 అంటూ డబ్బులు దోచేయడానికి జీవోలు జారీ చేస్తాడు. రేట్లు పెంచి, నామినేషన్ల పద్ధతిలో పనులిచ్చి దోచుకునే కార్యక్రమం చేస్తాడు. కొత్త రిజర్వాయర్ల నిర్మాణం మాట ఎలా ఉన్నా, ఉన్న రిజర్వాయర్లకు నీళ్లు నింపే కార్యక్రమం చేపట్టకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతాం. రాయలసీమ లిఫ్టునకు వ్యతిరేకంగా కేసులు వేయించాడు⇒ ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితిని చక్కబెట్టే దిశగా అడుగులు పడ్డాయి. ఇందులో భాగమే రాయలసీమ ఎత్తిపోతల. శ్రీశైలంలో 800 అడుగుల నుంచే మనం కూడా 3 టీఎంసీల నీళ్లు తీసుకుని వెళ్లే వెసులుబాటును ఈ ఎత్తిపోతల ద్వారా కల్పించాం. దాదాపు రూ.1,000 కోట్లు ఖర్చుతో చేపట్టి చకచకా పనులు కూడా జరిగాయి. ఈ ఎత్తిపోతల పూర్తయితే మా ప్రభుత్వానికి, వైఎస్ జగన్‌కు ఎక్కడ క్రెడిట్ వస్తుందో అనే భయంతో చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సొంత టీడీపీ కార్యకర్తలతోనే తెలంగాణ నుంచి కేసులు వేయించి అడ్డుకోవాలని చూశాడు. ఎంత దుర్మార్గుడో చూడండి. ⇒ అయినా సరే రాయలసీమ, నెల్లూరు రైతులకు మేలు చేకూర్చేందుకు, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టును ముందుకు కొనసాగించాం. ఈ ప్రాంత రైతుల దురదృష్టమేమిటంటే మా ప్రభుత్వం మళ్లీ రాకపోవడం. ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాజెక్టుకు చంద్రగ్రహణం పట్టింది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో రహస్య ఒప్పందం చేసుకుని రాష్ట్రానికి, సీమకు తీరని అన్యాయం చేశాడు చంద్రబాబు. కేవలం ఎన్జీటీ అభ్యంతరాల తర్వాత ఈఏసీ (ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ) 2024 నవంబర్, 2025 జనవరి, ఫిబ్రవరిలలో మూడుసార్లు సమావేశమైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు కనీసం నోరు మెదపలేదు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే ఈ ప్రాజెక్టును ఈ పెద్దమనిషి ఖూనీ చేశాడు. ⇒ ఒకటికి మూడుసార్లు సమావేశమై తమ వాదన విన్పించేందుకు అవకాశం ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపకుండా ఈ ప్రాజెక్టుపై కత్తి పెట్టాడు. అసలు ఈ ప్రాజెక్టే వేస్ట్ అన్నట్టుగా మాట్లాడతాడు. తన మనుషులతో మాట్లాడిస్తున్నాడు. పైగా ఆశ్చర్యకరంగా శ్రీశైలం డెడ్ స్టోరేజ్‌లో 34 టీఎంసీలే.. దాంట్లో ఏపీ వాటా 22 టీఎంసీలే.. దీని కోసం లిఫ్టు ఎందుకంటూ చంద్రబాబు అంటున్నాడు. చంద్రబాబూ.. నువ్వు అసలు మనిషివేనా.. నీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నా. అటువైపు 777–825 అడుగులకే రోజుకు 8 టీఎంసీల నీరు వాడుకుంటుంటే 881 అడుగులకు నీళ్లెప్పుడు చేరతాయి.. ఆ తర్వాత పోతిరెడ్డిపాడుకు ఎప్పుడు వస్తాయన్న కనీస ఆలోచన చేయకుండా మాట్లాడుతున్నాడంటే ఆయన్ను ఏమనాలి? మా హయాంలో ఒక్కొక్కటిగా చక్కదిద్దుతూ వచ్చాం ⇒ రాయలసీమలో పేరుకు రిజర్వాయర్లున్నాయి. కానీ ఏ ఒక్క రిజర్వాయర్‌లోనూ వాటి పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు నీరు నింపలేని పరిస్థితి ఉండేది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిని ఒక్కొక్కటిగా సరిదిద్దుతూ వచ్చాం. ప్రజలకు మేలు చేయాలనే తపనతో పని చేశాం. ⇒ తెలుగు గంగ లింక్ కెనాల్ 0 నుంచి 18 కిలోమీటర్ల డిజైన్ మేరకు నీటిని పంపించుకోలేని పరిస్థితి ఉండేది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.500 కోట్లు ఖర్చు పెట్టి డిజైన్ మేరకు దాంట్లో 15 వేల క్యూసెక్కులు పంపేలా ఆధునికీకరించి వాడుకలోకి తీసుకొచ్చాం. ⇒ ఎస్ఆర్బీసీ–జీఎన్ఎస్ఎస్ కాలువ సామర్థ్యం రెండూ కలిపి 30 వేల క్యూసెక్కులకు పెంచే కార్యక్రమం చేపట్టాం. నిప్పుల వాగు నుంచి నెల్లూరు వరకు 30 వేల క్యూసెక్కులు వెళ్లేలా పనులు చేపట్టాం. ⇒ హెచ్ఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువలో కేవలం 2 వేల క్యూసెక్కుల నీళ్లు వెళ్తుంటే, మేము వచ్చిన తర్వాత ఆ కాలువ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచే పనులకు శ్రీకారం చుట్టాం. ⇒ అవుకు టన్నెల్(సొరంగం)లో ఫాల్ట్ జోన్ సమస్యను గత ప్రభుత్వాలేమీ పట్టించుకోలేదు. మేము వాటిని అధిగమించి మొదటి టన్నెల్ ద్వారా 10 వేల క్యూసెక్కులు, రెండో టన్నెల్ ద్వారా మరో 10 వేల క్యూసెక్కుల నీళ్లు పంపగలిగాం. రెండు టన్నెళ్లు పూర్తి చేసేందుకు రూ.260 కోట్లు ఖర్చు చేశాం. అవుకులో మూడో టన్నెల్ పనులు కూడా మొదలు పెట్టాం. ⇒ గండికోట రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 27 టీఏంసీలు. కానీ.. ఏరోజూ 14–15 టీఎంసీలకు మించి నీళ్లు నిల్వ చేయలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1,000 కోట్లు ఆర్అండ్ఆర్ మీద ఖర్చు పెట్టి 27 టీఎంసీల నీళ్లు నిలిచేలా చేశాం.⇒ చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం మేరకు 10 టీఎంసీల నీళ్లు నిలపలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.280 కోట్లు ఖర్చు చేసి.. ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తి చేసి 10 టీఎంసీల నీళ్లు నిలిపేలా చేశాం. ⇒ బ్రహ్మంసాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 17 టీఎంసీలు. కానీ.. ఏ రోజూ ఆ స్థాయిలో నిల్వ చేయలేదు. మేము వచ్చిన తర్వాత డయా ఫ్రమ్ వాల్ కొత్తది వేసి.. లీకేజీ సమస్యను అరికట్టి రూ.90 కోట్లు ఖర్చు చేసి.. 17 టీఎంసీల నీళ్లు నింపాం. ⇒ వెలుగొండలో రెండు టన్నెళ్లను పూర్తి చేసి రెండు దశాబ్దాల కలను సాకారం చేసి, జాతికి అంకితం చేశాం. మిగిలింది ఆర్ అండ్ ఆర్, లైనింగ్ పనులు మాత్రమే.⇒ కొన్ని దశాబ్దాలుగా తెలుగుగంగలో అంతర్భాగమైన సోమశిల, కండలేరు రిజర్వాయర్లలో పూర్తి సామర్థ్యంలో ఏ రోజూ నీళ్లను నిలపలేదు. మేము వచ్చిన తర్వాత ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి సోమశిలలో 78 టీఎంసీలు, కండలేరులో 68 టీఎంసీల నీళ్లను నిలుప గలిగాం. రూ.120 కోట్లు ఖర్చు చేసి ఈ డ్యామ్‌లలో పూర్తి సామర్థ్యంలో నీళ్లు నిలబెట్టగలిగాం. ⇒ దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్ పనులు మా హయాంలో పూర్తి చేశాం. ఇక్కడ నుంచి కూతవేటు దూరంలో ఉంది పులిచింతల ప్రాజెక్టు. ఏ ఒక్కరోజూ పూర్తి సామర్థ్యం మేరకు ఇక్కడ నీటిని నిల్వ చేయలేదు. మేము వచ్చిన తర్వాత ఆర్ అండ్ ఆర్కు రూ.200 కోట్లు ఖర్చు చేశాం. 45 టీఎంసీలు స్టోరేజ్ చేశాం. ఇవన్నీ మా హయాంలో జరిగాయి. చిత్తశుద్ధి, సిన్సియారిటీ, కమిట్మెంట్ ఉంటే ఏదైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. పనులు జరుగుతాయి. అవి చంద్రబాబులో లోపించాయి. -
రాయలసీమ ఆశాదీపం
రాయలసీమ ప్రాంతం దశాబ్దాలుగా సాగు, తాగునీటి కోసం ఎదురుచూస్తున్న తరుణంలో, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒక ఆశాదీపం అయ్యింది. అయితే ఇటీవల తెలంగాణ శాసనసభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సంప్రదింపులు జరిపి ఈ పథకాన్ని నిలిపివేయించానని ప్రకటించడం, సీమ ప్రాజెక్టులను అక్రమమైనవిగా అభివర్ణించడం తీవ్ర చర్చలకు దారితీసింది. ఈ నేపథ్యంలో, రాయలసీమ నీటి హక్కుల వెనుక ఉన్న భౌగోళిక, సాంకేతిక వాస్తవాలను నిశితంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది.కేటాయింపులుండీ వాడుకోలేక...రాయలసీమ దాహార్తిని తీర్చే క్రమంలో గాలేరు–నగరి, హంద్రీ –నీవా, హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ, ఎస్సార్బీసీ, గుండ్రేవుల, గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వంటి నిర్మాణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులకు కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి దాదాపు 144.7 టీఎంసీల నికర జలాల కేటాయింపులు చట్టబద్ధంగా ఉన్నాయి. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి అత్యంత దయ నీయంగా ఉంది. ప్రస్తుతం సీమలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాల సామర్థ్యం 100 టీఎంసీల కంటే తక్కువగానే ఉంది. సరైన కాల్వల వ్యవస్థ లేకపోవడం వల్ల ఏటా కేవలం 50 నుంచి 60 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకోగలుగుతున్నారు. అంటే, తమకు దక్కాల్సిన వాటాలో సగం కూడా వాడుకోలేక పోతున్న ఈ ప్రాంతంపై ‘జల దోపిడీ’ చేస్తున్నారనే నిందలు వేయడం అత్యంత విచారకరం.రాయలసీమ ప్రాజెక్టులకు జీవనాధారమైన పోతిరెడ్డిపాడు, మల్యాల, ముచ్చుమర్రి వంటి మలుపులకు శ్రీశైలం రిజర్వాయర్ ప్రధాన వనరు. గతంలో శ్రీశైలం నీటి నిల్వ సామర్థ్యం 315 టీఎంసీలుగా ఉండేది. కానీ తీవ్రమైన పూడిక పేరుకుపోవడం వల్ల అది ప్రస్తుతం 200 టీఎంసీల లోపుకు పడిపోయింది. దీనికి అదనంగా, తెలుగు రాష్ట్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని ఖాళీ చేయడం వల్ల జలాశయం మట్టం వేగంగా తగ్గిపోతోంది. ఒకప్పుడు నెలల తరబడి వచ్చే కృష్ణా, తుంగభద్రల ప్రవాహాలు ఇప్పుడు కేవలం కొన్ని వారాలకే పరిమితమవు తున్నాయి. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని మళ్లించాలంటే శ్రీశైలంలో కనీసం 854 అడుగుల మట్టం ఉండాలి. పూడిక, విద్యుత్ అవసరాల కారణంగా ఈ మట్టం నిర్వహించడం అసాధ్యంగా మారుతోంది, ఫలితంగా వరద జలాల మీద ఆధారపడిన గాలేరు–నగరి, హంద్రీ– నీవా వంటి ప్రాజెక్టులకు గండం ఏర్పడుతోంది.పథకం ఆవశ్యకతవరద సమయంలో కృష్ణా నది నుంచి సుమారు 700–800 టీఎంసీల నీరు ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలోకి వృథాగా వెళ్తోంది. శ్రీశైలం నుంచి నీటిని తీసుకోవడానికి ఉన్న పరిమితులను అధిగమించేందుకు, కేవలం వారం పది రోజులు మాత్రమే లభించే వరద సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 3 టీఎంసీల చొప్పున నీటిని తరలించడం సాధ్యమవుతుంది.ముచ్చుమర్రి వంటి ఎత్తిపోతల కేంద్రాలకు అనేక సాంకేతిక పరిమితులు ఉన్నాయి. ముచ్చుమర్రి నుంచి నాలుగు రోజులు నిరంతరాయంగా నీటిని తోడితే కానీ ఒక టీఎంసీ నీరు రాదు. 40 టీఎంసీల లక్ష్యంతో నిర్మించిన హంద్రీ–నీవాకు ఇది ఏమాత్రం సరిపోదు. అలాగే మల్యాల నుంచి నీటిని తీసుకోవాలంటే కనీసం 842 అడుగుల మట్టం అవసరం. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగానే 800 అడుగుల మట్టం నుంచే నీటిని తీసుకునేలా ‘రాయలసీమ ఎత్తిపోతల పథకా’న్ని రూపొందించారు.తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 800 అడుగుల కంటే తక్కువ మట్టం నుంచి నీటిని లిఫ్ట్ చేసే పథకాలను నిర్మించుకుంది. అటువంటప్పుడు, ఆంధ్రప్రదేశ్ తన చట్టబద్ధమైన వాటాను వినియోగించు కోవడానికి 800 అడుగుల వద్ద ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసు కోవడం ఏమాత్రం అక్రమం కాదు. కృష్ణా నదిలో వరద ప్రవాహం ఉండి, నీరు సముద్రంలో కలిసే సమయంలో ఆ నీటిని తీసుకోవడం వల్ల ఎవరికీ నష్టం ఉండదు. అది ఏపీ ప్రాథమిక హక్కు కూడా!శాశ్వత పరిష్కారంరాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే అది గాలేరు నగరి, హంద్రీ–నీవా ప్రాజెక్టులకు వెన్నెముకగా మారుతుంది. పోతి రెడ్డిపాడు ద్వారా ఎస్సార్బీసీకి 19 టీఎంసీలు, తెలుగుగంగకు 15 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో గండికోట, చిత్రావతి రిజర్వాయర్ల ముంపు సమస్యలను పరిష్కరించి, అక్కడ 35 టీఎంసీల నీటిని నిల్వ చేసే వెసులుబాటు కల్పించారు. ఈ ఎత్తిపోతల పథకాన్ని అనంతపురం జిల్లాలోని హంద్రీ–నీవాతో అనుసంధానం చేస్తే, చిత్తూరు జిల్లాలోని మదన పల్లి డివిజన్ నుంచి కుప్పం వరకు గాలేరు–నగరి నీటిని సరఫరా చేసే అద్భుత అవకాశం కలుగుతుంది. ఇది రాయలసీమ కరవు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారంగా మారుతుంది.ఈ పథకానికి అనుమతులు సాధించడం అసాధ్యమైన పని కాదు. సీడబ్ల్యూసీ నియమించిన కమిటీలు ఒక కీలకమైన సిఫార్సు చేశాయి: డ్యామ్ భద్రతకు ముప్పు ఉన్నప్పుడు లేదా పూడిక వల్ల నిల్వ సామర్థ్యం తగ్గినప్పుడు, ఆ లోటును భర్తీ చేయడానికి ఎగువన నీటి నిల్వ ఏర్పాట్లు చేసుకోవచ్చు. శ్రీశైలం సామర్థ్యం 315 టీఎంసీల నుంచి 200 టీఎంసీలకు తగ్గిపోయిన వాస్తవాన్ని ప్రభుత్వం సమర్థంగా వాదించాలి. శ్రీశైలం భద్రతను, తగ్గిపోయిన నిల్వ సామర్థ్యాన్ని సాధికారిక సంస్థల ముందు నిరూపించగలిగితే, రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు సిద్ధేశ్వరం అలుగు వంటి ప్రాజెక్టులకు అనుమతులు సాధించడం సులభమవుతుంది.తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజ నాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వ పెద్దలు అప్రమత్తంగా వ్యవహరించాలి. గత ప్రభుత్వం అనుమతులు లేకుండా పనులు చేసిందనే నెపంతో ప్రాజెక్టు అవసరాన్ని తక్కువ చేసి మాట్లాడటం తెలంగాణ వాదనకు ఆయుధంగా మారుతుంది. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి, ఈ పథకానికి మిగిలి ఉన్న అనుమతులను తీసుకురావడానికి, పెండింగ్‌లో ఉన్న కొద్దిపాటి పనులను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి.శ్రీశైలం ఎగువ భాగం నుంచి నీటిని తీసుకోవడం సీమ ప్రజల ప్రాథమిక హక్కు అని జాతీయ వేదికలపై గట్టిగా వినిపించాలి. ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ కేవలం ఒక ఇంజినీరింగ్ నిర్మాణం కాదు, అది సీమ రైతాంగం ఆత్మగౌరవ ప్రతీక. ఈ పథకం కార్యరూపం దాల్చితేనే వెనుకబడిన ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది.మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డివ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త -
సీమ ఎత్తిపోతలపై శాపనార్థాలు!
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్రానికి జీవనాడి పోలవరం సాక్షిగా... రాయలసీమ ఎత్తిపోతలపై సీఎం చంద్రబాబు తన కడుపు మంట, ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రూ.3,528 కోట్లు మంజూరు చేసి సరైన అనుమతులు లేకుండా ప్రారంభించారని విమర్శించారు. అనుమతులు లేని ప్రాజెక్టును మొదలుపెట్టి విచ్చలవిడిగా, అడ్డగోలుగా పనులు చేశారన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 841 అడుగుల దిగువన కేవలం 34 టీఎంసీలే నిల్వ ఉంటాయని.. అందులో రాష్ట్ర వాటా 22 టీఎంసీలని.. ఆ నీటిని వాడుకోవడానికి మల్యాల, ముచ్చుమర్రి (హంద్రీ–నీవా) ఎత్తిపోతల ఉందంటూ దబాయించారు. ఆ నీటిలో రోజుకు 3 టీఎంసీలను మళ్లించేలా, పర్యావరణ అనుమతి తీసుకోకుండానే రాయలసీమ ఎత్తిపోతల చేపట్టారని.. దానిపై ఎవరో ఎన్జీటీలో కేసు వేస్తే పనులు ఆపేయాలని తీర్పు ఇచ్చిందని.. దాంతో పనులు ఆగిపోయాయంటూ తనకు అలవాటైన రీతిలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు వల్లె వేశారు. పోలవరం పనులను బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించిన సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువస్తామని చంద్రబాబు చెప్పారు. వచ్చే ఫిబ్రవరి నాటికి డయాఫ్రమ్‌వాల్ పూర్తవుతుందని, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2 పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ ఏడాది బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌లో నీళ్లు ఉన్నాయని, హంద్రీ–నీవా ద్వారా అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చామని, కుప్పం వరకు నీళ్లు పారించామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. కాగా సీఎం చంద్రబాబునాయుడుతో ఏకాంతంగా (క్లోజ్ రూమ్‌లో) సమావేశమై రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపేయించా..! ఆ పనులు ఆగిపోయాయో లేదో అన్నది తెలుసుకోవాలంటే తనిఖీ చేసుకోవచ్చంటూ తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి శనివారం చేసిన వ్యాఖ్యలను ఇంతవరకూ చంద్రబాబు ఖండించకపోవడం గమనార్హం. ఆ సమావేశంలో ఏం ఒప్పందం కుదిరిందన్నది వెల్లడించలేదు. దీంతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పింది నిజమేనని చంద్రబాబు అంగీకరించారన్నది స్పష్టమవుతోంది. దీన్ని బట్టి.. రాయలసీమ ఎత్తిపోతల పూర్తయితే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు మంచి పేరొస్తుందనే ఈర‡్ష్యతో.. పనిగట్టుకుని ఆ ఎత్తిపోతల పనులను చంద్రబాబు ఆపేయించారని సాగునీటిరంగ నిపుణులు తేల్చిచెబుతున్నారు. రాయలసీమ, నెల్లూరు వరదాయిని..⇒ శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా కనీస నీటి మట్టం 854 అడుగులు. తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ఆయకట్టుకు సాగునీరు, చెన్నైకి తాగునీటిని శ్రీశైలం జలాశయంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారానే నీటిని విడుదల చేయాలి. ⇒ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను శ్రీశైలం ప్రాజెక్టులో 841 అడుగుల నీటి మట్టం వద్ద అమర్చారు. శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు రోజుకు గరిష్టంగా 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. అదే 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 7 వేలు, 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించే వీలుంది. ఇక శ్రీశైలంలో 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉంటే చుక్క నీటిని కూడా తీసుకోలేం. ⇒ విభజన తర్వాత 2014 ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు సర్కార్.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాయి. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకూ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలాన్ని ఏపీ ప్రభుత్వం.. నాగార్జునసాగర్‌ను తెలంగాణ సర్కార్ నిర్వహించాలని నాడు కేంద్రం నిర్దేశించింది. కానీ.. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం తమ భూభాగంలో ఉందంటూ అప్పట్లో తెలంగాణ తన అధీనంలోకి తీసుకున్నప్పటికీ చంద్రబాబు అభ్యంతరం చెప్పలేదు. ఇంతలో ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కార్‌కు సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. ⇒ ఇదే అదునుగా తెలంగాణ సర్కార్ కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 25 నుంచి 40 టీఎంసీలకు పెంచుతున్నా.. అనుమతి లేకుండా శ్రీశైలం నుంచి రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల చేపట్టినా నాడు బాబు సర్కార్ నోరు మెదపలేదు. ఫలితంగా శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం నుంచి 4 టీఎంసీలు, కల్వకుర్తి నుంచి 0.4 టీఎంసీ, ఎస్సెల్బీసీ నుంచి 0.5 టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి–డిండి ఎత్తిపోతల ద్వారా 2 టీఎంసీలు వెరసి శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీటి మట్టం నుంచే రోజుకు 6.95 టీఎంసీలు తరలించే సామర్థ్యాన్ని తెలంగాణ సాధించుకుంది. శ్రీశైలం నుంచి 800 అడుగుల స్థాయిలో హంద్రీ –నీవా ద్వారా కేవలం 0.33 టీఎంసీలు తరలించే సామర్థ్యం మాత్రమే ఏపీకి ఉంది. ⇒ శ్రీశైలం దిగువన తాగు, సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చిన మేరకే నీటిని విడుదల చేస్తూ రెండు రాష్ట్రాలు విద్యుదుత్పత్తి చేయాలన్నది నిబంధన. కానీ.. 2014 నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం ప్రారంభం కాకున్నా సరే.. డెడ్ స్టోరేజీలో ఉన్న నీటిని శ్రీశైలం దిగువన ఎలాంటి నీటి అవసరాలు లేనప్పటికీ ఎడమ గట్టు కేంద్రంలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ.. దిగువకు నీటిని తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తూ రాయలసీమ రైతుల హక్కులను హరిస్తున్నా చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. ఇక శ్రీశైలంలోకి వరద ప్రవాహం ప్రారంభమయ్యాక కూడా తెలంగాణ సర్కార్ వచ్చింది వచ్చినట్టుగా నీళ్లను తరలించడం వల్ల నీటి మట్టం 881 అడుగులకు చేరడం గగనంగా మారింది. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు నీళ్లందక.. తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ఆయకట్టులో 2014–19 మధ్య ఏటా పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కృష్ణా బేసిన్లో 2015–16లో వర్షాభావ పరిస్థితుల వల్ల శ్రీశైలానికి 58.69 టీఎంసీల ప్రవాహమే రాగా.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు కేవలం 0.95 టీఎంసీని మాత్రమే సరఫరా చేశారు. ఆ ఏడాది గుక్కెడు తాగునీటి కోసం కటకటలాడటమే అందుకు నిదర్శనం. ⇒ ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తడారిన గొంతులను తడిపేందుకు.. బచావత్ ట్రిబ్యునల్ ద్వారా హక్కుగా దక్కిన నీటిని వాడుకుని ఎండిపోతున్న పంటలను రక్షించడం కోసం.. తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూ.3,825 కోట్లతో 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ ఎత్తిపోతల రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు వరదాయిని అవుతుందని సాగునీటిరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ⇒ చంద్రబాబు చెబుతున్నట్లుగా శ్రీశైలంలో 841 అడుగుల దిగువన నిల్వ ఉండే 34 టీఎంసీలను తరలించడానికి కాదు.. 841 అడుగుల ఎగువ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువకు 3 టీఎంసీలను ఎత్తిపోసి.. మనకు హక్కుగా దక్కిన వాటా జలాలను పూర్తి స్థాయిలో వాడుకోవడానికి చేపట్టిందే రాయలసీమ ఎత్తిపోతల.పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు అడుగడుగునా మోకాలడ్డు..రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్‌కు ఎక్కడ మంచి పేరొస్తుందోననే ఈర‡్ష్యతో.. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు గవినోళ్ల శ్రీనివాస్ ద్వారా ఎన్జీటీ (చెన్నై) బెంచ్‌లో చంద్రబాబు రిట్ పిటిషన్ దాఖలు చేయించారని.. అదే వ్యక్తితో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పశ్చిమ మండలాల రూపురేఖలను మార్చడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన ముదివేడు, నేతిగుంటపల్లి, ఆవులపల్లి రిజర్వాయర్ల పనులపైనా ఎన్జీటీలో ఫిర్యాదు చేయించారని సాగునీటిరంగ నిపుణులు, రైతులు అప్పట్లోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ఎత్తిపోతలతోపాటు ఆ మూడు రిజర్వాయర్ల నిర్మాణం వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని ఎన్జీటీలో పిటిషనర్ వాదించారు. అయితే తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీలకు పర్యావరణ అనుమతి ఉందని.. ఆ ప్రాజెక్టులకు నీటిని అందించడానికి చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి అవసరం లేదని వైఎస్ జగన్ ప్రభుత్వం నాడు ఎన్జీటీకి స్పష్టం చేసింది. కానీ.. పర్యావరణ అనుమతి తీసుకుని, ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబర్ 29న ఎన్జీటీ ఆదేశించింది. దీంతో పర్యావరణ అనుమతి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే.. రాయలసీమ, నెల్లూరు, చెన్నై తాగునీటి అవసరాల కోసం సీమ ఎత్తిపోతల పనులను కొనసాగించింది. ఈ క్రమంలో రూ.990 కోట్ల విలువైన పనులను పూర్తి చేశారు. కానీ.. గతేడాది ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించిన ఈఏసీ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతలను తొలి దశలో తాగునీటి అవసరాల కోసం చేపడుతున్నామని.. మలి దశలో పర్యావరణ అనుమతి తీసుకుంటామని చంద్రబాబు సర్కారు స్పష్టం చేసి ఉంటే ఆ ఎత్తిపోతల పనులకు ఎలాంటి అడ్డంకి ఉండేది కాదని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేవలం వైఎస్ జగన్‌కు మంచి పేరొస్తుందనే ఈర‡్ష్యతోనే ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలను ఈఏసీ సమావేశంలో చంద్రబాబు సర్కార్ చెప్పలేదని స్పష్టం చేస్తున్నారు.ఒక్క ప్రాజెక్టూ కట్టకుండా బడాయి మాటలు..ఉమ్మడి రాష్ట్రంలో 1995–99, 1999–2004.. విభజన తర్వాత 2014–19, మళ్లీ ఇప్పుడు.. మొత్తం నాలుగు సార్లు సీఎం చంద్రబాబు అధికారంలో ఉన్నారు. దాదాపు 16 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు డిజైన్ చేయలేదు.. నిర్మాణాన్ని చేపట్టలేదు.. పూర్తి చేసి జాతికి అంకితం చేయలేదు అంటూ జలవనరుల శాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన రిటైర్డు ఇంజనీర్–ఇన్–చీఫ్‌లు, చీఫ్ ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. కానీ.. రాష్ట్రంలో 90 శాతం ప్రాజెక్టులు తానే కట్టానంటూ సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు వల్లె వేస్తూ బడాయి మాటలు మాట్లాడారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో జలయజ్ఞం కింద ఒకేసారి రూ.లక్ష కోట్ల వ్యయంతో పోలవరం, పులిచింతల, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తోటపల్లి, పుష్కర, తాడిపూడి, వంశధార స్టేజ్–2 ఫేజ్–2 వంటి భారీ, సూరంపాలెం, భూపతిపాలెం వంటి మధ్య తరహా 83 ప్రాజెక్టులు చేపట్టి.. తాను మరణించే నాటికే 44 ప్రాజెక్టులను పూర్తి చేసి, జాతికి అంకితం ఇచ్చి చరిత్రలో నిలిచిపోయారని ఇంజనీర్లు, సాగునీటి రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. జలయజ్ఞంలో భాగంగా దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాలను సస్యశ్యామలం చేయడం కోసం 2005లో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచినప్పుడు.. దాన్ని నిరసిస్తూ, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రకాశం బ్యారేజీపై దేవినేని ఉమాహేశ్వరరావుతో తెలంగాణ ప్రాంతంలో మహబూబ్‌నగర్ జిల్లాలో మాజీ మంత్రి నాగం జనార్ధనరెడ్డితో చంద్రబాబు ధర్నాలు చేయించారని గుర్తు చేస్తున్నారు. ఇక తెలుగుగంగలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్ నిర్మాణంలో లోపాల వల్ల మట్టికట్టలో లీకేజీలు ఏర్పడటంతో 2020 వరకూ ఎన్నడూ నాలుగైదు టీఎంసీలకు మించి నిల్వ చేసిన దాఖాలు లేవు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రూ.90 కోట్లతో డయాఫ్రం వాల్ నిర్మించి, మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేసి 2020 నుంచి బ్రహ్మంసాగర్‌లో పూర్తి సామర్థ్యం మేరకు 17.74 టీఎంసీలను నిల్వ చేస్తే.. ఆ పని తాను చేసినట్లుగా సీఎం చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందంటూ ఆ పనులను పర్యవేక్షించిన రిటైర్డు అధికారి ఒకరు విస్తుపోయారు. మహానేత వైఎస్ నిర్మించిన గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు వైఎస్ జగన్ 2019లో రూ.వెయ్యి కోట్లతో పునరావాసం కల్పించి.. ఆ రిజర్వాయర్‌లో పూర్తి సామర్థ్యం మేరకు 26.85 టీఎంసీలను ప్రతి ఏటా నిల్వ చేస్తే.. ఆ పని తాను చేసినట్లుగా సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలాడటం గమనార్హం. ఇక మహానేత వైఎస్సార్ పూర్తి చేసిన పుష్కర, తాడిపూడి, చాగల్నాడు, కల్వకుర్తి, నెట్టెంపాడు, దేవాదుల లాంటి ఎత్తిపోతల పథకాలను తాను పూర్తి చేసినట్లుగా సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు. 2014–19 మధ్య చంద్రబాబు సర్కార్ పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయకుండా.. కమీషన్ల కోసం గోదావరి కుడి గట్టుపై పట్టిసీమ, ఎడమ గట్టుపై పురుషోత్తపట్నం ఎత్తిపోతలను చేపట్టింది. ఆ రెండు ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు తీసుకోలేదు. ఇక చింతలపూడి ఎత్తిపోతల తొలిదశకు 2008లో నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం పర్యావరణ అనుమతి తీసుకుంది. కానీ.. 2018లో ఆ ఎత్తిపోతల సామర్థ్యాన్ని చంద్రబాబు సర్కార్ పెంచింది. అయితే దానికి పర్యావరణ అనుమతి తీసుకోలేదు. ఈ మూడు ఎత్తిపోతల పథకాలపై ఎన్జీటీలో కేసులు దాఖలయ్యాయి. పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిన ఆ మూడు ఎత్తిపోతల పథకాలపై జరిమానా విధిస్తూ 2021 డిసెంబర్ 2న ఎన్జీటీ తీర్పు ఇచ్చింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతలపై రూ.24.56 కోట్లు, పట్టిసీమ ఎత్తిపోతలపై రూ.24.9 కోట్లు, చింతలపూడి ఎత్తిపోతలపై రూ.73.6 కోట్లను జరిమానాగా విధించింది.జగన్ హయాంలోనే సీమ సుభిక్షం..⇒ నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పులిచింతల నిర్వాసితులకు పరిహారం చెల్లించింది. తెలంగాణకు పరిహారం చెల్లించి పూర్తి స్థాయిలో అంటే 45.77 టీఎంసీలను పులిచింతలలో నిల్వ చేసి కృష్ణా డెల్టాలో రెండు పంటలకు నీళ్లందించి చరిత్ర సృష్టించింది. ⇒ తెలుగుగంగ లింక్ కెనాల్‌ను ఆధునికీకరించి.. వెలుగోడు రిజర్వాయర్‌ను సకాలంలో గరిష్ట సామర్థ్యం 16.95 టీఎంసీలను చేర్చి నింపింది. రూ.600 కోట్లతో తెలుగుగంగ ప్రధాన కాలువకు లైనింగ్ చేసి.. డిజైన్ మేరకు ప్రవాహ సామర్థ్యాన్ని 5 వేల క్యూసెక్కులకు పెంచింది. ⇒ బ్రహ్మంసాగర్ మట్టికట్టకు రూ.90 కోట్లతో డయాఫ్రం వాల్‌ను వేసి లీకేజీలకు అడ్డుకట్ట వేసి దాని పూర్తి సామర్థ్యం మేరకు 17.74 టీఎంసీలను నిల్వ చేసింది. ⇒ తెలుగుగంగలో అంతర్భాగమైన సోమశిల రిజర్వాయర్‌లో గరిష్ట సామర్థ్యం మేరకు 78 టీఎంసీలు, కండలేరు రిజర్వాయర్‌లో పూర్తి సామర్థ్యం మేరకు 68.3 టీఎంసీలను నింపి ఐదేళ్లూ ఆయకట్టులో రెండు పంటలకూ నీళ్లందించింది. ⇒ గాలేరు–నగరి వరద కాలువలో అవుకు వద్ద రెండు సొరంగాలను పూర్తి చేసి..గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లను పరిహారంగా చెల్లించి, వారికి పునరావాసం కూడా కల్పించి గరిష్ట సామర్థ్యం మేరకు 26.85 టీఎంసీలను నిల్వ చేసింది. ⇒ చిత్రావతి రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.250 కోట్లను పరిహారంగా చెల్లించి, పునరావాసం కల్పించి.. గరిష్ట సామర్థ్యం మేరకు పది టీఎంసీలు నిల్వ చేసింది. ⇒ ఇలా ఐదేళ్లూ రిజర్వాయర్లను సకాలంలో నింపి.. రాయలసీమను సస్యశ్యామలం చేసింది.కొత్తగా అనేక పనులు చేపట్టిన జగన్ సర్కార్...మారిన వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు కురిసే రోజులు తగ్గాయి. శ్రీశైలానికి గరిష్టంగా వరద వచ్చినప్పుడు దాన్ని ఒడిసి పట్టుకునే సామర్థ్యం కాలువలకు లేదు. దీంతో కృష్ణా వరద జలాలను గరిష్ట స్థాయిలో ఒడిసి పట్టి శ్రీశైలానికి వరద వచ్చే 30–40 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు ప్రాజెక్టులను నింపేలా వైఎస్సార్సీపీ హయాంలో కాలువల సామర్థ్యం పెంచే పనులు, అవసరమైన చోట్ల కొత్త ప్రాజెక్టుల పనులను చేపట్టింది. ⇒ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచే పనులు.. శ్రీశైలం కుడి గట్టు ప్రధాన కాలువ సామర్థ్యాన్ని, గాలేరు–నగరి వరద కాలువ, తెలుగుగంగ లింక్ కెనాల్, ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యం పెంచే పనులను చేపట్టింది. ⇒ కేసీ కెనాల్ ఆయకట్టును స్థిరీకరించడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాజోలి, జోలదరాసి రిజర్వాయర్ల పనులను చేపట్టింది. ⇒ తెలుగుగంగ ఆయకట్టుకు సమృద్ధిగా నీటిని అందించడానికి కుందూ ఎత్తిపోతల పనులను చేపట్టింది. ⇒ గాలేరు–నగరి సుజల స్రవంతి–హంద్రీ–నీవా సుజల స్రవంతిలను అనుసంధానం చేస్తూ ఉమ్మడి అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు పనులు చేపట్టింది. ⇒ హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3,850 నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచే పనులను చేపట్టింది. ⇒ కానీ.. చంద్రబాబు సర్కార్ ఆ పనులన్నింటినీ ఆపేసి రాయలసీమకు వెన్నుపోటు పొడిచింది. -
పురిటిగడ్డకు బాబు వెన్నుపోటు!
సాక్షి, అమరావతి: రాయలసీమ, నెల్లూరు జిల్లాల అభివృద్ధి.. ప్రయోజనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు చీమంతైనా చిత్తశుద్ధి లేదన్న నిజం మరోసారి తేటతెల్లమైంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో తాను ఏకాంతంగా సమావేశమై రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపివేయించానని.. ఆ పనులు ఆగిపోయాయో లేదో అన్నది తెలుసుకోవాలంటే తనిఖీ చేసుకోవచ్చని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి గత శనివారం చేసిన వ్యాఖ్యలను ఇప్పటివరకు చంద్రబాబు కనీసం ఖండించలేదు. ఇక జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ద్వారా రాయలసీమ ఎత్తిపోతలతో ఎలాంటి ప్రయోజనం లేదంటూ తాజాగా మంగళవారం స్పష్టం చేయించడం ద్వారా.. తెలంగాణ సీఎం రేవంత్ చెప్పింది నిజమేనని సీఎం చంద్రబాబు పరోక్షంగా అంగీకరించారు. రాయలసీమ ఎత్తిపోతల పూర్తయితే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు మంచి పేరొస్తుందనే ఈర్ష్యతోనే పనిగట్టుకుని ఆ ఎత్తిపోతల పనులు నిలిపివేయించారని సాగునీటిరంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కే కాదు.. జన్మనిచ్చిన రాయలసీమకు కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మండిపడుతున్నారు. దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు 2005లో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచినప్పుడు.. దాన్ని నిరసిస్తూ, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ అటు ప్రకాశం బ్యారేజీపై దేవినేని ఉమామహేశ్వరావుతో ఇటు తెలంగాణ ప్రాంతంలో మహబూబ్‌నగర్ జిల్లాలో మాజీ మంత్రి నాగం జనార్ధనరెడ్డితో చంద్రబాబు ధర్నాలు చేయించారని గుర్తు చేస్తున్నారు.ముమ్మాటికీ సీమ ఎత్తిపోతల గేమ్ ఛేంజర్..శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా కనీస నీటి మట్టం 854 అడుగులు. తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ఆయకట్టుకు సాగునీరు, చెన్నైకి తాగునీటిని శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారానే నీటిని విడుదల చేయాలి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను శ్రీశైలం ప్రాజెక్టులో 841 అడుగుల నీటి మట్టం వద్ద అమర్చారు. శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు రోజుకు గరిష్టంగా 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. అదే 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 7 వేలు, 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించే వీలుంది. ఇక శ్రీశైలంలో 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉంటే చుక్క నీటిని కూడా తీసుకోలేం. ఈ క్రమంలో విభజన తర్వాత 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కార్.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కొలువుదీరాయి. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకూ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలాన్ని ఏపీ ప్రభుత్వం.. నాగార్జునసాగర్‌ను తెలంగాణ సర్కార్ నిర్వహించాలని నాడు కేంద్రం నిర్దేశించింది. కానీ.. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం తమ భూభాగంలో ఉందంటూ అప్పట్లో తెలంగాణ సర్కార్ తన అధీనంలోకి తీసుకున్నప్పటికీ చంద్రబాబు సర్కార్ అభ్యంతరం చెప్పలేదు. ఇంతలో 2015లో ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కార్‌కు సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. దీంతో తెలంగాణ సర్కార్ కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 25 నుంచి 40 టీఎంసీలకు పెంచుతున్నా.. అనుమతి లేకుండా శ్రీశైలం నుంచి రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల చేపట్టినా చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. ఫలితంగా శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం నుంచి 4 టీఎంసీలు, కల్వకుర్తి నుంచి 0.4 టీఎంసీ, ఎస్సెల్బీసీ నుంచి 0.5 టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి–డిండి ఎత్తిపోతల ద్వారా 2 టీఎంసీలు వెరసి శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీటి మట్టం నుంచే రోజుకు 6.95 టీఎంసీలు తరలించే సామర్థ్యాన్ని తెలంగాణ సర్కార్ సాధించుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల స్థాయిలో హంద్రీ–నీవా ద్వారా కేవలం 0.33 టీఎంసీలు తరలించే సామర్థ్యం మాత్రమే ఏపీకి ఉంది. శ్రీశైలం దిగువన తాగు, సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చిన మేరకే నీటిని విడుదల చేస్తూ రెండు రాష్ట్రాలు విద్యుదుత్పత్తి చేయవచ్చు. కానీ.. 2014 నుంచి శ్రీశైలంలో నీటి మట్టం కనీస స్థాయికి 854 అడుగులకు చేరకున్నా.. వరద ప్రవాహం ప్రారంభం కాకపోయినా సరే తెలంగాణ సర్కార్ శ్రీశైలం దిగువన ఎలాంటి నీటి అవసరాలు లేనప్పటికీ ఎడమ గట్టు కేంద్రంలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ.. దిగువకు నీటిని తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తూ రాయలసీమ రైతుల హక్కులను హరిస్తున్నా చంద్రబాబు సర్కార్ నోరుమెదపలేదు. శ్రీశైలంలోకి వచ్చిన నీటిని వచ్చింది వచ్చినట్టుగా తరలించడం వల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు నీళ్లందక.. తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ఆయకట్టులో 2014–19 మధ్య ఏటా పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కృష్ణా బేసిన్లో 2015–16లో వర్షాభావ పరిస్థితుల వల్ల శ్రీశైలానికి 58.69 టీఎంసీల ప్రవాహమే రాగా.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు కేవలం 0.95 టీఎంసీని మాత్రమే సరఫరా చేశారు. ఆ ఏడాది గుక్కెడు తాగునీటి కోసం కటకటలాడారు. ఇక 2016–17లో శ్రీశైలానికి 337.95 టీఎంసీలు వచ్చినా.. తెలంగాణ 800 అడుగుల నుంచే యథేచ్ఛగా నీటిని తరలించడం వల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కేవలం 67.44 టీఎంసీలను మాత్రమే విడుదల చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తడారిన గొంతులను తడిపేందుకు.. బచావత్ ట్రిబ్యునల్ ద్వారా హక్కుగా దక్కిన నీటిని వాడుకుని ఎండిపోతున్న పంటలను రక్షించడం కోసం.. తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూ.3,825 కోట్ల వ్యయంతో 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ఎత్తిపోతల రాయలసీమ, నెల్లూరు జిల్లాల రూపురేఖలను మార్చేస్తుందని.. ఆ జిల్లాల అభివృద్ధికి గేమ్ ఛేంజర్ అవుతుందని సాగునీటిరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. మంత్రి నిమ్మల చెబుతున్నట్లుగా శ్రీశైలంలో 841 అడుగుల దిగువన నిల్వ ఉండే 34 టీఎంసీలను తరలించడానికి కాదు.. 841 అడుగుల ఎగువ నుంచి కూడా హక్కుగా దక్కిన వాటా జలాలను పూర్తి స్థాయిలో వాడుకోవడానికి చేపట్టిందే రాయలసీమ ఎత్తిపోతల అని స్పష్టం చేస్తున్నారు. గవినోళ్ల శ్రీనివాస్‌తో ఎన్జీటీలో ఫిర్యాదు చేయించిదెవరు బాబూ..?రాయలసీమ ఎత్తిపోతలను రూ.3,307.6 కోట్ల అంచనాతో వైఎస్ జగన్ ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు అప్పగించి పనులను పరుగులెత్తించింది. సీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్‌కు ఎక్కడ మంచి పేరొస్తుందోననే ఈర్షతో.. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు గవినోళ్ల శ్రీనివాస్ ద్వారా ఎన్జీటీ (చెన్నై) బెంచ్‌లో చంద్రబాబు రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పశ్చిమ మండలాల రూపురేఖలను మార్చడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం హంద్రీ–నీవాలో అంతర్భాగంగా చేపట్టిన ముదివేడు, నేతిగుంటపల్లి, ఆవులపల్లి రిజర్వాయర్ల పనులపైనా అదే గవినోళ్ల శ్రీనివాస్‌తో ఎన్జీటీలో ఫిర్యాదు చేయించారు. రాయలసీమ ఎత్తిపోతలతోపాటు ఆ మూడు రిజర్వాయర్ల నిర్మాణం వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని ఎన్జీటీలో వాదించారు. అయితే తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీలకు పర్యావరణ అనుమతి ఉందని.. ఆ ప్రాజెక్టులకు నీటిని అందించడానికి చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి అవసరం లేదని వైఎస్ జగన్ ప్రభుత్వం నాడు ఎన్జీటీకి స్పష్టం చేసింది. కానీ.. పర్యావరణ అనుమతి తీసుకుని, ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబర్ 29న ఎన్జీటీ ఆదేశించింది. దీంతో పర్యావరణ అనుమతి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే.. ఆ అనుమతి వచ్చేలోగా చెన్నైకి 15 టీఎంసీలు, రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసే పనులను తొలి దశలో చేపట్టాలని 2023 ఆగస్టు 11న నిర్ణయించింది. చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే.. తెలుగు గంగ ప్రధాన కాలువపై ఉన్న వెలిగోడు రిజర్వాయర్ (9.5 టీఎంసీలు), సోమశిల (17.33 టీఎంసీలు), కండలేరు (8.4 టీఎంసీలు) రిజర్వాయర్లలో మొత్తంగా కనీసం 35.23 టీఎంసీలు నిల్వ ఉండాలి. అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు రాయలసీమలోని దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు వెరసి 58.83 టీఎంసీలు (35.23+15+8.6) శ్రీశైలం నుంచి తరలించే పనులను పర్యావరణ అనుమతి వచ్చేలోగా చేపట్టడానికి అనుమతి ఇవ్వాలన్న అధికారుల ప్రతిపాదనకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఆ మేరకు అధికారులు పనులు చేపట్టారు. రూ.990 కోట్ల విలువైన పనులను పూర్తి చేశారు. కానీ.. గతేడాది ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించిన ఈఏసీ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతలను తొలి దశలో తాగునీటి అవసరాల కోసం చేపడుతున్నామని.. మలి దశలో పర్యావరణ అనుమతి తీసుకుంటామని చంద్రబాబు సర్కారు స్పష్టం చేసి ఉంటే ఆ ఎత్తిపోతల పనులకు ఎలాంటి అడ్డంకి ఉండేది కాదని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేవలం వైఎస్ జగన్‌కు మంచి పేరొస్తుందనే ఈర‡్ష్యతోనే ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలను ఈఏసీ సమావేశంలో చంద్రబాబు సర్కార్ చెప్పలేదని స్పష్టం చేస్తున్నారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం, చింతలపూడికి పర్యావరణ అనుమతి ఏదీ..?రాయలసీమ ఎత్తిపోతలను వైఎస్ జగన్ ప్రభుత్వం పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిందని.. అందువల్లే ఆ ఎత్తిపోతల పనులు ఆగిపోయాయంటూ మంత్రి నిమ్మల ఏమాత్రం పసలేని వాదన చేస్తున్నారు. 2014–19 మధ్య చంద్రబాబు సర్కార్ పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయకుండా.. కమీషన్ల కోసం గోదావరి కుడి గట్టుపై పట్టిసీమ, ఎడమ గట్టుపై పురుషోత్తపట్నం ఎత్తిపోతలను చేపట్టింది. ఆ రెండు ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు తీసుకోలేదు. ఇక చింతలపూడి ఎత్తిపోతల తొలిదశకు 2008లో నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం పర్యావరణ అనుమతి తీసుకుంది. కానీ.. 2018లో ఆ ఎత్తిపోతల సామర్థ్యాన్ని చంద్రబాబు సర్కార్ పెంచింది. అయితే దానికి పర్యావరణ అనుమతి తీసుకోలేదు. ఈ మూడు ఎత్తిపోతల పథకాలపై ఎన్జీటీలో కేసులు దాఖలయ్యాయి. పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిన ఆ మూడు ఎత్తిపోతల పథకాలపై జరిమానా విధిస్తూ 2021 డిసెంబర్ 2న ఎన్జీటీ తీర్పు ఇచ్చింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతలపై రూ.24.56 కోట్లు, పట్టిసీమ ఎత్తిపోతలపై రూ.24.9 కోట్లు, చింతలపూడి ఎత్తిపోతలపై రూ.73.6 కోట్లను జరిమానాగా విధించింది. నిజానికి రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి అవసరం లేదని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ తొలుత నివేదిక ఇచ్చింది.జగన్ హయాంలో సీమ సుభిక్షం..నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పులిచింతల నిర్వాసితులకు పరిహారం చెల్లించి సమస్యలను పరిష్కరించింది. తెలంగాణకు పరిహారం చెల్లించి పూర్తి స్థాయిలో అంటే 45.77 టీఎంసీలను పులిచింతలలో నిల్వ చేసి కృష్ణా డెల్టాలో రెండు పంటలకు నీళ్లందించి చరిత్ర సృష్టించింది. తెలుగుగంగ లింక్ కెనాల్‌ను ఆధునికీకరించి.. వెలుగోడు రిజర్వాయర్‌ను సకాలంలో గరిష్ట సామర్థ్యం 16.95 టీఎంసీలను చేర్చి నింపింది. రూ.600 కోట్లతో తెలుగుగంగ ప్రధాన కాలువకు లైనింగ్ చేసి.. డిజైన్ మేరకు ప్రవాహ సామర్థ్యాన్ని 5 వేల క్యూసెక్కులకు పెంచింది. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు రూ.90 కోట్లతో డయాఫ్రం వాల్‌ను వేసి లీకేజీలకు అడ్డుకట్ట వేసి దాని పూర్తి సామర్థ్యం మేరకు 17.74 టీఎంసీలను నిల్వ చేసింది. తెలుగుగంగలో అంతర్భాగమైన సోమశిల రిజర్వాయర్‌లో గరిష్ట సామర్థ్యం మేరకు 78 టీఎంసీలు, కండలేరు రిజర్వాయర్‌లో పూర్తి సామర్థ్యం మేరకు 68.3 టీఎంసీలను నింపి ఐదేళ్లూ ఆయకట్టులో రెండు పంటలకూ నీళ్లందించింది. ఇక గాలేరు–నగరి వరద కాలువలో అవుకు వద్ద రెండు సొరంగాలను పూర్తి చేసి.. గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లను పరిహారంగా చెల్లించి, వారికి పునరావాసం కూడా కల్పించి గరిష్ట సామర్థ్యం మేరకు 26.85 టీఎంసీలను నిల్వ చేసింది. చిత్రావతి రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.250 కోట్లను పరిహారంగా చెల్లించి, పునరావాసం కల్పించి.. గరిష్ట సామర్థ్యం మేరకు పది టీఎంసీలు నిల్వ చేసింది. ఇలా ఐదేళ్లూ రిజర్వాయర్లను సకాలంలో నింపి.. రాయలసీమను సస్యశ్యామలం చేసింది. మారిన వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు కురిసే రోజులు తగ్గాయి. శ్రీశైలానికి గరిష్టంగా వరద వచ్చినప్పుడు దాన్ని ఒడిసి పట్టుకునే సామర్థ్యం కాలువలకు లేదు. దీంతో కృష్ణా వరద జలాలను గరిష్ట స్థాయిలో ఒడిసి పట్టి శ్రీశైలానికి వరద వచ్చే 30–40 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు ప్రాజెక్టులను నింపేలా వైఎస్సార్సీపీ హయాంలో కాలువల సామర్థ్యం పెంచే పనులు, అవసరమైన చోట్ల కొత్త ప్రాజెక్టుల పనులను చేపట్టింది. ఈ క్రమంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచే పనులు.. శ్రీశైలం కుడి గట్టు ప్రధాన కాలువ సామర్థ్యాన్ని, గాలేరు–నగరి వరద కాలువ, తెలుగుగంగ లింక్ కెనాల్, ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యం పెంచే పనులను చేపట్టింది. కేసీ కెనాల్ ఆయకట్టును స్థిరీకరించడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాజోలి, జోలదరాసి రిజర్వాయర్ల పనులను చేపట్టింది. ఇక తెలుగుగంగ ఆయకట్టుకు సమృద్ధిగా నీటిని అందించడానికి కుందూ ఎత్తిపోతల పనులను చేపట్టింది. గాలేరు–నగరి సుజల స్రవంతి–హంద్రీ–నీవా సుజల స్రవంతిలను అనుసంధానం చేస్తూ ఉమ్మడి అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు పనులు చేపట్టింది. హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3,850 నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచే పనులను చేపట్టింది. కానీ.. చంద్రబాబు సర్కార్ ఆ పనులన్నింటినీ ఆపేసి రాయలసీమకు వెన్నుపోటు పొడిచింది. -
చంద్రబాబు సీమ జల ద్రోహి
కర్నూలు (సిటీ): రాయలసీమ నీటి కష్టాలను తొలగించే లక్ష్యంతో వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక నిలిపివేసింది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగంగానే ఇలా చేసింది. కానీ, దీనిపై పచ్చిగా అబద్ధాలు ఆడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు రాయలసీమ జిల్లాల వైఎస్సార్సీపీ నేతలు మంగళవారం నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలంలో నిలిచిపోయిన ఎత్తిపోతల పనుల ప్రదేశాన్ని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తొలినుంచి రాయలసీమ అంటే చంద్రబాబుకు వివక్షేనని విమర్శించారు. తన కోరిక మేరకే రాయలసీమ లిఫ్ట్ పనులను చంద్రబాబు ఆపేశారంటూ తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. దివంగత సీఎం వైఎస్ చేపట్టిన పోతిరెడ్డిపాడు విస్తరణ నుంచి నేటి రాయలసీమ లిఫ్ట్ వరకు చంద్రబాబు కుట్రలకు సాక్ష్యాలుగా నిలిచాయన్నారు. క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లో రేవంత్‌తో చేసుకున్న ఒప్పంద వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ హయాంలోనే 85% పనులు పూర్తి‘‘శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 881 అడుగుల పైన ఉంటేనే రాయలసీమకు తీసుకెళ్లే పరిస్థితుల్లో అవసరమైన మేర తరలించలేక ఏటా సీమలో పంటలు చివరి దశలో ఎండిపోతున్నాయి. ఇలాంటి ఇబ్బంది తలెత్తకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్‌ను ప్రతిష్ఠాత్మకంగా చేపడితే, చంద్రబాబు అడుగడుగునా అడ్డుకున్నారు. అయినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం 85 శాతం పనులు పూర్తిచేసింది. చంద్రబాబు సర్కారు ఏర్పడి 19 నెలలైనా పనులు అంగుళం కూడా కదల్లేదు. పర్యావరణ అనుమతులు లేవనే సాకు చూపించి బాబు ప్రజలను మభ్యపెట్టారు. కానీ, రేవంత్ వ్యాఖ్యలతో చంద్రబాబు చేసిన దగా, వంచన బట్టబయలైంది. ఆయన ఇకనైనా బుద్ధి తెచ్చుకుని సీమ లిఫ్ట్ పనులను మొదలుపెట్టాలి’’ అని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. కేంద్రంలో కీలకంగా ఉన్నామని చెప్పుకొంటున్న చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చే బాధ్యత తీసుకోవాలన్నారు. వెంటనే పనులు మొదలుపెట్టకపోతే సీమ రైతులు, ప్రజాసంఘాలు, రైతు సంఘాలు, సాగునీటి నిపుణులు, మేధావులతో కలసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.నంద్యాల జిల్లాలో నిలిచిపోయిన ఎత్తిపోతల పనుల ప్రదేశం వద్ద వైఎస్సార్సీపీ నేతలు కేసులు వేయించి.. పనులు నిలిపివేశారురాయలసీమలో కరువు శాశ్వత నివారణకు వైఎస్ జగన్ రాయలసీమ లిఫ్ట్ చేపట్టారు. తెలంగాణ అడ్డుచెప్పినా జగన్ దృఢ సంకల్పంతో ముందుకుసాగారు. ఈ ప్రాజెక్టు ముందుకుసాగితే జగన్‌కు మంచి పేరు వస్తుందని.. పక్క రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి చంద్రబాబు కుట్ర చేసి పనులు నిలిపివేశారు. –కాటసాని రాంభూపాల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడుఅమరావతి మీదున్న శ్రద్ధ సీమ మీద లేదా?చంద్రబాబుకు అమరావతి మీద ఉన్న శ్రద్ధ రాయలసీమ ఎత్తిపోతల మీద లేదు. సీమ కరువుకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఎత్తిపోతలు చేపట్టిన విజనరీ జగన్. కేసులతో అడ్డుకుని కుట్రలు చేసిన చరిత్ర చంద్రబాబుది. సీమ ఎడారిగా మారుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. – ఎస్వీ మోహన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడుసీమను నాశనం చేసే కుట్రసాగునీటి ప్రాజెక్టులు, రైతు సంక్షేమం గురించి ఏనాడూ ఆలోచించని వ్యక్తి చంద్రబాబు. ఓటుకు నోటు కేసుకు భయపడి సీమ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టుపెట్టారు. రెండు కళ్ల సిద్ధాంతంతో సీమను నాశనం చేసే కుట్రకు తెరలేపారు. – సాకె శైలజానాథ్, మాజీ మంత్రి, అనంతపురంరేవంత్తో కలిసి ప్రతిపక్షంలో ఉండగానే కుట్రరైతుల కన్నీరు తుడిచే అద్భుత ప్రాజెక్టు రాయలసీమ లిఫ్ట్. జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే పనులు మొదలుపెట్టి 85 శాతం పూర్తిచేశారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా... రేవంత్‌తో కలిసి ఈ లిఫ్ట్ పనులను ఆపాలని కుట్ర చేశారు. సీఎం అయ్యాక పర్యావరణ అనుమతులు లేవనే సాకు చూపి నిలిపివేశారు. – దారా సుధీర్, నందికొట్కూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జిఆ నీటిని సీమకు వాడుకుంటే తప్పేంటి?దివంగత సీఎం వైఎస్... పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచిన తర్వాతే మైలవరం రిజర్వాయర్‌కు నీరు చేరింది. ఇప్పుడు రాయలసీమ ప్రాజెక్టులలో సమృద్ధిగా నీరు ఉంటోంది. నీరు లేకపోతే వ్యవసాయం దెబ్బతింటుంది. వృథాగా సముద్రంలో కలిసే నీటిని సీమకు వాడుకుంటే తప్పేంటి? – పి.రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ, కడపసీమ ప్రజలు చంద్రబాబును క్షమించరురేవంత్రెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించాలి. క్లోజ్డ్ రూమ్ మీటింగ్ ఒప్పందాలను బయట పెట్టాలి. పుట్టిన ప్రాంతానికి అన్యాయం చేసేలా కుట్రలు చేస్తున్న బాబును సీమ ప్రజలు క్షమించరు. – కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీఆ జీవో అమలు చేయలేదు2004లో సీఎం కాగానే సీమ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి వైఎస్సార్ రైతు బాంధవుడిగా నిలిచారు. తండ్రిని మించి..పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని జగన్ 80 వేల క్యూసెక్కులకు పెంచారు. సీమ లిఫ్ట్ చేపట్టి రోజుకు 3 టీఎంసీలను తరలించేలా పనులు చేపట్టారు. మిగిలిన పనులను బాబు నిలిపేశారు. శ్రీశైలం కనీస నీటిమట్టం జీవోను అమలు చేయాలని ఆయనను నేను కోరినా పట్టించుకోలేదు. – శిల్పాచక్రపాణిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, శ్రీశైలంబాబు ఎప్పుడూ సీమకు మేలు చేయలేదు..రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేయాలని వైఎస్..పోతిరెడ్డిపాడును 44 వేల క్యూసెక్కులకు విస్తరించే పనులు చేపడితే దేవినేని ఉమాతో ప్రకాశం బ్యారేజీ వద్ద చంద్రబాబు దీక్షలు చేయించారు. బాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటినుంచి సీమకు మేలు చేయలేదు. పైగా ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కుట్ర పన్నారు. – వై.శివరామిరెడ్డి, ఎమ్మెల్సీ, అనంతపురంరైతులు, ప్రాజెక్టుల గురించి బాబు ఆలోచించరుచంద్రబాబు ఏనాడూ రైతులు, సాగునీటి ప్రాజెక్టుల గురించి ఆలోచించరు. ఓటుకు నోటు కేసుకు భయపడి చంద్రబాబుశ్రీశైలం నీటి వాటాను తెలంగాణకు తాకట్టు పెట్టాడు. తెలంగాణలో ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు చేపడుతున్నా నోరు మెదపడం లేదు. – శిల్పారవిచంద్రకిషోర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, నంద్యాల‘సీమ ఎత్తిపోతల’తో ప్రయోజనం లేదుమంత్రి నిమ్మలసాక్షి, అమరావతి: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఇప్పటికే 841 అడుగుల స్థాయి వరకు గ్రావిటీ ద్వారా నీరు రాయలసీమకు వస్తోందని పేర్కొన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో 2020లో ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల ద్వారా 800 అడుగుల స్థాయి నుంచి నీటిని తరలించేలా చేపట్టారని వెల్లడించారు. 841 అడుగుల దిగువన శ్రీశైలంలో కేవలం 34 టీఎంసీలు మాత్రమే ఉంటాయని.. అందులో కృష్ణా బోర్డు కేటాయించిన వాటా ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు దక్కేది 66 శాతం అంటే కేవలం 22 టీఎంసీలు మాత్రమేనన్నారు. ఆ నీటిని కూడా ఇప్పటికే ఉన్న మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా రాయలసీమకు తరలించవచ్చని అందువల్ల సీమ ఎత్తిపోతల వల్ల అదనంగా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. పర్యావరణ అనుమతి తీసుకోకుండా రాయలసీమ ఎత్తిపోతలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిందన్నారు. దీనిపై విచారించిన ఎన్జీటీ.. 2020 మే 20న పనులు నిలిపివేయమని ఆదేÔ>లు ఇచ్చిందన్నారు. 2024 మార్చిలో ఎన్జీటీ మళ్లీ విచారించి రూ.2.65 కోట్ల జరిమానా విధించిందన్నారు. ఇదంతా గత ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పనుల పేరుతో రూ.990 కోట్లు ఖర్చు చేసినట్లు రికార్డులు ఉన్నాయని చెప్పారు. ఈ ఖర్చు వృథాగా జరిగినట్లు భావిస్తున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా.. వృథా అని అనడం లేదని కానీ ప్రాజెక్టు నిరుపయోగంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో 3 కొత్త రిజర్వాయర్లు..గత ప్రభుత్వ హయాంలో జీఎన్ఎస్ఎస్–హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ ప్రాజెక్ట్ (అంచనా వ్యయం రూ.5,036 కోట్లు) పేరుతో భూసేకరణ లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా మట్టి పనులు మాత్రమే చేసి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని నిమ్మల ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ముదివేడు రిజర్వాయర్ (అంచనా రూ.500 కోట్లు, ఖర్చు రూ.167.97 కోట్లు), నేటిగుంటపల్లి రిజర్వాయర్ (అంచనా రూ.571 కోట్లు, ఖర్చు రూ.494 కోట్లు), ఆవులపల్లి రిజర్వాయర్ (అంచనా రూ.482 కోట్లు, ఖర్చు రూ.28 కోట్లు) అనే 3 కొత్త రిజర్వాయర్ల నిర్మాణ పనులను పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టారన్నారు. -
చంద్రబాబు పీడిత రాయలసీమ!
‘ప్రాంతేతరుడు మోసం చేస్తే,ప్రాంతం పొలిమేరల వరకూ తరిమి కొడతాం. ప్రాంతం వాడే మోసం చేస్తే, ప్రాంతం లోపలే పాతిపెడతాం’ అంటూ ఎలుగెత్తి చాటిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి స్ఫూర్తిదాయకమైన మాటలు... రాయలసీమ సమాజం చెవుల్లో మార్మోగుతున్నాయి. అంతేకాదు, రాయలసీమ ప్రాంతంలో పుట్టి, పెరిగి, రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి, పాలకుడిగా ఇప్పుడా ప్రాంతానికే ద్రోహం తలపెట్టిన చంద్ర బాబును ఏం చేయాలో అనే అంతర్మథనంలోనూ రాయలసీమ ఉంది. దశాబ్దాలుగా రాయలసీమ ప్రాంతాన్ని జలగలా పట్టి పీడిస్తున్న కరవు రక్కసిని పారదోలాలనే దివంగత ప్రియతమ నేత, తన తండ్రి వైఎస్సార్ ఆశయాన్ని, ఆకాంక్షను నెరవేర్చడానికి మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్’కు 2020 మే 5న శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీల నీటితో పాటు కరవు ప్రాంతమైన రాయల సీమలో 9.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యం నిర్దేశించుకోవడం వైఎస్ జగన్ గొప్ప ఆశయానికి నిదర్శనం.అప్పుడే పూర్తయ్యేది!శ్రీశైలం ప్రాజెక్ట్‌లో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీలు చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూ. 3,825 కోట్ల ఖర్చుతో ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. మొదటి దశలో పనులు చేపట్టాలని 2023 ఆగస్టు 11న అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే లోకం సుభిక్షంగా ఉండేందుకు దేవతలు యజ్ఞాలు చేస్తుంటే, రాక్షసులు విఘ్నాలు కలిగించిన చందంగా... రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లకుండా నాడు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు తన మనుషుల ద్వారా ఎన్జీటీలో పిటిషన్ వేయించి, అడ్డు తగిలారు. అయితే మహాభారతంలో అర్జునుడి లక్ష్యం చెట్టుపై ఉన్న పక్షి కన్నుపై తప్ప, కొమ్మలపై కానట్టుగా... పార్థుడి లాంటి వైఎస్ జగన్ దృష్టి ప్రాజెక్ట్ పనులపై మాత్రమే ఉండింది. అందుకే చంద్రబాబు సృష్టించిన ఆటంకాలను లెక్క చేయకుండా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని శరవేగంగా కొనసాగించేందుకు చర్యలు తీసుకున్నారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం 2024 ఎన్నికల తర్వాత కొనసాగి ఉంటే, ఈ పాటికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తయి, రాయలసీమంతా సస్యశ్యామలం అయ్యేది. కరవు పీడిత ప్రాంత రైతాంగం జీవన రూపురేఖలే పూర్తిగా మారిపోయేవి. కానీ రాయలసీమతో పాటు ఆంధ్రప్రదేశ్ సమాజంలో వెలుగులు నింపే వైఎస్ జగన్ పరిపాలనా దీపాన్ని... అబద్ధాలు, విష ప్రచారం ద్వారా కూటమి కొండెక్కించేసింది. తద్వారా వైఎస్ జగన్ కంటే, ఎక్కువగా తామే నష్టపోవాల్సి వస్తోందని ఆంధ్రప్రదేశ్ సమాజం ఆవేదన చెందుతోందన్నది ముమ్మాటికీ నిజం.మాతృగడ్డకే ద్రోహమా?ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం ద్వారా... మొదటి బాధిత ప్రాంతంగా రాయలసీమ రికార్డులకెక్కింది. రాయలసీమ వాసిగా, ఆ ప్రాంతా నికి తీరని ద్రోహం చేసిన పాలకుడిగా సమాజం అతడిపై మండి పడుతోంది. రాజకీయ ప్రత్యర్థి అయిన మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు మాలాంటి నాయకులపై ‘చంద్రబాబు అండ్ కో’కు కోపం ఉండొచ్చు. ఒకవేళ మాపై కోపాన్ని తీర్చుకోవాలంటే అధికారాన్ని యథేచ్ఛగా వాడుకోవచ్చు. ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మాకున్నాయి.కానీ కరవు ప్రాంతంపై చంద్రబాబు ప్రతాపం ఎందుకో అర్థం కావడం లేదు. అధికారాన్ని తాను పుట్టిన ప్రాంతానికి ద్రోహం తలపెట్టడానికి దుర్వినియోగం చేయడం ఎంత మాత్రం క్షమార్హం కాదు. బహుశా దేశ చరిత్రలో మరే నాయకుడూ తనకు రాజకీయ, అధికార భిక్షమేసిన మాతృగడ్డకు చంద్రబాబు మాదిరిగా వెన్ను పోటు పొడిచి ఉండరంటే అతిశయోక్తి కాదు. పిల్లనిచ్చిన మామకే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఇంతకాలం ఆయనపై మచ్చ ఉంది. ఇప్పుడు దానికంటే మించిన మచ్చ, అప్రతిష్ఠ చంద్రబాబుకు దక్కాయి. నిత్యం కరవు కాటకాలతో అల్లాడుతున్న రైతాంగం జీవితాలను మార్చేందుకు, కృష్ణా నీళ్లతో బీడు భూముల్ని తడిపేందుకు భగీ రథుడిలా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యజ్ఞం తలపెట్టగా, రాక్షసుడి మాదిరిగా చంద్రబాబు ఆటంకాలు సృష్టించారు. తన రాజకీయ శిష్యుడైన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కోరిన వెంటనే, తన అబ్బ సొత్తు అన్నట్టుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనుల్ని అర్ధంతరంగా ఆపివేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి పనులు చేయడానికి మాత్రమే చంద్రబాబు నాయకత్వంలోని కూటమికి అధికారం కట్టబెట్టారు. అంతే తప్ప, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కోరినట్టు నడుచుకోవడా నికి కాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాళోజీ చెప్పినట్టు...రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల నిలిపివేతతో, ఇవాళ కరవు పీడిత ప్రాంతం తీవ్రంగా నష్టపోతోంది. మళ్లీ వలసలు తప్పడం లేదు. మరోవైపు ఉపాధి హామీ పథకానికి కూడా కోరలు కట్ చేసిన పరిస్థితి. రాయలసీమ ప్రాంతంపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష? గత ఎన్నికల్లో అత్యధిక ఎమ్మెల్యే స్థానాల్ని కూటమికే కట్టబెడితే, రిటర్న్ గిఫ్ట్‌గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను లేకుండా చేస్తారా? ఇదెక్కడి అన్యాయం? ఈ దుర్మార్గానికి ఏం పేరు పెడితే సరిపోతుందో విజ్ఞులైన రాయలసీమ ప్రజలు ఆలోచించాలి. రాయలసీమ ప్రాంతం నీళ్ల కోసం అలమటిస్తోంది. అందుకే దివంగత వైఎస్సార్ హయాంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు అప్పట్లో పెంచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 80 వేల క్యూసెక్కులకు పెంచి, రాయలసీమ ప్రాంత కరవు పారదోలడానికి పనుల్ని వేగవంతం చేశారు. ఇదీ రాయలసీమను కరవు రక్కసి నుంచి తరిమికొట్టడానికి జగన్ నిబద్ధత. చంద్రబాబు మాత్రం... తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ రాయలసీమ కరవును పారదోలాలని ఆలోచించలేదు. కానీ వైఎస్ జగన్ తీర్చిదిద్దిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను మాత్రం తన రాజకీయ శిష్యుడైన రేవంత్ రెడ్డి కోసం లిఫ్ట్ చేయ డానికి అత్యుత్సాహం ప్రదర్శించారు. అందుకే చంద్రబాబును రాయలసీమ పాలిట పీడకుడని చెప్పడం! తమ ప్రాంతానికి మిత్రులెవరో, శత్రువులెవరో ప్రజలకు రేవంత్ రెడ్డి మాటలతో స్పష్టమైంది. సొంత ప్రాంతం వాడే ద్రోహం చేస్తే, ఏం చేయాలో మహాకవి కాళోజీ మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని నిర్ణయించుకోవా ల్సింది రాయలసీమ సమాజమే!భూమన కరుణాకర రెడ్డివ్యాసకర్త తిరుపతి మాజీ ఎమ్మెల్యే -
సీమ ఎత్తిపోతలకు చంద్ర ‘గ్రహణం’.. !
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షిస్తూ.. తడారిన గొంతులు తడిపేందుకు.. తెలుగుగంగ, గాలేరు–నగరి, శ్రీశైలం కుడి గట్టు కాలువ (ఎస్సార్బీసీ) కింద 9.6 లక్షల ఎకరాల్లో పంటలను రక్షించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు చంద్ర‘గ్రహణం’ పట్టుకుంది! ఆ ఎత్తిపోతల పూర్తయితే వైఎస్ జగన్‌కు మంచి పేరొస్తుందనే ఈర్ష్యతోనే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈఏసీ (ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ) 2024 నవంబర్ 5న.. 2025 జనవరి 1న నిర్వహించిన సమావేశాల్లో ఈఏసీ సభ్య కార్యదర్శి అడిగిన వివరాలను చంద్రబాబు సర్కార్ ఇవ్వలేదు. దాని పర్యవసానంగానే గతేడాది ఫిబ్రవరి 27న నిర్వహించిన ఈఏసీ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి ఇచ్చేందుకు నిరాకరించిందని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇదే అంశాన్ని లోక్‌సభలో గతేడాది మార్చి 19న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రస్తావించి చంద్రబాబు సర్కార్ తీరును కడిగిపారేశారు. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడానికి.. రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీరు, చెన్నైకి తాగునీటిని సరఫరా చేయడానికి.. తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ ఆయకట్టులో పంటలను రక్షించుకోవడానికి రాయలసీమ ఎత్తిపోతల పనులు కొనసాగించడానికి పర్యావరణ అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. టీడీపీ సానుభూతిపరుడు గవినోళ్ల శ్రీనివాస్‌తో కేసు.. ఓటుకు కోట్లు కేసు భయంతో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు చంద్రబాబు తాకట్టు పెట్టడంతో 2014–19 మధ్య ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి ఆయకట్టుకు నీళ్లందక పంటలు ఎండిపోయి రైతులు అల్లాడారు. ఈ నేపథ్యంలో ఏపీకి హక్కుగా దక్కిన నీటిని వాడుకుని తడారిన గొంతులను తడపడం, ఎండిపోతున్న పంటలను రక్షించడం కోసం తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూ.3,825 కోట్ల వ్యయంతో 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ పనులను రూ.3,707.06 కోట్ల వ్యయంతో కాంట్రాక్టు సంస్థకు అప్పగించి పనులను పరుగులెత్తించింది. సీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్‌కు ఎక్కడ మంచి పేరొస్తుందోననే అక్కసుతో.. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు గవినోళ్ల శ్రీనివాస్‌తో ఎన్జీటీ (చెన్నై బెంచ్) లో ఆ ప్రాంతంలోని టీడీపీ నేతల ద్వారా చంద్రబాబు అప్పట్లో రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. దీనిపై విచారించిన ఎన్జీటీ, పర్యావరణ అనుమతి తీసుకుని ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబర్ 29న ఆదేశించింది. రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే.. ఆ అనుమతి వచ్చేలోగా చెన్నైకి 15 టీఎంసీలు, రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసే పనులను తొలి దశలో చేపట్టాలని 2023 ఆగస్టు 11న నిర్ణయించింది. చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే.. తెలుగు గంగ ప్రధాన కాలువపై ఉన్న వెలిగోడు రిజర్వాయర్ (9.5 టీఎంసీలు), సోమశిల (17.33 టీఎంసీలు), కండలేరు (8.4 టీఎంసీలు) రిజర్వాయర్లలో మొత్తంగా కనీసం 35.23 టీఎంసీలు నిల్వ ఉండాలి. అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు రాయలసీమలోని దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు వెరసి 58.83 టీఎంసీలు (35.23+15+8.6) శ్రీశైలం నుంచి తరలించే పనులను పర్యావరణ అనుమతి వచ్చేలోగా చేపట్టడానికి అనుమతి ఇవ్వాలన్న అధికారుల ప్రతిపాదనకు గత ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఆ మేరకు అధికారులు పనులు చేపట్టారు. 22.54 శాతం పనులు పూర్తి చేశారు. చీకటి ఒప్పందంతో పనులు నిలిపివేతసీఎం చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమై సీమ ఎత్తిపోతల పనులను నిలిపి వేయించా.. కావాలంటే తనిఖీ చేసుకోవచ్చంటూ తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా శనివారం రాత్రి ఆ రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాయలసీమ ఎత్తిపోతల పనుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదు. దీన్ని బట్టి తెలంగాణలో రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమ ఎత్తిపోతల పనులను చంద్రబాబు ఆపేసి.. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను మళ్లీ తాకట్టు పెట్టారని సాగునీటిరంగ నిపుణులు, రైతులు మండిపడుతున్నారు. ఈ చీకటి ఒప్పందం కుదరడం వల్లే.. పర్యావరణ అనుమతిపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించిన సమావేశాల్లో ఈఏసీ సభ్య కార్యదర్శి అడిగిన వివరాలను చంద్రబాబు సర్కార్ కావాలనే ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పనులు నిలిచిపోవడానికి పర్యావరణ అనుమతి రాలేదనే సాకులు చూపడానికే చంద్రబాబు సర్కార్ ఈఏసీకి వివరాలు అందజేయలేదని స్పష్టం చేస్తున్నారు. -
‘సీమ’ ఎత్తిపోతల పనులు నేనే ఆపించా..
రెండు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి దాకా నేను సాధించిన విజయాలను చెప్పుకోలేదు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో నేను ఏకాంతంగా (క్లోజ్డ్ రూమ్) సమావేశమైనప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పనులను నిలిపేయాలని విజ్ఞప్తి చేశాను. నా మీద గౌరవంతో చంద్రబాబు ఆ పనులు ఆపేశారు. అధ్యక్షా.. రాయలసీమ ఎత్తిపోతలు పనులు ఆగినాయా? లేదా? తెలుసుకోవడానికి కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేయండి. సీపీఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నేత అక్బరుద్దీన్, బీజేపీ నేత మహేశ్వరరెడ్డి, కావాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా కమిటీలో నియమించి అక్కడికి పంపండి. ఒకవేళ శ్రీశైలంలో మేం కట్టే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కొత్తదని మీరు అభ్యంతరం పెడితే.. మేం తక్షణమే పాత ప్రతిపాదన అయిన జూరాల నుంచి రోజుకు రెండు టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల చేపడతామని చంద్రబాబుకు చెప్పాను. ఆ చర్చల ద్వారా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను సాకారం చేస్తున్నాం. – తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతలకు, ఆ దుర్భిక్ష ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబునాయుడు మరణ శాసనం రాశారన్న కఠోర వాస్తవం శనివారం తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా బహిర్గతమైంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో తాను ఏకాంతంగా సమావేశమైనప్పుడు రాయలసీమ ఎత్తిపోతలను ఆపేయాలని విజ్ఞప్తి చేశానని, తన మీద గౌరవంతో చంద్రబాబు ఆ ఎత్తిపోతల పనులు ఆపేశారని తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కావాలంటే ఆ ఎత్తిపోతల పనులు ఆగాయో లేదో తెలుసుకోవడానికి నిజ నిర్ధారణ కమిటీని అక్కడికి పంపుదామన్నారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక రాయలసీమ ఎత్తిపోతల పనులు పూర్తిగా ఆగిపోవడాన్ని బట్టి చూస్తే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పింది అక్షర సత్యమన్నది స్పష్టమవుతోంది. గత ఏడాది ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈఏసీ (ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ) సమావేశంలో చంద్రబాబు సర్కారు సమర్థవంతమైన వాదనలు వినిపించక పోవడం ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పనులకు సమాధి కట్టడాన్ని బట్టిచూస్తే ఇది వాస్తవమేనని తేటతెల్లమవుతోంది. ఓటుకు కోట్లు కేసులో 2015లో తెలంగాణ సర్కార్‌కు అడ్డంగా దొరికిపోయిన సీఎం చంద్రబాబు.. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టారని.. ఇప్పుడు తన శిష్యుడు రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం అదే కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను వదిలేసుకుని రాయలసీమ ఎత్తిపోతలతోపాటు ఆ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులకు మరణ శాసనం రాశారని సాగు నీటి రంగ నిపుణులు, రైతులు మండిపడుతున్నారు. హక్కులను కాపాడుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల ⇒ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. సీమ ప్రాజెక్టులకు సాగునీరివ్వడం కోసం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను 841 అడుగుల ఎత్తులో అమర్చారు. శ్రీశైలంలో 880 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నీరు నిల్వ ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 7 వేలు, 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించే అవకాశం ఉంటుంది. శ్రీశైలంలో 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉంటే చుక్క నీటిని కూడా తీసుకోలేం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీలు, ఎస్సార్బీసీకి 19, తెలుగు గంగకు 29, గాలేరు–నగరికి 38.. మొత్తంగా 101 టీఎంసీలు సరఫరా చేయాలి.⇒ రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకు శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. కానీ.. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రం తమ భూ భాగంలో ఉందని తెలంగాణ సర్కార్ దాన్ని తన అధీనంలోకి తీసుకున్నా.. ఆ రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాల కోసం నాటి చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. ఫలితంగా కృష్ణా బోర్డు కేటాయింపులు చేయకున్నా, దిగువన నీటి అవసరాలు లేకున్నా.. తెలంగాణ సర్కార్ ఏకపక్షంగా శ్రీశైలం జలాశయంలో 798 అడుగుల నుంచే ఎడమ గట్టు కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ ప్రాజెక్టును ఖాళీ చేస్తూ వస్తోంది. 800 అడుగుల నుంచే నీటిని తరలించేలా అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ⇒ తెలంగాణ సర్కార్ ఎలాంటి అనుమతి తీసుకోకుండా 2015లో కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు శ్రీశైలం నుంచి రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను చేపట్టినా నాటి చంద్రబాబు సర్కార్ అడ్డుకోలేదు. ఇలా తెలంగాణ సర్కార్ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తుండటం వల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కింద ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఉన్నా సరే వాడుకోలేని దుస్థితి నెలకొంది. వర్షాభావ పరిస్థితుల్లో రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగు నీటి మాట దేవుడెరుగు.. గుక్కెడు తాగు నీటికి సైతం తల్లడిల్లాల్సిన దయనీయ పరిస్థితి.⇒ తడారిన గొంతులను తడిపేందుకు.. హక్కుగా దక్కిన నీటిని వాడుకోవడానికే తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూ.3,825 కోట్ల వ్యయంతో 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తద్వారా చెన్నైకి 15 టీఎంసీలు సరఫరా చేయడం, ప్రాజెక్టుల కింద 9.6 లక్షల ఎకరాలకు నీళ్లందించాలన్నది లక్ష్యం. ⇒ ఈ నేపథ్యంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎక్కడ మంచి పేరొస్తుందోననే ఈర్ష్యతో.. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందంటూ ఎన్జీటీ (చెన్నై) బెంచ్‌లో తెలంగాణ ప్రాంతంలోని రైతులతో టీడీపీ నేతలు అప్పట్లో రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. దీనిపై విచారించిన ఎన్జీటీ పర్యావరణ అనుమతి తీసుకుని, ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబర్ 29న ఆదేశించింది. తాగునీటి పనులకూ బ్రేక్రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి కోసం ప్రయత్నిస్తూనే.. ఆ అనుమతి వచ్చేలోగా చెన్నైకి 15 టీఎంసీలు, రాయలసీమలో దుర్భిక్ష ప్రాంతాలకు నీటిని సరఫరా చేసే పనులను తొలి దశలో చేపట్టాలని 2023 ఆగస్టు 11న నాటి వైఎస్సార్సీపీ సర్కార్ నిర్ణయించింది. చెన్నైకి నీటిని సరఫరా చేయాలంటే.. తెలుగు గంగ ప్రధాన కాలువపై ఉన్న వెలిగోడు రిజర్వాయర్ (9.5 టీఎంసీలు), సోమశిల (17.33 టీఎంసీలు), కండలేరు (8.4 టీఎంసీలు) రిజర్వాయర్లలో మొత్తంగా కనీసం 35.23 టీఎంసీలు నిల్వ ఉండాలి. అప్పుడే చెన్నైకి 15 టీఎంసీలను సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు రాయలసీమలోని దుర్భిక్ష ప్రాంతాలకు తాగునీటి కోసం 8.6 టీఎంసీలు వెరసి 58.83 టీఎంసీలు (35.23+15+8.6) శ్రీశైలం నుంచి తరలించాలని ప్రభుత్వానికి జల వనరుల శాఖ అధికారులు ప్రతిపాదన పంపారు. పర్యావరణ అనుమతి వచ్చేలోగా రాయలసీమ ఎత్తిపోతలలో తాగు నీటి కోసం తరలించడానికి అవసరమైన పనులను చేపట్టడానికి అనుమతి ఇవ్వాలన్న అధికారుల ప్రతిపాదనపై ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఆ మేరకు అధికారులు పనులు చేపట్టారు. కానీ.. గతేడాది ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించిన ఈఏసీ సమావేశంలో చంద్రబాబు ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు విన్పించక పోవడంతో రాయలసీమ ఎత్తిపోతల తొలి దశ పనులకు బ్రేక్ పడింది. పర్యావరణ అనుమతులు వచ్చేలోగా తాగునీటి పనులు కొనసాగించడంలో ఏమాత్రం తప్పులేదని చెప్పలేకపోయింది. ఫలితంగా ఈ ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ కోసం చేసిన పనులను తొలగించి, యథాస్థితికి తేవాలని ఈఏసీ ఆదేశించింది.నిర్విఘ్నంగా పాలమూరు–రంగారెడ్డి⇒ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో గరిష్టంగా 120 టీఎంసీలు తరలించేలా 2015లో తెలంగాణ సర్కార్ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల (1.5 టీఎంసీలు), డిండి ఎత్తిపోతల (0.5 టీఎంసీలు) చేపట్టింది. తద్వారా మన రాష్ట్ర హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతుందని అటు రైతులు.. ఇటు నీటి పారుదల రంగ నిపుణులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసినా అప్పటి చంద్రబాబు సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ⇒ ఇటు ఏపీ, అటు తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవాలన్న రెండు కళ్ల సిద్ధాంతం.. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడం కోసం.. వ్యక్తిగతంగా లబ్ధి పొందాలన్న లక్ష్యంతో 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మొదటి సమావేశంలో నాటి సీఎం చంద్రబాబు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై నోరు మెదపలేదు. దాంతో 2019 నాటికి ఆ ప్రాజెక్టు పనులను సింహ భాగం తెలంగాణ సర్కార్ పూర్తి చేసింది.⇒ కృష్ణా జలాల్లో చిన్న నీటి పారుదల విభాగంలో 45.6 టీఎంసీల మిగులు ఉందని.. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకు గాను 45 టీఎంసీల కృష్ణా జలాలు అదనంగా తమకే దక్కుతాయని తనకు తానే తెలంగాణ సర్కార్ తీర్మానించుకుంది. ఆ రెండూ కలిపి 90 టీఎంసీలతో పాలమూరు–రంగారెడ్డిని చేపట్టినట్లు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రూపొందించింది. ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ సీడబ్ల్యూసీకి డీపీఆర్ పంపగా.. దాన్ని సీడబ్ల్యూసీ అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి పంపి అభిప్రాయాన్ని కోరింది. ⇒ చిన్న నీటి పారుదల విభాగంలో 45.6 టీఎంసీల మిగులు లేదని.. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం కృష్ణా జలాల్లో అదనంగా దక్కే 45 టీఎంసీల్లో ఎవరి వాటా ఎంత అన్నది ట్రిబ్యునల్ తేల్చాలని సీడబ్ల్యూసీకి 2022 సెప్టెంబరు 19న వైఎస్సార్సీపీ ప్రభుత్వం నివేదించింది. నీటి లభ్యతే లేని ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని, తద్వారా ఏపీ హక్కులను పరిరక్షించాలని కోరింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన సీడబ్ల్యూసీ.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్‌ను తెలంగాణ ప్రభుత్వానికి వెనక్కు పంపింది. ⇒ దీంతో ఇప్పుడు తెలంగాణ సర్కార్ కొత్త ఎత్తు వేసింది. చిన్న నీటి పారుదల విభాగం కింద తమకు కేటాయించిన నీటిలో 45.6 టీఎంసీలు మిగులు ఉందని.. ఆ నీటిని తాగునీటి అవసరాల కోసం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల తొలి దశ ద్వారా తరలించడానికి అనుమతి ఇవ్వాలంటూ సీడబ్ల్యూసీకి డీపీఆర్ సమర్పించింది. ఆ మేరకు నిర్విఘ్నంగా పనులు చేస్తున్నా చంద్రబాబు సర్కార్ నోరు మెదపకపోవడం పట్ల సాగు నీటి రంగం నిపుణులు, రైతులు విస్తుపోతున్నారు. -
తెలంగాణ వైఖరిని తప్పుబట్టిన వైఎస్ఆర్ జిల్లా రైతు సంఘాలు
-
రాజోలి రగడ
కర్నూలు(రూరల్)/ఎమ్మిగనూరు: రాజోలిబండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్) మరోసారి వివాదాస్పదమైంది. రాయలసీమ-తెలంగాణ ప్రాంతాల మధ్య తరచూ గొడవలకు కారణమవుతున్న ఈ ఆనకట్టు.. తాజాగా ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య చిచ్చు రేపింది. సీమ వైపు నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఆధునికీకరణ పేరిట ఏకంగా అర అడుగు ఎత్తు పెంచే ప్రయత్నాం చేయడం రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు పూర్తిస్థాయిలో అమలు కాకమునుపే.. అందులోనూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వాటా పంపకాలు చేపట్టక ముందే కర్ణాటక ప్రభుత్వం ఎత్తు పెంపునకు శ్రీకారం చుట్టడం జల వివాదాలకు ఆజ్యం పోస్తోంది. ఆంధ్రప్రదేశ్-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో తుంగభద్ర నదిపై అడ్డంగా నిర్మించిన ఆర్డీఎస్ ఆనకట్ట వివాదం ఆది నుంచి కొనసాగుతోంది. ఆర్డీఎస్ ఎడమ కెనాల్ ద్వారా కర్ణాటకలో 7500 ఎకరాలు, మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో 87,500 ఎకరాలకు.. కుడి కాలువ ద్వారా కర్నూలు, కడప జిల్లాల్లో లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందాల్సి ఉంది. అయితే కర్ణాటక కుటిల రాజకీయంతో ఆంధ్రాలో కుడికాలువ నిర్మాణానికి నోచుకోలేదు. సుంకేసుల డ్యాం ద్వారా కేసీ కెనాల్‌కు అందుతున్న నీరే ఆర్డీఎస్ నీటి వాటాగా తెలంగాణవాదులు మెలికపెడుతూ వచ్చారు. 2003లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే ఆ పార్టీకి చెందిన కర్నూలు జిల్లా నేతల సహకారంతో ఆర్డీఎస్ ఆనకట్టకు కర్నూలు వైపు మూసి ఉన్న స్లూయిస్(వెంట్)లను రైతులు ధ్వంసం చేశారు. దీంతో మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల రైతులు.. ప్రజాప్రతినిధుల మధ్య జల వివాదం చెలరేగింది. రెండు ప్రాంతాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో అప్పట్లో పలువురికి గాయాలయ్యాయి. 2005లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మొత్తం 5 స్లూయిస్‌లో నాలుగింటిని మూయించారు. అప్పటి నుండి ఈ వివాదం సద్దుమణిగింది. వైఎస్ మరణానంతరం ఆగస్టు 14, 2010న మరోసారి ఆర్డీఎస్ వివాదం చెలరేగినా అప్పటి మంత్రి శిల్పామోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, అబ్రహాం(అలంపూర్) చొరవతో ఇరుప్రాంత రైతులు శాంతించారు. ఆనకట్ట ఎత్తు పెంపునకు కర్ణాటక కుట్ర ఆధునికీకరణ పనుల పేరిట ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తును అర అడుగు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం పన్నిన కుటిల యత్నాన్ని కోసిగి మండలం రైతులు ఆదివారం అడ్డుకున్నారు. ఇప్పటికే కర్నూలు వైపున్న అన్ని స్లూయిస్‌లను మూయించి మా కడుపులు కొట్టడమే కాకుండా ఏకంగా ఆనకట్ట ఎత్తు పెంచి తాగునీరు కూడా రాకుండా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆర్డీఎస్ ఆనకట్ట వద్దకు చేరుకొని పనులను నిలుపుదల చేయించారు. కర్నూలు రైతుకు కష్టకాలం: జిల్లా ప్రజల తాగు, సాగునీటి అవసరరాలకు ప్రధాన వనరు తుంగభద్ర నది. తీరం వెంబడి విస్తరించిన పశ్చిమ ప్రాంతంతో పాటు కేసీ కెనాల్ పరీహాహకమంతా ఈ నదితోనే పెనవేసుకుంది. ప్రభుత్వాల మధ్య సమన్వయం లేక, పాలకుల్లో చిత్తశుద్ధి కొరవడటంతో ఆది నుంచి జిల్లాకు అన్యాయం జరుగుతోంది. ఆర్డీఎస్కు దిగువనున్న మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, నందికొట్కూరు నియోజకవర్గాల రైతులు నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తోంది.


