breaking news
MDR charges
-
ఆ ఒక్క రోజు UPI చెల్లింపులు బంద్!
యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలు విధంచాలనే.. నిర్ణయానికి వ్యతిరేకంగా, దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ ఫోన్ రిటెయిలర్లు నిరసనకు సిద్ధమవుతున్నారు. రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ ఛార్జీలు విధించే ప్రతిపాదన తమ వ్యాపారాలపై అదనపు భారం పెంచుతుందని రిటెయిలర్లు చెబుతున్నారు.ఆల్ ఇండియా మొబైల్ రిటెయిలర్స్ అసోసియేషన్ (AIMRA) అక్టోబర్ 2న 'నో యూపీఐ డే' నిర్వహించాలని ప్రకటించింది. గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా వేలాది మొబైల్ షాపుల యజమానులు యూపీఐ, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులను స్వీకరించకుండా నిరసన తెలపనున్నారు.కేవలం క్యాష్, కార్డు పేమెంట్స్ మాత్రమేనిరసనలో భాగంగా మొబైల్ షాపుల్లో ఉన్న యూపీఐ క్యూఆర్ కోడ్ స్టాండ్లను నల్లటి గుడ్డతో కప్పివేయనున్నట్లు సమాచారం. ఆ రోజు కస్టమర్ల నుంచి యూపీఐ లేదా క్యూఆర్ స్కాన్ ద్వారా చెల్లింపులు తీసుకోకుండా.. నగదు లేదా కార్డు ద్వారా మాత్రమే పేమెంట్లు స్వీకరించాలని రిటెయిలర్లు నిర్ణయించినట్లు అసోసియేషన్ తెలిపింది.వ్యాపార లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు విధించకుండా.. ప్రస్తుతం ఉన్న జీరో-ఎండీఆర్ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖకు కూడా లేఖ రాసినట్లు ఏఐఎంఆర్ఏ వెల్లడించింది.ఆదాయం తగ్గే అవకాశం!రిటెయిలర్ల ప్రకారం.. ముఖ్యంగా చిన్న వ్యాపారులపై ఈ ఛార్జీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నెలకు రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు యూపీఐ లావాదేవీలు చేసే వ్యాపారులకు 0.4 శాతం ఎండీఆర్ కూడా గణనీయమైన భారంగా మారుతుందని వారు చెబుతున్నారు. దీనివల్ల నెలకు రూ.2,000 నుంచి రూ.12,000 వరకు ఆదాయం తగ్గే అవకాశం ఉందని అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ తర్వీంద్ సింగ్ పేర్కొన్నారు.మొబైల్ ఫోన్ రిటెయిల్ వ్యాపారంలో ఇప్పటికే లాభాల మార్జిన్ తక్కువగా ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో అదనంగా 0.4 శాతం ఎండీఆర్ ఛార్జీ విధిస్తే తమ లాభాలపై ప్రభావం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా రిటెయిలర్లపై నెలకు సుమారు రూ.40 కోట్లు, ఏడాదికి దాదాపు రూ.500 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని అసోసియేషన్ అంచనా.డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంతో పాటు.. చిన్న, మధ్య తరహా వ్యాపారులపై అదనపు ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మొబైల్ రిటెయిలర్లు కోరుతున్నారు. తమ వ్యాపారాల్లో యూపీఐ వినియోగం పెరిగిన నేపథ్యంలో కొత్త ఎండీఆర్ ఛార్జీలు అమలైతే, దాని ప్రభావం నేరుగా తమ లాభాలపై పడుతుందని చెబుతున్నారు. అందుకే జీరో-ఎండీఆర్ ఛార్జీ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి: కేవలం రూ.20 చెల్లిస్తే.. రూ.2 లక్షలు అకౌంట్లోకి! -
యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ
యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) వసూలు అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టత ఇచ్చారు. రూ.2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఎండీఆర్ ఛార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేయరని ఆమె తెలిపారు. ఈ ఛార్జీలను వ్యాపారులు, బ్యాంకులు, చెల్లింపుల వ్యవస్థలోని ఇతర భాగస్వాములు భరిస్తారని స్పష్టం చేశారు.ఎండీఆర్ అనేది ప్రభుత్వం విధించే పన్ను లేదా సెస్ కాదని సీతారామన్ వివరించారు. యూపీఐ లావాదేవీలకు సంబంధించి జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్పీసీఐ), చెల్లింపు అగ్రిగేటర్లు, సేవలందించే సంస్థలు, పీఓఎస్ యంత్రాల ప్రొవైడర్లు, మర్చంట్ బ్యాంకులు వంటి సంస్థలు అందించే సేవలకు సంబంధించిన ఛార్జీగా దీనిని ఆమె పేర్కొన్నారు. ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వ ఖజానాకు వెళ్లదని, ప్రభుత్వం దీనిని విధించడం లేదని స్పష్టం చేశారు.రూ.2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలపై ఎండీఆర్ భారం వినియోగదారులకు బదిలీ అవుతుందన్న వాదనలను ఆమె తోసిపుచ్చారు. ఈ ఛార్జీని కస్టమర్ల బిల్లులో అదనపు ఖర్చుగా చూపించరాదని తెలిపారు. రూ.2,000లోపు యూపీఐ లావాదేవీలపై వ్యాపారుల నుంచి కూడా ఎండీఆర్ వసూలు చేయడం లేదని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఫోన్ రీచార్జ్‌లపై గుడ్‌న్యూస్.. చౌక ప్లాన్లు వస్తున్నాయ్! -
నో యూపీఐ.. ఓన్లీ క్యాష్!
సాక్షి, హైదరాబాద్: ‘నో యూపీఐ. ఓన్లీ క్యాష్’.. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన మార్కెట్లు, కిరాణా షాపుల ముందు కనిపిస్తున్న బోర్డులు ఇవి. ‘డిజిటల్ ఇండియా’ నినాదంతో ప్రతి గల్లీలోనూ యూపీఐ క్యూఆర్ కోడ్స్‌తో వెలిగిపోయిన వ్యాపార సామ్రాజ్యం ఇప్పుడు ఒక్కసారిగా వెనక్కి మళ్లుతోంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) మర్చంట్ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా కార్చిచ్చు రగిల్చింది. అక్టోబర్ 15 నుంచి ఈ కొత్త చార్జీలు అమలు కాబోతుండగా.. గడువుకు ముందే వ్యాపార వర్గాలు తిరుగుబాటు బావుటా ఎగురవేశాయి. ఫలితంగా కస్టమర్లను కేవలం నగదు రూపంలోనే చెల్లింపులు చేయాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో యూపీఐ లావాదేవీలు దేశవ్యాప్తంగా తిరోగమన బాట పట్టాయి. వ్యాపారులపై అదనపు భారం తెలంగాణలోనే అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్ అయిన బేగం బజార్‌తోపాటు హైదరాబాద్‌లో ప్రధాన మార్కెట్లయిన సుల్తాన్ బజార్, జనరల్ బజార్, అబిడ్స్, అమీర్‌పేట్, కూకట్పల్లి, కోఠిలో వ్యాపారులు ఇప్పటికే అధిక లావాదేవీలను నగదు రూపంలోనే సాగిస్తున్నారు. కంపెనీల మధ్య పోటీ, ఆన్లైన్ కారణంగా తమకు వచ్చే లాభాలు పరిమితమని, ఇప్పటికే వ్యాపారాలు తగ్గాయని వర్తకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎండీఆర్ రూపంలో పడే చార్జీలు తమకు భారమని, ఇప్పుడున్న పరిస్థితుల్లో కుటుంబాలు ఎలా గడవాలని ముక్తకంఠంతో ప్రశ్నిస్తున్నారు. అందుకే రూ.2,000 దాటిన లావాదేవీలను నగదు రూపంలోనే జరుపుతున్నట్టు వెల్లడించారు. చార్జీల భారాన్ని స్వీకరించేందుకు కస్టమర్ ముందుకు వస్తే ఆన్లైన్ పేమెంట్స్‌ను అంగీకరిస్తామని అంటున్నారు. ‘కస్టమర్లు చెల్లించే మొత్తాలను విభిన్న ఖాతాలకు మళ్లించడం ద్వారా ఎండీఆర్ నుంచి బయటపడొచ్చు. కానీ ఖాతాలను నిర్వహించడం తలకు మించిన భారం కాబట్టి సులువుగా నగదు వైపే మొగ్గు చూపుతాం’అని వర్తకులు చెబుతున్నారు. తగ్గిన లావాదేవీలు.. ఎండీఆర్ విధింపు ప్రకటనను సెప్టెంబర్ 15న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. యూపీఐని నిర్వహిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ 15న దేశవ్యాప్తంగా 80.24 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.1,01,136 కోట్లు. సెప్టెంబర్ 20న లావాదేవీల సంఖ్య 78.4 కోట్లకు పడిపోయింది. విలువ రూ.73,614 కోట్లకు వచ్చి చేరింది. సెప్టెంబర్ 1–20 మధ్య విలువ పరంగా ఇదే కనిష్టం కావడం గమనార్హం. గరిష్టంగా ఈ నెల 2న 85.86 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. అత్యధికంగా 1న రూ.1,31,787 కోట్ల విలువైన యూపీఐ చెల్లింపులు జరిగాయి. ఎండీఆర్ అమలులోకి రాకముందే దీని ప్రభావం దేశవ్యాప్తంగా తీవ్రంగా ఉన్నట్టు గణాంకాలనుబట్టి అర్థమవుతోంది. ఇక అమల్లోకి వచ్చాక యూపీఐ లావాదేవీలు మరింత క్షీణించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారుల ఆందోళనలివీ... ⇒ ఈ–కామర్స్, క్విక్ కామర్స్, కంపెనీల మధ్య పోటీతో హోల్‌సేల్, రిటైల్ రంగంలో నికర లాభాల మార్జిన్ కేవలం 2–4 శాతం మాత్రమే. అందులో 0.4 శాతం బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజుల రూపంలో పోతే వ్యాపారాల మనుగడ కష్టమవుతుందని వర్తకులు చెబుతున్నారు. ⇒ ఈ చార్జీలను వినియోగదారుల నుంచి విడిగా వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టమైన నిబంధన పెట్టింది. దీనివల్ల వ్యాపారులే ఈ నష్టాన్ని పూర్తిగా భరించాల్సి వస్తోంది. ⇒ డిజిటల్ పేమెంట్ల వల్ల సెకన్లలో ముగిసే లావాదేవీలు, నగదు లెక్కింపు, చిల్లర సమస్యల కారణంగా ఆలస్యమవుతాయి. మార్కెట్లలో రద్దీ పెరిగి, వ్యాపార వేగం మందగిస్తుంది. మార్కెట్‌పై తీవ్ర ప్రభావం ⇒ వ్యాపారులు యూపీఐ క్యూఆర్ కోడ్లను పక్కనపెట్టి కేవలం నగదు లావాదేవీలకే పరిమితమైతే దేశ ఆర్థిక వ్యవస్థపై, సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ⇒ కొన్నేళ్లుగా తగ్గుతూ వచ్చిన కరెన్సీ నోట్ల చలామణి మళ్లీ విపరీతంగా పెరుగుతుంది. ప్రజలు చిన్న, పెద్ద వస్తువుల కొనుగోళ్లకు కూడా జేబుల్లో డబ్బులు పెట్టుకుని తిరగాల్సి వస్తుంది. ⇒ నగదు లావాదేవీలు ఎక్కువైతే రికార్డుల్లో చూపించని టర్నోవర్ పెరిగి, పరోక్షంగా నల్లధనం చలామణికి, పన్ను ఎగవేతలకు దారితీస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ధరలు పెరుగుతాయి.. ఇతర వ్యాపారాల్లో అయితే వర్తకులు తమ లాభాలను అడ్జెస్ట్ చేసుకోవచ్చు. కా>నీ మా విషయంలో అలా కాదు. పెట్రోల్ పంపులకు వచ్చే మార్జిన్‌ను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఎండీఆర్ కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. క్షేత్రస్థాయిలో తలెత్తే ప్రభావాన్ని ప్రభుత్వం అంచనా వేయలేకపోతోంది. ఒక్కో డీలర్‌కు ఎంతలేదన్నా ఎండీఆర్ రూపంలో నెలకు రూ.40వేల అదనపు భారం పడుతుంది. ఈ భారాన్ని డీలర్లపై మోపకుండా చమురు కంపెనీలు ప్రత్యామ్నాయాలను ఆలోచించాలి. –మర్రి అమరేందర్ రెడ్డి, ప్రెసిడెంట్, తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ వినియోగదారులపైనే భారం ఎండీఆర్ చార్జీల భారాన్ని చివరకు వినియోగదారులే భరించాల్సి వస్తుంది. చిన్న వ్యాపారులు ఈ ఖర్చులను అనధికారికంగా కస్టమర్లపైనే నెట్టేయడమో లేదా నగదు చెల్లింపుల వైపు మొగ్గు చూపడమో చేస్తారు. పెద్ద రిటైల్ చైన్లు కస్టమర్లకు ఇచ్చే డిస్కౌంట్లు, ఉచితాలను తగ్గిస్తాయి. రూ.20వేల స్మార్ట్‌ఫోన్‌పై 18 శాతం జీఎస్టీ కలుపుకుని ధర రూ.23,600 అవుతుంది. కస్టమర్ యూపీఐ ద్వారా ఈ మొత్తాన్ని చెల్లిస్తే వ్యాపారుల నుంచి 0.40 శాతం ఎండీఆర్ వసూలు చేస్తారు. అంటే ప్రభుత్వం విధించిన రూ.3,600 జీఎస్టీపైనా వ్యాపారులు చార్జీలు చెల్లించాలి. పన్నుపై పన్ను మేమెందుకు కట్టాలి? ఒకే రకమైన సాంకేతికతను ఉపయోగిస్తున్నప్పటికీ ఇంధనం, గ్యాస్, బీమా, మొబైల్ రీచార్జి, రైల్వే టికెట్లపై మాత్రం తక్కువ చార్జీలు వసూలు చేయనున్నారు. –కైలాశ్ లఖ్యానీ, వ్యవస్థాపక చైర్మన్, ఆలిండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ గిడ్డంగుల నుంచే.. అద్దెలు ఏటికేడాది పెరుగుతూనే ఉన్నాయి. ఆ స్థాయిలో ఆదాయాలు పెరగడం లేదు. ఆన్లైన్ నుంచి తీవ్ర పోటీ ఉంది. వ్యాపారాలు ఇప్పటికే తగ్గిపోయాయి. దీంతో దుకాణాలను మూసివేసి గిడ్డంగుల నుంచే వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాం. ఇప్పుడు ఎండీఆర్ రూపంలో ముప్పు పొంచి ఉంది. –బేగంబజార్‌కు చెందిన ఓ వ్యాపారి మార్జిన్లు తగ్గించుకోలేం.. రూ.2వేల లోపు యూపీఐ చెల్లింపులను అంగీకరిస్తాం. అంతకుమించి అయితే క్యాష్ ఇవ్వాల్సిందే. ఆన్లైన్లోనే చెల్లిస్తానంటే చార్జీలతోసహా కస్టమర్ ఇవ్వాల్సిందే. వ్యాపారాలు బాగా తగ్గిపోవడంతో మార్జిన్లు తగ్గించుకునే పరిస్థితుల్లో వ్యాపారులు లేరు. –సుల్తాన్‌బజార్‌కు చెందిన ఓ వ్యాపారి. -
యూపీఐ ఛార్జీలపై మరోమారు ప్రకటన!
యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)కు జీఎస్టీ విధిస్తారని, దీంతో డిజిటల్ చెల్లింపులు ఖరీదవుతాయని, ముఖ్యంగా చిన్న వ్యాపారులపై భారం పడుతుందని కొన్ని వార్తలు నెట్టింట్లో చక్కర్లు కోరుతున్నాయి. దీనిపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) స్పందిస్తూ.. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.పర్సన్-టు-మర్చంట్ఎన్పీసీఐ ప్రకారం.. రూ.2,000 కంటే ఎక్కువ విలువైన పర్సన్-టు-మర్చంట్ (పీ2ఎం) యూపీఐ లావాదేవీలకు మాత్రమే ఎండీఆర్ వర్తిస్తుంది. రూ.2,000 వరకు జరిగే లావాదేవీలపై ఎలాంటి ఎండీఆర్ ఉండదు. కాబట్టి వాటిపై జీఎస్టీ భారం కూడా ఉండదు. దేశంలో జరిగే మొత్తం యూపీఐ మర్చంట్ లావాదేవీల్లో 96 శాతానికి పైగా రూ.2,000 లోపువేనని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అంటే, ఎక్కువ శాతం లావాదేవీలపై ఈ నిబంధనల ప్రభావం ఉండదు.అంతే కాకుండా.. నెలకు రూ.1 లక్ష వరకు యూపీఐ ద్వారా చెల్లింపులు స్వీకరించే చిన్న వ్యాపారులు ఎండీఆర్ చెల్లించాల్సిన అవసరం లేదు. అందువల్ల వారికి జీఎస్టీ భారం కూడా ఉండదు.రూ.2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలపై ఎండీఆర్ చెల్లించే వ్యాపారులు, ఆ ఎండీఆర్‌పై చెల్లించిన జీఎస్టీకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందవచ్చు. అంటే.. వారు తమ వస్తువులు లేదా సేవలపై చెల్లించాల్సిన జీఎస్టీ నుంచి ఆ మొత్తాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. దీంతో వ్యాపారులపై అదనపు జీఎస్టీ భారం ఉండదని ఎన్పీసీఐ తెలిపింది.పర్సన్-టు-పర్సన్ఇక వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే పర్సన్-టు-పర్సన్ (పీ2పీ) యూపీఐ లావాదేవీలపై ఈ నిబంధనలు వర్తించవు. ఎంత మొత్తాన్ని బదిలీ చేసినా పీ2పీ చెల్లింపులు ఎప్పటిలాగే ఉచితంగానే కొనసాగుతాయి.ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఎండీఆర్ అనేది ప్రభుత్వం లేదా ఎన్పీసీఐ వసూలు చేసే పన్ను కాదు. యూపీఐ వ్యవస్థను నిర్వహించడం, అభివృద్ధి చేయడం కోసం బ్యాంకులు, పేమెంట్ యాప్‌ల వంటి భాగస్వాములకు చెల్లించే రుసుము మాత్రమే.కొత్త నిబంధనల ప్రకారం.. రూ.2,000 కంటే ఎక్కువ విలువైన పీ2ఎం లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది. రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు ఎండీఆర్ గరిష్ఠంగా రూ.300గా పరిమితం చేశారు. రైల్వే, టెలికాం, ఇంధనం, వ్యవసాయం వంటి ముఖ్యమైన, తక్కువ మార్జిన్ ఉన్న రంగాల్లో రూ.2,000 దాటిన లావాదేవీలకు ఒక్కో లావాదేవీకి కేవలం రూ.5 ఫ్లాట్ ఛార్జీ మాత్రమే ఉంటుందని ఎన్పీసీఐ వివరించింది.ఇదీ చదవండి: ముఖంతో సంపాదన.. ఏకంగా రూ.14 లక్షల వరకు! -
రూ.2 వేలపై యూపీఐ చెల్లింపులు.. కొత్త రూల్ ఇదే!
న్యూఢిల్లీ: యూపీఐ చెల్లింపులపై కొత్తగా మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) అమల్లోకి రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఈ రుసుమును వ్యాపారులు వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేయకుండా చూడటంపై పేమెంట్ అగ్రిగేటర్లు, ఇతర చెల్లింపు సంస్థలతో కేంద్రం చర్చలు జరుపుతోంది. అక్టోబర్ 15 నుంచి వ్యాపారులు కస్టమర్లపై ఈ భారం మోపుతున్నారా? లేదా? అనే విషయాన్ని రోజువారీగా పరిశీలిస్తామని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు.రూ.2 వేలకుపైగా చేసే కొన్ని యూపీఐ వ్యాపార లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ వసూలు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ రుసుమును కస్టమర్ల నుంచి నేరుగా తీసుకునేందుకు వ్యాపారులకు అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. రూ.2 వేల వరకు చేసే చెల్లింపులకు ఎండీఆర్ ఉండదు. అలాగే వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే యూపీఐ చెల్లింపులపై కూడా ఈ రుసుము వర్తించదు. చిన్న వ్యాపారులకు కొన్ని మినహాయింపులు కూడా కొనసాగనున్నాయి.కొత్త ఎండీఆర్ వల్ల వ్యాపారులపై జీఎస్టీ భారం కూడా పెద్దగా ఉండదని కేంద్రం చెబుతోంది. ఎండీఆర్‌పై చెల్లించే జీఎస్టీని అర్హత ఉన్న వ్యాపారులు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ద్వారా సర్దుబాటు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ అంశంపై వచ్చే నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఎండీఆర్ కారణంగా యూపీఐ లావాదేవీలు తగ్గి ప్రజలు నగదు చెల్లింపుల వైపు వెళ్లే పరిస్థితి రాదని కేంద్రం భావిస్తోంది.యూపీఐపై ఎండీఆర్ విధించాలనే నిర్ణయం అమెరికా ఒత్తిడితో తీసుకున్నదన్న కాంగ్రెస్ ఆరోపణలను కేంద్ర ఆర్థిక సేవల విభాగం ఖండించింది. దేశీయ చెల్లింపు సంస్థలకు మరింత అవకాశం కల్పించడంతో పాటు కొత్త సంస్థలు మార్కెట్లోకి రావడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. దేశీయంగా అభివృద్ధి చేసిన రూపే డెబిట్ కార్డులకు ఎండీఆర్ నుంచి మినహాయింపు కొనసాగుతున్న విషయాన్ని వారు గుర్తుచేశారు. యూపీఐ వ్యవస్థను ఎప్పటికీ పూర్తిగా ప్రభుత్వ సబ్సిడీతో నడపడం సాధ్యం కాదని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా.. ఎండీఆర్ ద్వారా వచ్చే మొత్తంలో 5 శాతాన్ని ప్రత్యేక నిధికి కేటాయించనున్నారు. చిన్న వ్యాపారుల్లో యూపీఐ వినియోగాన్ని పెంచేందుకు, వారు డిజిటల్ చెల్లింపులను కొనసాగించేలా ప్రోత్సహించేందుకు ఈ నిధిని ఉపయోగించనున్నారు. మొత్తంగా కొత్త ఎండీఆర్ అమల్లోకి వచ్చినా.. దాని భారం నేరుగా వినియోగదారులపై పడకుండా పర్యవేక్షించడమే కేంద్రం ముందున్న ప్రధాన లక్ష్యంగా ఉంది.ఇదీ చదవండి: ట్రక్ డ్రైవర్ నుంచి యూట్యూబ్ స్టార్‌గా.. లక్షల్లో ఆదాయం -
ఎండీఆర్‌పై అమెరికా ఒత్తిడి లేదు
న్యూఢిల్లీ: యూపీఐ చెల్లింపులకు సంబంధించి 0.4 శాతం ఎండీఆర్ విధించాలన్న నిర్ణయానికి అమెరికా ఒత్తిడే కారణమన్న ఆరోపణలను ఆర్థిక శాఖ ఖండించింది. ఇవి పూర్తిగా నిరాధారమైన, తప్పుదోవ పట్టించే ఆరోపణలను పేర్కొంది. ఈ విషయంలో ఎన్పీసీఐ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం రూపే కార్డులతో పోలిస్తే ఇతర విదేశీ క్రెడిట్ కార్డులకు ఎలాంటి అదనపు ప్రయోజనాలూ ఉండవని స్పష్టం చేసింది. రూపేకి ఇస్తున్న ప్రాధాన్యత వల్ల యూపీఐ వ్యవస్థలో అమెరికన్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు పోటీపడలేకపోతున్నారంటూ యూఎస్టీఆర్ (అమెరికా ట్రేడ్ రిప్రెజెంటేటివ్) 2026 రిపోర్ట్ వ్యాఖ్యానించడం, ఆ తర్వాత యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధించడం చోటు చేసుకున్న నేపథ్యంలో విమర్శకుల ఆరోపణలు, ఆర్థిక శాఖ వివరణ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘యూపీఐ వ్యవస్థలో రూపే క్రెడిట్ కార్డులకు మాత్రమే అనుమతి ఉంటుందని సెపె్టంబర్ 15 నాటి ఎన్పీసీఐ సర్క్యులర్ స్పష్టం చేస్తోంది. భారత్‌లో యూజర్లు రూపే క్రెడిట్ కార్డులకు ప్రాధాన్యతనిచ్చేలా ప్రోత్సహించాలనే విధానం చాలా స్పష్టంగా ఉంది. బైటి ఒత్తిళ్ల వల్ల ఎండీఆర్‌ను ప్రవేశపెట్టారనే ఆరోపణ పూర్తిగా అవాస్తవం‘ అని ఎక్స్‌లో ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) పోస్ట్ చేసింది. అధిక విలువ చేసే లావాదేవీలపై ఎండీఆర్‌ని ప్రవేశపెట్టడం వల్ల మరిన్ని దేశీ సంస్థలు యూపీఐ వ్యవస్థలో పని చేసేందుకు ముందుకు వస్తాయని పేర్కొంది. ఫోన్‌పేకి ప్రయోజనం.. ఎండీఆర్ విధింపుతో ఫోన్‌పే అత్యధికంగా లబ్ధి పొందవచ్చని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. యూపీఐ లావాదేవీల్లో 45 శాతం వాటా ఫోన్‌పేదే ఉన్నట్లు పేర్కొన్నారు. 2023లో 12 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ పలికినప్పటికీ ప్రస్తుతం 10 బిలియన్ డాలర్లకు పడిపోవడంతో 2026 మార్చిలో తలపెట్టిన ఐపీవోని ఫోన్‌పే వాయిదా వేసింది. తాజాగా ఎండీఆర్ నుంచి వచ్చే ఆదాయంతో సంస్థ వేల్యుయేషన్ భారీగా పెరుగుతుందని శ్రీవాస్తవ వివరించారు. ఫోన్‌పే, గూగుల్‌పే దేశీయంగా 80 శాతం పైగా యూపీఐ లావాదేవీలను ప్రాసెస్ చేస్తున్నాయి. అమెజాన్, ఇతర విదేశీ ప్లాట్‌ఫాంలు కూడా విస్తరిస్తున్నాయి. ‘ప్రజా ధనంతో భారతీయ సంస్థలు, బ్యాంకులు నిర్మించిన యూపీఐ మౌలిక సదుపాయాలను వినియోగించుకోవడానికి అమెరికన్ టెక్నాలజీ కంపెనీలకి భారత్ ఇప్పటికే భారీ స్థాయిలో యాక్సెస్ ఇస్తోంది. ఈ ప్లాట్‌ఫాంలలో భారీ స్థాయిలో లావాదేవీలు జరుగుతున్నాయి. అంతేకాకుండా కోట్ల కొద్దీ ప్రజలు ఖర్చు చేసే ధోరణులకు సంబంధించిన గణాంకాలు కూడా వాటికి చేరుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారులపై ఎండీఆర్ భారాన్ని మోపితే వారు అంతిమంగా దాన్ని వినియోగదారులకు బదలాయిస్తారు. ఈ మార్పులన్నీ కూడా భారత్‌లో అమెరికన్ వీసా, మాస్టర్‌కార్డ్‌ల వ్యాపారాన్ని యూపీఐ, రూపే కార్డులు దెబ్బతీస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న అమెరికాకే ప్రయోజనం చేకూర్చేవిగా ఉన్నాయి. ఎండీఆర్ విధించే బదులుగా యూపీఐతో అత్యధికంగా ప్రయోజనం పొందుతున్న అగ్రగామి విదేశీ సంస్థలు ఒక్కో దానికి వార్షికంగా ఓ 100 మిలియన్ డాలర్ల పారి్టసిపేషన్ ఫీజు విధించాలి‘ అని శ్రీవాస్తవ చెప్పారు. -
యూపీఐ ‘ట్యాక్స్’ రచ్చ.. చిదంబరం పేరుతో రాహుల్‌కు కౌంటర్!
యూపీఐ లావాదేవీలపై కొత్తగా అమలు చేయనున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విషయంలో రాజకీయ రగడ ముదురుతోంది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఛార్జీల విధానాన్ని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిని ఆయన ‘యూపీఐ ట్యాక్స్’గా అభివర్ణిస్తూ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం పేరును హైలైట్ చేస్తూ బీజేపీ తాజాగా కాంగ్రెస్‌పై ప్రశ్నలు సంధించింది.బీజేపీ వర్గాల ప్రకారం.. ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ యూపీఐకి సంబంధించి శ్రేణుల వారీగా (టైర్డ్) ఎండీఆర్/రెవెన్యూ విధానాన్ని తీసుకురావాలని సిఫార్సు చేసింది. ఈ కమిటీలో కాంగ్రెస్‌కు చెందిన పి. చిదంబరం(మాజీ ఆర్థిక మంత్రి), మనీష్ తివారీ, గౌరవ్ గొగోయ్, కిషోరీ లాల్, కే. గోపీనాథ్ కూడా సభ్యులుగా ఉన్నారు. ఆగస్టు 12న కమిటీ నివేదికను ఆమోదించిన సమావేశానికి వీరంతా హాజరయ్యారని, ప్రచురితమైన మినిట్స్‌లో ఎలాంటి అసమ్మతి నమోదు కాలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.దీంతో.. పార్లమెంటరీ కమిటీలో కాంగ్రెస్ ఎంపీలు ఉన్నప్పుడే యూపీఐకి స్థిరమైన రెవెన్యూ మోడల్ అవసరమని సిఫార్సు చేశారని, ఇప్పుడు రాహుల్ గాంధీ కొత్త ఎండీఆర్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని బీజేపీ ప్రశ్నిస్తోంది.ఆ కమిటీ ఏం చెప్పిందంటే..యూపీఐ వ్యవస్థను దీర్ఘకాలికంగా ఆర్థికంగా నిలబెట్టేందుకు టైర్డ్ రెవెన్యూ మోడల్ అవసరమని కమిటీ పేర్కొంది. యూపీఐ వ్యవస్థకు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన మొత్తం సుమారు రూ.2,000 కోట్లుగా ఉండగా.. పరిశ్రమ అంచనా వేసిన నిర్వహణ వ్యయం దాదాపు రూ.20,700 కోట్లుగా ఉందని కమిటీ ప్రస్తావించింది. తగిన రెవెన్యూ వ్యవస్థ లేకపోతే బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ప్రభుత్వ ప్రోత్సాహకాలపై అధికంగా ఆధారపడాల్సి వస్తుందని, సైబర్ సెక్యూరిటీ, మోసాల నివారణ, నెట్వర్క్ మౌలిక వసతులపై పెట్టుబడులపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది.అసలు కొత్త ఛార్జీ ఎంత?కేంద్రం ప్రకటించిన ప్రస్తుత విధానం ప్రకారం అక్టోబర్ 15 నుంచి రూ.2,000కు మించిన కొన్ని మర్చంట్ యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ అమల్లోకి రానుంది. ఈ ఛార్జీని వ్యాపారుల నుంచి వసూలు చేస్తారు. రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు గరిష్ఠంగా రూ.300గా పరిమితి ఉంటుంది. వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే సాధారణ యూపీఐ బదిలీలు ఈ ఛార్జీ పరిధిలోకి రావు.రైల్వేలు, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధనం, విద్యుత్, నీటి వంటి కొన్ని విభాగాల్లో రూ.2,000కు మించిన చెల్లింపులకు శాతం ఆధారిత ఎండీఆర్‌కు బదులుగా ఫ్లాట్ రూ.5 రుసుము ఉండనుంది. క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలకు 0.02 శాతం ఎండీఆర్, గరిష్ఠంగా రూ.300 పరిమితి ఉంటుంది.రాహుల్ గాంధీ ఏమంటున్నారు?ఈ కొత్త విధానాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యూపీఐ ట్యాక్స్ వెనక అమెరికా ఒత్తిడి ఉందని ఆరోపించారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఆరోపణను తిరస్కరించింది. యూపీఐ విధాన నిర్ణయాలు ఎలాంటి బయటి ఒత్తిళ్లతో తీసుకోలేదని స్పష్టం చేసింది. అలాగే కేంద్రం మరోవైపు ఎండీఆర్ అంటే పన్ను కాదని, వినియోగదారుల నుంచి ప్రభుత్వం లేదంటే ఎన్పీసీఐ నేరుగా వసూలు చేసే ఛార్జీ కూడా కాదని చెబుతోంది. పేమెంట్ వ్యవస్థలోని బ్యాంకులు, యాప్ ప్రొవైడర్లు తదితర భాగస్వాముల మధ్య ఈ రుసుము పంపిణీ అవుతుందని వివరిస్తోంది.ఇక రాజకీయంగా కొత్త చర్చ..ఇలా రాహుల్ గాంధీ కొత్త ఎండీఆర్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న వేళ.. అదే సమయంలో పార్లమెంటరీ కమిటీ గతంలో చేసిన టైర్డ్ రెవెన్యూ మోడల్ సిఫార్సును బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. కమిటీలో ఉన్న ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు నివేదిక ఆమోద సమయంలో ఉన్నారని, ప్రచురితమైన మినిట్స్‌లో వారి అసమ్మతి నమోదు కాలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసిన రెవెన్యూ మోడల్‌కు, ఇప్పుడు అమల్లోకి వస్తున్న ఎండీఆర్ విధానానికి ఉన్న తేడాలు ఏమిటన్నదే తాజా రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది.ఇదీ చదవండి: ఆన్లైన్ పేమెంట్లు చేస్తున్నారా?.. ఛార్జీలు కట్టాల్సిందేనా?! -
యూపీఐ చార్జీలు: ఆ.. ఎంతలే అనుకోవద్దు!!
దేశంలో గత ఆరేళ్లుగా సాగుతున్న ఉచిత యూపీఐ (UPI) చెల్లింపుల సేవలకు కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) ఒత్తిడితో పాటు, ఆర్బీఐ, బ్యాంకుల సూచనల మేరకు పెద్ద వ్యాపారుల లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) పునఃప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 15 నుంచి ఈ నూతన విధానం అమల్లోకి రానుంది.కొత్త చార్జీల నిబంధనలుమినహాయింపులు: రూ.2,000 లోపు ఉండే వ్యాపార చెల్లింపులు, వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P) జరిగే నగదు బదిలీలు, రూ.1 లక్ష లోపు నెలవారీ టర్నోవర్ ఉన్న చిరు వ్యాపారులకు ఎలాంటి ఎండీఆర్ వర్తించదు.భారం ఎవరిపై?: వ్యక్తుల నుంచి వ్యాపారులకు (P2M) జరిగే రూ.2,000 పైబడిన లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ విధించనున్నారు.గరిష్ట పరిమితి: రూ.75,000 దాటిన చెల్లింపులపై ఎండీఆర్ రుసుమును గరిష్టంగా రూ.300గా ఖరారు చేశారు.ఏయే లావాదేవీలపై ఎక్కువ భారం?ఆగస్టు నెలలో నమోదైన మొత్తం యూపీఐ లావాదేవీల విలువలో రూ.2,000 దాటిన చెల్లింపుల వాటా ఏకంగా 67 శాతంగా ఉంది. సంఖ్య పరంగా ఇవి 4 శాతం మాత్రమే అయినప్పటికీ, విలువ రీత్యా అత్యంత భారీ మొత్తాలు వీటిలోనే ఉన్నాయి. వ్యాపారులు ఈ అదనపు ఎండీఆర్ భారాన్ని వినియోగదారులపైకే నెట్టేసే అవకాశం ఉండటంతో, పెద్ద కొనుగోళ్లపై ప్రభావం పడనుంది.ఏయే లావాదేవీలపై ఎంత భారం?కొత్త చార్జీలు ఏయే చెల్లింపులపై ఎలా వర్తిస్తాయో ఉదాహరణలతో చూస్తే..రూ.2,000 లోపు కొనుగోలు: చేస్తే ఎటువంటి లేదు. ఉదాహరణకు రూ.1,500 విలువైన వస్తువును యూపీఐతో కొనుగోలు చేస్తే కొత్త ఎండీఆర్ వర్తించదు.రూ.5,000 చెల్లింపు: 0.4 శాతం ప్రకారం వ్యాపారికి రూ.20 చార్జీ వర్తిస్తుంది.రూ.10,000 చెల్లింపు: రూ.40 చార్జీ వర్తిస్తుంది.రూ.25,000 చెల్లింపు: రూ.100 చార్జీ వర్తిస్తుంది.రూ.50,000 చెల్లింపు: రూ.200 చార్జీ వర్తిస్తుంది.రూ.75,000 చెల్లింపు: రూ.300 చార్జీ వర్తిస్తుంది.రూ.1 లక్ష చెల్లింపు: 0.4 శాతం ప్రకారం రూ.400 వచ్చినా, గరిష్ఠ పరిమితి కారణంగా ఎండీఆర్ రూ.300లే అవుతుంది.కొన్ని రంగాలకు ఫ్లాట్ రూ.5రైల్వేలు, టెలికాం, బీమా, ఇంధనం, వ్యవసాయ ఇన్పుట్స్ వంటి కీలక, తక్కువ మార్జిన్ రంగాల్లో రూ.2,000కు పైబడిన లావాదేవీలకు 0.4 శాతానికి బదులుగా ఒక్కో లావాదేవీకి రూ.5 ఫ్లాట్ ఎండీఆర్‌గా నిర్ణయించారు.ఏటా రూ.16,000 కోట్ల ఆదాయం ఈ రుసుముల ద్వారా పేమెంట్స్ పరిశ్రమకు ఏటా రూ.16,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఎన్పీసీఐ డేటా ప్రకారం ఆగస్టులో రూ.29,82,356 కోట్ల విలువైన 2,451 కోట్ల లావాదేవీలు జరిగాయి. పర్సన్-టు-పర్సన్ బదిలీల్లో రూ.2,000 పైబడిన ఉచిత లావాదేవీల వాటా 85% ఉన్నప్పటికీ, వ్యాపార చెల్లింపులపై ఈ చార్జీల భారం పడనుంది.పెద్ద మొత్తంలో షాపింగ్ చేసేటప్పుడు డిజిటల్ చార్జీలు వసూలు చేస్తే, ప్రజలు మళ్లీ యూపీఐకి ప్రత్యామ్నాయంగా పాత పద్ధతిలోనే నగదు (Cash) వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌కు యూపీఐ చార్జీల ఎఫెక్ట్.. ఎంత?
యూపీఐ (UPI) లావాదేవీలపై కొత్తగా మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధానాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా యూపీఐ ద్వారా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ తదితర క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలకు చెల్లింపులు చేసే వారికి కూడా చార్జీలు అమల్లోకి రానున్నాయి. అక్టోబర్ 15 నుంచి క్యాపిటల్ మార్కెట్ కేటగిరీలోని యూపీఐ చెల్లింపులపై 0.02 శాతం ఎండీఆర్ వసూలు చేయనున్నారు. ఒక్కో లావాదేవీకి ఈ ఛార్జీ గరిష్ఠంగా రూ.300 ఉంటుంది.ఇన్వెస్టర్లపై నేరుగా నో ఎఫెక్ట్!కొత్త విధానంలో ఈ ఎండీఆర్‌ను రిటైల్ ఇన్వెస్టర్‌పై నేరుగా మోపడం కాకుండా, క్యాపిటల్ మార్కెట్ పరిధిలోని నియంత్రిత సంస్థలైన బ్రోకర్లు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు, డీలర్లు, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫారమ్‌లు భరించాల్సి ఉంటుంది. ఈ కేటగిరీలో ఈక్విటీ కొనుగోళ్లు, డెట్ మార్కెట్ పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్ కొనుగోళ్లు, బ్రోకర్ అకౌంట్ లేదా వాలెట్‌కు నిధుల జమ వంటి యూపీఐ చెల్లింపులు ఉంటాయి.అందువల్ల సాధారణ దీర్ఘకాలిక మదుపరులకు తక్షణంగా అదనపు ఛార్జీ పడే అవకాశం పరిమితంగానే ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా సిప్ల వంటి లావాదేవీల్లో ప్రభావం తక్కువగా ఉండొచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే ఆయా సంస్థలు భవిష్యత్తులో తమ ఫీజు నిర్మాణాన్ని మార్చుతాయేమోనన్న ఆందోళనైతే ఉంది.రూ.1 లక్ష చెల్లిస్తే ఎంత?0.02 శాతం ఎండీఆర్ అంటే ప్రతి రూ.1 లక్ష క్యాపిటల్ మార్కెట్ యూపీఐ చెల్లింపుపై రూ.20 ఖర్చవుతుంది. రూ.5 లక్షల లావాదేవీకి లెక్క ప్రకారం రూ.100 అవుతుంది. అయితే రూ.15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చెల్లించినా గరిష్ఠ ఎండీఆర్ రూ.300కే పరిమితం అవుతుంది.ఇది సాధారణ మర్చంట్ యూపీఐ చెల్లింపులపై అమలయ్యే 0.4 శాతం రేటుతో పోలిస్తే చాలా తక్కువ. సాధారణంగా రూ.2,000కు మించిన వ్యక్తి నుంచి వ్యాపారికి (P2M) లావాదేవీలకు 0.4 శాతం ఎండీఆర్, ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.300 వర్తిస్తుంది. మరోవైపు వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P) జరిపే యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలూ ఉండవు.యాక్టివ్, ఇంట్రాడే ట్రేడర్లపై ప్రభావం?దీర్ఘకాలిక మదుపరులతో పోలిస్తే తరచూ ట్రేడింగ్ చేసే యాక్టివ్, ఇంట్రాడే ట్రేడర్ల విషయంలో ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రోజులో అనేకసార్లు యూపీఐ ద్వారా ట్రేడింగ్ అకౌంట్లోకి నిధులు జమ చేసే సందర్భాల్లో బ్రోకర్లకు ప్రతి లావాదేవీపై ఈ ఖర్చు ఏర్పడుతుంది.డిస్కౌంట్ బ్రోకర్ల విషయంలో ఇది మరింత ప్రాధాన్యం సంతరించుకోవచ్చు. వీరు సాధారణంగా తక్కువ మార్జిన్లతో పనిచేస్తుండటంతో, అదనపు చెల్లింపు వ్యయం కొంత మేర లాభదాయకతపై ఒత్తిడి తేవచ్చు. దీనికి ప్రతిగా బ్రోకర్లు నెట్ బ్యాంకింగ్, NEFT/RTGS వర్చువల్ అకౌంట్లు, యూపీఐ బ్లాక్ మెకానిజం వంటి ప్రత్యామ్నాయ చెల్లింపు మార్గాలను మరింతగా ప్రోత్సహించే అవకాశం ఉంది.అన్ని పెట్టుబడులపైనా ఒకే ప్రభావం ఉండదుకొత్త ఎండీఆర్ ప్రభావం పెట్టుబడి సాధనం, లావాదేవీ పరిమాణం, సంబంధిత బ్రోకర్ లేదా ఏంఎంసీ ఇప్పటికే వసూలు చేస్తున్న ఫీజులపై ఆధారపడి మారవచ్చు. అందువల్ల షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, ఇతర సెక్యూరిటీల లావాదేవీలపై ప్రభావం ఒకే విధంగా ఉండకపోవచ్చు.ఇదీ చదవండి: యూపీఐ చార్జీలు.. ఆర్బీఐ ఏమన్నదంటే? -
యూపీఐపై వడ్డన!
సాక్షి, హైదరాబాద్: దేశంలో దాదాపు ఆరేళ్లుగా కొనసాగుతున్న పూర్తి ఉచిత యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) చెల్లింపుల సేవలకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. యూపీఐ చెల్లింపులపై చార్జీల విధానాన్ని పునఃప్రవేశపెట్టాలంటూ గూగుల్ పే, అమెజాన్ పే, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, జియో పేమెంట్స్ బ్యాంక్ సహా మరికొన్ని సంస్థలు సభ్యులుగా ఉన్న పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెచ్చిన ఒత్తిడితోపాటు ఏటా రూ. 40 లక్షలకుపైగా టర్నోవర్ ఉండే వ్యాపారులపై చార్జీలు విధించాలన్న ఆర్బీఐ, బ్యాంకుల సూచనను పరిగణనలోకి తీసుకుంది. వ్యక్తుల నుంచి వ్యాపారులకు రూ. 2 వేలకుపైగా జరిగే యూపీఐ చెల్లింపుల లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధించనున్నట్లు మంగళవారం ప్రకటించింది. అలాగే రూ. 75 వేలకన్నా ఎక్కువ విలువైన యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్‌ను గరిష్టంగా రూ. 300గా ఖరారు చేసినట్లు తెలిపింది. అయితే రూ. 2 వేలలోపు వ్యక్తుల నుంచి వ్యాపారులకు జరిపే యూపీఐ చెల్లింపులతోపాటు వ్యక్తుల నుంచి వ్యక్తుల మధ్య జరిగే యూపీఏ లావాదేవీలు, చిరు వ్యాపారులకు ఎలాంటి ఎండీఆర్ చార్జీ వర్తించదని స్పష్టం చేసింది. అక్టోబర్ 15 నుంచి నూతన విధానం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ, భారత జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్పీసీఐ) సంయుక్తంగా నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఎండీఆర్ రుసుము రూపంలో ఏటా పేమెంట్స్ పరిశ్రమకు రూ. 16,000 కోట్లు వస్తాయని అంచనా. వినియోగదారులు చార్జీ చెల్లించక్కర్లేదు.. ‘యూపీఏ ద్వారా చేసే చెల్లింపులపై వినియోగదారులు ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యాపారుల చెల్లింపుల వ్యవస్థలో ఎండీఆర్ ఒక రకమైన చార్జీ. ఇది యూపీఐ చెల్లింపులు జరిపే వినియోగదారులపై విధించే చార్జీ కాదు. వ్యక్తులు ఎప్పటిలాగే ఎలాంటి పరిమితులు, కోటాలు లేకుండా పూర్తి ఉచితంగా యూపీఐ లావాదేవీలు కొనసాగించవచ్చు’ అని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఎండీఆర్‌ను కస్టమర్ల నుంచి వసూలు చేయరాదని.. వ్యాపారులే భరించాలని స్పష్టం చేసింది. అలాగే ఎండీఆర్ చార్జీల భారాన్ని వ్యాపారులు వినియోగదారులపై మోపకుండా చూడాలని బ్యాంకులను ఆదేశించింది. అదే సమయంలో యూపీఐ యాప్‌ల ప్రొవైడర్లు ప్లాట్‌ఫాం ఫీజులు లేదా హిడెన్ చార్జీలు వసూలు చేయడాన్ని నిషేధించింది. కీలక రంగాలకు యూపీఐ చెల్లింపులపై.. అయితే రైల్వే టికెట్ల బుకింగ్, టెలికం రీచార్జీలు, బీమా ప్రీమియం చెల్లింపులు, పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపుకోవడం వంటి వాటికి వ్యక్తులు రూ. 2 వేలకుపైగా జరిపే యూపీఐ చెల్లింపులపై ఒక్కో లావాదేవీకి రూ. 5 చొప్పున ఎండీఆర్ వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. అలాగే రూ. 2 వేలకు మించిన విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, పైప్డ్ గ్యాస్ బిల్లులపై జరిపే యూపీఏ చెల్లింపులతోపాటు రూ. 2 వేలకు మించిన స్కూలు ట్యూషన్ ఫీజు, యూనివర్సిటీ ఫీజు చెల్లింపులపైనా ఒక్కో లావాదేవీపై రూ. 5 చొప్పున ఎండీఆర్ ఉంటుందని పేర్కొంది. అయితే రూ. 2 వేలకన్నా తక్కువగా ఉండే బిల్లులు, ఫీజులపై మాత్రం ఎలాంటి టీడీఆర్ ఉండదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. మరోవైపు మ్యూచువల్ ఫండ్లు, సెక్యూరిటీల చెల్లింపులు, స్టాక్‌బ్రోకర్లు, డీలర్ల ద్వారా జరిపే చెల్లింపులపై 0.02 శాతం టీడీఆర్ వర్తిస్తుందని తెలిపింది. అయితే వ్యక్తుల ఖాతా నుంచి వ్యాపారుల ఖాతాకు నేరుగా జరిగే యూపీఐ చెల్లింపులకు మాత్రమే ఎండీఆర్ వర్తిస్తుందని.. యుటిలిటీ బిల్లులు, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, పునరావృత పెట్టుబడులకు సంబంధించి అమలయ్యే యూపీఐ మ్యాండేట్లు లేదా ఆటోపే విధానాలకు ఎండీఆర్ ఉండదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఎందుకీ చార్జీ? మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ద్వారా వసూలయ్యే మొత్తంలో కొంత యూపీఐ లావాదేవీల సేవలు అందిస్తున్న బ్యాంకులు, యాప్‌లకు పంచుతామని ఎన్పీసీఐ తెలిపింది. అలాగే మిగిలిన మొత్తాన్ని దేశంలో మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడుల ఊతానికి, నూతన ఆవిష్కరణాలు, సైబర్ సెక్యూరిటీ, కస్టమర్ సర్వీస్ రంగాలకు ఉపయోగిస్తామని వివరించింది. అలాగే టైర్–3 పట్టణాలు, ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ–కాశ్మీర్, లద్దాఖ్‌లలో డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, ఆర్థిక రాయితీలు ఇవ్వడానికి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనుంది. కొత్త వ్యాపారులను డిజిటల్ పరిధిలోకి తీసుకురావడానికి ఈ నిధి నుంచి ఆర్థిక సహాయం అందించనుంది. దేశంలో 2021లో కోవిడ్ వ్యాప్తి వేళ యూపీఐ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఎండీఆర్ చార్జీని తొలగించిన కేంద్ర ప్రభుత్వం.. దీనివల్ల బ్యాంకులు, పేమెంట్ సర్వీసు ప్రొవైడర్లకు అయ్యే వ్యయాన్ని బడ్జెట్ కేటాయింపుల ద్వారా భరిస్తూ వచ్చింది. అయితే యూపీఏ సేవల నిర్వహణ, సర్వర్ల బ్యాండ్‌విడ్త్ వ్యయం, బ్యాంకుల సాంకేతిక సహాయ ఖర్చులు ఏటా సుమారు రూ. 20 వేల కోట్లను చేరడంతో తమ బడ్జెట్ కేటాయింపుల ద్వారానే ఆ మొత్తాన్ని భర్తీ చేయలేమని కేంద్రం చెబుతోంది. యూపీఐని నిర్వహిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకారం ఆగస్టులో దేశవ్యాప్తంగా రూ.29,82,356 కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరిగాయి. అలాగే లావాదేవీల సంఖ్య 2,451 కోట్లు దాటింది. లావాదేవీల వాటా ఇలా.. – ఆగస్టులో నమోదైన యూపీఐ లావాదేవీల సంఖ్యలో 63 శాతం వాటా వ్యాపారులకు చేసిన చెల్లింపులదే. – వ్యాపారులకు చేసిన మొత్తం చెల్లింపుల్లో రూ.2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీల వాటా 67 శాతం. అంటే వ్యాపార రంగంలో జరిగే మెజారిటీ నగదు చలామణి పెద్ద మొత్తాల్లోనే సాగుతోంది. – సంఖ్య పరంగా చూస్తే రూ.2,000 పైబడిన లావాదేవీలు కేవలం 4 శాతం మాత్రమే. కానీ విలువ పరంగా అవి 67 శాతం ఉండటం వల్ల ఎల్రక్టానిక్స్ కొనుగోళ్లు, బట్టలు, బంగారు ఆభరణాలు, విమాన/రైలు టికెట్లు, హోటల్ బిల్లుల వంటి పెద్ద చెల్లింపులపై ఈ అదనపు భారం పడనుంది. – వ్యాపారులు ఈ ఎండీఆర్ భారాన్ని తాము భరించలేక వినియోగదారులపైకి నెట్టేసే ప్రమాదం ఉంది. దీనివల్ల పెద్ద కొనుగోళ్లు చేసేటప్పుడు ప్రజలు యూపీఐని పక్కనపెట్టి మళ్లీ నగదు వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. – నెలవారీ వ్యాపార టర్నోవర్ రూ.1 లక్ష లోపు ఉన్న చిన్న చిన్న దుకాణదారులకు ఈ రుసుము నుండి పూర్తి మినహాయింపు ఇచ్చారు. – ఒకరి ఖాతా నుంచి మరొకరి ఖాతాకు పంపే వ్యక్తిగత నగదు బదిలీల విషయానికి వస్తే మొత్తం యూపీఐ లావాదేవీల విలువలో దీని వాటా అత్యధికంగా 70 శాతం. – పర్సన్–టు–పర్సన్ విభాగంలో జరిగిన మొత్తం లావాదేవీల విలువలో రూ.2,000 కంటే ఎక్కువ విలువైన బదిలీల వాటా ఏకంగా 85 శాతం నమోదైంది. – సంఖ్య పరంగా ఇవి 18 శాతం మాత్రమే అయినప్పటికీ, విలువలో 85 శాతం కలిగి ఉండటం గమనార్హం. మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్): మనం ఏదైనా దుకాణానికి వెళ్లి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డిజిటల్ పద్ధతిలో డబ్బులు చెల్లించినప్పుడు.. ఆ సేవను అందించినందుకు బ్యాంకులు, చెల్లింపు కంపెనీలు వ్యాపారి నుండి వసూలు చేసే రుసుము. – డిజిటల్ చెల్లింపు చేసినప్పుడు ఆ డబ్బు వినియోగదారుడి ఖాతా నుండి వ్యాపారి ఖాతాకు సురక్షితంగా చేరాలి. దీనికోసం పని చేసే బ్యాంకులు, కార్డు కంపెనీలు, యాప్‌లు తమ సాఫ్ట్వేర్, భద్రతను నిర్వహించడానికి ఈ ఛార్జీని తీసుకుంటాయి. – నిబంధనల ప్రకారం ఈ భారాన్ని వ్యాపారస్తులే భరించాలి. వినియోగదారులు కాదు. ఉదాహరణకు ఈ రుసుము 1 శాతం ఉందనుకుందాం. దుకాణంలో మీరు రూ.3,000 చెల్లిస్తే వ్యాపారికి రూ.2,700 మాత్రమే అందుతాయి. ఛార్జీల కింద రూ.30 కట్ అవుతుంది. – వ్యాపారస్తులు తమ లాభాలు తగ్గిపోకుండా ఉండటానికి ఈ భారాన్ని వస్తువుల ధరలు పెంచి చివరికి వినియోగదారుల పైకే నెట్టేసే ప్రమాదం ఉంది. -
డెబిట్ కార్డు పేమెంట్లపై గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ : నగదురహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు డిజిటల్ లావాదేవీలపై కేంద్ర కేబినెట్ పలు ప్రోత్సహాకాలను ప్రవేశపెడుతోంది. రూ.2000 వరకు జరిపే డిజిటల్ లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేటును ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని, ఈ లావాదేవీలపై వినియోగదారులు ఎలాంటి ఛార్జీలను చెల్లించాల్సినవసరం లేదని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ శుక్రవారం నిర్ణయించింది. ''అంతకముందు చెల్లించిన ఎండీఆర్‌లను ప్రభుత్వం తిరిగి చెల్లించాలని మేము నిర్ణయించాం. డెబిట్ కార్డు, యూపీఐ, భీమ్, ఆధార్ ఎనాబుల్ లావాదేవీలకు ఇది వర్తిస్తుంది. చిన్న డిజిటల్ వినియోగదారులకు ఇది చాలా పెద్ద ఊరట'' అని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కనీసం రెండేళ్ల వరకు రూ.2000 వరకు జరిపే డెబిట్ కార్డు లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలను చెల్లించాల్సినవసరం లేదని పేర్కొన్నారు. డెబిట్, క్రెడిట్ కార్డు సర్వీసులు అందించేందుకు గాను, బ్యాంకులు వసూలు చేసే రుసుం ఎండీఆర్. రూ.2000 కంటే తక్కువగా ఉన్న లావాదేవీలకు బ్యాంకులకు చెల్లించే ఎండీఆర్ విలువ 2018-19లో రూ.1,050 కోట్లగా అంచనావేస్తుండగా.. 2019-20లో రూ.1,462 కోట్లుగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. తాజా నోటిఫికేషన్ ప్రకారం, వార్షిక టర్నోవర్ రూ.20 లక్షల వరకున్న చిన్న వర్తకులకు విధించే ఎండీఆర్ ఛార్జీలు 0.40 శాతంగా నిర్ణయించారు. ఒకవేళ వర్తకుల వార్షిక టర్నోవర్ రూ.20 లక్షలు దాటితే, ఎండీఆర్ ఛార్జీలు 0.90 శాతంగా ఉన్నాయి. -
ఎండీఆర్‌పై శుభవార్త అందించిన ఆర్బీఐ
సాక్షి, న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. డెబిటక్రెడిట్ కార్డుల మర్చంట్ డిస్కౌంట్ల రేటు(ఎండీఆర్)పై ఆర్బీఐ పలు మార్పులు చేసింది. డిజిటల్ లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో ఎండీఆర్ చార్జీలను సవరించినట్టు తెలిపింది. ఈ సవరించిన రేట్లు జనవరి 1, 2018 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. టర్నోవర్ ఆధారంగా వ్యాపారులను వర్గీకరించి ఆ మేరకు చార్జీలను వసూలు చేయనుంది. ప్రధానంగా చిరు వ్యాపారులు, వినియోగదారులకు లాభం కలిగేలా ఈ చర్యలు తీసుకున్నామని తెలిపింది. అలాగే క్యూఆర్ ఆధారిత లావాదేవీలకు కేంద్ర బ్యాంకు ఒక విభిన్న ఎండీఆర్‌ను కూడా రూపొందించింది. చిరు వ్యాపారులు, చిన్న సంస్థలల్లో కూడా డెబిట్ కార్డ్ లావాదేవీలకు ప్రోత్సాహం, ఉనికిలో ఉన్న చిన్నవ్యాపారాలు, సంస్థల స్థిరత్వానికి భరోసా కల్పించడం అనే రెండు లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ తెలిపింది. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల సేవలపై వ్యాపారులకు బ్యాంకులు విధించే చార్జీలను పరిమితం చేస్తామని, వ్యాపారుల కేటగిరీ ఆధారంగా ఈ చార్జీలను విధిస్తామని పేర్కొంది. లావాదేవీ జరిగిన మొత్తం ఆధారంగా ఎండీఆర్ చార్జీలపై పరిమితులు విధిస్తామని వెల్లడించింది. క్యూఆర్ కోడ్ పేమెంట్ పద్ధతుల్లాగే అసెట్ లైట్ యాక్సెప్టెన్స్ వసతులను కల్పిస్తామని తెలిపింది. తాజాగా సవరించిన రేట్ల ప్రకారంరూ. 20 లక్షల వరకూ టర్నోవర్ కలిగిన వ్యాపారుల ఎండీఆర్ రేటు 0.4 శాతంగా నిర్ణయించింది. క్యూఆర్ కోడ్ ద్వారా లావాదేవి నిర్వహించినట్లయితే ఇది మరింత తగ్గి 0.3 శాతంగా ఉంటుందని తెలిపింది. వార్షిక టర్నోవర్ రూ. 20 లక్షలకు మించి వ్యాపారులకయితే స్వైప్ మెషీన్ ఆధారిత లావాదేవీలకు 0.9 శాతం, క్యూఆర్ కోడ్ ఆధారిత అమ్మకాలకు 0.8 శాతం చార్జీని వసూలు చేస్తుంది. కాగా గత ఏడాది రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత ఎండీఆర్‌ను క్రమంగా తగ్గిస్తూ వచ్చిన ఆర్బీఐ తాజాగా మరోసారి చార్జీలను తగ్గించింది. -
కార్డు చెల్లింపులపై ఎండీఆర్ చార్జీలు తగ్గించే యోచన!
డిజిటల్ పేమెంట్ల ప్రోత్సాహం లక్ష్యం న్యూఢిల్లీ: డెబిట్ కార్డ్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్)ను తగ్గించే విషయాన్ని కేంద్రం యోచిస్తోంది. డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యమని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ మంగళవారం ఇక్కడ తెలిపారు. లావాదేవీల పరిమాణం పెరిగితే ఎండీఆర్‌ను చార్జీలను తగ్గించే ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో ఉందని వివరించారు. ఎండీఆర్ చార్జీల తగ్గింపునకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఇటీవల విడుదల చేసిన ఒక ముసాయిదాను కేంద్రం పరిశీలిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచీ డెబిట్ కార్డ్ పేమెంట్లపై ఎండీఆర్ చార్జీల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని ఇటీవలి తన ఒక నివేదికలో ఆర్బీఐ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రూ.2,000 వరకూ లావాదేవీపై ఎండీఆర్ పరిమితి 0.75 శాతంకాగా, ఆపైన 1 శాతంగా ఉంది. అయితే ఈ చార్జీల తగ్గింపు డిజిటల్ చెల్లింపుల బాటలో చిన్న వర్తకులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆర్బీఐ తన ముసాయిదా పత్రంలో పేర్కొంది. -
డెబిట్ కార్డు యూజర్లకు శుభవార్త!
న్యూఢిల్లీ: డెబిట్‌కార్డ్ ట్రాన్సాక్షన్స్‌పై ఎండిఆర్ చెల్లింపులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎండిఆర్ రద్దుతో బ్యాంకులపై పడే భారాన్ని భర్తీ చేయనున్నట్టు ఆర్బీఐ గురువారం ప్రకటించింది. జనవరి 1 నుంచి ఉన్న ఈ బకాయిలను బ్యాంకులకు రీఇంబర్స్ చేయనున్నట్టు తెలిపింది. ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా పథకాన్నిఅమలు చేసే దిశగా జనవరి 1, 2017 నుంచి డెబిట్ కార్డుల మీద టాక్స్ అండ్ నాన్ టాక్స్ బకాయిలను ఆయా బ్యాంకులకు చెల్లించనున్నట్టు సెంట్రల్ బ్యాంకు ఒక నోటిఫికేషన్ లో తెలిపింది. బ్యాంకులు ఎండీఆర్ బకాయిల కోసం త్రైమాసిక ప్రాతిపదికన చట్టబద్ధమైన ఆడిటర్ల సర్టిఫికేట్ తోపాటు ఆర్బిఐ నాగ్‌పూర్ కార్యాలయంలో సంప్రదించాలని కోరింది. అలాగే రూ. ఒక లక్షలోపు లావాదేవీలపై చెల్లింపుదారునుండి ఎలాంటి చార్జీలు వసూలు చేయలేదని బ్యాంకులు సర్టిఫై చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ బకాయి ల చెల్లింపుల కోసం ఏప్రిల్30 లోగా ఆర్బీఐలో దరఖాస్తు చేయాలని నోటిఫికేషన్ లో కోరింది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాంతీయ బ్యాంకులు కూడా గోల్డ్ లోన్స్ తీసుకునే అవకాశాన్ని కల్పించింది. సంవత్సర కాలానికి గాను రూ.లక్ష నుంచి 2లక్షల వరకు బంగారంపై రుణాలను తీసుకోవచ్చు. కాగా గత ఏడాది డిశెంబర్ లో డెబిట్ కార్డు లావాదేవీలపై ఎండీఆర్ చార్జీలను ప్రభుత్వం రద్దు చేసింది. డీమానిటైజేషన్ అనంతరం డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహాన్నందించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.


